For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: లాస్యకు మరో షాకిచ్చిన నందూ.. అలా పిలిస్తే నాలుక కోస్తానంటూ!

  |

  దేశంలోని మిగిలిన భాషలతో పోలిస్తే తెలుగు బుల్లితెరపై వచ్చే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరూ చూడండి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. బెంగళూరు నుంచి ఇంటికి చేరుకున్న నందూతో లాస్య గొడవకు దిగుతుంది. ఈ ఇంట్లో తనకు అవమానాలు జరుగుతున్నాయని.. అసలు తనకు ఈ ఇంటికి ఉన్న సంబంధం ఏంటో చెప్పాలంటూ అతడిని నిలదీస్తుంది. అంతేకాదు, అసలు తనను ఎప్పుడు పెళ్లి చేసుకుంటావో చెప్పాలంటూ అడుగుతుంది. ఆ సమయంలో తులసికి సపోర్ట్ చేస్తూ లాస్యను తెగ తిడుతుంది అనసూయ. ఇక, చివర్లో లాస్యను పెళ్లి చేసుకోడానికి నందూ ఒప్పుకుంటాడు. అంతేకాదు, ఇంట్లో వాళ్లంతా ఆమె ఏం చెబితే అదే చేయాలంటూ కండీషన్ పెడతాడు.

  పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ప్రభాస్ హీరోయిన్: పెళ్లైన ఆరు నెలలకే తల్లిగా ప్రమోషన్

  పెళ్లి ఆపాలని ఇంట్లో వాళ్ల చర్చలు

  పెళ్లి ఆపాలని ఇంట్లో వాళ్ల చర్చలు

  లాస్యను పెళ్లి చేసుకోడానికి నందూ ఒప్పుకోవడంతో ఇంట్లో వాళ్లందరూ షాక్‌కు గురవుతారు. ఇక, ఈరోజు ఎపిసోడ్‌లో మాత్రం వాళ్లంతా కలిసి పెళ్లిని ఎలా ఆపాలన్న దానిపై చర్చలు జరుపుతుంటారు. ఈ క్రమంలోనే 'బెంగళూరు వెళ్లి ఇద్దరూ ఒక దగ్గర ఉన్నారు. దీంతో వీళ్లిద్దరి మధ్య మనస్పర్థలు తొలగిపోయాయేమో అనుకున్నాం. కానీ లాస్యను పెళ్లి చేసుకుంటా అని అంకుల్ చెప్పడం అందరినీ షాక్‌కు గురి చేసింది' అని అంటుంది శృతి. అప్పుడంతా ఆమెకు మద్దతుగానే మాట్లాడడంతో పాటు ఎలాగైనా ఈ పెళ్లి ఆపాలని అనుకుంటూ ఉంటారు.

  ఇష్టం లేకుండా ఉండలేము అంటూ

  ఇష్టం లేకుండా ఉండలేము అంటూ

  ఇంట్లో వాళ్లంతా మాట్లాడుతున్న సమయంలో తులసి వస్తుంది. వచ్చీ రావడమే ఏంటి అందరి ముఖాల్లో బాధ కనిపిస్తుంది అని ప్రశ్నిస్తుంది. అప్పుడు వాళ్లు ఇంట్లో జరిగిన విషయాన్ని గుర్తు చేయడంతో పాటు నీకు బాధగా లేదా అని ఎదురుగా ప్రశ్నిస్తారు. దీనికి తులసి 'ఇష్టం లేకుండా ఎవరి జీవితంలోనూ మనం ఉండలేం. జరగని విషయాల గురించి తలుచుకొని ఏంటి లాభం? మనకు దక్కిందే ప్రాప్తం అని సంతోషపడాలి. అంతేకానీ, జరగదని తెలిసి కూడా కొన్ని విషయాల గురించి పదే పదే పాకులాడినా ఉపయోగం ఉండదు కదా' అని సమాధానం చెబుతుంది.

  లవర్‌తో కలిసున్న ఫొటో లీక్ చేసిన శృతి హాసన్: అతడు అడగ్గానే అంత పని చేసేసిన బ్యూటీ

  మేమిద్దరం ఎప్పటికీ కలవము కదా

  మేమిద్దరం ఎప్పటికీ కలవము కదా

  తులసి మాటలకు 'అమ్మా.. అలా అని నాన్న చేసే తప్పును పట్టించుకోకుండా ఉంటే జీవితంలో మరో తప్పు చేసిన దానివి అవుతావు కదా' అని ప్రేమ్ అంటాడు. దీనికి తులసి 'నాకు ఆయన దగ్గరవ్వాలన్న తాపత్రయం.. దగ్గర అవుతారన్న ఆశ కూడా లేదు. మేమిద్దరం ఏనాటికీ కలవం. అయినా మమ్మల్ని కలపడానికి మీరంతా ఎందుకు ఇంత తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు' అని అంటుంది. అప్పుడు అనసూయ 'ఈ ఇంటి కోడలి స్థానంలో నువ్వు తప్ప ఇంకొకరు రాకూడదు. ఇంకొకరిని ఊహించుకోలేం' అని అంటుంది. దీంతో తులసి ఒక్కసారిగా షాక్ అవుతుంది.

