For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: తులసిని బెడ్‌పై పడుకోబెట్టిన నందూ.. లాస్యకు దొరకడంతో కథలో మలుపు

  |

  మిగిలిన భాషలతో పోల్చుకుంటే తెలుగు బుల్లితెరపై వచ్చే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరూ చూడండి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే


  శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తులసిని పెట్టిన బాధలను తలుచుకుంటూ అనసూయ ఎంతగానో కుమిలిపోతుంది. ఆ తర్వాత పరందామయ్య ముందే తన తప్పులను చెప్పుకుంటుంది. ఇక, ఆఫీస్ పని మీద బెంగళూరులో ఉన్న నందూ ఫుల్లుగా తాగి హోటల్‌కు తిరిగి వస్తాడు. ఆ సమయంలో మనసు విప్పి మాట్లాడతానని చెప్పి తులసికి సారి చెప్పడంతో పాటు ప్రపోజ్ కూడా చేస్తాడు. అయితే, ఇదంతా లాస్య కన్న కల అని తర్వాత తెలుస్తుంది. చివర్లో లాస్య, నందూకు వీడియో కాల్ చేసి మాట్లాడుతుంది. ఆ సమయంలో తులసిని చూసి రగిలిపోతూ ఉంటుంది.

  Bigg Boss 11th Week Nominations: వాళ్లందరికీ భారీ షాకిచ్చిన బిగ్ బాస్.. ఈ సారి ఊహించని నామినేషన్స్

  నందూ రూమ్‌లో తులసి.. లాస్య ఫైర్

  నందూ రూమ్‌లో తులసి.. లాస్య ఫైర్

  బెంగళూరు హోటల్‌లో ఉన్న నందూకు లాస్య వీడియో కాల్ చేసి రొమాంటిక్‌గా మాట్లాడుతుండగా ఈరోజు ఎపిసోడ్ ప్రారంభం అయింది. ఆమె లొడలొడా మాట్లాడుతున్నా.. నందూ మాత్రం కంగారుగానే స్పందిస్తూ ఉంటాడు. అంతలో తులసి అక్కడికి కాఫీ పట్టుకుని వస్తుంది. అది చూసిన లాస్య ఆగ్రహంతో ఊగిపోతుంది. 'నందూ మీరిద్దరూ వేరు వేరుగా ఉంటున్నామని చెప్పావు కదా. ఇప్పుడు ఒకే దగ్గర ఉన్నారే. అయినా నాకు అబద్ధం చెబుతావా? నువ్వైనా వేరే దగ్గర ఉండొచ్చు కదా? ఇలా ఎందుకు చేస్తున్నావ్' అంటూ ఓ రేంజ్‌లో అతడిపై ఫైర్ అవుతుంది.

  సర్ది చెప్పబోయిన నందూ.. వార్నింగ్

  సర్ది చెప్పబోయిన నందూ.. వార్నింగ్

  లాస్య మాటలకు నందూ ఇబ్బంది పడుతుంటాడు. అంతేకాదు, 'టికెట్ బుక్ చేసే సమయంలో పొరపాటు పడ్డట్టే క్లయింట్స్ ఇప్పుడు కూడా పొరపాటు పడ్డారు. ఇద్దరికీ ఒకే రూమ్ అలాట్ చేశారు. ఆ తర్వాత వేరే రూమ్ కోసం చాలా ప్రయత్నించాను. కానీ, హోటల్‌లో రూమ్స్ ఖాళీ లేవు. అలాగే, వేరే హోటల్‌కు వెళ్దామని అనుకున్నా. కానీ, తులసి ఒక్కటే ఉంటుందని వెళ్లలేదు. అందుకే ఇలా అడ్జస్ట్ అయ్యాను' అని చెబుతాడు. తులసి కూడా అదే మాట చెప్పినా లాస్య వినదు. దీంతో నందూ.. లాస్యను కోపగించుకుంటూ కాల్ కట్ చేసి వార్నింగ్ కూడా ఇస్తాడు.

  పెళ్లైనా తగ్గని స్టార్ హీరోయిన్: జాకెట్ విప్పేసి మరీ బ్రాతో ఘాటుగా.. మరీ ఇంత రచ్చ అవసరమా!

  సారీ చెప్పిన తులసి... అస్వస్థతతో

  సారీ చెప్పిన తులసి... అస్వస్థతతో

  లాస్య అవమానిస్తూ మాట్లాడుతుండడంతో నందూకు చిర్రెత్తుకొస్తుంది. ఆ తర్వాత తులసి వచ్చి 'సారీ అండీ.. నేను మధ్యలో రావడం వల్లే మిమ్మల్ని లాస్య అన్ని మాటలు అన్నది' అని అంటుంది. దీనికి నందూ 'అదేం లేదులే తులసి.. లాస్యకు డీసెన్సీ ఉండాలి కదా. అలా అవమానించడమేనా' అంటూ మాట్లాడతాడు. దీంతో తులసి అక్కడి నుంచి పక్కకు వెళ్లిపోవాలని అనుకుంటుంది. అంతలో తులసి అస్వస్థతకు గురవుతుంది. ఆ వెంటనే ఉన్నట్లుండి అక్కడే కింద పడిపోతుండగా.. నందూ వచ్చి ఆమెను పట్టుకుని మంచం మీద పడుకోబెడతాడు.

