Intinti Gruhalakshmi May 31st Episode: నిజం తెలిసి తులసి ఇంటికొచ్చేసిన నందూ.. లాస్యకు ఘోర అవమానం

ఎంతో కాలంగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో రన్ అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మీ' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మీ' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూద్దాం పదండి!

శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. కూతురు అల్లుడితో సత్యనారాయణ స్వామి వ్రతం చేయిద్దామని వచ్చిన తులసి తల్లికి అసలు నిజం తెలిసిపోతుంది. ఆ తర్వాత దీపక్ వచ్చి నందూ మీద పోలీస్ కంప్లైట్ ఇస్తానని బెదిరిస్తాడు. దీనికి తులసి అడ్డుపడుతుంది. దీంతో తల్లి, సోదరుడు అక్కడ్నుంచి వెళ్లిపోతారు. తర్వాత నందూని తండ్రి ఫోన్ చేసి తిట్టగా.. అతడు నైట్ తాగి వచ్చి గొడవ చేస్తాడు.

తులసిని అపార్థం చేసుకున్న భర్త

తులసిని అపార్థం చేసుకున్న భర్త

తప్పతాగిన నందూ తులసి ఇంట్లోకి రావడాన్ని చూపిస్తూ సోమవారం ఎపిసోడ్ ప్రారంభం అయింది. నిజం తెలిసిందని మాట్లాడుతూ.. 'నా పిల్లల ముందు నన్ను ఎదవను చేయడానికే దివ్యకు డబ్బులు ఇచ్చావు. ప్రేమ్ ఇచ్చాడని అబద్ధం చెప్పావు. నా కారును అమ్మకుండా అడ్డుపడ్డావు' అంటూ కోప్పడ్డాడు. అప్పుడు 'నేను ఏం చేసినా మంచే చేశా'నంటూ తులసి వివరణ ఇచ్చింది.

మైకం ఎక్కువై పడిపోయిన నందూ

మైకం ఎక్కువై పడిపోయిన నందూ

తులసి చెబుతున్న విషయాలను పట్టించుకోకుండా చాలా సేపు గొడవ పడ్డాడు నందూ. ఆ తర్వాత మైకం ఎక్కువై అక్కడే పడిపోయాడు. దీంతో అతడిని గదిలోకి తీసుకెళ్లిన తులసి.. అతడిని సోఫాపై పడుకోబెట్టింది. ఆ సమయంలో అతడు 'లాస్య లాస్య' అంటూ కలవరించాడు. ఆ సమయంలో తులసి ఎంతగానో బాధ పడుతుంది. ఆ తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది.

నందూ కోసం వచ్చిన లాస్యకు షాక్

నందూ కోసం వచ్చిన లాస్యకు షాక్

గొడవ పడుతూ నందూ ఎంత సేపటికీ తిరిగి రాకపోవడంతో లాస్య కూడా అక్కడకు వస్తుంది. అప్పుడు తీవ్ర స్థాయిలో ఆగ్రహించిన తులసి.. ఆమెపై ఏ రేంజ్‌లో ఫైర్ అవుతుంది. 'మళ్లీ ఎందుకు వచ్చావ్ లాస్య. మొన్న జరిగిన అవమానం సరిపోలేదా? అయినా నీ ఇష్టం వచ్చినట్లు చేస్తే చూస్తూ ఊరుకోడానికి అప్పటి ఆడదాన్ని కాదు. చీపురు తిరగేయాల్సి వస్తుంది' అని అవమానించింది.

నందూకు ఝలక్ ఇచ్చిన తులసి

నందూకు ఝలక్ ఇచ్చిన తులసి

మరుసటి రోజు ఉదయాన్నే మత్తు వీడిన నందూ.. నిద్ర లేస్తాడు. అప్పుడు రాత్రి జరిగిన విషయాన్నింటినీ గుర్తు చేసుకుంటాడు. అలానే లేచి బయటకు రాగానే.. తులసి, అనసూయ కనిపిస్తారు. అప్పుడు తన కొడుకుకి కాఫీ తెచ్చి ఇమ్మనగా తులసి ఇవ్వనని తేల్చి చెబుతుంది. 'ఆయన ఈ ఇంటికి సంబంధించిన వ్యక్తి కాదు. ఇక్కడ మర్యాదలు చేయనవసరం లేదు' అంటూ చెబుతుంది.

నందూ ప్రవర్తనపై కోప్పడిన లాస్య

నందూ ప్రవర్తనపై కోప్పడిన లాస్య

తులసిలో వచ్చిన మార్పును గుర్తు చేసుకుంటూ లాస్య, భాగ్య చర్చించుకుంటారు. అప్పుడు నందూ తీరుపైనా మాట్లాడతారు. అప్పుడే అతడు ఇంటికి రాగా.. లాస్య అతడిపై కోప్పడుతుంది. 'నీకు మూడొచ్చినప్పుడల్లా అటు ఇటు తిరుగుతావా నందూ? నువ్వేమీ రెండిళ్ల పూజారివి కాదు. నీ ప్రవర్తన నాకేమీ నచ్చడం లేదు. నీ కోసం వస్తే నన్ను అవమానించారు' అని అతడికి చెబుతుంది.

Recommended Video

Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
లాస్య దగ్గరకు వచ్చేస్తానన్న అత్త

లాస్య దగ్గరకు వచ్చేస్తానన్న అత్త

ఆ తర్వాత కొద్ది సేపటికి అనసూయ కూడా అక్కడకు వస్తుంది. అప్పుడు లాస్యతో 'నన్ను కూడా తులసి లెక్క చేయడం లేదు. పెద్దదాన్ని అని కూడా చూడకుండా ఎదురిస్తుంది. కాబట్టి నేను కూడా ఇక్కడకు వచ్చేస్తా' అని అంటుంది. దీనికి కంగారు పడిన లాస్య 'మీరు రావొద్దు ఆంటీ.. అప్పుడే కాదు.. తర్వాత వద్దురు గానీ' అంటూ చెబుతుంది. దీంతో ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X