For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: లాస్యకు మరో షాక్.. తులసి ఆలోచనలో నందూ.. సామ్రాట్ పెళ్లి గురించి!

  |

  ఇండియాలోని చాలా లాగ్వేజ్‌లతో పోల్చుకుంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. సామ్రాట్ గొడవ పెట్టుకుని వెళ్లిన తర్వాత తులసి విషయంలో తాను తప్పుచేశానని నందూ పశ్చాత్తాప పడుతుంటాడు. ఇంతలో లాస్య వచ్చి తులసిపై నిందలు వేసే ప్రయత్నం చేయగా అతడు సీరియస్ అవుతాడు. అంతేకాదు, తాను ముంబై వెళ్తున్నానని, వచ్చే వరకూ గొడవలు చేయొద్దని చెప్తాడు.

  అనంతరం సామ్రాట్, తులసి కలుసుకుంటారు. ఆ సమయంలో సామ్రాట్‌ను తులసి చాలా ప్రశ్నలు అడుగుతుంది. దానికతడు సమాధానాలు చెప్తాడు. దీంతో ఒకరికొకరు సారీ చెప్పుకుని.. మళ్లీ ఇద్దరూ కలిసిపోతారు.

  రష్మీ గౌతమ్‌కు విల్లాను గిఫ్టుగా ఇచ్చిన హీరో: అతడి గురించి పెదవి విప్పబోతున్న యాంకర్

  ప్రేమ్ హ్యాపీ.. అనసూయ దిగులు

  ప్రేమ్ హ్యాపీ.. అనసూయ దిగులు

  మళ్లీ కలిసిపోయిన తులసి, సామ్రాట్ చక్కగా తింటూ కబుర్లు చెప్పకుంటూ ఉంటారు. అది చూసిన ప్రేమ్ చాలా సంతోషిస్తాడు. అంతేకాదు, ఆ దేవుడికి థ్యాంక్స్ అంటూ మనసులోని మాటలను పంచుకుంటాడు. మరోవైపు పరందామయ్య కోపం పోగొట్టేందుకు అనసూయ ప్రయత్నిస్తుంది. అప్పుడు అతడి తలను తుడుస్తూ.. 'మీరు నన్ను దూరం పెట్టారు. మన ఇన్నెళ్ల వైవాహిక జీవితంలో ఎప్పుడూ ఇలా చేయలేదు. అప్పుడు మీరు ఒక మాట అన్నారు.. కోపంలో మీరు నన్ను ఇప్పుడు దూరం పెడితే.. కోపం తగ్గాక నాతో మాట్లాడాలని అనుకున్నా అప్పటికి నేను ఉంటానో ఉండనో' అని ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ చేస్తుంది.

  నందూ బట్టలిచ్చిన అనసూయ

  నందూ బట్టలిచ్చిన అనసూయ

  ఆ తర్వాత అనసూయ 'మన నందూ మీ పుట్టిన రోజు వేడుకను ఘనంగా చేయాలనుకున్నాడు. కానీ, ఏదో జరిగిపోయింది. ఇప్పుడు ఎందుకిలా చేశారు అని నేను అడగను. మీరూ చెప్పకండి. కానీ, వాడు బాధపడుతున్నాడు. బాధతో ఊరు వెళ్లిపోయాడు. ఇవి వాడు మీకోసం కొన్న బట్టలు. కేక్ కట్ చేయించలేకపోయాను. కనీసం బట్టలు అయినా వేసుకుంటారని ఇచ్చాడు. వాడి తరుపున నేనే ఇచ్చాను. మీరంటే వాడికి చాలా ఇష్టం. ఈ బట్టలు వేసుకుంటే వాడు చాలా సంతోషిస్తాడు. కనీసం మీ పుట్టినరోజు నాడు అయినా వాడిని సంతోషపెట్టండి.

  ఈ బట్టలు తీసుకోకపోతే నాన్న అని పిలిచే హక్కును మీరు వాడి నుంచి లాక్కున్నట్టే' అంటూ పరందామయ్యకు ఇస్తుంది. దీంతో ఆయన వాటిని తీసుకుంటాడు. దీంతో ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది.

  అతి దారుణమైన ఫొటోలు వదిలిన సీరియల్ నటి: ఏమీ దాచుకోకుండానే హాట్ షో

  అనసూయను రెచ్చగొట్టిన లాస్య

  అనసూయను రెచ్చగొట్టిన లాస్య

  ఆ తర్వాత అనసూయ.. లాస్య దగ్గరికి వెళ్లి 'నువ్వొక్కదానివే కాఫీని కుడితి తాగినట్లు తాగుతున్నావు ఏంటే? మామయ్య గారికి కూడా ఇవ్వొచ్చు కదా' అంటుంది. అప్పుడామె మామయ్య గారు నా చేతి కాఫీ తాగుతారా అని అడుగుతుంది. దీంతో అనసూయ 'తాగుతారు ఎందుకు తాగరు. నందూ ఇచ్చిన బట్టలు కూడా వేసుకున్నారు. ఇది చేయండి అంటే చేస్తారు. ఇది వద్దు అంటే ఊరుకుంటారు' అని చెప్తుంది. దీంతో లాస్య 'ఇక నుంచి మామయ్య గారిని చేయి జారనీయొద్దు. మంచిగా చూసుకోవాలి. లేకుంటే ఆ తులసి మళ్లీ ఆయన్ని దూరం చేస్తుంది' అంటుంది.

