For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: దీనస్థితిలో పరందామయ్య.. అలా చూసి షాకైన తులసి.. వాళ్లు కూడా దూరం

  |

  ఇండియాలోని చాలా భాషల కంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' మంగళవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  సోమవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  సోమవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  సోమవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. జరిగిన దానిని చూసి తలుచుకుంటూ పరందామయ్య కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటాడు. దీంతో తులసి, సామ్రాట్ ఆయనకు సర్ధి చెప్పే ప్రయత్నాలు చేస్తుంటారు. ఆ తర్వాత కాసేపటికి ఆయన కోలుకుంటాడు. మరోవైపు, అనసూయ మాత్రం ఇంటికి వెళ్లినప్పటి నుంచి పిచ్చిపట్టిన దానిలా ప్రవర్తిస్తూ రచ్చ రచ్చ చేస్తుంటుంది. దీంతో అందరూ ఆమెను భయంతో చూస్తుంటారు. ఆ సమయంలో శృతి ఆమెకు సర్ధి చెప్పాలని చూస్తుంది. కానీ, అనసూయ మాత్రం అస్సలు వినదు. దీంతో లాస్యలో టెన్షన్ తారాస్థాయికి చేరుకుంటుంది.

  బికినీలో షాకిచ్చిన దీపికా పిల్లి: ఎద అందాలు ఆరబోస్తూ హాట్ షో

  కనిపించకుండా పోయిన మామ

  కనిపించకుండా పోయిన మామ

  పెద్ద గొడవ జరిగిన తర్వాత పరందామయ్య నిద్రలోనూ అనసూయ గురించే కలవరిస్తూ.. భయపడుతుండటంతో ఏం చేయాలో తులసికి అర్థం కాదు. పాలు తాగమన్నా కూడా భయపడి పాలు మీద పడేసుకుంటాడు. దీంతో దుప్పటి మార్చి తెస్తా ఆగండి అని బయటికి వెళ్తుంది. ఆ తర్వాత దుప్పటి తీసుకుని వచ్చి చూస్తే పరందామయ్య కనిపించడు. దీంతో తులసి కంగారు పడిపోయి ఇళ్లంతా వెతుకుతుంది. కానీ, పరందామయ్య కనిపించడు. అప్పుడు ఏం చేయాలో ఆమెకు అర్థం కాదు. దీంతో వెంటనే సామ్రాట్‌కు ఫోన్ చేస్తుంది. అతడు హుటాహుటిన అక్కడకు వస్తాడు.

  తులసి, సామ్రాట్ వెతుకుతూనే

  తులసి, సామ్రాట్ వెతుకుతూనే

  తులసి, సామ్రాట్ కలసి పరందామయ్యను వెతుకుతూ ఉంటారు. దీంతో ఆయన ఏమైనా చేసుకుంటాడా అని తులసి భయపడుతుంది. అప్పుడు సామ్రాట్ ఆమెకు ధైర్యం చెప్పి వెతుకుతూనే ఉంటారు. ఇంతలో పరందామయ్య ఒక బిల్డింగ్ దగ్గర కనిపిస్తాడు. అక్కడి సెక్యూరిటీ గార్డుతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ కుర్రాడితో 'బాబూ.. సెక్యూరిటీ గార్డుగా పని చేస్తే నీకు ఎంత జీతం ఇస్తారు' అని ప్రశ్నిస్తాడు. అప్పుడతను 'నాకు పది వేలు ఇస్తారు. రాత్రి ఎనిమిది గంటల నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకూ డ్యూటీ చేయాలి' అని వివరంగా చెబుతాడు.

  Bigg Boss Elimination: తొలిరోజే షాకింగ్ ఓటింగ్.. టాప్‌లో ఊహించని ప్లేయర్.. ప్రమాదంలో ఆ లేడీస్

  నాక్కూడా ఉద్యోగం చూపిస్తావా

  నాక్కూడా ఉద్యోగం చూపిస్తావా

  ఆ సెక్యూరిటీ గార్డు చెప్పిన మాటలకు పరందామయ్య 'నాక్కూడా ఉద్యోగం ఇప్పిస్తావా బాబూ' అని అడుగుతాడు. దీంతో అతడు 'ఈ వయసులో నీకు సెక్యూరిటీ ఉద్యోగం ఏంటి పెద్దాయానా? నీకు ఎవరూ లేరా ఏంటి' అని అడుగుతాడు. అప్పుడు పరందామయ్య 'నాకు బంగారం లాంటి కూతురు ఉంది కానీ.. తనకు నేను భారం కాకూడదని అనుకుంటున్నా. నా కూతురు బంగారం. నెత్తిన పెట్టుకొని చూసుకుంటోంది. ఇప్పటికే తను సమస్యల్లో ఉంది. నేను కొత్త సమస్యగా మారదల్చుకోలేదు. ఒంట్లో శక్తి ఉన్నంత వరకు ఏదో ఒక పని చేసి సంపాదించుకుంటాను' అంటాడు.

