Intinti Gruhalakshmi Today Episode: తులసి ఫొటోలు చూసి లాస్య షాక్.. నందూతో నిజం చెప్పడంతో!
తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ నుంచి అతి భారీ స్థాయిలో స్పందన దక్కుతుందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' మంగళవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

సోమవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే
సోమవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ప్రవళ్లికతో కలిసి బయటకు వెళ్లిన తులసి ఎంతో సంతోషంగా గడుపుతుంది. దీంతో ఆమె మరింత ప్రోత్సహిస్తూ బాధలను మాయం చేసే ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగానే తులసితో పానీపూరీని ఎక్కువగా ఎవరు తింటారు అంటూ పందెం కాస్తుంది. ఇందులో తులసే గెలుస్తుంది. అప్పుడు ప్రవళ్లిక కొన్ని మంచి మాటలు చెప్పి తులసిని ఎంకరేజ్ చేస్తుంది. మరోవైపు, శృతి పనికి వెళ్లకపోవడంతో ఓనర్ ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఆ తర్వాత ప్రేమ్ డాక్టర్‌ను తీసుకొచ్చి తన భార్యకు వైద్యం చేయిస్తాడు.

సంతోషాన్ని పంచుకున్న తులసి
ప్రవళ్లికతో కలిసి షాపింగ్ చేసిన తర్వాత తులసి సంతోషంగా ఇంటికి వస్తుంది తులసి. ఆ తర్వాత తను, తన ఫ్రెండ్ కలిసి చేసిన హంగామాను పరందామయ్య, అనసూయ, దివ్యకు చెబుతుంది. అంతేకాదు, ఆ సమయంలో దివ్య తన తల్లిని తన నానమ్మ, తాతయ్య ముందు ఇరికించే ప్రయత్నాలు చేస్తుంది. కానీ, తులసి మాత్రం వాళ్లను కూల్ చేస్తుంది. ఆ సమయంలో ఆమె సంతోషంగా ఉండటం చూసి వాళ్లు అందరూ షాక్ అవుతారు. అప్పుడు పరందామయ్య 'మీ ఫ్రెండ్‌కు మా అందరి తరుపున థాంక్స్ చెప్పమ్మా? మేము చేయలేని పనులను తను చేసింది' అంటాడు.

తులసి ఫొటోలు చూసి అసూయ
ప్రవళ్లికతో షాపింగ్ చేసి వచ్చిన తర్వాత వాళ్లు ఇద్దరూ కలిసి దిగిన ఫోటోలను తులసి దివ్యకు చూపిస్తుంది. వాటిని దివ్య తనకు షేర్ చేసుకుని.. ఆ ఫోటోలను వెంటనే ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తుంది. ఫోన్ చెక్ చేస్తూ ఆ ఫోటోలను లాస్య తన ఫోన్‌లో చూస్తుంది. వాటిని చూసి షాక్ అవుతుంది. ఇంతలో నందూ వస్తాడు. అప్పుడు లాస్య 'అబ్బబ్బ.. హీరోయిన్ గారు స్టెప్పులు కూడా. ఒకసారి ఇలా రండి.. మీకు ఒకటి చూపిస్తా. నీ మాజీ భార్య బరితెగింపు ఏ లేవల్‌లో ఉందో చూపిద్దామని పిలిచాను చూడు' అంటుంది. ఆ ఫోటోలను చూసి నందూకు తెగ కోపం వస్తుంది.

నందూను రెచ్చగొట్టేసిన లాస్య
ఫొటోలు చూపించిన తర్వాత లాస్య 'పార్కుల్లో వాకింగ్స్, కుర్రవాళ్లతో డ్యాన్సులు, పానీపూరీలు. ఫ్యాక్టరీ వదులుకుంది. తను ఎలా బతుకుతుందో అని అన్నావు కదా. అన్నీ వదిలేసిన దేశదిమ్మరిలా ఎలా బరితెగించి తిరుగుతోందో చూడు' అంటూ నందూను రెచ్చగొడుతుంది. దీనికి నందూ ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు అని అడుగుతాడు. అప్పుడు లాస్య 'మీ అమ్మానాన్నకు ఫోన్ చేసి తనను కంట్రోల్‌లో పెట్టుకోమను. లేదంటే పబ్బుకు వెళ్దాం పదా అని అడుగుతుంది' అంటుంది. ఆ తర్వాత నందూ ఫ్రెండ్ ఫోన్ చేసి.. 'నిన్ను వదిలేశాక మీ ఆవిడ చాలా ఇంప్రూవ్ అయిందిరా. ఇంతలోనే అంత మార్పు ఎలా వచ్చింది' అని అడుగుతాడు. చిరాకు వచ్చి ఫోన్ పెట్టేస్తాడు.

