For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: తులసికి తీవ్ర అవమానం.. ఆరోజు రాత్రే చెడిందని.. చెంపపై కొట్టడంతో!

  |

  జనరేషన్లు ఛేంజ్ అవుతున్నా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి!
  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే


  శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. పరందామయ్య పుట్టినరోజు కావడంతో అర్ధరాత్రి ఆయనకు సర్‌ప్రైజ్ ఇవ్వాలని నందూ బ్యాచ్ ప్లాన్ చేస్తుంది. కానీ, ఆయనతో పాటు ప్రేమ్, శృతి, దివ్య, అంకితలు కనిపించకుండా వెళ్లిపోతారు. ఆ తర్వాత అందరూ కలిసి తులసి ఇంటికి చేరుకుంటారు. అక్కడే పరందామయ్య పుట్టినరోజు సెలెబ్రేషన్స్‌ చేసుకుంటారు. అదంతా అభి చాటుగా చూస్తుంటాడు. తులసికి ఎప్పటికి అండగా ఉంటానని సామ్రాట్.. పరందామయ్యకు హామీ ఇస్తాడు. వాళ్లంతా వెళ్లిపోగానే అభి ఆ ఇంట్లోకి కోపంగా వెళ్లి గొడవ పెట్టుకోడానికి ప్రయత్నిస్తాడు.

  అషు రెడ్డి 'కామం' వీడియో వైరల్: వాళ్లకు మాత్రమేనట.. కింద కామెంట్స్ చూశారంటే!

  తులసి, సామ్రాట్‌కు అభి షాక్

  తులసి, సామ్రాట్‌కు అభి షాక్


  కోపంగా వచ్చిన అభితో తులసి 'ఈరోజు తాతయ్య పుట్టిన రోజు. కాస్త ముందు వచ్చి ఉంటే మాతో పాటు ఎంజాయ్ చేసి ఉండేవాడివి కదరా' అంటుంది. అప్పుడు అభి 'నేను వచ్చింది మీతో పాటు పండగ చేసుకోవడానికో, లేదంటే కొత్తింట్లోకి వచ్చినందుకు కంగ్రాట్స్ చేయడానికి కాదు. నేను వచ్చి చాలాసేపు అయింది. బయట నుంచి లోపల జరగుతున్న తమాషా అంతా చూస్తున్నా' అని అంటాడు. దీంతో తులసి 'బయట ఎందుకు నిలబడటం.. ఏదైనా అడగాల్సింది ఉంటే.. లోపలకొచ్చి అడగాల్సింది.. అప్పుడే సమాధానం చెప్పేదాన్ని' అని అంటుంది. దీంతో అభి.. తాతయ్య మూడ్ పాడు చేయొద్దని రాలేదు అంటాడు. అప్పుడు అంకిత పెద్దవాళ్లను గౌరవించడం ఎప్పుడు నేర్చుకున్నావ్ అనగా మా అమ్మ తప్పు చేసినప్పటి నుంచి అంటాడు.

  కొడుకుని వెళ్లిపోమన్న తులసి

  కొడుకుని వెళ్లిపోమన్న తులసి

  ఆ తర్వాత అభి 'మా మామ్ చేసిన సిగ్గులేని పనుల బురదను శుభ్రం చేద్దామని, తాడో పేడో తేల్చుకోవాలని వచ్చాను. నువ్వు చేసిన చేస్తున్న నీతిమాలిన పనుల వల్ల మేం ఇబ్బంది పడటానికి సిద్ధంగా లేము. నేను చెప్పేది వినిపిస్తుందా' అని అరుస్తాడు. దీనికి తులసి కూడా గట్టిగానే అరుస్తూ 'హా వినిపిస్తుంది. ఇప్పుడు నేను చెప్పేది విను. తాతయ్య గారి పుట్టినరోజు సంతోషాన్ని పాడుచేసుకోకూడదని ఆలోచిస్తున్నా. పోరా ఇక్కడ నుంచి' అని అంటుంది. అప్పుడే అంకిత వచ్చి పద ఇక్కడ నుంచి వెళ్లిపోదాం.. ఒక్క మాట కూడా మాట్లాడటానికి వీళ్లేదు అంటుంది.

