Intinti Gruhalakshmi: తులసికి దొరికిన లాస్య, రాజ్యలక్ష్మి.. చెంప పగలగొట్టి మరీ.. ఆగిపోయిన శోభనం

చాలా కాలంగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే : మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. దివ్య, విక్రమ్‌లను ఫస్ట్ నైట్‌ కోసం రెడీ చేస్తారు. ఆ సమయంలో తనకు సలహాలు చెప్పమని అడిగినా దివ్యకు ఎవరూ సహకరించరు. కానీ, విక్రమ్‌ను మాత్రం వాళ్ల తాతయ్య సరదాగా ఆటపట్టిస్తాడు. ఆ తర్వాత బిందెలో ఆట పెట్టగా దివ్య కోసం విక్రమ్ ఓడిపోతాడు. దీంతో రాజ్యలక్ష్మికి కోపం వస్తుంది. అనంతరం వీళ్లిద్దరినీ శోభనం గదిలోకి పంపిస్తారు. అప్పుడే వాళ్లకు ఫస్ట్ నైట్ జరగకుండా చేసేందుకు రాజ్యలక్ష్మి మెట్లపై నుంచి పడిపోయినట్లు నటిస్తుంది. దీంతో విక్రమ్ శోభనం గదిలో నుంచి బయటకు వచ్చేస్తాడు.

 Intinti Gruhalakshmi

ఫస్ట నైట్ వద్దని చెప్పిన విక్రమ్: మెట్ల మీద నుంచి కింద పడిన తర్వాత రాజ్యలక్ష్మి 'మీకు ఫస్ట్ నైట్ జరుగుతుందన్న ఆనందంలో ఆలోచించుకుంటూ మెట్లు ఎక్కుతున్నాను. అంతలోనే కాలు స్లిప్ అయిపోయింది' అని అంటూ గోల గోల చేస్తుంది. దీంతో విక్రమ్ హాస్పిటల్‌కు వెళ్దామా అని అడుగుతాడు. దీనికామె వద్దు మీరు గదిలోకి వెళ్ళండి అంటుంది. అప్పుడు తులసి 'అవును మీరు వెళ్ళండి. మేమందరం రాత్రి మీ అమ్మగారి పక్కనే ఉంటాము' అంటుంది. దీంతో విక్రమ్ 'అమ్మకు ఇలా ఉంటే నేను వెళ్ళలేను. నేను దివ్య ఇద్దరం అమ్మ పక్కనే ఉంటాము' అంటాడు.

 Intinti Gruhalakshmi

గెలిచాను చూశావా అని సైగలు: నొప్పితో బాధ పడుతున్న రాజ్యలక్ష్మిని తీసుకు వెళ్లి మంచం మీద పడుకోబెడతారు. అప్పుడు దివ్య అత్తయ్యా కంగారు పడకండి అని మెడిసిన్ తీసుకుని వచ్చి ఇస్తుంది. అప్పుడు రాజ్యలక్ష్మి 'నన్ను చూసుకోవటానికి ప్రియ ఉంది కదా. మీరు వెళ్ళండి. చూడు దివ్య ఎంత బాధ పడుతుందో' అని విక్రమ్‌తో చెప్తుంది. దీనికతడు 'తనేమీ బాధపడదు.. ఎందుకంటే నువ్వు నాకెంతో తనకు కూడా అంతే. ఆ మాట తనే చెప్పింది' అంటాడు. తర్వాత లాస్య వైపు చూస్తూ గెలిచాను చూసావా అన్నట్లుగా సైగ చేస్తుంది.

 Intinti Gruhalakshmi

నాతో పెట్టుకుంటే అంతే అని: రాజ్యలక్ష్మికి ప్రమాదం జరగడంతో తులసి వాళ్లంతా అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఇంటికి వెళ్లిన వెంటనే ఆమెకు లాస్య ఫోన్ చేసి.. 'వాళ్ళిద్దర్నీ గదిలోకి పంపించేస్తుంటే నువ్వు చేతులెత్తేసావేమో.. ఫస్ట్ నైట్ జరిగిపోతుందేమో అని కంగారు పడ్డాను. కానీ, చివరి నిమిషంలో భలే ట్విస్ట్ ఇచ్చావు' అని మోసేస్తుంది. దీనికి రాజ్యలక్ష్మి 'ఇది నా సామ్రాజ్యం.. ఇక్కడ అందరి తలరాతలు నేనే రాసేది. ఈ రాజ్యంతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో అందరూ తెలుసుకోవాలి. దివ్య తల్లిదండ్రులు కూడా ఇది తెలియాలి' అంటుంది.

