Intinti Gruhalakshmi Today Episode: ప్రేమ్ దగ్గర నిజం దాచిన శృతి.. లాస్య ముందే నందూకు తులసి ఝలక్

మిగిలిన భాషలతో పోల్చుకుంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ నుంచి అతి భారీ స్థాయిలో స్పందన దక్కుతుందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా చూసేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే

మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే


మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ప్రవళ్లికతో కలిసి బయటకు వెళ్లిన తులసి ఇంటికొచ్చిన తర్వాత ఎంతగానో సంతోషిస్తుంటుంది. అది చూసిన పరందామయ్య, అనసూయ, దివ్యలు ఖుషీ అవుతుంటారు. ఇక, ప్రవళ్లికతో తులసి దిగిన ఫొటోలను దివ్య తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తుంది. వాటిని చూసిన లాస్య ఒక్కసారిగా షాక్ అవడంతో పాటు నందూకు చూపిస్తుంది. అంతేకాదు, ఆమె గురించి చెడుగా చెబుతూ రెచ్చగొడుతుంది. అలాగే, వెంటనే ఇంటికి ఫోన్ చేసి అడగమని అంటుంది. ఇక, ప్రేమ్ తన భార్యకు సపర్యలు చేస్తూ తన బాధనంతా చెబుతాడు.

క్లాత్ కప్పుకుని సిగ్గు పడ్డ తులసి

క్లాత్ కప్పుకుని సిగ్గు పడ్డ తులసి

అనుకున్న దాని ప్రకారమే ప్రవళిక ఉదయమే జాగింగ్‌కు వచ్చి తులసి కోసం ఎదురు చూస్తుంటుంది. ఇంతలో ఆమె జాగింగ్ డ్రెస్ వేసుకొని దాని మీద ఓ క్లాత్ కప్పుకొని వస్తుంది. అప్పుడు ప్రవళ్లిక ఆమెను చూసి నవ్వుతుంది. అంతేకాదు, 'నీకు జ్వరం కానీ వచ్చిందా. ఈ కొంగు ఎందుకు కప్పుకున్నావు' అని అడుగుతుంది. దీనికి తులసి 'నాకేమీ కాలేదు. నా జాగింగ్ డ్రెస్ ఎవ్వరికీ కనిపించకుండా కప్పుకున్నాను. నేను వస్తుంటే నా జాగింగ్ డ్రెస్ చూసి అందరూ నన్ను విచిత్రంగా చూస్తున్నారు . నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నేను ఇంటికి వెళ్లిపోతాను' అని చెప్తుంది.

తులసికి పరీక్ష.. సక్సెస్ అవగానే

తులసికి పరీక్ష.. సక్సెస్ అవగానే

వర్కౌట్ డ్రెస్ వేసుకున్న తర్వాత తులసి పడుతున్న ఇబ్బంది చూసి ముందుగా నవ్వుకున్న ప్రవళ్లిక.. ఆ తర్వాత 'ఒక పని చేయి.. ఒక్క నిమిషం ఈ జాగింగ్ డ్రెస్ మీద ఇక్కడ నిలబడు. నిన్ను ఎవ్వరైనా చూస్తే నువ్వు రేపటి నుంచి జాగింగ్ డ్రెస్ వేసుకోకు.. జాగింగ్ కోసం కూడా రాకు' అని అంటుంది. దీంతో తను కప్పుకున్న ఆ క్లాత్‌ను తులసి తీసేస్తుంది. కానీ, ఎవ్వరూ ఆమెను చూడరు. దీంతో తులసికి కాన్ఫిడెన్స్ పెరిగిపోతోంది. ఆ తర్వాత జాగింగ్ చేయడానికి ఒప్పుకుంటుంది. దీంతో ఇద్దరూ జాగింగ్ డ్రెస్‌లో పార్కులో సరదాగా జాగింగ్ చేస్తూ ఉంటారు.

పార్క్‌లో తులసిపై నందూ ఫైర్

పార్క్‌లో తులసిపై నందూ ఫైర్

తులసి, ప్రవళ్లిక జాగింగ్ చేస్తుండగా.. నందూ, లాస్య ఇద్దరు కూడా అదే పార్క్‌కు వస్తారు. ఆ తర్వాత ఇక నీ సిగ్గు పోయిందా. రేపటి నుంచి వస్తావా అని అడుగుతుంది. దీంతో వస్తా అని చెబుతుంది తులసి. తులసి, ప్రవళిక ఇద్దరూ మాట్లాడుతుండటం నందూ, లాస్య చూసి షాక్ అవుతారు. తర్వాత ప్రవళ్లిక వెళ్లిపోయి.. తులసి ఇటువైపు నుంచి వెళ్లిపోతుండగా నందూ పిలుస్తాడు. 'తులసి.. నువ్వేంటి నువ్వు చేస్తున్న పనులేంటి' అని కోపంగా అడుగుతాడు. దీంతో తులసి 'మీరెవరో తెలుసుకోవచ్చా. ఈయన ఎవరు మీ ఆయనా. ఇలా రోడ్డు మీద వెళ్లే ప్రతి ఒక్కరి డ్రెస్‌పై కామెంట్ చేస్తారా' అని గట్టి సమాధానం చెబుతుంది.

