For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: తులసి కాళ్లు పట్టుకున్న నందూ.. వీడియో కాల్‌ చేసిన లాస్యకు షాక్

  |

  ఇండియాలోని మిగిలిన భాషలతో పోల్చుకుంటే తెలుగు బుల్లితెరపై వచ్చే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరూ చూడండి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తులసి వ్యవహరిస్తున్న తీరుతో కోపంగా ఉంటాడు నందూ. దీంతో ఆమెతో గొడవకు దిగుతాడు. అప్పుడు ఇద్దరి మధ్య కాసేపు వాదన జరుగుతుంది. ఆ సమయంలో ఆరా తీయడానికి ఫోన్ చేసిన లాస్యపై నందూ ఫైర్ అవుతాడు. సరిగ్గా అప్పుడే అనసూయ.. లాస్య కోసం రాగా చిరాకు పడుతుంది. ఆ తర్వాత భాగ్యతో లాస్య ఫోన్‌లో మాట్లాడుతుండగా అనసూయ వింటుంది. దీంతో లాస్య నిజస్వరూపం తెలుసుకుంటుంది. ఆ తర్వాత తులసి ఆమెకు ఫోన్ చేసి ప్రేమగా మాట్లాడగా.. కన్నీరు పెట్టుకుంటుంది అనసూయ.

  Bigg Boss: షణ్ముఖ్‌పై దీప్తి సునైనా షాకింగ్ పోస్ట్.. ఆమెతో చేస్తే తప్పులేదా అంటూ అతడిపై ఓ రేంజ్‌లో!

  తప్పు తెలిసి బాధ పడిన అనసూయ

  తప్పు తెలిసి బాధ పడిన అనసూయ


  లాస్య నిజస్వరూపం తెలుసుకున్న అనసూయ.. తులసితో మాట్లాడిన తర్వాత భర్త పరందామయ్య ముందు పశ్చాత్తాపం చెందుతుంది. ఆ సమయంలోనే ఇంతకాలం లాస్యతో కలిసి తులసి ఎన్ని రకాలుగా బాధలు పెట్టానన్న దాన్ని గుర్తు చేసుకుంటుంది. అప్పుడామె తులసి పరిస్థితిని తలుచుకుని తెగ బాధ పడుతుంది. అప్పుడు ఆరా తీసేందుకు ప్రయత్నించిన పరందామయ్యతో 'ఇంత కాలం దేవత ఎవరో దెయ్యం ఎవరో కనుక్కోలేకపోయాను. ఎంతో మంచిదైన తులసికి ద్రోహం చేసి నానా కష్టాలు పెట్టాను. చాలా తప్పు చేశాను' అంటూ బోరున విలపిస్తుంటుంది.

  మనం మాజీ భార్యభర్తలం కదంటూ

  మనం మాజీ భార్యభర్తలం కదంటూ

  ఆఫీస్ పనుల కోసం బెంగళూరు వెళ్లిన నందూ, తులసి మధ్య చిత్ర విచిత్రమైన సంఘటనలు జరుగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తులసిని హోటల్‌లో ఒంటరిగా వదిలేసి నందూ బయటకు వెళ్లిపోతాడు. అలా చాలా సేపటి తర్వాత అతడు ఫుల్లుగా మద్యం సేవించి వస్తాడు. ఆ సమయంలో తులసి తాగి వచ్చారా అని ప్రశ్నించగా.. తాగాల్సి వచ్చింది అంటూ నందూ బదులిస్తాడు. అంతేకాదు, 'ఎవరి జీవితాలు వాళ్లవి అన్నావు కదా.. మనం మాజీ భార్యభర్తలం అన్నావ్ కదా.. మరి ఇప్పుడెందుకు నన్ను నిలదీస్తున్నావ్' అని అనగా తులసి సారీ చెబుతుంది.