గుర్తు తెచ్చుకుని సిగ్గ పడుతూనే
ప్రవళ్లికతో కలిసి రోజంతా తిరుగుతూ ఎంజాయ్ చేసిన విషయాలను గుర్తు తెచ్చుకుని తులసి సిగ్గు పడుతూ ఉంటుంది. అలా చాలా సేపు తనలో తాను నవ్వుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత అక్కడే ఉన్న గులాబీ చెట్టు దగ్గరికి వెళ్లి ఆ గులాబీ చెట్టుకు తన ఆనందాలను అన్నింటినీ పంచుకుంటుంది. ఆ సమయంలోనే 'నాకోసం నేను బతకడంలో ఉన్న ఆనందం నాకు తెలిసేలా ప్రవళ్లిక చేసింది. ఇక నుంచి నేను ఇలాగే ఉంటాను. ఇలాగే నవ్వుతూ కనిపిస్తాను. నీతో నవ్వుతూ మాట్లాడుతాను. ఇకపై ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ గడుపుతాను' అని చెబుతుంది.

శృతికి సాయం.. ప్రేమ్ ఎమోషన్
శృతికి ఇంకా జ్వరం తగ్గకపోవడంతో ప్రేమ్ దగ్గరుండి సపర్యలు చేస్తాడు. అతడే వండి అన్నం తినిపిస్తాడు. బయటికి తీసుకొచ్చి వరండాలో కూర్చోబెడతాడు. తర్వాత ఆమెకు ట్యాబ్లెట్లు వేస్తాడు. దీంతో శృతి చాలా సంతోషిస్తుంది. అప్పుడామె 'నా కోసం నువ్వు ఇంతలా సపర్యలు చేయడం చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది. నేను ఎంత అదృష్టవంతురాలినో అర్థం అవుతోంది' అంటుంది. దీనికి ప్రేమ్ 'నువ్వు లేకపోతే నేను లేను శృతి' అంటాడు. అప్పుడామె 'ఆడదాని మనసు.. సముద్రం లోతు తెలుసుకోవడం ఎవ్వరి వల్ల అయ్యే పని కాదు అంటారు. కానీ, ఆ అదృష్టం నాకు ఇచ్చావు. ఆడదాని మనసు ఇంత గొప్పగా ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. నిన్ను భర్తగా పొందినందుకు నేను చాలా అదృష్టవంతురాలిని' అంటుంది.

తల్లిని గుర్తు చేసుకున్న ప్రేమ్
శృతి మాటలకు ప్రేమ్ 'ఈ మెచ్యూరిటీకి కారణం మా అమ్మే. తన నుంచే ఇవన్నీ నేను నేర్చుకున్నాను. జీవితంలో ఎలా ఉండాలో.. ఎలా ఉండకూడదో చెప్పడానికి జీవితానుభవాలే మనకు దారి చూపుతాయి. ఒక్క రోజు కాదు.. ఒక్క నెల కాదు.. ఒక్క సంవత్సరం కాదు.. 20 సంవత్సరాలకు పైగా మా అమ్మ మా నాన్నతో నరకయాతన పడింది. మా అమ్మ చిన్న చిన్న ఆనందాలు కూడా కోల్పోయింది. నా భర్త నన్ను దూరంగా ఊటీకో తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఆప్యాయంగా నన్ను దగ్గరికి తీసుకుంటే చాలు అని తపించిపోయేది' అని చెప్పి ఏడుస్తాడు.

అమ్మే నన్ను ఒంటరిని చేసింది
ప్రేమ్ మాట్లాడుతూ.. 'ఏ ఒక్క కోరిక తీర్చలేదు మా నాన్న. కానీ, ముగ్గురు పిల్లలను కన్నాడు. చాటుగా కూర్చొని మా అమ్మ ఏడ్చేది. కానీ, నేను తనను ఓదార్చలేకపోయాను. అందుకే మా నాన్న మీద నాకు ద్వేషం. అప్పుడే డిసైడ్ అయ్యాను. ఎప్పటికీ మా అమ్మను ఒంటరిగా వదిలిపెట్టకూడదని. కానీ, మా అమ్మే నన్ను దూరంగా తరిమేసింది. మా అమ్మను ఒంటరిదాన్ని చేయకూడదు అనుకున్నాను కానీ, నన్నే ఒంటరిని చేసింది. తల్లి బాధను అంత దగ్గరగా చూసిన ఏ కొడుకూ.. కట్టుకున్న భార్యను బాధపెట్టడు' అని శృతితో చెబుతాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