నందూకు షాకిచ్చేసిన తులసి

నందూకు షాకిచ్చేసిన తులసి

తులసి మాటలకు మరింత రెచ్చిపోయిన నందూ 'టాపిక్ మార్చకు తులసి. ముగ్గురు పిల్లల తల్లివి.. కూతురు పెళ్లి చేయాలి. అన్ని మరిచిపోయి ఇలాంటి డ్రెస్ వేసుకొని తిరగడం ఏంటి' అని ప్రశ్నిస్తాడు. దీనికామె 'అసలు మీ బాధ ఏంటో.. ఎందుకు ఇలా గొంతు చించుకొని అరుస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. అసలు మీకు నాకు సంబంధం ఏంటి. నేను ఒకప్పుడు మీ భార్యను. ఇప్పుడు కాదు. విడాకులతో ఆ బంధం ఎప్పుడో తెగిపోయింది. ఇప్పుడు మీతో నాకు.. నాతో మీకు ఎలాంటి సంబంధం లేదు. నా మీద మీకు ఎలాంటి అధికారం లేదు. అర్థమైందా' అంటుంది.

మీ ఆవిడ కంటే బెటర్ అంటూ

మీ ఆవిడ కంటే బెటర్ అంటూ

ఆ తర్వాత తులసి 'ఎవరైనా మీ ముందు నా గురించి చెడుగా మాట్లాడితే ఉక్రోషపడటం కాదు.. వాడి చెంప చెళ్లు మనిపించు. అది ఎవరో ఏదో డ్రెస్ వేసుకుంటే నీకెందుకురా అను' అని చెప్తుంది. దీనికి నందూ 'నా పిల్లలు, మా అమ్మానాన్న నీ దగ్గర ఉన్నంత వరకు మా పరువు నీ మీద ఆధారపడి ఉంటుంది' అంటాడు. అప్పుడు తులసి 'నేను ఇలాంటి బట్టలు వేసుకొని తిరిగితే మీ ఇంటి పరువు పోతుందా. నేను మాజీ కోడలును. కానీ, నీ పక్కన నిలబడింది కదా తను నిజమైన కోడలు. మీకు ఏమైనా అనాలనిపిస్తే తనను అనండి. బుద్ధి చెప్పాలనుకుంటే తనకు చెప్పండి నాకు కాదు. మీ ఆవిడ రోజు వేసుకునే బట్టల కన్నా నేను ఈరోజు వేసుకున్న బట్టలు చాలా సంస్కారంగా ఉన్నాయి. నీ భార్యకు ఒక నీతి.. నాకు ఒక నీతా' అంటూ బుద్ది చెప్తుంది.

కోలుకున్న శృతి.. పని చేయగా

కోలుకున్న శృతి.. పని చేయగా

శృతికి ఆరోగ్యం బాలేకపోవడంతో ఆమెకు సపర్యలు చేసిన ప్రేమ్ అలసిపోయి నిద్రపోతూ ఉంటాడు. తెల్లారేసరికి ఆమెకు జ్వరం తగ్గుతుంది. దీంతో ఆమెనే స్వయంగా అన్ని పనులూ చేస్తుంటుంది. అప్పుడే లేచిన ప్రేమ్.. ఇంత పొద్దున్నే శృతి ఏం చేస్తుంది అని అనుకుంటాడు. ఆ తర్వాత కిచెన్‌లో ఆమె వంట చేయడం చూసి షాక్ అవుతాడు. దీంతో వెంటనే 'నువ్వు అప్పుడే పనులు ఎందుకు చేస్తున్నావు. కాస్త బలం రాగానే వంటింట్లో దూరేయడమేనా' అంటూ సీరియస్ అవుతాడు. ఆ తర్వాత ఆమె పని చేస్తుంటే అడ్డుకుంటాడు. ఎంత చెప్పినా వినడు.

ప్రేమ్ దగ్గర నిజం దాచిందిగా

ప్రేమ్ దగ్గర నిజం దాచిందిగా

శృతి పని చేస్తానని అంటుండగా ప్రేమ్ వద్దంటూ ఉంటాడు. అంతలో శృతికి ఫోన్ వస్తుంది. దాన్ని ప్రేమ్ లిఫ్ట్ చేస్తాడు. దీంతో అవతల ఉన్న ఇంటి ఓనర్ 'పనిలోకి వస్తున్నావా' లేదా అని ఆ మహిళ గట్టిగా అరుస్తుంది. దీంతో ప్రేమ్ ఎవరండి మీరు.. ఏం మాట్లాడుతున్నారు అంటాడు. ఇంతలో శృతి ఫోన్ తీసుకొని మేడమ్ నేను వస్తున్నాను అంటుంది. అప్పుడు ప్రేమ్ 'ఎవరు మీ మేనేజరా. ఇలా తలబిరుసుగా మాట్లాడుతుందేంటి. నువ్వేమన్నా పనిమనిషివా. రాను అని చెప్పేయ్' అంటాడు. దీనికామె 'ఏం కాదులే.. వాళ్లు అలాగే ఉంటారు' అని నిజం దాచేస్తుంది.

తులసి డ్రెస్ చూసి వాళ్లు షాక్

తులసి డ్రెస్ చూసి వాళ్లు షాక్

జాగింగ్ చేసిన తర్వాత తులసి ఇంటికి చేరుకుంటుంది. అప్పుడామె వేసుకున్న జాగింగ్ డ్రెస్ చూసి దివ్య షాక్ అవుతుంది. ఆ తర్వాత లోపలికి వెళ్లగానే అనసూయ, పరందమయ్య కూడా అవాక్కైపోతారు. అప్పుడు అనసూయ 'నీలో ఇంత మార్పు వచ్చిందా' అని ఆశ్చర్యంగా అడుగుతుంది. పరందామయ్య 'నీలో వచ్చిన ఈ మార్పు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది' అంటాడు. అప్పుడామె 'నా ఈ మార్పుకు కారణం ప్రవళిక' అని నిజం చెబుతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X