Intinti Gruhalakshmi: నందూను అరెస్ట్ చేయించింది లాస్య కాదు.. బయటపడ్డ రాజ్యలక్ష్మి కుట్ర

చాలా ఏళ్లుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే:శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ప్రియ తీరుతో అనుమానం వ్యక్తం చేసిన దివ్య.. ఆమెను నిజం చెప్పమని అడుగుతుంది. కానీ, ప్రియ మాత్రం అస్సలు బయటపడదు. అంతేకాదు, నన్ను ఇబ్బంది పెట్టొద్దు అంటూ దివ్యకు రిక్వెస్ట్ చేస్తుంది. ఇక, దివ్యను చూడ్డానికి నందూ, తులసి వస్తుండగా.. పోలీసులు వచ్చి అతడిని అరెస్ట్ చేస్తారు. మరోవైపు, దివ్యను శోభనం కోసం రెడీ చేస్తూ ఉండగా.. అందరూ సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ సమయంలోనే లాస్య నందూను అరెస్ట్ చేసిన విషయం దివ్యకు ఫోన్ చేయడంతో తన ఇంటికి వెళ్లిపోతుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode May 8th 2023

నానా రకాలుగా అనుకుంటారు:నందూను అరెస్ట్ చేయడంతో కంగారుగా వచ్చిన దివ్య.. నువ్వు ఎందుకు చూస్తూ ఉండిపోయావు అని తులసిని ప్రశ్నిస్తుంది. దీనికామె 'ఆ భార్య భర్తల మధ్యలో నేను కలుగ చేసుకుంటే నలుగురు నానా రకాలుగా అనుకుంటారు. అందుకే సైలెంట్‌గా ఉండిపోయాను' అని చెప్తుంది. దీంతో అనసూయ 'అలా అని నందూను ఒంటరిగా వదిలేస్తావా? ఇన్నాళ్లు ఏమవుతావని వాడికి ఎందుకు అండగా నిలబడ్డావు' అని అడుగుతుంది. దీంతో తులసి 'కేవలం ఒక ఫ్రెండ్‌గా మాత్రమే ఆయనతో నిలబడ్డాను' అని సమాధానం చెప్తుంది. తర్వాత పరందామయ్య అడగడంతో తులసి అందరినీ తీసుకుని స్టేషన్‌కు వెళ్తుంది.

ప్లాన్ ప్రకారమే జరుగుతుందని:రాజ్యలక్ష్మితో బసవయ్య 'లాస్య ఫోన్ చేస్తుందని చెప్పావు కదా. ఇందాకటి నుంచి ఆ గుడ్ న్యూస్ కోసం వెయిట్ చేస్తున్నాను' అని అంటాడు. అంతలోనే రాజ్యలక్ష్మికి లాస్య ఫోన్ చేసి 'అంతా నువ్వు చెప్పినట్లుగానే జరుగుతుంది' అని అంటుంది. దీనికామె ఇంతకీ విషయం దివ్యకు చెప్పావా అని అడగ్గా.. ఎప్పుడో చెప్పాను ఇంకా ఇంట్లోనే ఉందా అని ప్రశ్నిస్తుంది. దీంతో రాజ్యలక్ష్మి 'తెలియదు.. కావాలనే దూరంగా ఉన్నాను' అంటుంది. దీనికి లాస్య 'ఆ ఇంట్లో నేను చిచ్చు పెడతాను.. ఈ ఇంట్లో నీ కొడుకుని నువ్వు ఆయుధంగా మార్చుకో' అని చెప్తుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode May 8th 2023

రాజకీయాల్లో వెలిగేవాడినంటూ:లాస్యతో రాజ్యలక్ష్మి మాట్లాడిన మాటలను విన్న బసవయ్య 'అక్కా.. నీకున్న తెలివితేటలు నాకుంటే ఈ పాటికి రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగే వాడిని' అంటాడు. దీంతో రాజ్యలక్ష్మి 'నువ్వు వెలగడం కాదు. వెలగబెట్టవలసిన పనులు చాలా ఉన్నాయి' అంటూ కొన్ని విషయాలను అతడికి చెబుతుంది. అప్పుడు బసవయ్య 'అలాగే అక్క విక్రమ్ మనసులో విష బీజం నాటుతాను. పెళ్ళాం పార్టీ నుంచి మన పార్టీకి వచ్చేలాగా చేస్తాను. ఇంక ఆ విక్రమ్ గాడు దివ్యతో గొడవలు పెట్టుకోవడం స్టార్ట్ చేసేలా చేస్తాను' అని చెబుతాడు.

