For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: తులసికి ఎదురు తిరిగిన ప్రేమ్.. లాస్యలో మొదలైన మార్పులు

  |

  దాదాపు రెండు మూడు దశాబ్దాలుగా తెలుగు బుల్లితెరపై వచ్చే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరూ చూడండి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. లాస్యను పెళ్లి చేసుకుంటానని నందూ చెప్పడంతో ఇంట్లో వాళ్లందరూ దాని గురించి చర్చలు జరుపుతూ ఉంటారు. ఈ సమయంలోనే పెళ్లిని ఆపేందుకు వాళ్లంతా ప్లాన్లు చేస్తుంటారు. అప్పుడే తులసి వచ్చి ఎందుకలా ఉన్నారని ప్రశ్నించగా.. పెళ్లి జరగకూడదని అంటారు.

  దీంతో ఆమె తమిద్దరికీ రాసిపెట్టి లేదని అంటుంది. ఆ తర్వాత లాస్య తన కొడుకు లక్కీని తీసుకొని తులసి ఇంటికి వస్తుంది. అప్పుడు నందూ ఆ చిన్నారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. దీంతో ఆ వ్యవహారంలో తులసి కలుగజేసుకుని లాస్యకు సపోర్టుగా మాట్లాడుతుంది.

  'అఖండ' ఈవెంట్‌కు ఇద్దరు హీరోలు: ఎన్టీఆర్‌తో పాటు బాలయ్య అభిమాని కూడా.. ఇక రచ్చ రచ్చే

  తులసిని ప్రశ్నించిన ప్రేమ్... శృతి

  తులసిని ప్రశ్నించిన ప్రేమ్... శృతి

  లాస్య కొడుకు ఎంట్రీ ఇవ్వడంతో సీరియల్ మరింత ఆసక్తికరంగా మారింది. ఇక, తులసిని ప్రేమ్, శృతి ప్రశ్నించడంతో ఈరోజు ఎపిసోడ్ ప్రారంభం అయింది. 'లక్కీ గురించి నాన్న, లాస్య మధ్య గొడవ జరుగుతుంటే నువ్వెందుకు వెళ్లావ్ అమ్మా? నువ్వలా చేయడం మాకు అస్సలు నచ్చలేదు' అని ప్రేమ్, శృతి కలిసి తులసితో అంటారు. దీంతో ఆమెకు కోపం వస్తుంది. 'చిన్న పిల్లాడని కూడా చూడకుండా వాడిని మీ నాన్న తోసేస్తుంటే చూస్తూ ఊరుకోమంటావా? గొడవ ఎవరిదైనా నా కళ్ల ముందు జరిగినే మాత్రం చూస్తూ ఊరుకోలేను' అంటూ బదులిస్తుంది.

  మిమ్మల్ని కూడా నేను వదిలేశానా?

  మిమ్మల్ని కూడా నేను వదిలేశానా?

  ప్రేమ్, శృతి అడిగిన దానికి ఆగ్రహం వ్యక్తం చేసిన తులసి 'మీ నాన్న నాకు విడాకులు ఇచ్చాడని మిమ్మల్ని కూడా నేను వదిలేశానా? లేదు కదా.. అలాగే, లాస్య కూడా చేయాలి. తల్లీ బిడ్డల బంధాన్ని ఎవరూ ఎప్పటికీ విడగొట్టకూడదు. నాకు మీరంతా ఎంత ముఖ్యమో... లాస్యకు తన పిల్లలు అంటే అంతే ముఖ్యం కదా. మీ నాన్న లాస్యకు మాత్రమే భర్తను అవుతాను.. లక్కీకి మాత్రం తండ్రిని కాలేను అంటే ఎలా కుదురుతుంది? ఆ బంధం కావాలంటే ఈ బంధాన్ని కూడా కచ్చితంగా ఒప్పుకుని తీరాల్సిందే' అంటూ కొంత ఆగ్రహంగానే సమాధానం చెబుతుంది.

