twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Intinti Gruhalakshmi Today Episode: లాస్య పరువు తీసిన లక్కీ.. తులసి పిల్లలు కూడా అలా అనడంతో!

    |

    తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు చాలా కాలంగా ప్రేక్షకుల నుంచి భారీ నుంచి అతి భారీ స్థాయిలో స్పందన దక్కుతుందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా చూసేయండి మరి!
    Photos Courtesy: Star మా and Disney+Hotstar

    శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

    శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

    శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. మదర్ థెరిస్సా ఫౌండేషన్ ఈవెంట్ కోసం అందరూ చేరుకోగా.. లక్కీ వచ్చి తులసిని హత్తుకుంటాడు. ఆ సమయంలో లాస్య వచ్చి ఆ చిన్నారిపై చేయి చేసుకోబోతుంది. దీంతో అనసూయ, పరందామయ్య ఆమెపై మండిపడతారు. అప్పుడు లాస్య గౌరవం లేకుండా మాట్లాడుతుంది. దీంతో ప్రవళ్లిక ఎంటరై లాస్య, నందూకు క్లాస్ పీకుతుంది. ఆ తర్వాత బెస్ట్ మదర్ కాంపిటీషన్ జరగ్గా.. దానికి లాస్య, తులసి పేర్లు నమోదు చేస్తారు. మొదటి రౌండ్‌లోనే లాస్య ఓడిపోతుంది. కానీ, తులసి మాత్రం ఫస్ట్ రౌండ్ గెలిచి.. రెండో రౌండ్‌కు వెళ్తుంది.

    Samantha: శృతి మించిన సమంత హాట్ షో.. ఆమెను ఇంత గ్లామర్‌గా ఎప్పుడూ చూసుండరు!Samantha: శృతి మించిన సమంత హాట్ షో.. ఆమెను ఇంత గ్లామర్‌గా ఎప్పుడూ చూసుండరు!

    మూడుసార్లు జన్మనిచ్చిందని అభి

    మూడుసార్లు జన్మనిచ్చిందని అభి

    బెస్ట్ మదర్ కాంపిటీషన్‌లో భాగంగా అభి తన తల్లి తులసి గురించి మాట్లాడుతూ.. 'ఏ తల్లి అయినా ఒకేసారి జన్మనిస్తుంది. కానీ, మా మామ్ మాత్రం నాకు మూడు సార్లు జన్మనిచ్చింది. ఒకసారి 9 నెలలు కడుపులో మోసి.. మరోసారి నేను చేసిన తప్పును తన నెత్తి మీద వేసుకొని.. మూడోసారి నేనొక మర్డర్ కేసులో ఇరుక్కొని నా జీవితాన్నే వదిలేసుకున్న సమయంలో ఈ దేవత న్యాయదేవతలా పోరాడి నన్ను నిర్దోషిగా బయటపడేసింది. ఆ విధంగా నాకు మూడోసారి జన్మనిచ్చింది. అందుకే మా అమ్మ గ్రేట్' అని చెప్తాడు. అది నందూ, లాస్యకు అస్సలు నచ్చదు. అప్పుడు పరందామయ్య 'వీడిలో స్వార్థం ఉన్నా అమ్మ మీద ప్రేమ కూడా ఉంది' అంటాడు.

    తల్లిని పొడిగి.. తండ్రిపై విమర్శలు

    తల్లిని పొడిగి.. తండ్రిపై విమర్శలు

    కాంపిటీషన్‌లో దివ్య మాట్లాడుతూ.. 'ఏ కూతురు అయినా.. భరోసా కోసం తండ్రి వైపే చూస్తుంది. డాడీ ఉన్నాడనే భరోసాతో ఉంటుంది. కానీ, నా విషయంలో మాత్రం అలా జరగలేదు. నన్నెవరో కిడ్నాప్ చేసినప్పుడు మా డాడ్ స్థానంలో మా మామ్ నిలబడి నన్ను రక్షించుకుంది. అయినా కట్టుకున్న మామ్‌కే సపోర్ట్ ఇవ్వని డాడ్.. ఇక పిల్లలమైన మాకు ఏం ఇస్తారు? అందుకే నా దృష్టిలో మా మామ్ ఎప్పటికీ గ్రేట్ మదర్' అంటూ వెక్కి వెక్కి ఏడుస్తుంది. దీంతో అక్కడున్నవాళ్లు అంతా నిశ్శబ్ధంగా చూస్తుంటారు. కానీ, నందూ, లాస్య మాత్రం కోపంతో రగిలిపోతూ కనిపిస్తారు.

