For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: అనసూయకు మరో షాక్.. వాళ్లను చూసిన పరందామయ్య.. అంతలోనే ట్విస్ట్

  |

  చాలా భాషలతో పోల్చుకుంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

   మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే

  మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే

  మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. పరందామయ్య తనలో తాను కుమిలిపోతూ ఉంటాడు. దీంతో తులసి అతడిని ఓదార్చే ప్రయత్నం చేస్తుంటుంది. ఆ సమయంలో ఆమె లోపలికి వెళ్లగా.. పరందామయ్య తప్పించుకుని వెళ్లిపోతాడు. దీంతో సామ్రాట్‌ను పిలిచి ఆయనను వెతకడం మొదలు పెడుతుంది.

  అప్పుడు పరందామయ్య సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం కావాలని ఒకరిని అడుగుతుంటాడు. అది చూసి తులసి బాధ పడుతుంది. మరోవైపు అనసూయ ఏమీ జరగనట్లు మాట్లాడుతుంది. ఆ సమయంలో పరందామయ్యను తీసుకు రమ్మని లాస్య రిక్వెస్ట్ చేస్తుంది.

  నాగశౌర్య కట్నం వివరాలు లీక్: అన్ని కోట్ల విలువైన కానుకలు.. అనూష పేరిట ఉన్న ఆస్తి ఎంతంటే!

  బయటకు రాని పరందామయ్య

  బయటకు రాని పరందామయ్య

  పూర్తిగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిన పరందామయ్యను దాని నుంచి బయటకు తీసుకు వచ్చేందుకు తులసి వాళ్లు ప్రయత్నాలు చేస్తుంటారు. ఇందులో భాగంగానే ఆయనను వాకింగ్ కోసం బయటకు తీసుకు వెళ్తారు. కానీ, ఆయన మాత్రం మూడీగానే కూర్చుని ఉంటాడు.

  అది చూసి సామ్రాట్, తులసి ఎంతగానో బాధపడతారు. అప్పుడు సామ్రాట్ వాళ్ల బాబాయి ఆయనను నవ్వించేందుకు ఎంతో ప్రయత్నించినా నవ్వడు. దీంతో సామ్రాట్ 'పరందామయ్య గారు మీకు మాత్రమే బాధ్యత కాదు.. నాకు కూడా. ఆయన నాకు కూడా తండ్రి లాంటి వారు' అంటాడు.

  నావల్ల కావడం లేదు అంటూనే

  నావల్ల కావడం లేదు అంటూనే

  ఆ తర్వాత సామ్రాట్ బాబాయి జోకులు చేసుకుంటూ బాగా నవ్వుతాడు. అయినా పరందామయ్య మాత్రం అలాగే ఉండిపోతాడు. దీంతో సామ్రాట్ ఇప్పడు అందరం నవ్వుదాం. ఓకేనా వన్, టూ, త్రీ.. అంటాడు. కానీ.. పరందామయ్య తప్ప అందరూ నవ్వుతారు. ఎంత బతిమిలాడినా కూడా పరందామయ్య మాత్రం మారడు. అంతేకాదు, 'నా వల్ల కావడం లేదు. మనసును మోసం చేసుకోలేకపోతున్నాను. మళ్లీ ఎప్పుడైనా ట్రై చేస్తాను సరేనా' అంటాడు. దీంతో తులసి 'అలాగే మామయ్య.. పదండి వెళ్దాం.

  దారిలో వేడి వేడి కాఫీ తాగుదాం. ఫ్రెష్‌గా అనిపిస్తుంది' అంటుంది. దీంతో సామ్రాట్ బాబాయి 'బంధం అంటే బలంగా అయి ఉండాలి. లేదా పూర్తిగా తెగిపోయి అయినా ఉండాలి. ఉండీ లేనట్టుగా ఉండే బంధాలు ఇలాగే బాధపెడతాయి' అంటాడు.

