For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: లాస్యతో పెళ్లిపై నందూ సంచలన నిర్ణయం.. నిజం చెప్పడంతో అంతా షాక్

  |

  సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై వచ్చే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరూ చూడండి!

  Photo Courtesy: Star మా and Disney+Hotstar

   గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. హోటల్ రూమ్‌లో అనారోగ్యానికి లోనైన తులసి గురించి ఇంట్లో ఉన్న వాళ్లంతా దిగులు చెందుతూ ఉంటారు. అప్పుడు ప్రేమ్, అభి వాళ్లకు దైర్యం చెబుతారు. ఇక, నీరసంగా ఉన్న తులసికి నందూ తెగ సపర్యలు చేస్తుంటాడు. ఆ సమయంలో ఆమె దెప్పుతూనే అతడికి సహకరిస్తుంది. సరిగ్గా అప్పుడే లాస్య ఫోన్ చేస్తున్నా నందూ మాత్రం లిఫ్ట్ చేయడు. అలా ఇద్దరూ పడుకుండిపోతారు. ఉదయాన్నే భాగ్య.. నందూకు ఫోన్ చేసి లాస్య చాలా కోపంగా ఉందని చెబుతుంది. ఆ తర్వాత నందూ, తులసి జంటగా ఇంటికి చేరుకుంటారు.

  బ్రా కూడా లేకుండా షాకిచ్చిన పాయల్: వెయిట్ చేయలేకపోతున్నా అంటూ పోస్ట్.. వామ్మో ఇది మరీ దారుణం

   నేనెవరంటూ నందూతో లాస్య గొడవ

  నేనెవరంటూ నందూతో లాస్య గొడవ

  తులసితో కలిసి నందూ ఇంటికి రాగానే అందరూ వాళ్లకు స్వాగతం పలుకుతారు. దీంతో అందరూ కలిసిపోయినట్లు సంతోషంగా కనిపిస్తారు. ఆ సమయంలోనే లాస్య కోపంగా బ్యాగ్ పట్టుకుని వస్తుంది. 'నందూ ఇక్కడ ఉన్న వాళ్లందరి కంటే నీ కోసం ఎక్కువగా ఆరాటపడింది నేను. అసలు నేను ఈ ఇంటికి ఏమౌతాను? నేనెవరు? అనేది ఇప్పుడే తేలిపోవాలి' అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది. అప్పుడు నందూ 'నీకు ఇంట్లో ఏం జరిగిందో అన్న విషయం నాకు ఇప్పటికే తెలిసింది. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం లాస్య' అని అడుగుతాడు నందూ.

  లాస్య సూటి ప్రశ్న.. నందూ సైలెంట్

  లాస్య సూటి ప్రశ్న.. నందూ సైలెంట్

  తులసి, నందూ కలిసిపోయినట్లు కనిపిస్తుండడంతో లాస్య తనలో ఉన్న బాధనంతా వెల్లగక్కుతూ ఉంటుంది. 'నందూ నువ్వు లేనప్పుడు వీళ్లంతా నాకు ఈ ఇంటికి సంబంధం లేదని అవమానించారు. అసలు నేను ఈ ఇంటికి ఏమౌతాను? ఇక్కడ సమాధానం చెప్పలేక.. బయట ప్రశ్నలకు బదులివ్వలేక ఎంతగా ఇబ్బంది పడుతున్నానో తెలుసా? అసలు ఈ ఇంట్లో స్థానం ఎంతో చెప్పు నందూ' అంటూ సూటిగా ప్రశ్నిస్తుంది. కానీ, దీనికి నందూ మాత్రం సైలెంట్‌గానే ఉండిపోతాడు. అప్పుడు ప్రేమ్ కూడా తండ్రికి సపోర్టుగా మాట్లాడగా లాస్య షాక్ అవుతుంది.

  సుమ షోలో రెచ్చిపోయిన లోబో: ఏకంగా ఆమెకు ముద్దులు.. ఇంట్లో ఎవరూ చేయట్లేదా అంటూ బూతులు