  డోసు పెంచేసిన జబర్దస్త్ వర్ష: ముందూ వెనుక ఏమీ లేకుండా హాట్ షో

  నువ్వు అసలు తల్లివేనా అని

  నువ్వు అసలు తల్లివేనా అని


  అంకిత చేతిని వదిలించుకున్న అభి అక్కడున్న వాటిని విసిరికొడతాడు. అంతేకాదు 'నీకు నీ వివాహ బంధాన్ని నిలుపుకోవడం చేతకాలేదు. కానీ, నీ పిల్లలకి నీతులు చెప్తూ వాళ్ల జీవితాలతో ఆటలాడుతున్నావు. అసలు నువ్వు తల్లివేనా? నీ జీవితంలాగే నీ కొడుకు జీవితాన్ని కూడా చేసి మా మొగుడు పెళ్లాలని ఎలా విడదీయాలనిపిస్తుంది' అని ప్రశ్నిస్తాడు. అప్పుడు తులసి 'నవమాసాలు మోసి కని పెంచిన అమ్మనిరా నేను. నేనెందుకు నీ జీవితాన్ని నాశనం చేస్తాను' అని అడుగుతుంది. దీనికి అభి 'నాశనం చేయడం కాదు మామ్. ఆల్రెడీ నాశనం చేసేశావు. నా భార్యకు నన్ను శత్రువును చేశావు. నాకు సపోర్ట్‌గా నిలబడ్డ అత్తగారిని కూడా దూరం చేశావు. ఎందుకూ పనికి రాకుండా చేశావు' అని నిందలు వేస్తాడు.

  బాయ్‌ఫ్రెండ్‌తో ఉన్నావంటూ

  బాయ్‌ఫ్రెండ్‌తో ఉన్నావంటూ


  ఆ తర్వాత అభి 'నా సంసారాన్ని మంటకలిపింది. తను మాత్రం బాయ్‌ఫ్రెండ్‌ను వెతుక్కుని ఎంజాయ్ చేస్తుంది. అసలు నీది ఫ్రెండ్‌షిప్ చేసే వయసు కాదు. అలాంటిది ఏకంగా బాయ్‌ఫ్రెండ్‌నే సెట్ చేసుకున్నావు' అని నోటికొచ్చినట్టు మాట్లాడతాడు. ఆ మాటలన్నీ విన్న సామ్రాట్ కోపంతో ఊగిపోతుంటాడు. అప్పుడు అంకిత 'జాగ్రత్తగా మాట్లాడు అభి. సామ్రాట్ గారు ఆంటీకి బాయ్‌ఫ్రెండ్ కాదు. అయినా బాయ్‌ఫ్రెండ్ అయితే తప్పేంటి? ఆ మాట తప్పే అయితే అప్పట్లో నువ్వు నాకు ఎందుకు బాయ్‌ఫ్రెండ్‌గా ఉన్నావు. మీ డాడ్ చేసింది ఏంటి? ఏ వయసులో లాస్యకి బాయ్‌ఫ్రెండ్ అయ్యారు? అప్పుడు ఏమైంది నీ నోరు' అని ప్రశ్నిస్తుంది. దీంతో అభి లాజిక్‌లు మాట్లాడిన సమాజంలో కట్టుబాట్లు ఉన్నాయని కోప్పడతాడు.

