For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: మనసులో మాట చెప్పబోయిన సామ్రాట్.. లాస్య, నందూకు బిగ్ షాక్

  |

  ఎన్నో భాషలతో పోల్చుకుంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే చూడండి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ఇల్లు చూసుకున్న తర్వాత తులసి సంతోషంగా ఉంటుంది. అప్పుడు సామ్రాట్ ఆమెకు ఓ గిఫ్ట్ ఇస్తాడు. కానీ, తులసి అది వద్దు అంటుంది. అలా బ్రతిమాలిన తర్వాత ఆమె గిఫ్ట్ చూడగా.. అందులో కీ చైన్ ఉంటుంది. అది చూసి తులసి సంతోషిస్తుంది. ఆ తర్వాత సామ్రాట్‌తో కలిసి తులసి షాపింగ్‌కు వెళ్తుంది. అక్కడ ప్రమిదలు కొనే సమయంలో ఓ కస్టమర్‌కు ఆమె క్లాస్ పీకుతుంది. ఇక, మాధవితో జరిగిన గొడవ వల్ల నందూ బాధగా ఉంటాడు. కానీ, లాస్య, అనసూయ మాత్రం తులసి వల్లే ఇలా జరిగిందని అంటారు.

  షర్ట్ విప్పేసి అరాచకంగా ప్రణిత: ఆమె ఓ బిడ్డకు తల్లంటే నమ్ముతారా!

   తులసి కోసం వచ్చేసిన పిల్లలు

  తులసి కోసం వచ్చేసిన పిల్లలు

  షాపింగ్‌కు వెళ్లి వచ్చే సరికి తులసి ఇంటి ముందు ప్రేమ్, శృతి, అంకిత, దివ్యలు వేచి చూస్తూ ఉంటారు. వాళ్లను అక్కడ చూసి ఆమె ఎంతగానో సంతోషిస్తుంది. అప్పుడే వాళ్లంతా కూడా వీళ్లిద్దరిని చూసి నవ్వుకుంటూ ఉంటారు. ఆ సమయంలో దివ్య 'మీ ఇద్దరూ అలాగే ఉండండి. ఒక ఫొటో తీసుకుంటా' అని అడుగుతుంది. అప్పుడు సామ్రాట్ 'పర్మిషన్ అడగాల్సింది నన్ను కాదు.. మీ మమ్మీని' అని అంటాడు. తర్వాత దివ్య ఫొటో తీయగా సామ్రాట్ 'దయచేసి ఈ ఫొటోను నెట్లో కానీ పెట్టుకు.. నాకేం ఇబ్బంది లేదు కానీ.. చూసేవాళ్లు ఇబ్బంది పడుతున్నారు. అసలే మేం ఇద్దరం కలిసి ఉన్న ఫొటోలకు లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి' అని అంటాడు.

  ఇల్లు మొత్తం సర్ధి పెట్టేశారుగా

  ఇల్లు మొత్తం సర్ధి పెట్టేశారుగా

  తులసి తన పిల్లలతో మాట్లాడుతున్నంత సేపు సామ్రాట్ షాపింగ్ చేసుకుని వచ్చిన సామాన్లను మోస్తూనే ఉంటాడు. దాన్ని ఆలస్యంగా గమనించిన తులసి 'సరే సరే.. మాట్లాడుకున్నది చాలు కానీ, సామ్రాట్ గారి చేతిలో ఉన్న ఆ బాక్సులను తీసుకుని లోపలకు తీసుకు రండి' అంటుంది. అప్పుడు వాటిని ప్రేమ్ వాళ్లు తీసుకుంటారు. ఆ సమయంలో దివ్య ఇక నుంచి రామ దండులా మేమంతా తులసి దండు. ఫటాఫట్ ఇల్లు మొత్తం సర్దేస్తాం.. అందుకే ఇక్కడకు అంతా వచ్చేశాం అని అంటుంది. ఆ తర్వాత వాళ్లంతా కలిసి మంచి చెడ్డా గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.

  మళ్లీ బికినీలో నిహారిక ఓవర్ డోస్ హాట్ షో: ఎద అందాలు కూడా కనిపించేలా!

  సామ్రాట్ చంద్రుడన్న తులసి

  సామ్రాట్ చంద్రుడన్న తులసి

  అనంతరం సామ్రాట్ 'ఇంత పెద్ద ఇల్లు తీసుకుని గెస్ట్‌లను బయట పెట్టి మాట్లాడుతున్నారేంటి? గెస్ట్‌లకు ఇంటి ఓనర్ ఎక్స్‌స్ట్రా పేమెంట్ వసూలు చేయడు' అని చమత్కరిస్తాడు. దీంతో శృతి మేం గెస్ట్‌లం కాదు.. ఆంటీ వారసులం అని అంటుంది. దీనికతడు నేను అన్నది మీ గురించి కాదు నా గురించి అని అంటాడు. అప్పుడు తులసి 'ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నా.. చంద్రుడికి ఉండే విలువే వేరు. వస్తూ పోతూ ఉంటాననడానికి ఆకాశానికి చంద్రుడు గెస్ట్ ఏం కాదు కదా' అని సామ్రాట్‌ను తన ఆకాశం లాంటి జీవితానికి చంద్రుడు అన్నట్లుగా చెబుతుంది.

