Intinti Gruhalakshmi: శోభనం విషయం కీలక నిర్ణయం.. సంజయ్‌కు షాకిచ్చిన దివ్య.. రాజ్యలక్ష్మి రావడంతో!

దాదాపు రెండు మూడు దశాబ్దాలుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే:గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. లాస్యను కొట్టినందుకు నందూ తిట్టడంతో తులసి గదిలో కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు ఆమెను ఓదార్చడానికి వెళ్లిన పరందామయ్య, అనసూయకు ఆమె నిజాలు చెబుతుంది. అదంతా విన్న నందూ.. లాస్య మీదకు కోపంతో వెళ్తాడు. ఆ సమయంలో ఇద్దరికీ గొడవ జరుగుతుంది. దీంతో డబ్బు ఉందనే కదా మీరు కూడా చదువుకోని వాడిని అల్లుడిని చేసుకున్నారని అంటుంది. దీంతో నందూ.. లాస్యను లాక్కెళ్లి గుమ్మం బయట పెట్టి తలుపులు వేసేస్తాడు. ఎవరు ఎంత చెప్పినా వినకుండా ఆమెను వదిలేస్తాడు.

Intinti Gruhalakshmi Serial Today Episode May 5th 2023

నందూకు చాలెంజ్ విసిరిన లాస్య:లాస్యను బయట పెట్టి నందూ తలుపులు మూస్తాడు. ముందు తనను లోపలికి రానివ్వమని ఆమె బ్రతిమాలుతుంది. కానీ, ఎంత చెప్పినా నందూ మాత్రం వినడు. దీంతో లాస్యకు కోపం వచ్చి బెదిరిస్తుంది. అప్పుడు నందూ 'ఏం చేసుకుంటావో చేసుకో. తలుపు మాత్రం తీయను' అని ఛాలెంజ్ చేస్తాడు. దీంతో లాస్య 'నువ్వు ఇప్పుడు తలుపు తీయకపోయినా.. నేను ఇదే ఇంట్లో అడుగు పెట్టి తీరుతాను. ఇది నా చాలెంజ్' అంటూ అక్కడినుంచి వెళ్ళిపోతుంది. దీంతో నందూ కూడా లోపలికి వెళ్లిపోతాడు.

Intinti Gruhalakshmi Serial Today Episode May 5th 2023

శోభనానికి ముహూర్తం పెట్టిస్తానని:కాలు నొప్పి వస్తుందని నటిస్తూ బసవయ్య సహాయంతో రాజ్యలక్ష్మి కిందకు వస్తుంది. దీంతో అంత కష్టపడుతూ కిందకు ఎందుకు వచ్చావని తల్లిపై విక్రమ్ కోప్పడతాడు. అప్పుడామె దివ్యను పిలిచి 'నా ధ్యాస అంతా నీ మీదే. నేను మీ పాలిట విలన్‌లాగా మారాను. మీ శోభనానికి అడ్డుపడుతున్నాను' అంటూ నటిస్తుంది. అప్పుడు విక్రమ్ 'కోరుకున్న పిల్లనిచ్చి పెళ్లి చేశావు ఇంతకన్నా ఏం కావాలి' అంటాడు. దీనికామె 'అంతే చేశాను.. అంతకుమించి ఏమీ చేయలేదు. అందుకే పంతులు గారిని రమ్మన్నాను మీ శోభనానికి ముహూర్తం పెట్టడానికి' అంటుంది. అప్పుడే పంతులు వచ్చి 'మీ కంగారుకు తగినట్లుగానే ఈరోజు సాయంత్రమే ముహూర్తం చాలా బాగుంది' అని చెబుతారు.

Intinti Gruhalakshmi Serial Today Episode May 5th 2023

పాము నీడలో బతుకుతుంది అని:ఇక నందూ.. ఇప్పటికైనా లాస్య బాధ తప్పింది అంటాడు. అప్పుడు అనసూయ 'అంతు చూస్తాను అని వెళ్ళింది.. ఏం చేస్తుందో ఏమో' అంటుంది. దీనికి నందూ 'అదేం చేస్తుంది? చూస్తూ ఉండండి.. తనే వచ్చి కాళ్లు పట్టుకుంటుంది. అయినా క్షమించేది లేదు. ఇకపై మా ఇద్దరి మధ్యన ఉన్న బంధం ముగిసిపోయినట్లే' అంటాడు. అప్పుడు తులసి 'దివ్య సంగతి తలుచుకుంటేనే భయంగా ఉంది. తను అక్కడ పాము నీడలో బ్రతుకుతోంది. ముందు ముందు ఎన్ని ఇబ్బందులు పడుతుందో' అంటూ భయపడుతుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode May 5th 2023