రాజ్యలక్ష్మికి నిజం చెప్పింది: ఆ తర్వాత లాస్య 'శోభనానికి మళ్లీ ముహూర్తం ఎప్పుడు పెట్టిస్తావు' అని అడగ్గా.. నీకెందుకు అంత తొందర అని రాజ్యలక్ష్మి అడుగుతుంది. దీనికి లాస్య 'మళ్లీ ఎలాంటి ప్లాన్ వేస్తావో అని ఆత్రంగా ఉంది. మీ డబ్బు తులసి ద్వారా మళ్ళీ మీ దగ్గరికి చేరింది కదా. ఆ డబ్బును మళ్లీ నాకు అందేలాగా చేయండి. నాకు చాలా అవసరం ఉంది' అంటుంది. దీనికి రాజ్యలక్ష్మి 'ఆ డబ్బు వాళ్ల చేతికి ఎందుకు వెళ్ళింది' అనగా.. 'నేను మీ దగ్గర డబ్బులు తీసుకోవడం ఎలా చూసిందో.. తులసి చూసిందంట, ఇంటికి వచ్చి పెద్ద గొడవ చేసింది' అని నిజం చెప్తుంది.

 Intinti Gruhalakshmi

లాస్య చెంప పగలగొట్టేసింది: అనంతరం లాస్య 'దివ్యను మీకు బలి పశువును చేసినందుకు తీసుకుంటున్న డబ్బులు అని నేను వాళ్లతో చెప్పలేదు. అయినా ఈ విషయం వాళ్లకు ఎప్పటికీ తెలియదు కూడా. అవసరానికి మీ దగ్గర డబ్బులు తీసుకున్నాను అని అబద్ధం చెప్పాను' అని వెనక్కి తిరుగుతుంది. అప్పటికే ఆ మాటలు అన్ని విన్న తులసి కోపంతో లాస్య చెంప పగలగొడుతుంది. దీంతో లాస్య 'నన్ను ఎందుకు కొట్టావు? ఈ ఇంట్లో రోజురోజుకీ నాకు రక్షణ లేకుండా పోతుంది' అని అరుస్తుంది. దీంతో అందరూ అక్కడకు చేరుకుంటారు.

తులసిని అపార్థం చేసుకుని: నందూ అక్కడకు రాగానే లాస్య ఏడుస్తూ 'చూడు నందూ.. నన్ను ఎలా కొట్టిందో' అని కంప్లైంట్ చేస్తుంది. అప్పుడు తులసి ఎవరూ లేనప్పుడు కాదు అందరూ ఉంటుండగానే కొడతాను అంటూ మళ్ళీ కొడుతుంది. దీంతో లాస్య 'పక్కన నువ్వున్నా కూడా నాకు ఈ ఇంట్లో రక్షణ లేదంటే నా బాధను ఎవరితో చెప్పుకోమంటావు' అని ఏడుస్తుంది. దీంతో నందూ 'నేను ఉండగానే నా భార్యను కొట్టావు అంటే నీకు ఎంత ధైర్యం? అసలు తను ఏం తప్పు చేసింది' అని ప్రశ్నిస్తాడు. దీంతో తులసి 'అసలకే కూతురికి ఏదో అయిపోతుంది అని భయపడుతున్నారు. ఇప్పుడు నిజం తెలిసింది అంటే ఆయన మరింత కంగారు పడతారు' అనుకుని సైలెంట్‌గా ఉంటుంది. దీంతో నందూ ఆమెను అపార్థం చేసుంటాడు.

నువ్వు అలాంటి దానివే అని: ఆ తర్వాత లాస్యకు క్షమాపణ చెప్పమని తులసిని అడుగుతాడు. అప్పుడు లాస్య 'అది సరిపోదు కాళ్లు పట్టుకొని క్షమాపణ అడగాలి' అంటుంది. దీంతో తులసి 'చచ్చినా ఆ పని చేయను. ఏం చేసుకుంటావో చేసుకో' అనగానే లాస్య ఏడుస్తూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు నందూ 'నువ్వు నా దృష్టిలో దిగజారి పోయావు. నువ్వు కూడా అందరిలాంటి మామూలు ఆడదానివే' అని వెళ్లిపోతాడు. ఇక, ఫస్ట్ నైట్ జరగదని నీకెలా తెలుసంటూ ప్రియను దివ్య ప్రశ్నిస్తుంది. కానీ, ఆమె నిజం చెప్పదు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X