For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: తులసి ప్రేమలో ఉంది.. మా మధ్య ఉంది అదే.. నిజం చెప్పేసిన సామ్రాట్

  |

  తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి!
  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. పుట్టినరోజు సెలెబ్రేషన్స్ అయిపోయిన తర్వాత ఇంట్లోకి వచ్చిన అభి.. తన తల్లిపై విరుచుకుపడతాడు. తనకు, అంకితను దూరం చేసిందరి, వివాహ బంధాన్ని నిలుపుకోవడం చేతకాదని, సామ్రాట్‌ లాంటి బాయ్‌ఫ్రెండ్‌ను సెట్ చేసుకుందని, వరంగల్ వెళ్లిన రోజు రాత్రే చెడిపోయిందని నోటికొచ్చినట్లు తిడతాడు. దీంతో తులసి అతడి చెంప పగలగొడుతుంది. మరోవైపు నందూ.. తన తండ్రి పుట్టినరోజు చేయాలని అనుకున్నా.. పరందామయ్య మాత్రం దానికి అస్సలు ఒప్పుకోనంటే ఒప్పుకోను అని చెప్పి వెళ్లిపోతానని అంటాడు.

  శృతి మించిన శివాత్మిక బోల్డు షో: ఆ డ్రెస్సేంటి.. ఆ ఫోజులేంటి బాబోయ్!

  దూరంగా వెళ్లిపోతానన్న సామ్రాట్

  దూరంగా వెళ్లిపోతానన్న సామ్రాట్

  తులసి ఇంట్లో గొడవ తర్వాత బయటకు వచ్చేసిన సామ్రాట్ 'తులసి ఇంట్లో జరిగే ప్రతి గొడవకు కారణం నేనే అవుతున్నాను. అభి చెప్పింది నిజమే. తులసిపై నిందలు పడటానికి కడుపున పుట్టిన వాడు వేలెత్తి చూపించడానికి అన్నింటికీ కారణం నేనే. ఎందుకు ఇన్ని రోజులు నేను తెలుసుకోలేకపోయాను. నా జాతకం ఏంటో నాకు అర్ధం కావడం లేదు. ప్రాణంగా చూసుకున్న చెల్లెల్ని కాపాడుకోలేకపోయాను. తులసి గారి విషయం కూడా అంతే. అభిమానిస్తున్న మనిషికి కన్నీళ్లు బహుమతిగా ఇస్తున్నా. అలా అస్సలు జరగకూడదు' అంటూ నడుస్తూ వెళ్తుంటాడు.

  వదలొద్దని తులసి... అతడు అలా

  వదలొద్దని తులసి... అతడు అలా

  సామ్రాట్ వెళ్తుండగా తులసి వచ్చి ఎదురుగా నిలబడుతుంది. ఆ సమయంలో సామ్రాట్ 'నా వల్ల మీకు ఎలాంటి సమస్యలు రావు తులసి గారూ.. నేను దూరంగా వెళ్లిపోతున్నాను. మీ జీవితంలో నేను ఉండకూడదు' అని అంటాడు. అప్పుడు తులసి 'ఒక్కసారి నా మాట వినండి సామ్రాట్ గారూ' అని అంటుంది. దీనికి సామ్రాట్ 'వద్దు తులసి గారూ జరిగింది చాలు. ప్రతివాళ్లు మీతో చెప్తూనే ఉన్నారు సామ్రాట్‌కి దూరంగా ఉండమని. ఎందుకు వినలేదు? ఎందుకు మొండితనంగా ఉంటున్నారు' అని అంటాడు. అలా ఆ వెంటనే అతడు మాయం అయిపోతాడు.

  బ్రాతో బిగ్ బాస్ దివి అరాచకం: బాడీ మొత్తం చూపిస్తూ హాట్ వీడియో

  నందూను రిక్వెస్ట్ చేసిన సామ్రాట్

  నందూను రిక్వెస్ట్ చేసిన సామ్రాట్

  ఆ వెంటనే సామ్రాట్ నేరుగా నందూ ఇంటికి వెళ్తాడు. అప్పుడు నందూ 'ఆకలితో ఉన్న సింహం ముందుకు జింక వచ్చినట్లు వచ్చావు' అని అంటాడు. అప్పుడు సామ్రాట్ 'ఒక రెండు నిమిషాలు టైం ఇవ్వు నందూ అని సామ్రాట్ అడగ్గానే అతడు ఒప్పుకుంటాడు. అప్పుడు సామ్రాట్ 'ఇది నాకు సంబంధించిన విషయం అయితే.. ఎలాగోలా సమాధానాలు చెప్పుకునే వాడిని. అదే మా బాబాయికి సంబంధించిన మేటర్ అయితే ఏం చేయాలో అది చేసేవాడిని. కానీ, ఇది తులసి గారి విషయం. కాబట్టి మీ అందరికీ చేతులు ఓడించి అడుగుతున్నా. దయచేసి ఆమె మీద బురద చల్లడం ఆపండి' అని అంటాడు.

  తులసి గారు లవ్‌లో పడ్డారంటూ

  తులసి గారు లవ్‌లో పడ్డారంటూ

  ఆ తర్వాత సామ్రాట్ 'తులసి గారు ప్రేమలో పడిన మాట నిజం. జీవితంలో ఒకే ఒక్కసారి తులసి ప్రేమించారు. ఎస్ ఇది నిజం. అది ఎవరితోనో తెలుసా? మీతోనే.. కేవలం మీతోనే.. తులసి గారు ప్రేమించింది నిన్ను మాత్రమే. ప్రేమకు బదులు ఎవరైనా ప్రేమనే ఇస్తారు. కానీ, నువ్వు మాత్రం తన మనసును విరిచేశావు. కానీ, ఆ విరిగిన ముక్కల్లో కూడా ఆమె ఎవరికీ చోటు ఇవ్వలేదు. అది తులసి గారి నిజాయితీ. తులసి గారి మనసులో ఉన్నది మీ అందరూ మాత్రమే. ఇంత అవమానించినా తులసి గారు అత్తయ్యను ఎందుకు తల్లిలా భావిస్తున్నారని అనుకున్నా. తులసి గారు కాబట్టే అంత పెద్ద మనసు. నాకు తెలిసి తులసి గారిని ధ్వేషించడం మీ అందరికీ పని అయింది' అని సీరియస్ అవుతాడు.