  వాళ్లను గుర్తు చేసుకుని బాధగా

  వాళ్లను గుర్తు చేసుకుని బాధగా

  ఇక, ఆ తర్వాత తులసి కొత్త ఇంట్లో పాలు పొంగిస్తుంది. ఆ తర్వాత వాటితో తులసి పాయసం చేస్తుంది. అది అందరూ లొట్టలేసుకుంటూ లాగించేస్తారు. ఇక, సామ్రాట్ అయితే 'తులసి పాయసం ఫ్యాన్స్ అసోసియేషన్‌లో నేను కూడా ఒక మెంబర్‌ను. తులసి చేతి పాయసానికి అసలు మార్కెటింగ్ అవసరం లేదు' అని అంటాడు. దీనికి ప్రేమ్ 'మీరే కాదు.. ఈ అసోషియేషన్‌కు మా నానమ్మ ఫౌండర్ ప్రెసిడెంట్' అని అంటాడు. ఆ మాటతో తులసికి అత్తమామలు గుర్తుకొచ్చి ఎమోషనల్ అవుతుంది. తర్వాత అందరూ వెళ్లిపోగా.. సామ్రాట్, తులసి మాత్రమే ఉంటారు.

  బట్టలు మొత్తం విప్పేసి శ్రీయ దారుణం: ఈ వీడియోలో ఆమెను చూశారంటే!

  పూజలో తులసి.. లక్ష్మీ దేవితో

  పూజలో తులసి.. లక్ష్మీ దేవితో

  సాయంత్రం కాగానే తులసి, సామ్రాట్ పూజ కోసం డ్రెస్ మార్చుకుని కనిపిస్తారు. తులసి దేవుడి వైపు చూస్తుండగా.. సామ్రాట్ మాత్రం ఆమెనే చూస్తుంటాడు. అప్పుడామె 'ఏంటి అలా చూస్తున్నారు' అని అడగ్గా.. 'లక్ష్మీదేవిని చూస్తున్నా' అని సామ్రాట్ బదులిస్తాడు. ఇంతలో సామ్రాట్ వాళ్ల బాబాయ్ ఫోన్ చేస్తాడు. 'తులసి ఇంట్లో ఒంటరిగా ఉంది కదూ. ఆమె మూడ్ బాగానే ఉంది కదా' అని అడుగుతాడు. అప్పుడు సామ్రాట్ 'నేను పక్కన ఉంటే.. తులసి మూడ్ బాగానే ఉంటుంది.. ముందు ఎందుకు కాల్ చేశావో విషయం చెప్పు' అని అడుగుతాడు.

  మనసులో మాట చెప్పాలని

  మనసులో మాట చెప్పాలని

  ఆయన మాటలకు సామ్రాట్.. తులసి నాకు ఫ్రెండ్ మాత్రమే అంటాడు. అప్పుడు ఏంటీ ఫ్రెండ్ అంటున్నారు అని అడుగుతుంది. దీనికి సామ్రాట్ ఏం లేదు.. ఎవరో ఫ్రెండ్ వచ్చారట. తనను వెళ్లిపోమని చెప్పాను అంటాడు. అప్పుడు తులసి వెళ్లిపోతుంటే.. తులసి గారూ అని పిలుస్తాడు.. దీంతో వెనక్కి తిరిగి ఏంటో చెప్పండి అని తులసి అడుగుతుంది. అప్పుడు సామ్రాట్ 'మరీ.. మరీ.. అంటూ చెప్పాలా వద్దా అని ఆలోచిస్తుంటాడు. దీంతో ఆమె ఏంటో చెప్పండీ.. మొహమాటపడకండి అని అంటుంది. దీనికి సామ్రాట్ 'ఏం లేదు.. రేపు మీ మామయ్య బర్త్ డే కదా వెళ్లొచ్చు కదా' అంటాడు. అప్పుడామె అక్కడికి వెళ్లి గొడవ పడే ఓపిక లేదు అంటుంది. దీంతో సామ్రాట్ అయితే ఓ ప్లాన్ చేద్దాం అని అంటాడు.

  హాట్ షోతో షాకిచ్చిన రమ్యకృష్ణ: చీర ఉన్నా లేనట్లే యమ ఘాటుగా!

  నందూను తిట్టుకున్న లాస్య

  నందూను తిట్టుకున్న లాస్య

  నందూ.. తన చెల్లెలు మాధవిని అన్న మాటల్ని గుర్తు చేసుకుని బాగా బాధపడూ ఉంటాడు. అప్పుడు లాస్య 'ఓరి పిచ్చోడా.. అంతా మనం అనుకున్నట్టే జరుగుతుందిరా. తులసి పీడ విరగడైంది. ఈ ఇల్లు మన సొంతం అయింది. నీ వాళ్లు నీకు దగ్గర అయ్యారు. ఎందుకు ఇంతిలా బాధపడిపోతున్నావు' అని మనసులో అనుకుంటుంది. కానీ, నందూ తలపై చేయి వేసి ఓదార్చుతూ.. 'మీ అన్నాచెల్లెల్లు కలవాలని నేను కోరుకుంటున్నా. నువ్వు బాధపడటంలో అర్ధం ఉంది కానీ.. అంతకంటే ముఖ్యమైన పని మరొకటి ఉంది. మామయ్య గారి బర్త్‌డేని సెలబ్రేట్ చేయాలి. అర్ధరాత్రి అంతా సర్‌ప్రైజ్ చేద్దాం' అని అంటుంది. కానీ, రాత్రి సమయంలో ఇంట్లో ఎవరూ కనిపించరు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 786: Tulasi Recalls her Memories with Anasuya and Gets Emotional. After That Anasuya Annoyed as Parandhamaiah is Angry with her.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X