Intinti Gruhalakshmi: నందూకు ఝలక్ ఇచ్చిన లాస్య.. దివ్యకు తెలిసిన నిజం.. పుట్టింటికి వెళ్లిపోవడంతో!

తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

Photos Courtesy: Star మా and Disney+Hotstar

Intinti Gruhalakshmi Serial Today Episode May 6th 2023

శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే: శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తనను బయటకు గెంటేసి నందూ తలుపులు వేయడంతో.. లాస్య 'నువ్వు ఇప్పుడు తలుపు తీయకపోయినా.. నేను ఇదే ఇంట్లో అడుగు పెట్టి తీరుతాను. ఇది నా చాలెంజ్' అంటూ అక్కడినుంచి వెళ్ళిపోతుంది. తర్వాత రాజ్యలక్ష్మి... విక్రమ్, దివ్య గురించి బాధ పడుతున్నట్లు నటిస్తుంది.

అంతేకాదు, వాళ్ల ఫస్ట్ నైట్‌కు ముహూర్తం కూడా ఫిక్స్ చేయిస్తుంది. ఆ తర్వాత సంజయ్.. ప్రియను కొట్టే ప్రయత్నం చేయగా.. దివ్య ఆపుతుంది. అంతేకాదు, ఆమెకు సారీ చెప్పాలని డిమాండ్ చేయడంతో క్షమాపణలు అడుగుతాడు.

Intinti Gruhalakshmi Serial Today Episode May 6th 2023

ప్రియను ప్రశ్నించిన దివ్య: తన దగ్గరకు వచ్చిన ప్రియతో దివ్య 'నువ్వు నాతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నావు. కానీ చెప్పలేకపోతున్నావు. అసలు ఏం జరుగుతుందో చెప్పు' అంటుంది. దీనికి ప్రియ 'చెప్పగలిగితే నేను చెప్తాను కదా.. నేను మీ అంత చదువుకోలేదు.

నా కుటుంబం మీ కుటుంబం అంతా పెద్దది కూడా కాదు. ఒక్కసారిగా ఈ బంగ్లాలోకి వచ్చి పడేసరికి ఊపిరాడటం లేదు. ఈ ఇంటి డోర్‌మేట్ అంత కూడా ఉండదు నా బ్రతుకు' అంటుంది. దీంతో దివ్య 'అదంతా గతం ఇప్పుడు మనం ఇద్దరం ఈ ఇంటి కోడళ్ళమే' ఉంటుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode May 6th 2023

నన్ను ఇబ్బంది పెట్టొద్దు: దివ్య మాటలకు ప్రియ 'మన ఇద్దరికీ చెట్టుకు ఉన్న పువ్వుకు.. చెట్టు నుంచి రాలిపోయిన పువ్వుకు ఉన్నంత తేడా ఉంది' అంటుంది. దీంతో దివ్య 'నీ ప్రాబ్లం సంజయ్ అయితే చెప్పు నేను అత్తయ్యతో మాట్లాడుతాను' అని భరోసా ఇస్తుంది.

అప్పుడు ప్రియ 'ఈ విషయంలో మీ పోరాటం మీది.. నా పోరాటం నాది. దయచేసి నన్ను ఇంతకుమించి ఇబ్బంది పెట్టొద్దు' అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు దివ్య తనకు సరైన సమాధానం దొరకలేదని బాధ పడిపోతుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode May 6th 2023

కూతురి దగ్గరకు తులసి: నందూతో అనసూయ 'లాస్య ఫోన్ చేసిందా? జరిగిన గొడవ గురించి నాకు భయంగా ఉంది' అంటుంది. దీనికతడు 'నీకెందుకు? నువ్వేమీ భయపడొద్దు' అని ధైర్యం చెప్తాడు. అప్పుడే తులసి దివ్య దగ్గరికి వెళ్లి వస్తానంటూ బయలుదేరుతుంది.

దీంతో నందూ 'అక్కడికి వెళ్లొద్దు.. రాజ్యలక్ష్మి గురించి అన్నీ తెలుసు కాబట్టి నువ్వు ప్రతిదీ అనుమానిస్తావు. వచ్చేటప్పుడు మనసు కష్టపెట్టుకొని వస్తావు' అంటాడు. దీనికామె 'కూతురు కష్టంలో ఉందని తెలిసి చూస్తూ ఊరుకోలేకపోతున్నాను. తనను చూసి తీరాల్సిందే' అంటుంది.

నందూను అరెస్ట్ చేయగా: తులసి వెళ్తుంటే నందూ కూడా వస్తానని తులసితో బయలుదేరుతాడు. అప్పుడు నందూ 'ఇప్పటికే లాస్య ఇక్కడ జరిగిన గొడవ గురించి అక్కడ చెప్పేసి ఉంటుంది' అనగా.. 'అందరికీ అన్ని తెలిసినా తేలు కుట్టిన దొంగల్లా కామ్‌గా ఉండటం తప్పితే ఎవరినీ ఏమి చేయలేము' అంటుంది.