  తులసికి నందూ సపర్యలు చేయగా

  తులసికి నందూ సపర్యలు చేయగా

  కళ్లు తిరిగి కింద పడిపోయిన తులసిని మంచం మీద పడుకోబెట్టిన తర్వాత 'పాపం తులసి ఎంతో నీరసంగా ఉంది. ఇప్పుడేం చేయాలి' అని తనలో తానే మాట్లాడుకుంటాడు నందూ. అంతేకాదు, ఆ వెంటనే ఆమెను నిద్ర లేపి డాక్టర్‌ను తీసుకు రమ్మంటావా అని అడుగుతాడు. దీనికి తులసి వద్దని చెప్పి కాసేపు రెస్ట్ తీసుకుంటా అంటుంది. అంతలో నందూ అక్కడే ఉన్న ఫలాలు తీసుకొచ్చి ఆమెకు ఇస్తాడు. తను తింటానని అనగా నందూనే కట్ చేసి నోటికి అందిస్తాడు. మరోవైపు లాస్య మాత్రం ఎన్నో ఊహించుకుంటూ తెగ గింజుకుంటూ తిరుగుతూ ఉంటుంది.

  హాట్ షోలో బౌండరీ దాటేసిన నందినీ రాయ్: తడిచిన బట్టల్లో మొత్తం కనిపించేలా ఘాటు ఫోజు

  ఇంట్లో వాళ్లపై లాస్య చిందులు వేసి

  ఇంట్లో వాళ్లపై లాస్య చిందులు వేసి


  నందూను తలచుకుంటూ కోపంతో రగిలిపోతున్న లాస్య.. అప్పుడే సినిమాకు వెళ్లొచ్చి నవ్వుకుంటోన్న అభి, అంకిత, శృతి, ప్రేమ్, దివ్యలపై ఫైర్ అవుతుంది. 'మీకు వయసు రాగానే సరిపోదు. బాధ్యత ఉండాల్సిన పని లేదా? అయినా మీ పెంపకమే అంతలే' అంటూ చిందులు తొక్కుతుంది. దీంతో ప్రేమ్, అంకిత ఆమెపై ఫైర్ అవుతారు. అలాగే, అభి, శృతి కూడా కలుగజేసుకుని ఎందుకు అలా మాట్లాడుతున్నావ్ అని ప్రశ్నిస్తారు. దీనికి 'మీ నానమ్మకు కాలు కాలింది. మీరు చూసుకోవాల్సిన బాధ్యత లేదా' అంటూ మళ్లీ వాళ్లందరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.

  అంకితకు శృతి సపోర్ట్.. వార్నింగ్‌లు

  అంకితకు శృతి సపోర్ట్.. వార్నింగ్‌లు

  లాస్య మాటలకు అంకిత 'మీరు అమ్మమ్మకు కాబోయే కోడలు కదా.. మీరే చూసుకోవచ్చుగా' అని అంటుంది. దీంతో లాస్య ఆమెపై ఫైర్ అవుతుంది. అప్పుడు శృతి కలుగజేసుకుని 'అంకితను ఎందుకు అంటున్నారు. తను అన్న మాట నిజమే కదా. అయినా మీకు మా మీద పెత్తనం చెలాయించే అధికారం లేదు. ఇవ్వం కూడా' అని అంటుంది. తర్వాత అభి కూడా 'మీరు మా చేతులు కట్టేయాలని చూడొద్దు' అంటూ వార్నింగ్ ఇస్తాడు. ఇక, పరందామయ్య కూడా వాళ్లకు సపోర్టుగా మాట్లాడి లాస్యను అవమానిస్తాడు. తర్వాత అందరూ వెళ్లిపోగా లాస్య రగిలిపోతుంది.

  హాట్ హాట్ వీడియోతో షాకిచ్చిన విష్ణుప్రియ: బ్రాతో అలా చేస్తూ ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన యాంకర్

  Recommended Video

  Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
  తులసి, నందూ క్లోజ్‌గా.. లాస్య చూసి

  తులసి, నందూ క్లోజ్‌గా.. లాస్య చూసి

  ఉదయాన్నే మీటింగ్‌కు వెళ్లేందుకు తులసి, నందూ రెడీ అవుతుంటారు. ఆ సమయంలో చేతికి గాయం ఉండడంతో నందూ టై కట్టుకోలేకపోతుంటాడు. అది చూసిన తులసి అతడికి టై కట్టే ప్రయత్నం చేస్తుంది. అంతలో లాస్య స్కైప్ కాల్ చేస్తుంది. దాన్ని కట్ చేయబోయి నందూ యాక్సెప్ట్ చేస్తాడు. దీంతో వీళ్లిద్దరూ క్లోజ్‌గా ఉండడాన్ని లాస్య చూస్తుంది. ఆ తర్వాత గట్టిగా కేకలు వేస్తూ ప్రశ్నిస్తుంది. అప్పుడు తులసి వెటకారంగా సమాధానం చెబుతుంది. అనంతరం నందూ కోపంగా కాల్ కట్ చేస్తాడు. దీంతో ఈరోజు ఎపిసోడ్ మరింత రసవత్తరంగా ముగుస్తుంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 477: Tulasi Suffering From Sickness. Then Nandhu Takes Care of Her. Lasya Feeling Mad About Tulasi and Nandhu.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X