    Neil Kitchlu: కొడుకు ఫొటోతో కాజల్ బిగ్ సర్‌ప్రైజ్.. నీల్ కిచ్లూ ఎలా ఉన్నాడో చూశారంటే!Neil Kitchlu: కొడుకు ఫొటోతో కాజల్ బిగ్ సర్‌ప్రైజ్.. నీల్ కిచ్లూ ఎలా ఉన్నాడో చూశారంటే!

    నాకు రెండూ ఇచ్చింది మా అమ్మే

    నాకు రెండూ ఇచ్చింది మా అమ్మే

    చివర్లో ప్రేమ్ కూడా తన తల్లి గురించి మాట్లాడతాడు. 'అమ్మ జన్మనిస్తే నాన్న జీవితాన్ని ఇస్తాడు అంటారు. నాకు మాత్రం జన్మను ఇచ్చింది.. జీవితాన్ని ఇచ్చింది కూడా మా అమ్మే. నేను ఒక పనికిరాని వాడిని అని నా తండ్రితో సహా అందరూ నా మీద ముద్ర వేశారు. కానీ, మా అమ్మ మాత్రమే నన్ను నమ్మి అండగా నిలిచింది. ముందుకు నడిపిస్తోంది. అందుకే మా అమ్మ గ్రేట్' అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తాడు. దీంతో తులసికి ఏం చేయాలో అస్సలు అర్థం కాదు. ఆ సమంయలో మాత్రం మనసులో నా ప్రేమ్ ఎప్పటికీ గ్రేట్ అని అనుకుంటుంది.

    లాస్యకు అందరి ముందే ఝలక్

    లాస్యకు అందరి ముందే ఝలక్

    తులసి వంతు అయిపోయిన తర్వాత లాస్య గురించి ఆమె కొడుకు లక్కీ మాట్లాడతాడు. 'మా మమ్మీ కూడా చాలా గ్రేట్. గోరు ముద్దలు తినిపించడం.. ఒడిలో కూర్చోబెట్టుకొని మాట్లాడటం.. ఒక్క నిమిషం కూడా వదలదు. కానీ, ఇదంతా నిజం కాదు కలలో. నేను ఏం తప్పు చేశానో తెలియదు. మా మమ్మీ నన్ను హాస్టల్‌లో ఉంచి చదివిస్తోంది. చుట్టూ ఫ్రెండ్స్ ఉంటారు. లోన్లీగా ఉంటుంది. హాస్టల్ రూమ్ జైలులా అనిపిస్తుంది. మమ్మీ కనిపించదు. మమ్మీ మాట వినపడదు. ఏడుపు వస్తూ ఉంటుంది. చెప్పుకోవడానికి ఎవ్వరూ ఉండరు. తినాలని ఉండదు. నిద్ర పట్టదు. పారిపోవాలనిపిస్తుంది' అంటూ బాధ పడతాడు.

    బాత్రూంలో శ్రీయ హాట్ సెల్ఫీ: వామ్మో తల్లైనా అస్సలు తగ్గకుండా అందాల ఆరబోతబాత్రూంలో శ్రీయ హాట్ సెల్ఫీ: వామ్మో తల్లైనా అస్సలు తగ్గకుండా అందాల ఆరబోత

    తులసి ఆంటీనే బెస్ట్ అన్న లక్కీ

    తులసి ఆంటీనే బెస్ట్ అన్న లక్కీ

    లక్కీ మాటలకు అందరూ షాక్ అవుతారు. అప్పుడు లాస్య వాడేదో తమాషాకు అలా అంటున్నాడు. కదా లక్కీ అని అడుగుతుంది. అప్పుడా బుడ్డోడు 'లేదు మమ్మీ నిజంగానే చెబుతున్నాను. నువ్వు కూడా నన్ను తులసి ఆంటీలాగా ప్రేమగా చూసుకోవచ్చు కదా మమ్మీ. నాకు అబద్ధం చెప్పడం చేతకాదు. అందుకే నిజం చెప్పేశా. సారీ మమ్మీ. ఎవ్వరికీ నా లాంటి లైఫ్ ఉండకూడదు' అంటూ ముగిస్తాడు. అప్పుడు యాంకర్ 'నాకు తెలుసు. లక్కీ మాటలు ఇక్కడున్న అందరి హృదయాలను టచ్ చేశాయి. ఇది కాంపిటిషన్. దీని గురించి మాట్లాడుకోవద్దు' అంటుంది.

