Intinti Gruhalakshmi Today Episode: తులసిని భార్యగా ఒప్పుకున్న నందూ.. ఇంట్లో వాళ్లలో టెన్షన్ మొదలు

సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై వచ్చే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూద్దాం పదండి!

Photos Courtesy: Star మా and Disney+Hotstar

మంగళవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

మంగళవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. క్లయింట్లతో మీటింగ్ సందర్భంగా తులసి, నందూ అక్కడకు వెళ్తారు. ఆ సమయంలో కాంట్రాక్టు విషయంలో వాళ్లు నందూను నిందిస్తారు. దీంతో అతడికి తీవ్ర స్థాయిలో కోపం వస్తుంది. అప్పుడు మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అంటూ లేచి వచ్చేయాలని చూస్తాడు. ఆ సమయంలో తులసి కాంట్రాక్టు పేపర్స్‌లో ఉన్న క్లాజుల్లో కేసు పెడతామని లేదని చూపిస్తుంది. దీంతో వాళ్లు సైలెంట్ అయిపోతారు. ఆ తర్వాత ఆమె దెబ్బకు క్లయింట్లతో పాటు నందూ షాక్ అవుతాడు. ఇవన్నీ మోహన్ వల్ల తెలుసుకున్నానని తులసి చెబుతుంది.

తులసి ఫొటోను చూసి అనసూయ అలా

తులసి ఫొటోను చూసి అనసూయ అలా

తులసి విషయంలో నిజం తెలుసుకున్న అనసూయ.. తన కోడలిని తలచుకుంటూ ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. అప్పట్లో తులసి పాటల పోటీల్లో గెలుచుకున్న మెడల్‌ను, ఫొటోను చూసి అనసూయ కుమిలిపోతూ ఉంటుంది. ఆ సమయంలో 'అత్తగా నువ్వు నన్ను ఎప్పుడూ గౌరవిస్తూనే ఉన్నావు. కానీ, నేనే నీ మంచి మనసును తెలుసుకోలేకపోయాను. అందుకే ఇప్పుడు నీ ముందు ఓడిపోయాను. ఇప్పుడు కనుక నువ్వు నా ఎదురుగా ఉండి ఉంటే.. కచ్చితంగా క్షమాపణ చెప్పాలని ఉంది తులసి' అంటూ తనలో తానే మాట్లాడుకుంటూ బాధ పడిపోతుంది.

తులసికి అనసూయ ఫోన్... ఆనందంతో

తులసికి అనసూయ ఫోన్... ఆనందంతో

తులసికి క్షమాపణ చెప్పాలని అనుకుంటోన్న అనసూయ.. ఆ వెంటనే ఆమెకు ఫోన్ చేస్తుంది. దీంతో తులసి ముందుగా ఆశ్చర్యపోతుంది. ఆ తర్వాత కాల్ లిఫ్ట్ చేసి 'అత్తయ్య ఎలా ఉన్నారు? మీరు నాకు ఫోన్ చేశారంటే నమ్మలేకపోతున్నాను. పోగొట్టుకున్నదేదో దొరికినంత ఆనందగా ఉంది. ఇంతకీ ఎలా ఉన్నారు? మీ కాలు నొప్పి తగ్గిపోయిందా?' అంటూ మాట్లాడుతుంది. దీనికి అనసూయ ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్‌గా ఉంటుంది. ఆ తర్వాత తులసి మళ్లీ కలుగజేసుకుని రేపు ఉదయాన్నే బయలుదేరుతున్నాం అంటూ అనసూయకు సమాధానం చెబుతుంది.

మాట్లాడుతూ కింద పడిపోయిన తులసి

మాట్లాడుతూ కింద పడిపోయిన తులసి

తులసి మాట్లాడుతున్నా అనసూయ మాత్రం చాలాసేపు సైలెంట్‌గానే ఉంటుంది. అప్పుడు 'నాకు తలనొప్పి వస్తుంది అత్తయ్యా.. మీ అబ్బాయి బయటకు వెళ్లారు' అని చెబుతుంది. అప్పుడు అనసూయ 'నేను ఫోన్ చేసింది నందూ కోసం కాదమ్మా.. నీ కోసమే' అని చెప్పుకొస్తుంది. దీంతో తులసి ఎంతో సంతోషిస్తుంది. అలా తనలో తానే ఆనందిస్తోన్న సమయంలోనే తులసికి కళ్లు తిరుగుతాయి. ఈ విషయాన్ని అనసూయకు చెప్పి అక్కడికక్కడే పడిపోతుంది. దీంతో ఆమె కంగారు పడిపోయి తులసి తులసి అంటూ గట్టిగట్టిగా అరుస్తూ ఏడవడం మొదలు పెడుతుంది.

