Intinti Gruhalakshmi Today Episode: తులసిని దెబ్బ కొట్టేలా అంకిత ప్లాన్.. నందూకు మరో షాకిచ్చిన జీకే

ఇండియాలోని మిగిలిన భాషలతో పోలిస్తే తెలుగు బుల్లితెరపై వచ్చే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరూ చూడండి!

Photos Courtesy: Star మా and Disney+Hotstar

శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. పిజ్జాలు బాగోకపోయినా తులసి ముందే అవమానపడాలన్న ఉద్దేశంతో వాటిని అఇష్టంగానే తింటారు నందూ, లాస్య. ఆ తర్వాత అతడు బయటకు రాగానే ఆఫీస్‌లో ఉన్న ఉద్యోగులు అతడిపై జోక్స్ చేసుకుంటూ ఉంటారు. అంతేకాదు, ఘోరంగా మాట్లాడుతూ అవమానిస్తారు. దీంతో నందూకు బాగా కోపం వస్తుంది. ఆ తర్వాత ఇంటికొచ్చి తులసితో తీవ్ర స్థాయిలో వాదనకు దిగుతాడు. అంతేకాదు, ఇకపై ఆఫీస్‌కు రానని కూడా చెబుతాడు. ఆ సమయంలో తులసి చెప్పిన మాటలను మాత్రం అస్సలు పట్టించుకోరు కుటుంబ సభ్యులు.

దివ్య కాలేజ్ ఫీజును కట్టేసిన తులసి

దివ్య కాలేజ్ ఫీజును కట్టేసిన తులసి

ఫీజు కట్టలేదని దివ్యను కాలేజ్‌కు రావొద్దన్న విషయం దివ్య తల్లి తులసితో చెబుతుంది. దీంతో ఆమె ఈ విషయాన్ని మర్చిపోయానని చెబుతుంది. ఆ తర్వాత కూతురి బాధను అర్థం చేసుకుని ఆమెను ఓదార్చుతుంది. అంతేకాదు, ఆ తర్వాత తన ఫ్యాక్టరీ మేనేజర్‌కు ఫోన్ చేసి 'మేనేజర్ గారు.. వెంటనే ఫ్యాక్టరీ అకౌంట్ నుంచి నా పర్సనల్ ఖర్చుల నిమిత్తం ఒక యాభై వేలు పంపండి' అని చెబుతుంది. దీంతో దివ్య 'అబ్బో మామ్‌కు బ్యాంక్ అకౌంట్ ఎలా డీల్ చేయాలో తెలిసిపోయిందే' అని అంటుంది. దీంతో తులసి మురిసిపోతూ నువ్వే కదా నాకు నేర్పించావు అంటుంది.

తులసికి దూరంగా అభి.. అంకిత ప్లాన్

తులసికి దూరంగా అభి.. అంకిత ప్లాన్

దివ్యతో మాట్లాడి వస్తుండగా.. అంకిత, అభి మాట్లాడుకుంటోన్న విషయాలను చాటుగా వింటుంది తులసి. అప్పుడు అంకిత 'ఆంటీతో కలిసి కంపెనీకి వెళ్లడానికి అంకుల్ సిద్ధంగా లేరు. ఈ విషయాన్ని గొడవ జరిగినప్పుడే చెప్పేశారు కదా. అదే జరిగితే ప్రాజెక్టు పూర్తవదు. దీని వల్ల రెండు కోట్లు కట్టాలి. అప్పుడు ఆ కంపెనీ వాళ్లు, శశికళ వచ్చి ఇల్లు స్వాదీనం చేసుకుంటారు. కాబట్టి మనదారి మనం చూసుకుందాం' అంటుంది. అప్పుడు అభి 'అమ్మ అనుకుంటే ఏదైనా చేసేస్తోంది. కష్టాల్లో ఉన్నప్పుడు వదిలేసి వెళ్లకూడదు' అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

నందూను మరింత రెచ్చగొట్టిన లాస్య

నందూను మరింత రెచ్చగొట్టిన లాస్య

తులసితో గొడవ పడిన నందూను లాస్య మరింత రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తుంది. 'మంచి పని చేశావ్ నందూ. లేకపోతే ఆఫీస్‌లో స్టాఫ్ ముందు నీ పరువు తీసేలా మాట్లాడిస్తుందా? ఎక్కడ నువ్వు తులసికి లొంగిపోతావో అని తెగ భయపడిపోయాను. తను వచ్చి నీ కాళ్ల మీద పడి వేడుకున్నా నువ్వు మాత్రం అస్సలు తగ్గొద్దు. మొత్తం ఏదో తనే నిన్ను ఉద్దరిస్తున్నట్లు బిల్డప్ కొడుతుంది. ఆమెకు సరైన బుద్ధి చెప్పావు. ఇకపై కూడా అలాగే ఉండు. తులసి మాటలు అస్సలు వినకు' అంటూ చెబుతుంది. అంతలో అక్కడకు ప్రేమ్ ఎంట్రీ ఇస్తాడు.