  Bigg Boss: డబుల్ ఎలిమినేషన్ వెనుక కుట్ర.. ఒకరి బదులు మరొకరు ఎలిమినేట్.. లీకైన సెన్సేషనల్ న్యూస్

  ప్రామిస్‌గా నేను భరిస్తాను అంటూ

  ప్రామిస్‌గా నేను భరిస్తాను అంటూ

  అనంతరం 'ఒక్కటి గుర్తుంచుకోండి. ధ్వేషంలో కూడా నిజాయితీ ఉండాలి. కానీ, నాకు అది కనిపించడం లేదు. తులసి గారిని ధ్వేషిస్తూ మీరంతా ఎంత దిగజారిపోతున్నారో తెలుసా? మిమ్మల్ని మీరే ధ్వేషించుకునేంతగా దిగజారుతున్నారు. మీ అందరికీ చెబుతున్నా.. ఇకపై తులసి గారిపై బురద చల్లకండి. కావాలంటే నా మీద చల్లండి.. నన్ను తిట్టండి భరిస్తాను. కానీ, దయచేసి తులసి గారిని వదిలేయండి. ఏమీ చేయలేక కుమిలిపోతోంది. తులసి మనసు అద్దం లాంటి నందూ. పాతికేళ్ల క్రితం ఎంత పవిత్రంగా ఉందో.. ఇప్పటికీ అలాగే ఉంది. పరాయి మనిషిని నేనే ఈ విషయాన్ని తెలుసుకున్నప్పుడు సొంత వాళ్లు మీరెందుకు అర్థం చేసుకోవడం లేదు. మీకు ఏదైనా ఉంటే నన్ను అనండి. దేవుడి మీద ప్రమాణం చేస్తున్నా.. నేనేమీ మిమ్మల్ని అనను. తులసి గారిని మాత్రం ఏమీ అనకండి. ప్రతిరోజూ మీరు అనే మాటలకు తను కుమిలిపోతోంది. ధైర్యం కోల్పోతుంది. అలాంటి పవిత్రమైన మనిషికి కలంకం అంటించకండి' అని చెబుతాడు సామ్రాట్.

  కాలర్‌ను పట్టేసుకున్న నందూ

  కాలర్‌ను పట్టేసుకున్న నందూ

  సామ్రాట్ మాట్లాడుతుండగా నందూ 'నీకు ఇచ్చిన టైం అయిపోయింది. ఇంక ఆపు సామ్రాట్' అంటాడు. దీంతో సామ్రాట్ ఏదో మాట్లాడుతుండగా నందూ అతడి కాలర్ పట్టుకుంటాడు. అంతేకాదు, 'ఫ్రెండు ఫ్రెండూ ఫ్రెండు.. ఆ మాట వినడానికి అసహ్యం పుడుతుంది. ఒకమాట విను లాస్య విషయంలో నా ప్రేమ తప్పుకావచ్చు. కానీ నా ప్రేమని అందరి ముందు ధైర్యంగా చెప్పుకున్నా ఒప్పుకున్నా నీలా ప్రేమకి స్నేహం అనే ముసుగు వేసి నటించడం లేదు' అంటాడు. అంతేకాదు, మీ మధ్య ఉన్నది ప్రేమే అని ఒప్పుకో అంటూ అతడిని రెచ్చగొడతాడు.

  టాప్‌ను కిందకు జరిపి తెలుగు హీరోయిన్ రచ్చ: వామ్మో మరీ ఇలా చూపిస్తే ఎలా!

  నందూకు సామ్రాట్ వార్నింగ్

  నందూకు సామ్రాట్ వార్నింగ్

  నందూ రెచ్చగొట్టడంతో సామ్రాట్ 'నీకు కావాల్సింది మా మధ్య ఉంది స్నేహం కాదని ఒప్పుకోవడమే కదా. ఒప్పుకుంటున్నాను.. మా మధ్య ఉన్నది స్నేహం కాదు. మనసున్న ఓ గొప్ప మనిషిగా, దేవతగా భావించి.. తులసి గారిని పవిత్రంగా ఆరాధిస్తున్నాను.. గౌరవిస్తున్నాను. దానికి కారణం కూడా నేనే చెప్తాను. నా ఆరాధనకు కారణం ఏంటంటే.. ఇప్పటికి కూడా మీలాంటి స్వర్దపరుల కోసమే ఆలోచిస్తుంది అందుకు. నేను స్నేహితుడిగానే ఆమెను ఆరాధిస్తున్నాను. కుళ్లిపోయిన మీ మనసులకు నిజాలు అర్థం కాదు. తులసి గారికి ఎలాగో న్యాయం చేయలేదు. కానీ, గాయం మాత్రం చేయకు. నువ్వు మారకపోతే నేను మారతా. నా మంచి తనాన్ని పక్కనపెడతా. స్నేహం కోసం ఏమైనా చేస్తా. ఎంత దూరమైనా వెళ్తా' అని వార్నింగ్ ఇస్తాడు. ఇలా ఈ ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 789: Anasuya Gets Upset with Parandhamaiah Behaviour. After That Nandhu and Samrat Have a Heated Argument about Tulasi.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X