విక్రమ్ నీ భర్తలాగ కాదు అంటూ:తులసి మాటలకు నందూ 'నీ పరిస్థితి వేరు.. దివ్య పరిస్థితి వేరు. నీ భర్త నిన్ను చూసుకునేవాడు కాదు. కానీ దాని భర్త దానిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు. ప్రియ దివ్య పెళ్లి జరిగే సమయంలో ఈ విషయాలు చెప్పి నన్ను హెచ్చరించింది' అని నిజం చెప్పేస్తాడు. దీంతో తులసి 'ఆ విషయం నాకు అప్పుడే ఎందుకు చెప్పలేదు' అంటుంది. దీనికి నందూ 'తెలుసుకొని ఏం చేస్తావు? నాలాగా బాధపడటం తప్పితే' అంటాడు. దీంతో తులసి 'ఈ సమస్యకు కాలమే పరిష్కారం చెప్పాలి' అంటుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode May 5th 2023

సంజయ్‌తో గొడవ పడిన దివ్య:సంజయ్ ఆస్పత్రికి వెళ్తుంటే ప్రియ చీపురుతో ఎదురు వస్తుంది. దీంతో అతడు ఆమెపై కోపంతో చేయి లేపుతాడు. అది చూసిన దివ్య ఎందుకు చెయ్యెత్తుతున్నావు అంటూ నిలదీస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన రాజ్యలక్ష్మి 'వీడు మళ్ళీ దీనికి దొరికిపోయినట్లున్నాడు. అందుకే ఒక ఆట ఆడుకుంటుంది. ఈ టాపిక్‌ను ఇక్కడితో ఆపకపోతే పెద్ద రేవల్యూషన్ తీసుకొచ్చేలాగా ఉంది' అనుకుంటుంది. ఆ వెంటనే 'సంజయ్.. నువ్వు తప్పు చేశావు. ప్రియ ఎలా బాధపడుతుందో చూడు. చేసిన తప్పుకి ప్రియకు సారీ చెప్పు' అని ఆర్డర్ వేస్తుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode May 5th 2023

నరకం చూపిస్తారు అని భయం:ఆ తర్వాత విక్రమ్ కూడా 'ఇంటి కోడలు ఏడిస్తే అరిష్టంరా' అని తమ్ముడికి చెప్తాడు. దీంతో సంజయ్ ముభావంగా సారీ చెప్పి వెళ్లిపోతుంటాడు. అప్పుడు దివ్య 'అలా కాదు.. ఎదురుగా వెళ్లి మనస్ఫూర్తిగా మరెప్పుడు ఇలా చేయనని చెప్పు' అంటుంది. రాజ్యలక్ష్మి కూడా చెప్పటంతో 'మరెప్పుడూ నీ మీద చెయ్యి ఎత్తను' అంటూ సంజయ్ సారీ చెప్తాడు. అప్పుడు ప్రియ మనసులో 'ఇప్పుడు సారీ చెప్తారు.. కానీ తర్వాత నరకం చూపిస్తారు. ఆ సంగతి దివ్యకి తెలియదు' అని అనుకుంటుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode May 5th 2023

కాళ్లు పట్టుకునేలా చేస్తానంటూ:ఇంట్లో జరిగిన గొడవ గురించి లాస్య.. భాగ్యకు వివరిస్తుంది. అప్పుడామె 'రాజ్యలక్ష్మి గారు అంత మంచి ఆఫర్ ఇచ్చినప్పుడు నాలాంటి మీడియేటర్‌ను పెట్టుకోవచ్చు కదా. మళ్లీ నాకు ఎక్కడ కమిషన్ ఇవ్వాలని కక్కుర్తి. ఇప్పుడు చూడు ఏమైందో' అంటుంది. అప్పుడు లాస్య 'ఎలా అయినా నందూతో కాళ్లు పట్టుకునే లాగా చేస్తాను' అనగా.. 'అవును మరి నువ్వు పెద్ద సత్యభామవు. బావగారు ఏమో శ్రీకృష్ణుడు' అంటూ భాగ్య వెటకారం ఆడుతుంది. తర్వాత ప్రియ దగ్గరకు వచ్చి దివ్య ప్రశ్నలు అడుగుతుంది. కానీ, ఆమె నిజాలు చెప్పదు. ఇలా ఈ ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X