  మార్కులు కొట్టేయాలని ప్లాన్‌తో

  మార్కులు కొట్టేయాలని ప్లాన్‌తో

  ఆ తర్వాత లాస్య మామయ్య గారు ఏరి.. ఇంకా రాలేదు అని అడుగుతుంది. దీంతో అనసూయ 'వస్తారులే. ఆయన ఏమన్నా చిన్న పిల్లాడా? భారీ దేహం ఉన్నోడు కదా. కాస్త లేట్ అవుతుందిలే. ముందు పూజకు అన్ని ఏర్పాట్లు చేయి. మళ్లీ మనకు మంచి రోజులు మొదలయినందుకు దేవుడికి హారతి ఇచ్చి మళ్లీ కొత్త జీవితాన్ని మొదలుపెడదాం' అంటుంది. దీంతో లాస్య సరే అంటుంది. ఆ వెంటనే 'నందూకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పాలి. ఇదంతా నా క్రెడిటే అని చెప్పాలి. దీనికి నందూ చాలా సంతోషిస్తాడు. ఆ మార్కులు నాకే పడతాయి' అనుకుంటుంది.

  ఆ హీరోపై యాంకర్ విష్ణుప్రియ దారుణ కామెంట్స్: 'చూస్తే నలిపేయడమే' అంటూ మేటర్ లీక్ చేయడంతో!

  తులసిపై ఆలోచనలోనే నందూ

  తులసిపై ఆలోచనలోనే నందూ

  నందూకు లాస్య ఫోన్ చేయగా అతడు లిఫ్ట్ చేయడు. దీంతో ఇంకా నిద్ర లేవలేదేమో అనుకుంటుంది. అప్పుడు నందూ 'కాల్ లిఫ్ట్ చేస్తే ఏం చేస్తున్నావు? ఎప్పుడు వస్తావు అంటూ పీక్కుతింటుంది. నాన్న పరిస్థితి చూడలేక ఒకవిధంగా నేను పారిపోయి ఇక్కడకు వచ్చాను. ఆయన మారాలంటే తులసి అయినా అక్కడికి వెళ్లాలి. లేదా తులసి దగ్గరికి అయినా నాన్న వెళ్లాలి. తులసి గురించి ఎంత వద్దు అనుకున్నా ఆమె గురించే ఆలోచించాల్సి వస్తోంది. ఎందుకు తులసి గురించి ఎక్కువ రియాక్ట్ అవుతున్నాను' అని తనలో తాను అనుకుంటూ ఉంటాడు.

  వాళ్ల ఆందోళన.. తులసి క్లాసులు

  వాళ్ల ఆందోళన.. తులసి క్లాసులు

  సామ్రాట్ ఇంకా బర్త్‌డే పార్టీలో జరిగిన విషయం గురించే ఆలోచిస్తుంటాడు. దీంతో తులసి ఏమైంది అని అడుగుతుంది. అప్పుడతను 'మనం హ్యాపీగా నవ్వుకున్న ప్రతిసారీ మనకు దిష్టి తగులుతోంది' అంటుంది. దీనికి ప్రేమ్ కూడా మాట కలుపుతాడు. దీంతో తులసి 'బాధలో ఉన్నప్పుడు ఎలాగూ బాధపడాలి.

  అలాగే సంతోషంగా ఉన్నప్పుడు సంతోషపడాలి. కానీ, గతంలో ఉన్న బాధలను గుర్తు తెచ్చుకొని బాధపడటం ఏంటి? చావును తలుచుకుంటూ ఎవరూ బతకం కదా. జరగాల్సింది ఎలాగూ జరిగి తీరుతుంది. సామ్రాట్ గారిని ఆదర్శంగా తీసుకో ప్రేమ్. పెళ్లి చేసుకుంటే ఎలాంటి సమస్యలు వస్తాయో అని అసలు పెళ్లే చేసుకోలేదు. అది పాజిటివ్‌గా ఆలోచించడం అంటే' అంటూ క్లాస్ చెబుతుంది.

  సీతా రామం హీరోయిన్ హాట్ షో: సినిమాలో పద్దతిగా.. అందులో మాత్రం!

  పరందామయ్య కోసం పూజలు

  పరందామయ్య కోసం పూజలు

  ఆ తర్వాత తులసి 'మీ తాతయ్య పుట్టిన రోజు కదా. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ పూజ చేయిస్తున్నాను. ఇంట్లో పరిస్థితుల వల్ల ఆయన చాలా ఆందోళనగా ఉంటున్నారు. నాకంటే ఆయనే ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. నానమ్మతో కూడా సరిగా మాట్లాడటం లేదు' అని అంటుంది. దీంతో ముందు చెప్తే నేను తీసుకొచ్చే వాడిని కదా అని ప్రేమ్ అంటాడు. దీంతో గొడవలు జరగకుండా జరగాలి అని తులసి అంటుంది. ఆ తర్వాత పరందామయ్య రెడీ అయి తులసి దగ్గరకు బయలుదేరుతుంటాడు. దీంతో అనసూయ, లాస్యకు కోపం వచ్చి ఆపుతారు. కానీ, ఆయన మాత్రం అక్కడికే వెళ్తానని అంటాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 792: Parandhamaiah Leaves The Home. Then Nandhu Upsets for His Behaviour. After That Lasya Provokes Anasuya About Tulasi.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X