    ఆప్షన్స్.. తులసి జవాబుకు ఫిదా

    ఆప్షన్స్.. తులసి జవాబుకు ఫిదా

    మూడో రౌండ్‌లో భాగంగా తల్లులను ఒక క్వశ్చన్ అడిగి.. దానికి రెండు ఆప్షన్లు ఇస్తామని యాంకర్ చెబుతుంది. ఇందులో భాగంగానే అందరినీ అడుగుతుంది. అలా లాస్యతో 'మీ అబ్బాయి మిమ్మల్ని నేను ఇష్టమా.. డాడీ ఇష్టమా అని అడిగితే మీరు ఏం చెప్తారు' అని యాంకర్ ప్రశ్నిస్తుంది. దీంతో నువ్వే ఇష్టం అని చెబుతా అంటుంది. అప్పుడు జడ్జీలు అలా పిల్లలకు ఆప్షన్స్ ఇవ్వడం తప్పంటారు. తర్వాత తులసిని 'మీ నాన్న గారికి యాక్సిడెంట్ అయి ఆసుపత్రిలో ఉన్నారు. మరోవైపు స్కూల్‌లో మీ బాబు మీ కోసం ఎదురు చూస్తున్నారు. ముందు ఎవరి దగ్గరికి వెళ్తారు' అని ప్రశ్నిస్తుంది. దీనికి తులసి 'నేను మా నాన్న దగ్గరకే వెళ్తా. ఎందుకంటే నేను రాకున్నా ఇంటికి వచ్చేయడం నా పిల్లలకు నేర్పించా' అంటుంది. దీంతో అంతా ఫిదా అవుతారు.

    మరోసారి యాంకర్ వర్షిణి అందాల ఆరబోత: టాప్ టూ బాటమ్ కనిపించేలా ఘాటుగా!మరోసారి యాంకర్ వర్షిణి అందాల ఆరబోత: టాప్ టూ బాటమ్ కనిపించేలా ఘాటుగా!

    పిల్లల వంతు.. తులసి బాధగానే

    పిల్లల వంతు.. తులసి బాధగానే

    పిల్లలను తల్లుల గురించి మాట్లాడమని అడుగుతారు. దీంతో లాస్య గురించి లక్కీ.. తులసి గురించి అభి, ప్రేమ్, దివ్య మాట్లాడతారు. ఆ సమయంలో వీళ్లు ముగ్గురూ స్టేజ్ మీదకు వెళ్లి మరీ తులసి కోసం ఏదైనా చేయాలని అనుకుంటున్నట్లు చెబుతారు. అంతేకాదు, తామంతా ఓడిపోయాని అంటారు. దీంతో తులసి 'ఎందుకు మీరు ఓడిపోయారని అనుకుంటున్నారు. మీరు నాకు ఏం చేయలేదని ఎందుకు అనుకుంటున్నారు. ఈరోజు అందరి ముందు నేను ఇలా తలెత్తుకొని నిలబడి ఉన్నానంటే దానికి కారణం మీరు కాదా. ఒక మనిషిని నమ్మి నా జీవితాన్ని తన చేతుల్లో పెట్టాను. నన్ను, నా పిల్లలను ప్రేమగా చూసుకుంటాడు అని ఆశపడ్డాను మోసపోయాను. నన్ను కాదనుకొని తను మరోమనిషికి సొంతం అయ్యాడు' అంటుంది. ఇలా ఈ ఎపిసోడ్ పూర్తైంది.

    English summary
    Intinti Gruhalakshmi Episode 627: Abhi, Prem and Divya Shares Their Memories With Tulasi. Then Crowd Appreciates Her. After That Lasya Comes Up With Bad Plan.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X