  Bigg Boss: లోబో పరువు తీసిన ఫేమస్ యాంకర్.. ఉమాదేవితో సరసాలు.. రెండో పెళ్లి అంటూ సంచలన వ్యాఖ్యలు

  నిజాలు చెప్పడానికే తాగేసి వచ్చాను

  నిజాలు చెప్పడానికే తాగేసి వచ్చాను

  ఫుల్లుగా తాగి ఉన్న నందూ తులసితో మనసు విప్పి మాట్లాడతాడు. ఈ సమయంలోనే 'నేను కావాలనే ఫుల్లుగా తాగాను. నీతో కొన్ని నిజాలు చెప్పాలి. అందుకోసమే ధైర్యం వస్తుందని తాగి వచ్చాను. నేను ఏం చెప్పాలని అనుకున్నానో అవన్నీ ఇప్పుడు చెప్పనివ్వు. మనుషులు అందరూ ఒకేలా ఉండరు.. ప్రతి ఒక్కరికీ బలం బలహీనతలు ఉంటాయి. నా బలహీనతల్ని నా బలంతో గెలవలేకపోయాను. అందుకే ఓడిపోయాను. ఆ ప్రాసెస్‌లోనే నిన్ను కూడా పోగొట్టుకున్నాను. ఎప్పటి నుంచో ఈ నిజం నీకు చెప్పాలని అనుకున్నా' అంటూ ఆమె ముందు ఓపెన్ అవుతాడు.

  తులసి అంటే చాలా ఇష్టమని చెప్పి

  తులసి అంటే చాలా ఇష్టమని చెప్పి

  మద్యం మత్తులో ఉన్న నందూ.. తులసిపై ఉన్న ప్రేమను కూడా వ్యక్త పరుస్తాడు. 'ఇంత కాలం నీ ప్రేమను నేను ఎందుకు అర్థం చేసుకోలేదు? అందుకే ఈ విషయం నీకు చెప్పాలని అనుకుంటున్నా. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం తులసి. నేను చెప్పేది నిజం. ఇన్ని రోజులూ ఆ ఇష్టాన్ని నాలోనే దాచుకున్నాను. ఎందుకంటే అప్పటికే నా జీవితం నా చేయి దాటిపోయింది. నా జీవితంలోకి లాస్య వచ్చేసింది. ఇలా నాకు తెలియకుండానే నీ విషయం చాలా తప్పులు చేశాను. తర్వాత వాటిని సరిదిద్దుకోలేకపోయాను' అంటూ తెగ ఏడుస్తూ ఉంటాడు నందూ.

  Bigg Boss: నామినేషన్‌లో ఉన్న రవికి మరో బిగ్ షాక్.. అడ్డంగా దొరకడంతో ఎలిమినేషన్ ప్రమాదం

   నందూపై ప్రేమ లేదని అన్న తులసి

  నందూపై ప్రేమ లేదని అన్న తులసి

  నందూ మాటలకు స్పందించిన తులసి 'చేయి దాటిపోయిన దాని గురించి ఇప్పుడు చెప్పి ఏం ప్రయోజనం? ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు? నన్ను ఓదార్చాలనా? లేక నా నుంచి ఓదార్పు కావాలనా? ముగిసిపోయిన కథని తవ్వుకోవడం ఎందుకు' అని ప్రశ్నిస్తుంది. దీనికి నందూ 'నువ్వు ప్రతిసారీ ఇలా మాట్లాడే గుండెల్లో గునపాలు దించుతున్నావు. మన మధ్య దూరాన్ని పెంచుతున్నావు. ఇప్పటికైనా తెలుసుకో' అంటాడు నందూ. దీంతో దూరం పెంచింది మీరేనని అంటుందామె. అంతేకాదు, నందూ మీద తనకు ప్రేమ లేదని సమాధానం చెబుతుంది.