   లాస్యకు కోలుకోలేని షాకిచ్చిన అత్త

  లాస్యకు కోలుకోలేని షాకిచ్చిన అత్త

  నందూ ఎంతకీ మాట్లాడకపోవడంతో తనను చంపేయమని నందూను బలవంతపెడుతుంది లాస్య. అప్పుడు తులసి వెళ్లిపోతూ ఉండగా.. అనసూయ 'ఎక్కడికే వెళ్తున్నావు? నీకు సంబంధం లేదనుకుంటే ఆ మెడలో తాళి ఎందుకు? నువ్వు ఇలా ఉండబట్టే ఈ లాస్య ఇలా చేస్తుంది. అప్పుడు నా కొడుకు కాలర్ పట్టుకుంటే ఇంత దాకా వచ్చేది కాదు' అంటుంది. దీనికి లాస్య 'ఏంటి ఆంటీ' అంటుంది. అప్పుడు అనసూయ 'నీ కల్లబొల్లి మాటలు నమ్మి నా కోడలిని దూరం చేసుకున్నా' అంటూ కన్నీరు పెట్టుకుంటుంది. దీంతో తులసి అత్తను కౌగిలించుకుంటుంది.

   తులసిని నందూ పెళ్లి చేసుకోవాలని

  తులసిని నందూ పెళ్లి చేసుకోవాలని

  అనసూయ మారడంతో ఇంట్లో వాళ్లంతా చప్పట్లు కొట్టి అభినందిస్తారు. అప్పుడు అనసూయ 'నువ్వు నా కొడుకును నిలదీయి.. వాడు మళ్లీ నిన్ను పెళ్లి చేసుకోవాలి' అంటూ తులసిని ప్రోత్సహిస్తుంది. దీనికి ఆమె 'వస్త్రాలు కాలితే పర్లేదు.. ఒళ్లు కాలేదాక ఉండకూడదు.. లాస్యతో మీ కొడుకు సంబంధం పెట్టుకున్నప్పుడే మీరు పెద్దరికం చూపించి ఉంటే నాకు ఈ గతి పట్టేది కాదు. ఇప్పుడు మా దారులు ఎప్పటికీ కలుసుకోలేనంతగా దూరమయ్యాయి. ఏదో జరుగుతుందని ఆశ పెట్టుకోకండి. మేమెప్పటికీ కలవలేము' అంటూ వాళ్లకు సమాధానం చెబుతుంది.

  పెళ్లైనా తగ్గని స్టార్ హీరోయిన్: జాకెట్ విప్పేసి మరీ బ్రాతో ఘాటుగా.. మరీ ఇంత రచ్చ అవసరమా!

   నా భర్తకు విడాకులు ఇవ్వమన్నాడు

  నా భర్తకు విడాకులు ఇవ్వమన్నాడు

  తులసి మాటలతో లాస్య 'చూడు నందూ.. తులసి కూడా మనల్ని బాగా అర్థం చేసుకుంది. ఇప్పటికైనా నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పు' అంటూ ప్రాధేయపడుతుంది. అప్పుడు ఇంట్లో వాళ్లంతా ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడతారు. ఆ సమయంలో లాస్య 'అసలు తప్పంతా నందూదే. నేనంటే ఇష్టం అని నా భర్తకు విడాకులు ఇప్పించింది కూడా నందూనే. నా భర్తను, నా కొడుకును కాదనుకుని వచ్చిన నాకు ఇప్పుడు న్యాయం కావాలి. ఎలాగైనా నందూ నన్ను పెళ్లి చేసుకోవాలి' అంటూ గొడవ చేయడంతో ఇంట్లో వాళ్లంతా ఆశ్చర్యపోతూ ఉంటారు.

  Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
   లాస్యతో పెళ్లిపై నందూ ముందడుగు

  లాస్యతో పెళ్లిపై నందూ ముందడుగు

  లాస్య ఎంత అడిగినా నందూ మాత్రం నోరు విప్పడు. దీంతో ఆమె నేలపై కూర్చుడిపోతుంది. అప్పుడు నందూ ఆమెను పైకి లేపి కన్నీళ్లను తుడుస్తూ 'లాస్య మనం పెళ్లి చేసుకుందాం. ముహూర్తం పెట్టడానికి పంతులు గారికి కబురు పెట్టు' అని చెబుతాడు. అప్పుడామె 'ఇంట్లో వాళ్లందరికీ చెప్పు' అని అడుగుతుంది. దీనికి నందూ 'లాస్య నాకు కాబోయే భార్య. ఇకపై తను ఏదంటే అదే అందరూ ఫాలో అవ్వాలి' అని చెబుతాడు. దీంతో ఇంట్లో వాళ్లు కోప్పడుతుండగా.. తులసి మాత్రం లాస్య దగ్గరకు వచ్చి కంగ్రాట్స్ చెబుతుంది. దీంతో ఈ ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 481: Lasya Shocked about Anasuya Supports Tulasi. Then Family Members Aback From Nandhu Decision.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X