  బ్రాతో యాంకర్ రష్మీ ఓవర్ డోస్ హాట్ షో: తొలిసారి ఇలా తెగించిన బ్యూటీ

  అనసూయకు క్లాస్ పీకిన ప్రేమ్

  అనసూయకు క్లాస్ పీకిన ప్రేమ్

  ఇక, ఇంట్లో నుంచి బయటకు వచ్చేయాలని డిసైడ్ అయిన ప్రేమ్‌ను అనసూయ, లాస్య ఆపుతారు. అప్పుడతను అనసూయపై నిందలు వేస్తూ ఓ రేంజ్‌లో క్లాస్ పీకుతాడు. 'తాతయ్యను అనుమానించడం వల్ల ఆయన పరువును దిగదార్చుకోగా.. అందరిలో నువ్వు నీ మర్యాదను దిగదార్చుకున్నావు. 50 ఏళ్ల పాటు తాతయ్యతో కలిసి ఉండి నువ్వు ఇంకా ఇలాగే ప్రవర్తిస్తున్నావు. అమ్మ విషయంలో అలాగే ఉన్నావు. తాతయ్య విషయంలోనూ అలాగే తయారయ్యావు. ఇక నుంచి నేను ఈ ఇంట్లో ఉండటానికి నా మనసు ఒప్పుకోవడం లేదు నానమ్మ' అని చెబుతాడు.

  కుప్పకూలిపోయిన అనసూయ

  కుప్పకూలిపోయిన అనసూయ

  ఆ తర్వాత కూడా ప్రేమ్ 'అమ్మ దూరం అయ్యాక ఈ ఇంట్లో వెలుగు దూరం అయింది. తాతయ్య దూరం అయ్యాక ఈ ఇంట్లో మానవత్వం దూరం అయింది. అందుకే ఇక్కడ నాకు అస్సలు ఉండాలని అనిపించడం లేదు. కాబట్టి ఇక్కడి నుంచి మేమిద్దరం వెళ్లిపోతున్నాము' అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంటారు. అప్పుడు లాస్య.. నందూ ఏమన్నా అంటాడేమో అన్న భయంతో వాళ్లను ఆపాలనుకుని 'ప్రేమ్.. జరిగిన తప్పును నానమ్మ సరిచేసుకుంటుంది. మీరు ఇల్లు వదిలి వెళ్లొద్దు' అని బ్రతిమాలుతుంది. దీంతో అనసూయ ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది.

  మళ్లీ రెచ్చిపోయిన రీతూ చౌదరి: ఎద అందాలు కనిపించేలా హాట్ షో

  నందూ ఫోన్.. రెచ్చగొట్టిన లాస్య

  నందూ ఫోన్.. రెచ్చగొట్టిన లాస్య

  ప్రేమ్ వాళ్లు వెళ్లిపోయారని అనసూయ ఏడుస్తోన్న సమయంలోనే లాస్యకు నందూ ఫోన్ చేస్తాడు. దీంతో లాస్య 'ఇంట్లో పరిస్థితి చెబితే అస్సలు ఆగడు. ఏం చేయాలి. ముందు అత్తయ్య మైండ్ సెట్ చేసి ఆ తర్వాత నందూతో మాట్లాడుతా' అని మనసులో అనుకుంటుంది. ఆ వెంటనే 'మామయ్య ఇష్యూ గురించి నందూకు తులసి చెప్పేసినట్టుంది. ఆ తులసి మామూల్ది కాదు అత్తయ్యా. నందు ఫోన్ చేస్తున్నాడు. ఇప్పటికైనా మీరు మనసు మార్చుకొని మామయ్యను తీసుకురావడానికి ఒప్పుకోకపోతే చాలా కష్టం' అంటూ అనసూయను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది.