గీత దాటొద్దని మీ అమ్మకు చెప్పు అని

గీత దాటొద్దని మీ అమ్మకు చెప్పు అని

ప్రేమ్ అక్కడకు రాగానే 'మీ అమ్మ నాకు ముఖం చూపించలేక.. నిన్ను రాయబారానికి పంపిందా' అని అడుగుతాడు నందూ. ఆ సమయంలో 'చూడండి నాన్న.. ఈ అప్పు చేసింది మీరు. మీ కోసమే అమ్మ కష్ట పడుతుంది. దీనికి మీరు సహకరించాల్సింది పోయి ఇలా చేస్తారా' అంటూ ప్రశ్నిస్తాడు. అప్పుడు లాస్య మాట్లాడుతుండగా ప్రేమ్ ఆమెను మధ్యలో రావొద్దని అంటాడు. దీనికి నందూ 'వస్తుంది.. మీ అమ్మకు ఈ ఇంటిపై ఎంత హక్కుందో తనకు కంపెనీపై హక్కుంది. అయినా ఆమె నా భార్య కాదు.. మీ అమ్మ.. ఇకపై ఎప్పుడూ గీత దాటొద్దని చెప్పు' అని కోప్పడతాడు.

తులసికి షాకిచ్చిన నందూ.. గొడవతో

తులసికి షాకిచ్చిన నందూ.. గొడవతో


ఉదయాన్నే రెడీ అయి వస్తున్న నందూను చూసి 'ఏమండీ ఆఫీస్‌కేనా? మీరు మనసు మార్చుకుంటారని నాకు తెలుసండీ. ఆ రెండు కోట్ల గండం నుంచి బయట పడడం కోసమే తాపత్రయపడుతున్నా' అంటుంది. దీనికి నందూ 'నేను ఆఫీస్‌కు రావడం లేదు. నీ మీద నమ్మకం లేదు. అందుకే విడాకుల వరకూ తీసుకెళ్లావ్' అని అంటాడు. దీనికి తులసి తొందర పడొద్దు అని అంటుంది. అప్పుడు నందూ 'నేను తొందరపడకపోవడం వల్లే మన కథ ఇక్కడి వరకూ వచ్చింది. లేకపోతే ఇదంతా జరిగేది కాదు' అంటూ తీవ్ర ఆగ్రహంతో సమాధానం చెబుతాడు.

తులసి లేకపోతే జైలుకే.. శృతి రాకతో

తులసి లేకపోతే జైలుకే.. శృతి రాకతో

నందూ.. తులసి మాట్లాడుతుండగా పరందామయ్య అక్కడకు వస్తాడు. ఇద్దరి మధ్య డిస్కర్షన్ జరుగుతోన్న సమయంలో పరందామయ్య కలుగజేసుకుని 'అరేయ్ నందూ తులసి లేకపోతే నువ్వు ఎప్పుడో జైలుకు వెళ్లేవాడివి. అయినా నీ డబ్బుల కోసమే కదా తను కష్టపడుతుంది' అంటుంది. అప్పుడు నందూ 'మీ పెద్ద కొడుకు చచ్చిపోలేదు నాన్న' అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత అనసూయ వచ్చి తులసిని నిందిస్తుండగా.. శృతి ఎంట్రీ ఇస్తుంది. అప్పుడామె లాస్య గురించి ప్రశ్నలు అడుగుతుంది. దీంతో అనసూయ ఆమెపై ఫైర్ అవగా తులసి ఆపుతుంది.

Recommended Video

Siri Hanmanth : ఆదర్శంగా నిలిచిన Bigg Boss బ్యూటీ.. పెళ్లి కాకుండానే తల్లిగా || Filmibeat Telugu
జీకే దగ్గరకెళ్లి సహాయం కోరిన నందూ

జీకే దగ్గరకెళ్లి సహాయం కోరిన నందూ

కంపెనీ పరిస్థితిని చక్కబెట్టేందుకు రంగంలోకి దిగిన నందూ.. సహాయం కోసం జీకే దగ్గరకు వెళ్తాడు. అప్పుడు జీకేను నందూ బావ అని పిలవగా ఆయన ఆగ్రహిస్తాడు. అంతేకాదు, ఎందుకొచ్చావ్ అంటూ సీరియస్ అవుతాడు. అప్పుడు నందూ 'అక్షర పెళ్లి విషయంలో పొరపాటు జరిగింది. ఇప్పుడు బిజినెస్ గురించి మాట్లాడడానికి వచ్చాను' అంటాడు. దీనికి జీకే 'అది పొరపాటు కాదు.. మోసం. నువ్వు నీ బిజినెస్ కోసం మోసం చేశావ్. అయినా నా గురించి నీకు.. నీ బిజినెస్ గురించి నాకు అవసరం లేదు. నువ్వు కేవలం తులసి మాజీ భర్తగానే తెలుసు' అని కోప్పడతాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X