అంతలోనే అక్కడకు పోలీసులు వచ్చి 'మీరు ఇబ్బంది పెడుతున్నారని మీ భార్య కేసు పెట్టింది. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం' అని నందూతో చెప్తారు. అప్పుడు నువ్వేమీ మాట్లాడవే అని తులసిని అనగా.. అది వాళ్ల భార్యభర్తల విషయం అంటుంది. దీంతో నందూ వాళ్లతో వెళ్తాడు.

Intinti Gruhalakshmi Serial Today Episode May 6th 2023

బ్లాక్‌మెయిల్ చేస్తున్నావా: ఫస్ట్ నైట్ కోసం దివ్యను రాజ్యలక్ష్మి వాళ్లు రెడీ చేస్తుంటారు. అప్పుడు బసవయ్య భార్య 'నీ కోడళ్ళు అదృష్టవంతులు వదినా.. నీలాంటి మంచి అత్తగారు దొరికింది' అంటుంది. దీనికామె 'ఆ మాట నువ్వు కాదు.. నా కోడలు చెప్పాలి' అంటుంది.

మరోవైపు విక్రమ్ తాత బెడ్‌ను రెడీ చేస్తూ ఉంటాడు. అప్పుడాయన 'నీ బెడ్‌ను ఇంత బాగా అలంకరించాను. నా పేరు నీ కొడుక్కి పెట్టుకుంటావా' అని అడుగుతాడు. దీంతో విక్రమ్ 'ఇదేం బ్లాక్ మెయిల్? ముందు ఫస్ట్ నైట్ జరగనీ తర్వాత చూద్దాం' అంటాడు.

Intinti Gruhalakshmi Serial Today Episode May 6th 2023

ప్రియకు అత్త వార్నింగ్: నందూ అరెస్ట్ అయిన విషయాన్ని తులసి.. మోహన్‌కు ఫోన్ చేసి చెప్పి బెయిల్ ఇప్పించమని అడుగుతుంది. దీంతో ఆయన 'అదంతా నేను చూసుకుంటాను. వాళ్ళను కంగారు పడొద్దు అని చెప్పు' అంటాడు. ఇక, కోడల్ని రెడీ చేస్తోన్న సమయంలో రాజ్యలక్ష్మి 'ఫస్ట్ నైట్ ముహూర్తం అంటే నాకు, దివ్యకు అగ్ని పరీక్షలా తయారైంది.

ఈసారి ఎలాగైనా ఫస్ట్ నైట్ జరిగి తీరాలి' అంటుంది. తర్వాత దివ్యను రెడీ చేయమని ప్రియకు చెప్పి వాళ్లు వెళ్లిపోతారు. బయటికి వచ్చిన తర్వాత ప్రియను పిలిచి 'మీ ఇద్దరి మధ్య స్నేహం ఎక్కువ అవుతున్నట్లుగా ఉంది. సమస్య ఎక్కడ నుంచి మొదలైన నా వేట ముందు నీ మీదే జాగ్రత్త' అంటూ రాజ్యలక్ష్మి వార్నింగ్ ఇస్తుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode May 6th 2023

దివ్యకు తెలిసిన నిజం: రాజ్యలక్ష్మితో బసవయ్య 'నువ్వు ఈ ఫస్ట్ నైట్‌ను ఎలా ఆపాలనుకుంటున్నావో తెలుసుకోవాలనుకుంటున్నాను. ఏం జరుగుతుందో తెలియక టెన్షన్ వచ్చేస్తుంది' అంటాడు. అప్పుడామె 'చెప్పడం ఎందుకు? నువ్వే చూస్తావు కదా' అంటుంది. ఇంతలో లాస్య.. దివ్యకు ఫోన్ చేసి 'మీ నాన్న పోలీస్ స్టేషన్లో ఉన్నాడు.

గదిలో నీ భర్త దగ్గరికి వెళ్తావో కటకటాలలో ఉన్న నీ తండ్రి దగ్గరికి వెళ్తావో నీ ఇష్టం' అంటుంది. ఆ వెంటనే దివ్య ఇంటికి బయలుదేరుతుంది. ఆ వెంటనే కంగారుగా ఇంటికి అడుగుతుంది. మరి నువ్వు ఇక్కడ ఉన్నావే అని తులసిని ప్రశ్నిస్తుంది. అప్పుడామె 'ఇప్పటికే వాళ్లిద్దరి మధ్యలో రావణకాష్టం రగులుతుంది. మధ్యలో నేను వెళ్తే అది మరింత పెరుగుతుంది' అంటుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X