  ప్రేమ్‌ను చూసి తాత సంతోషం

  ప్రేమ్‌ను చూసి తాత సంతోషం

  ఇక, పరందామయ్య కోసం తులసి జీడిపప్పు ఉప్మా చేస్తుంది. అప్పుడు సామ్రాట్ వాళ్ల బాబాయి 'అర్జెంట్‌గా ముందు మీ మామయ్య గారికి నైవేధ్యం పెట్టి.. ఆ తర్వాత ప్రసాదం మాకు పెట్టు. త్వరగా కానివ్వు మా కడుపులు కాలుతున్నాయి' అంటాడు. కానీ, పరందామయ్య ఉప్మా కూడా వద్దు అంటాడు. దీంతో తులసి పాయసం చేయనా అంటుంది. కానీ, ఆయన మాట్లాడకపోవడంతో సామ్రాట్, బాబాయి మాకు ఇష్టం అంటారు. అప్పుడే ప్రేమ్ కూడా వచ్చి నాకూ అదే ఇష్టం అంటాడు.

  వాళ్లను చూసిన పరందామయ్య వెంటనే లేచి వాళ్ల దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ప్రేమ్ మీతో పాటు ఉండిపోవడానికి వచ్చాం అంటాడు. చెప్పకుండా వచ్చినందుకు తులసికి సారీ చెప్పగా.. ఆమె పర్లేదు అంటుంది. ఆ తర్వాత పరందామయ్య నవ్వుతాడు.

  ఆరియానా ఎద అందాల ఆరబోత: వామ్మో ఇలా తెగించేసిందేంటబ్బా!

  పుట్టినరోజు గిఫ్ట్ ఇవ్వమన్న లాస్య

  ఆ తర్వాత లాస్య కూడా అక్కడకు వస్తుంది. అంతేకాదు, 'మీరు మనసు మార్చుకొని ఇంటికి వచ్చేస్తే నందూకు తెలిసే అవకాశం ఉండదు మామయ్య. ఇది మీ పుట్టిన రోజు సందర్భంగా మీరు మాకు ఇచ్చే గిఫ్ట్ అనుకోండి. మిమ్మల్ని తీసుకెళ్లడానికి వచ్చాను మామయ్య' అంటుంది. ఇంతలో అనసూయ కూడా వస్తుంది. ఆమెను చూసి పరందామయ్య భయపడతాడు. అప్పుడు తులసి గుమ్మం దగ్గరే నిలబడ్డారేం.. లోపలికి రండి అని పిలుస్తుంది. దీంతో అనసూయ లోపలికి వెళ్తుంది. వచ్చీ రావడమే పరందామయ్యను పదండి మనింటికి వెళ్దాం అంటుంది. కానీ, ఆయన వినడు.

  ఇక్కడే చచ్చిపోవాలా అంటూ

  ఇక్కడే చచ్చిపోవాలా అంటూ

  అనంతరం అనసూయ 'జరిగిన గొడవ, మీకు మాకు మధ్యన మాత్రమే. ఇందులో వేరే వాళ్లు కల్పించుకోవాల్సిన అవసరం లేదు. మనింటికి వెళ్లి తీరిగ్గా మాట్లాడుకుందాం పదండి' అంటూ పరందామయ్యను లాక్కుని తీసుకెళ్లబోతుంది. దీంతో తులసి అత్తయ్య జాగ్రత్త అంటుంది. అప్పుడు అనసూయ 50 ఏళ్లు కాపురం చేశాం. మా మధ్య నువ్వు రాకు అంటుంది.

  దీంతో తులసి వస్తాను.. ఆయన్ను జాగ్రత్తగా చూసుకోకపోతే నేను ఊరుకోను అంటుంది. అప్పుడు పరందామయ్య ఆమె చేతిని విదిలించుకుని లోపలికి వచ్చి డోర్ పెట్టేస్తాడు. దీంతో అనసూయ బయట నుంచే మాట్లాడుతుంది. 'మిమ్మల్ని అవమానించాలని కాదు. అన్నంత మాత్రాన ఇలా నన్ను తోసేస్తారా? ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు. ఇలా డోర్ దగ్గరే నన్ను గొంతు పిసుక్కొని చనిపోమంటారా' అంటుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 797: Prem and Shruthi Leave The Home. Then Lasya Gets Upset. After That Anasuya Apologises to Parandhamaiah and Tries to Convince Him.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X