Intinti Gruhalakshmi Serial Today Episode May 8th 2023

ఆ దేవుడే శిక్షను వేశాడంటూ:తులసి వాళ్లు అందరూ కలిసి నందూ ఉన్న పోలీస్ స్టేషన్‌కు వస్తారు. అప్పుడు నందూ తులసితో 'నేను నీ పట్ల చేసిన అన్యాయానికి ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాను. నిజానికి నువ్వు నా మీద గృహహింస పెట్టాలి. కానీ నువ్వు క్షమించే వదిలి పెట్టావు. కానీ ఆ దేవుడు వదిలిపెట్టలేదు' అని ఎమోషనల్ అవుతాడు. అప్పుడు అనసూయ 'బాధపడకు.. నీకోసం మేము అందరమూ ఉన్నాము. నిన్ను జైలు నుంచి బయటికి తెచ్చుకుంటాము. నువ్వేమీ బాధ పడకు' అని ధైర్యం చెప్తుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode May 8th 2023

మా విషయం పట్టించుకోకు:నందూతో దివ్య 'అసలు ఏం జరిగింది నాన్న? నువ్వు జైలుకు రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది. నాకు చెప్పు నేను లాస్య ఆంటీతో మాట్లాడుతాను' అంటుంది. దీనికి నందూ 'నువ్వు ఈ విషయంలో కల్పించుకోకు. ఇక్కడ నుంచి వెళ్ళిపో' అంటాడు. దీనికామె 'ఎందుకు వెళ్ళిపోవాలి? నాకు అత్తింట్లో సమస్యలు ఎదురైనప్పుడు మీరు నన్ను అలాగే వదిలేస్తారా? మా అత్తగారికి చాలా పేరు ఉంది. నేను ఆవిడతో మాట్లాడుతాను. ఆవిడ మన హెల్ప్ చేస్తారు' అంటుంది. దీంతో నందూ 'ఆవిడ దృష్టిలో నేను చులకనవ్వటం ఇష్టం లేదు చెప్పొద్దు' అంటాడు.

Intinti Gruhalakshmi Serial Today Episode May 8th 2023

దివ్య కనిపించడం లేదని:ఆ తర్వాత తులసి 'పుట్టింటి సమస్యలు అత్తింటి వరకు తీసుకువెళ్లొద్దు. నువ్వు ఇంట్లో చెప్పే వచ్చావా? నిన్ను చూస్తే ఇంట్లో ఏదో ఫంక్షన్‌లాగా ఉంది' అని అడగ్గా.. కంగారులో ఎవరికీ చెప్పకుండా వచ్చానని అంటుంది. దీంతో తులసి భయపడుతుంది. అప్పుడు దివ్య 'ఇప్పటికైనా ఫోన్ చేసి చెప్పొచ్చు కానీ నువ్వే అత్తయ్యకి తెలియనివ్వోద్దన్నావు కదా. అందుకే ఊరుకున్నాను. రేపు పొద్దున్న వెళ్లి వాళ్లకి ఏదో ఒకటి సర్ది చెప్తాను' అంటుంది. ఇక, ఇంట్లో ముహూర్తానికి టైం అవుతుంది దివ్యను తీసుకురా అని రాజ్యలక్ష్మి.. ప్రియను పిలుస్తుంది. అప్పుడామె 'దివ్య మేడం ఇంట్లో లేదు ఏదో ఫోన్ వచ్చింది. విషయం ఏంటో చెప్పకుండా వెళ్ళిపోయింది' అంటుంది. దీంతో అంతా కంగారు పడినట్లు నటిస్తారు.

Intinti Gruhalakshmi Serial Today Episode May 8th 2023

విక్రమ్ మనసు మార్చాలని:విషయం తెలిసిన వెంటనే విక్రమ్ వాళ్ల తాత 'ఏదో అనుకోని కష్టం వచ్చి ఉంటుంది. అందుకే వెళ్లింది. దివ్య అంత బాధ్యత లేని మనిషి కాదు' అంటాడు. అప్పుడు బసవయ్య 'ఎక్కడికి వెళ్ళిందో ఏంటో.. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఫోన్ చేస్తే ఏమని సమాధానం చెప్తాం? అనవసరంగా మా అక్కకి మాట వస్తుంది. అయినా చెప్పి వెళ్లాలి కదా' అంటూ విక్రమ్‌ను రెచ్చగొడుతుంటారు. ఆ సమయంలో విక్రమ్, దివ్యకి ఫోన్ చేస్తాడు కానీ స్విచ్ ఆఫ్ వస్తుంది. అప్పుడు తాత దివ్యకు సపోర్ట్ చేస్తూ మాట్లాడతాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X