  పెళ్లైన కొత్తలోనే హీరోయిన్ పూర్ణకు షాక్: బయటపడిన భారీ మోసం.. తన భర్త ఎలాంటి వాడో చెబుతూ పోస్ట్

  అభికి సామ్రాట్ మాస్ వార్నింగ్

  అభికి సామ్రాట్ మాస్ వార్నింగ్


  అనంతరం అభి 'అందరు మామ్స్ రూల్స్ పాటిస్తుంటే మా మామ్‌కు మాత్రం పట్టవు. తల్లులకు స్వార్ధం ఉండదు.. ఉండకూడదు. నీకు మాత్రం నిలువెల్లా స్వార్ధమే. ఒక ఆడదానివి, ఒక అమ్మవి అయుండి.. ఇంత స్వార్ధంతో దిగజారిపోయి ఇంత సిగ్గులేకుండా ఎలా ఉండగలుగుతున్నావు? మనవళ్లు, మనవరాళ్లతో ఆడుకోవాల్సిన వయసులో మా మామ్ ఈ వెధవపనులేంటి' అని అంటాడు. అప్పుడు సామ్రాట్ 'చాలు.. ఇక చాలు. శ్రీరాముడి లాంటి ఈ సామ్రాట్‌లో పరశురాముడు కూడా ఉన్నాడు. ఇప్పటి వరకూ నీ మాటలు విని ఓర్చుకున్నా. ఇంకొక్క మాట నీ నోటిలో నుంచి బయటకు వస్తే పరుశురాముడిలా గొడ్డలి తీస్తా' అని వార్నింగ్ ఇస్తాడు. దీంతో అతడి మీదే అభి ఎదురు తిరుగుతాడు. అంకిత చెప్పినా వినకుండా తిట్టేస్తాడు.

  ఆ రాత్రే మా మామ్ చెడిందని

  ఆ రాత్రే మా మామ్ చెడిందని


  అక్కడితో ఆగని అభి 'తుఫాన్ వచ్చిన రోజు రాత్రి జరిగిన సంఘటనతో మా రిలేషన్స్ అన్నీ ముక్కలైపోయాయి. మా మామ్ పడరాని మాటలు పడింది. నిందలు మోసింది. మా మామ్‌ను ప్రతివాడు వేలెత్తి చూపిస్తున్నాడంటే అది మీవల్లే. నోటికొచ్చినట్టు కామెంట్లు చేస్తున్నారు. క్యారెక్టర్ గురించి నీఛంగా మాట్లాడుతున్నారంటే దానికి కారణం మీరు.. ఇప్పుడు మా అమ్మ ఇల్లు వదిలి బయటకు వచ్చిందంటే మీరే కారణం. ఇంత వరకూ మా మామ్ వైపు నుంచి ఎలాంటి తప్పు లేదనుకున్నా.. మీతో కలిసి కొత్త ఇంట్లోకి వచ్చినప్పుడే ఆమె చెడింది' అని అంటడు. దీంతో తులసి అతడి చెంప చెల్లుమనిపిస్తుంది. అంతేకాదు, నా క్యారెక్టర్‌కు నీ సర్టిఫికెట్ అవసరం లేదు అంటుంది.

  హాట్ వీడియో వదిలిన ప్రగ్యా జైస్వాల్: వామ్మో ఇది మామూలు షో కాదుగా!

  నా ఫొటోకు దండేయండి అని

  నా ఫొటోకు దండేయండి అని


  తులసి ఇంట్లో పుట్టినరోజు జరుపుకున్న తర్వాత పరందామయ్య వాళ్లు ఇంటికి తిరిగి వస్తారు. దీంతో నందూ 'నాన్న మీరు అనుకున్నట్లే మీకు కావాల్సిన వాళ్ల దగ్గరే పుట్టినరోజు జరుపుకున్నారు కదా. ఇకనైనా సంతోషంగా ఉండండి. నవ్వుండి నాన్న. మా సంతోషం కోసం నన్ను క్షమించి ఇక్కడ కూడా కేక్ కట్ చేయండి' అంటాడు. అప్పుడాయన 'నేను నిన్ను క్షమించినా ఈ ఇంట్లోని కొందరినీ ఆ భగవంతుడు కూడా క్షమించడు. ఒకపని చేయ్. నా ఫొటోకు దండేసి, దీపం పెట్టి, కేక్ కట్ చేయి' అంటాడు. దీంతో అంతా షాక్ అవుతారు. ఇలా ఈరోజు ఎపిసోడ్ ముగిసింది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 788: Abhi Blames Tulasi For His Disputes with ankitha. After That He Talking about Tulasi and Samrat Relationship.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X