  మామయ్యకు తులసి ప్రశ్నలు

  మామయ్యకు తులసి ప్రశ్నలు

  పరందామయ్య మాటలకు ఆ సెక్యూరిటీ గార్డు 'నీ వెనుక పెద్ద కథే ఉన్నట్టుంది. భార్య లేదా' అని అడుగుతాడు. దీనికి పరందామయ్య నా భార్య చచ్చిపోయింది అని చెబుతాడు. అప్పుడతను 'అయ్యో పాపం. నీకు ఉద్యోగం చూసి పెడతాలే పెద్దాయనా' అంటాడు. దీంతో పరందామయ్య 'తప్పకుండా చూడు బాబూ. సంపాదన లేనివాడిని కానీ.. చేతకాని వాడిని కాదు. కష్టపడి పనిచేస్తా. రాత్రంతా మెలుకువగా ఉండి పని చేస్తా' అంటాడు.

  ఇదంతా అక్కడే ఉండి చూసిన తులసి కాసేపటికి అక్కడికి వచ్చి 'మామయ్య ఏంటి ఇది? నన్ను కూడా చంపేశారా? లేననుకున్నారా? ఏంటి ఇదంతా ఎందుకు ఇలా చేస్తున్నారు? అంటూ ప్రశ్నిస్తుంది. దీంతో నాకు అడ్డు పడకు అమ్మ అంటాడాయన. ఆ తర్వాత సామ్రాట్, తులసి ఆయన్ను తీసుకెళ్తారు.

  ఆరియానా ఎద అందాల ఆరబోత: వామ్మో ఇలా తెగించేసిందేంటబ్బా!

  అనసూయకు లాస్య రిక్వెస్ట్‌గా

  అనసూయకు లాస్య రిక్వెస్ట్‌గా

  అనసూయ ఉదయమే దేవుడికి పూజ చేస్తుంటుంది. ఆమెనలా చూసి అభి, అంకిత షాక్ అవుతారు. తర్వాత అందరూ కిందికి దిగుతారు. దీంతో లాస్య 'రాత్రి రాక్షసిలా అరిసింది. ఇప్పుడేంటి ఇంత కూల్ అయింది' అని అనుకుంటుంది. తర్వాత అనసూయ అందరినీ హారతి తీసుకోండి అంటుంది. అంతేకాదు, గుడ్ మార్నింగ్ లాస్య అంటుంది. దీంతో లాస్య 'నిజంగా ఇది గుడ్ మార్నింగ్ కావాలంటే వెంటనే వెళ్లి మామయ్య తీసుకురావాలి' అంటుంది. అప్పుడామె 'వస్తారు.. ఆయనకు ఆయనే వస్తారు. ముందు హారతి తీసుకో. నిన్న నేను అరిచాను కదా అందుకే ఆయనకు కోపం వచ్చి ఉంటుంది. తెల్లారే సరికి ఆ కోపం తగ్గుతుందిలే. ఆయనే తిరిగి వస్తారులే' అని బదులిస్తుంది.

  ఇవన్నీ మాకు అలవాటే అని

  ఇవన్నీ మాకు అలవాటే అని

  అనసూయ మాటలకు అంకిత 'మీకు మీరు సర్దిచెప్పుకుంటున్నారా? లేక మాకు సర్దిచెబుతున్నారా అమ్మమ్మా' అని అడుగుతుంది. దీంతో అనసూయ 'నేను ఎవ్వరికీ సర్దిచెప్పడం లేదు. మా 50 ఏళ్ల కాపురంలో ఇవన్నీ మాకు అలవాటే. ఎప్పుడూ ఎవరు తగ్గాలో మాకు తెలుసు. ఆయన అంతట ఆయన తిరిగి వస్తారు. వేరే దారి లేదు' అంటుంది. అప్పుడు లాస్య ఒకవేళ రాకపోతే అంటుంది. దీనికామె నా మొగుడిని నా నుంచి ఎవరూ లాక్కోలేరు అంటుంది. దీంతో ఎవరైనా లాక్కుంటే అని అడగ్గా.. నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు అని సమాధానం చెబుతుంది.

  యాంకర్ మంజూష అందాల అరాచకం: పైటను పక్కకు జరిపి మరీ హాట్ షో

  అనసూయకు ప్రేమ్, శృతి షాక్

  అనసూయకు ప్రేమ్, శృతి షాక్

  ఇక, చివర్లో ప్రేమ్, శృతి ఇద్దరూ బ్యాగులు సర్దుకొని బయలుదేరుతారు. దీంతో అనసూయ ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది. అప్పుడు ప్రేమ్ ఎక్కడ ప్రేమ ఉందో అక్కడికే వెళ్తున్నాం అంటాడు. దీనికి లాస్య ఈ డొంకతిరుగుడు ఎందుకు.. మీ అమ్మ ఇంటికి వెళ్తున్నాం అని చెప్పొచ్చు కదా అంటుంది. అప్పుడు ప్రేమ్ 'అరె నేను చెప్పా కదా.. ఎలా పసిగట్టిందో చూడు. పెద్దరికంతో అందరికీ నచ్చజెప్పి అందరూ కలిసి ఉండేలా చేయాల్సిన నానమ్మే ఆవేశపడుతోంది. ఇవాళ తాతయ్యనే అవమానించావు. రేపు మమ్మల్ని కూడా అలా చేయవని ఏంటి నమ్మకం. అందుకే మేము వెళ్లిపోవాలని డిసైడ్ అయ్యాం' అంటాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 796: Tulasi and Samrat Gets Worried about Parandhamaiah Behaviour. After That Anasuya Gets Angry and Lasya Request to her.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X