అందరిలో కంగారు.. భాగ్య మాత్రం అలా

అందరిలో కంగారు.. భాగ్య మాత్రం అలా

తులసి కింద పడిపోవడంతో గట్టిగా ఏడుస్తున్న అనసూయను చూసి ఇంట్లో వాళ్లందరూ అక్కడకు చేరుకుంటారు. అప్పుడు వాళ్లకు అనసూయ విషయం చెబుతుంది. దీంతో అందరూ కంగారు పడిపోతుంది. ఆ సమయంలో అనసూయ 'నాకేం అర్థం కావడం లేదు. నాకేదో భయంగా ఉంది. అమ్మా తులసి.. నేను మారిపోయాను. ఇప్పుడు నీకు క్షమాపణ చెబుదామనే ఫోన్ చేశాను. ఇంతలోనే నీకు ఎంత కష్టం వచ్చింది తల్లీ' అంటూ ఏడ్చేస్తుంది. అప్పుడు పక్కనే ఉన్న భాగ్య 'ఈ వయసులో కళ్లు తిరిగి పడిపోవడం ఏంటో' అనగా.. లాస్య గింజుకుంటూ ఉంటుంది.

తులసి తన భార్య అని చెప్పిన నందూ

తులసి తన భార్య అని చెప్పిన నందూ

తులసి హోటల్ రూమ్‌లో పడిపోయి ఉండగా నందూ లోపలికి వస్తాడు. అప్పుడు నందూకు ఏం చేయాలో అర్థం కాదు. వెంటనే ఆమెను మంచం మీద పడుకోబెడతాడు. ఆ తర్వాత డాక్టర్‌ను పిలిపిస్తాడు. అప్పుడు తులసికి ట్రీట్‌మెంట్ చేసిన డాక్టర్.. 'మీరు ఈవిడకు ఏమవుతారు? గతంలో ఆమెకు ఇలా జరిగిందా?' అని అడుగుతుంది. అప్పుడు నందూ.. తులసికి భర్తను అని చెబుతాడు. దీంతో డాక్టర్ 'ఆమెకు మానసిక ఒత్తిడి ఎక్కువ అయినట్లుంది. రేపు ఆస్పత్రికి తీసుకు రండి' అని చెప్పి వెళ్లిపోతుంది. మరోవైపు ఇంట్లో వాళ్లంతా తెగ టెన్షన్ పడుతూ ఉంటారు.

ఫోన్ లిఫ్ట్ చేసిన నందూ.. అంతా కూల్

ఫోన్ లిఫ్ట్ చేసిన నందూ.. అంతా కూల్

తులసి పరిస్థితి గురించి భయపడిపోతున్న కుటుంబ సభ్యులు నందూకు ఫోన్ చేయగా చేయగా ఎప్పుడో లిఫ్ట్ చేస్తాడు. అప్పుడు ప్రేమ్ 'ఏంటి నాన్నా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు. అసలు అమ్మకు ఇప్పుడు ఎలా ఉంది?' అని అడుగుతాడు. ఆ తర్వాత అభి కూడా తన తల్లి పరిస్థితి ఎలా ఉందని కంగారుగా అడుగుతూ ఉంటాడు. దీనికి నందూ 'ఇప్పుడే డాక్టర్ వచ్చి వెళ్లారు. ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. తులసి లేవగానే నేనే మీకు ఫోన్ చేయిస్తాను' అని కాల్ కట్ చేస్తాడు. దీంతో ఇంట్లో వాళ్లందరూ ఊపిరి పీల్చుకుంటారు. కానీ, లాస్య మాత్రం ఏమీ మాట్లాడకుండా ఉంటుంది.

Recommended Video

Taxiwala Will Cross Geetha Govindam's TRP Record? | Filmibeat Telugu
భాగ్య చెంప చెల్లుమనిపించిన లాస్య

భాగ్య చెంప చెల్లుమనిపించిన లాస్య

బెంగళూరు హోటల్‌లో ఉన్న తులసి, నందూను ఊహించుకుంటూ తెగ టెన్షన్ పడుతూ ఉంటుంది లాస్య. అంతలో భాగ్య వచ్చి ఆమెకు గుచ్చుకునేలా మాట్లాడుతుంది. అంతేకాదు, 'వాళ్లు వచ్చిన వెంటనే నీ పెళ్లి గురించి మాట్లాడతావా' అని అడుగుతుంది. అప్పుడు లాస్య 'ఈరోజే వస్తారనుకున్నా.. కానీ, తులసి వల్ల రాలేదు' అని అంటుంది. అప్పుడు భాగ్య 'ఒకవేళ పెళ్లికి బావగారు ఒప్పుకోకపోతే ఏం చేస్తావ్? నీ దారి నువ్వు చూసుకుంటావా?' అని అడుగుతుంది. దీంతో వెంటనే లాస్య కోపంతో ఊగిపోతూ భాగ్య చెంప చెల్లుమనిపించడంతో ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X