  హాట్ షోలో హద్దు దాటిన పూజా హెగ్డే: కేవలం అదొక్కటే ధరించి.. ఇలాంటి ఫొటోలు కూడా షేర్ చేస్తారా!

  లక్కీని తమ్ముడిగా ఒప్పుకోవాలా?

  లక్కీని తమ్ముడిగా ఒప్పుకోవాలా?

  తల్లి మాటలకు షాకైన ప్రేమ్.. 'ఏం చెబుతున్నావ్ అమ్మా.. అంటే ఇప్పుడు లాస్యను నాన్న పెళ్లి చేసుకుంటే లక్కీని మేమంతా తమ్ముడిగా ఒప్పుకోవాలా? ఇదే ఇంట్లో వాడు మా నాన్న కొడుకుగా తిరుగుతూ ఉంటాడు. అదే కదా నువ్వు ఇప్పుడు చెప్పేది' అంటూ కోప్పడతాడు. దీనికి తులసి 'లక్కీని తమ్ముడిగా అంగీకరించాలనే విషయాన్ని చాలా తొందరగా అర్థం చేసుకున్నావు. మరి ఇప్పుడేమంటావ్? వాడిని తమ్ముడిగా చూడలేనని అంటావ్ అంతేగా? నువ్వు అలా అనుకుంటే తప్పు నీది కాదు.. నా పెంపకంది' అంటూ ఎమోషనల్‌గా మాట్లాడుతుంది తులసి.

  నేను మాత్రం అలా చేయలేనని

  నేను మాత్రం అలా చేయలేనని

  తులసి అన్న మాటలకు ప్రేమ్ మాత్రం ఒప్పుకోడు. 'నీ పెంపకం గురించి అలా అనుకోవద్దమ్మా. సాటి మనిషిని ప్రేమగా చూడాలని నువ్వు మాకు నేర్పించావు. అదమ్మా నీ పెంపకం. కానీ, నువ్వు ఎంత చెప్పినా లక్కీని మేం తమ్ముడిగా ఒప్పుకోవడం కష్టంగా ఉంటుంది' అంటూ బదులిస్తాడు. దీనికి తులసి 'మీ నాన్నకి భార్యగా లాస్యని నేను ఒప్పుకున్నదానికంటే కష్టంగా ఉంటుందా? పిల్లల నుంచి వారసత్వంగా ఆస్తులే కాదు బంధాలు కూడా వస్తుంటాయి. వాటిని ఒప్పుకోవాల్సిందే. మీ నాన్న చేసిన తప్పుల వల్ల ఈ ఇంట్లో అందరూ ఒప్పుకోవాల్సిందే' అని అంటుంది.

  పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ప్రభాస్ హీరోయిన్: పెళ్లైన ఆరు నెలలకే తల్లిగా ప్రమోషన్

  ఈ ఇంట్లోనే పర్మినెంట్‌గా ఉంటా

  ఈ ఇంట్లోనే పర్మినెంట్‌గా ఉంటా

  ఉదయాన్నే లక్కీ చక్కగా రెడీ అయి కిందకు వస్తుంటాడు. అప్పుడు తులసి ఆ చిన్నారిని పలకరిస్తుంది. 'ఇంత ఉదయాన్నే రెడీ అయిపోయావు వెరీ గుడ్' అని అంటుంది. అప్పుడు 'హాస్టల్‌లో అన్నీ టైంకి అయిపోవాలిగా ఆంటీ. అందుకే అలవాటు అయింది. నేను ఈ ఇంటికి పర్మినెంట్‌గా వచ్చేస్తున్నానుగా అప్పుడు నా ఇష్టం వచ్చినట్లు ఉండొచ్చు' అని అంటాడు. దీనికి తులసి 'నువ్వు ఈ ఇంటికి పర్మినెంట్‌గా రావడం ఏంటి? అసలు ఈ విషయం నీకు ఎవరు చెప్పారు' అని తులసి అడుగుతుంది. దీనికి లక్కీ మా మమ్మీ చెప్పింది ఆంటీ అని బదులిస్తాడు.