  లాస్య కొడుకు ఎంట్రీ.. తులసి కోసం

  లాస్య కొడుకు ఎంట్రీ.. తులసి కోసం

  నందూతో పెళ్లి సెట్ అవడంతో లాస్య తన కొడుకును ఏకంగా ఇంటికి తీసుకొచ్చేస్తుంది. అప్పుడు ఆ బాబుతో 'ఇకపై ఇదే నీ ఇల్లు. ఇప్పటి నుంచి ఈయనే నీ నాన్న' అని నందూను చూపిస్తుంది. అంతేకాదు, 'ఇక నుంచి నువ్వు ఈయన్నే నాన్న అని పిలవాలి' అంటుంది. అయితే ఆ బాబు వెంటనే తులసి ఆంటిని కలిసి వస్తాను అంటాడు. అలా వెళ్లగానే తులసి ఆ చిన్నారిని హత్తుకుంటుంది. 'ఎన్నిరోజులు అయిందిరా నిన్ను చూసి. ఈ ఆంటిని మరిచిపోయావా' అని అంటుంది. దీనికి లక్కీ 'లేదు ఆంటి.. మమ్మీ తీసుకురాలేదు' అని బదులిస్తాడు.

  Unstoppable with NBK: రెండు ఎపిసోడ్లకే ఆగిపోయిన బాలకృష్ణ షో.. అసలు కారణం చెప్పిన ఆహా

  డాడీ అని పిలిస్తే నాలుక కోస్తానని

  డాడీ అని పిలిస్తే నాలుక కోస్తానని

  తులసితో మాట్లాడిన తర్వాత లక్కీని నందూకు పరిచయం చేస్తుంది. అప్పుడు కొడుకుతో 'డాడీ కావాలి.. డాడీ కావాలి అన్నావు కదా.. నీకు డాడీని చూపించడానికి ఇక్కడికి తీసుకొచ్చాను. ఈరోజు నుంచి ఈయనే మీ డాడీ' అంటుంది. దీంతో నందూతో సహా అందరూ షాక్ అవుతారు. అప్పుడు లక్కీ 'అదేంటి మమ్మీ.. ఈయన అంకుల్ కదా.. సడెన్‌గా డాడీ ఎలా అయ్యారు' అని ప్రశ్నిస్తాడు. ఆ తర్వాత నందూను లక్కీ డాడీ అని పిలవగా.. అతడికి చిర్రెత్తుకొస్తుంది. అప్పుడు'ఎవడ్రా నీకు డాడీ. ఇంకోసారి అలా పిలుస్తే నాలుక కోస్తాను' అని గట్టిగానే అరుస్తాడు.

   లాస్యకు సపోర్ట్‌గా నిలిచిన తులసి

  లాస్యకు సపోర్ట్‌గా నిలిచిన తులసి

  నందూ చిరాకు పడడంతో లాస్య ప్రశ్నిస్తుంది. దీంతో అతడు కవర్ చేసుకుంటాడు. సరిగ్గా అప్పుడే తులసి 'లాస్యను పెళ్లి చేసుకోవాలని ఒప్పుకున్నప్పుడే తన బంధాలు.. మీ బంధాలుగా మారిపోయాయి. లాస్యను ప్రేమించినప్పుడు ఆమెకు ఒక కొడుకు ఉన్నాడని మీకు తెలియదా' అంటూ నందూను ప్రశ్నిస్తుంది. అప్పుడు లక్కీ 'నేను ఇక్కడ ఉండను. హాస్టల్‌కే వెళ్లిపోతా. నాకు చాలా భయంగా ఉంది. నిన్నటి వరకూ డాడీ కావాలనిపించింది. ఇప్పుడు వద్దు' అని అంటాడు. దీంతో లాస్య 'ఆయన నేను పెళ్లి చేసుకోబోతున్నాం. ఇక నుంచి నువ్వు కూడా ఇక్కడే ఉండొచ్చు' అంటూ లక్కీకి చెబుతుంది. దీంతో ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 482: Family Members Creates Plans for to Stop Nandhu Lasya Marriage. Then Lasya Bring Back her Son To Tulasi House.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X