  ఆమె కాళ్లు పట్టుకుని ఏడ్చిన నందూ

  ఆమె కాళ్లు పట్టుకుని ఏడ్చిన నందూ

  తులసి మాటలకు నొచ్చుకున్న నందూ ఆమె చేయి పట్టుకుని 'బంగారం లాంటి నిన్ను వదులుకుని మాయలేడి లాంటి లాస్య ఉచ్చులో చిక్కుకున్నాను. ఇప్పుడు నా తప్ప తెలుసుకున్నా బయటపడలేకపోతున్నా. లాస్య అంటే నాకు ఇష్టం లేదు. ఆమె నుంచి దూరం కాలేక నరకం అనుభవిస్తున్నా. ఇది నాటకం కాదు నిజం. ఏదో ఒకటి చేసి లాస్య నుంచి నన్ను కాపాడు. నాకు నువ్వు కావాలి. నీతో జీవితం పంచుకోవడం నాకు కావాలి' అంటూ తులసి కాళ్లపై పడి ఏడుస్తాడు. తర్వాత ఇద్దరూ హగ్ చేసుకుంటారు. అప్పుడు నందూ ప్రపోజ్ చేస్తాడు.

  షర్ట్ విప్పేసి బ్రా తీసేసి అషు రెడ్డి రచ్చ: హాట్ షోలో హద్దు దాటేసి.. మరీ ఇలా చూపిస్తారా!

  చివర్లో ట్విస్ట్.. ఆప్యాయంగా పిలుస్తూ

  చివర్లో ట్విస్ట్.. ఆప్యాయంగా పిలుస్తూ

  కథ సుఖాంతం అవుతుందని అనుకుంటున్న సమయంలో ఇదంతా లాస్య కంటున్న కల అని ట్విస్ట్ ఇస్తారు. భయంతో నిద్ర నుంచి తేరుకున్న లాస్య 'ఇలాంటి కల నాకు ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఈ కల నిజం అయ్యే ప్రమాదం ఉంది' అని తనలో తాను అనుకుంటుంది. అందుకు తగ్గట్లుగానే బెంగళూరులో ఉన్న తులసి, నందూ సన్నిహితంగా ఉన్నట్లు కనిపిస్తారు. మంచినీళ్లు కావాలని అడగడానికి ఆప్యాయంగా పిలుస్తాడు నందూ. ఆ సమయంలో తులసి ఎంతగానో పొంగిపోతుంది. దీంతో ఇద్దరి మధ్య కాసేపు ఆసక్తికరమైన చూపులు కనిపిస్తాయి.

  నందూకు లాస్య ఫోన్... రొమాంటిక్‌గా

  నందూకు లాస్య ఫోన్... రొమాంటిక్‌గా

  నందూకు లాస్య ఫోన్ చేయగా.. అతడు ఎంతగానో కంగారు పడుతుంటాడు. దీంతో అనుమానించిన లాస్య.. వీడియో కాల్ చేస్తానని అంటుంది. అందుకు తగ్గట్లుగానే వెంటనే కాల్ చేస్తుంది. దీంతో నందూ రూమ్ చూపించగా.. 'ఎంతో రొమాంటిక్‌గా ఉంది నందూ.. నీకు నన్ను చూడాలని అనిపించడం లేదా? మాట్లాడాలని లేదా? అని అడుగుతుంది. కానీ, నందూ మౌనంగా తులసి చూస్తుందేమో అని భయపడుతుంటాడు. దీనికి లాస్య 'ఏమైంది నందూ? నీలో ఉన్న రొమాంటిక్ యాంగిల్ ఏమైంది? అని ప్రశ్నిస్తుంది. అంతలో తులసి కాఫీ పట్టుకుని అక్కడకు వస్తుంది. దీంతో లాస్య కోపంతో రగిలిపోతుంటుంది. అలా ఈ ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 476: Anasuya Feels Guilty about her Behaviour with Tulasi. Then Nandhu Said Sorry to Tulasi and Propose to Her.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X