  నందూను అలా వేడుకున్న లక్కీ

  నందూను అలా వేడుకున్న లక్కీ

  తర్వాత లక్కీ 'తొందరలోనే మా మమ్మీ డాడీని పెళ్లి చేసుకుంటుందంట కదా.. అప్పుడు నేను ఇక్కడికి పర్మినెంట్‌గా వచ్చేయొచ్చు అని చెప్పింది. మమ్మీ నిజమే చెప్పిందా' అని తులసిని అడుగుతాడు. దీనికామె నిజమే అంటుంది. ఆ తర్వాత లక్కీ నందూ దగ్గరకు వెళ్లి 'నేను మిమ్మల్ని డాడీ అని పిలిస్తే నచ్చదా? నేనంటే మీకు చాలా ఇష్టం అని మమ్మీ చెప్పింది. నా కోసం చాలా ఇష్టంగా చూస్తున్నారని మమ్మీ చెప్పింది.. నేనంటే ఇష్టం అయినప్పుడు నాపై కోపం ఎందుకు డాడీ? నేనేమైనా తప్పు చేశానా డాడీ.. చిన్నపిల్లాడిని కదా డాడీ నాకు తెలియకుండా తప్పు చేస్తే సారీ.. పనిష్మెంట్ ఇవ్వండి డాడీ. మీకు దండం పెడతాను డాడీ.. నాతో మాట్లాడండి' అని వేడుకుంటాడు.

  Unstoppable with NBK: రెండు ఎపిసోడ్లకే ఆగిపోయిన బాలకృష్ణ షో.. అసలు కారణం చెప్పిన ఆహా

  కరగని నందూ మనసు.. చివరకు

  కరగని నందూ మనసు.. చివరకు

  లక్కీ మాటలకు నందూ మనసు కరగదు. కానీ అక్కడే ఉన్న తులసి తెగ ఏడ్చేస్తుంది. అప్పుడు లాస్య కూడా అక్కడకు వెళ్లే ప్రయత్నం చేయగా.. తులసి వద్దని సైగలు చేస్తుంది. ఇక, నందూ అక్కడి నుంచి వెళ్లిపోతుండగా.. లాస్య 'ఏంటి నందూ? చిన్న పిల్లాడు అంతలా బతిమిలాడుతుంటే ఎందుకంత అసహనం? నేను మీ ఫ్యామిలీలో మెంబర్ అయితే వాడు కూడా ఈ ఫ్యామిలీ మెంబరే కదా' అంటుంది. ఆ తరువాత లక్కీ లాస్య చేయి పట్టుకుని అబద్ధం చెప్పావా అని ప్రశ్నిస్తాడు. దీనికామె 'అబద్ధం చెప్పలేదురా.. ఎప్పటికైనా నిజం అవుతుంది' అంటుంది.

  Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
  లాస్యకు తులసి సపోర్ట్.. దివ్యతో

  లాస్యకు తులసి సపోర్ట్.. దివ్యతో

  లాస్యతో మాట్లాడుతుండగా తులసి లక్కీ చేయిపట్టుకుని 'మీ మమ్మీ చెప్పింది ఎప్పటికైనా నిజం అవుతుంది. నువ్ బాధపడకు. నీ కలలన్నీ నిజం అవుతాయి' అని చెబుతుంది. దీంతో లాస్య మారినట్లు కనిపిస్తుంది. ఆ తర్వాత దివ్య, లక్కీ ఆడుకుంటూ ఉండగా.. లాస్య వెళ్లి గొడవ చేస్తుంది. దీంతో తులసి రంగ ప్రవేశం చేసి లాస్యను తిడుతుంది. ఆ తర్వాత అనసూయ.. కొడుకు నందూ దగ్గరకు వెళ్లి 'ఆ లాస్యను వదిలేసి తులసిని పెళ్లి చేసుకోరా' అని అడుగుతుంది. దీనికి నందూ ప్రాణం పోయినా మాట తప్పను అంటూ బదిలివ్వడంతో ఈ ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 483: Lucky Requested to Nandhu. Then Tulasi Try to Lucky Feel Happy. After That Anasuya Request to Nandhu about Tulasi.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X