For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: పెళ్లికి ముందు లాస్య వద్దన్న నందూ.. తులసికి గిఫ్ట్ ఇచ్చిన లక్కీ

  |

  తెలుగు బుల్లితెరపై వచ్చే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరూ ఓ లుక్కేయండి మరి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  మంగళవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  మంగళవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ఇంట్లో జరుగుతున్న పరిణామాలకు అలిగిన లక్కీ ఒంటరిగా కూర్చుంటాడు. అప్పుడు తులసి వచ్చి కథలు చెబుతూ అతడి మనసు మార్చే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు కోపంగా వచ్చిన లాస్య.. లక్కీ జోలికి రావొద్దని.. తన కొడుకుకు దూరంగా ఉండమని వార్నింగ్ ఇస్తుంది.

  ఆ తర్వాత శృతి, ప్రేమ్ మధ్య సరసాలు జరుగుతూ ఉంటాయి. ఇక, ఉదయాన్నే మళ్లీ లక్కీతో కనిపించిన తులసిని లాస్య, నందూ తిడతారు. దీంతో తులసి వాళ్లకు ఎదురు తిరుగుతుంది. ఇక, చివర్లో పెళ్లికి ముహూర్తం పెట్టించానని లాస్య నందూకు చెబుతుంది.

  హాట్ ఫొటోలు షేర్ చేసిన సమంత: విడాకుల తర్వాత తొలిసారి ఘాటుగా.. అసలిలా ఎప్పుడూ చూసుండరు

   మా మధ్యలోకి రావొద్దంటూ తులిసికి షాక్

  మా మధ్యలోకి రావొద్దంటూ తులిసికి షాక్

  లక్కీపై ప్రేమను కురిపిస్తూ లాస్యతో మాటలు పడుతోన్న తులసిని నిన్నటి ఎపిసోడ్‌లో నందూ కూడా అరవడం చూపించారు. ఇక, ఈరోజు అదే గొడవతో సీరియల్ ప్రారంభం అయింది. తన మీద గొడవ చేస్తున్న లాస్య, నందూ మధ్యలోనే గొడవ పెట్టేలా తులసి మాట్లాడుతుంది. అప్పుడు నందూ 'మా మధ్య ఏమైనా ఉంటే మేము మేము చూసుకుంటాం.

  దయచేసి నువ్వు మా మధ్యలోకి రావొద్దు' అంటూ సీరియస్ అవుతాడు. అప్పుడు లాస్య 'అది అలా బుద్ధి చెప్పు నందూ' అంటూ మరింత రెచ్చగొడుతుంది. అనంతరం లక్కీని తీసుకుని వెళ్లిపోతుంది.

  తల్లిని వద్దని తులసి దగ్గరకు చేరిన లక్కీ

  తల్లిని వద్దని తులసి దగ్గరకు చేరిన లక్కీ

  లక్కీ ఎప్పుడూ తులసి దగ్గరకు వెళ్తుండగా లాస్య 'అసలు నువ్వు ఏమనుకుంటున్నావురా? ఎందుకిలా చేస్తున్నావ్? ఆకలి ఆకలి అన్నావు కదా.. ఇదిగో తిను' అంటూ టిఫిన్ పట్టుకొచ్చి ఇస్తుంది. దీంతో లక్కీ 'నాకొద్దు.. నాకు ఈ టిఫిన్ వద్దు. నువ్వు నాకు నచ్చడం లేదు. అసలు నేను నీతో ఉండను. తులసి ఆంటీతోనే ఉంటాను.

  ఆమె అంటేనే నాకు ఇష్టం' అంటూ ఆ టిఫిన్ ప్లేట్‌ను నేలకేసి కొడతాడు. అంతేకాదు.. 'నువ్వు తినిపిస్తే నేను అస్సలు తినను. తులసి ఆంటీ తినిపిస్తేనే తింటాను' అని వెళ్లిపోతాడు. దీంతో లాస్య ఒక్కసారిగా షాక్‌కు గురవుతుంది.

  హాట్ వీడియోతో షాకిచ్చిన మోనాల్ గజ్జర్: చాలా రోజుల తర్వాత ఇంత ఘాటుగా కనిపించడంతో!

  లాస్య శత్రువు అన్నది మార్చిపోవద్దమ్మా

  లాస్య శత్రువు అన్నది మార్చిపోవద్దమ్మా

  లక్కీ విషయంలో తులసి వ్యవహరిస్తున్న తీరుతో పాటు ఆమె ఎదుర్కొంటోన్న అవమానాలను గ్రహించిన పరందామయ్య.. దీని గురించి ఆమెతో చర్చిస్తుంటాడు. 'లాస్య నీకు శత్రువు అన్న విషయాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దమ్మా. లాస్యకు నీలోని మంచితనం కనిపించడం లేదు. అలాంటి ఆమెకు నువ్వు మంచిగా మాట్లాడినా అర్థం కాదు. తను ఎప్పటికీ నిన్ను శత్రువులాగే చూస్తుంది తప్పితే మంచిగా అయితే ఉండలేదు' అని అంటాడు. అప్పుడు తులసి 'లాస్యలో ఎప్పటికీ తన బంధాలు దూరం అవ్వకూడదన్న ఈర్షే కనిపిస్తుంది మామయ్య' అంటూ బదులిస్తుంది.

  నందూను ఇంట్లో నుంచి వెళ్లిపోమంటూ

  నందూను ఇంట్లో నుంచి వెళ్లిపోమంటూ

  తులసి బాధను చూసి తట్టుకోలేని పరందామయ్య.. నందూను పిలిచి 'నీతో ఐదు నిమిషాలు మాట్లాడాలి. నా కడుపున పుట్టిన బిడ్డతో నేను ఇలా మాట్లాడాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. దారితప్పిన కొడుకును దారిన పెట్టాల్సింది పోయి.. నేను కూడా దారితప్పి ప్రవర్తించాల్సి వస్తోంది' అని అంటాడాయన.

  అప్పుడు నందూ 'మీరు దారి తప్పాల్సిన అవసరం లేదు' అంటాడు. దీనికి పరందామయ్య 'అదే నా బాధ.. నువ్వు వెంటనే లాస్యను తీసుకుని ఈ ఇంటి నుంచి వెళ్లిపో' అని ఆదేశిస్తాడు. దీంతో షాకైన నందూ ఇప్పుడంత అవసరం ఏమొచ్చిందని అడుగుతాడు.

  Bigg Boss: అర్ధరాత్రి ఒకే బెడ్‌పై సిరి, షణ్ముఖ్.. లెటర్‌పై రాసి మరీ రచ్చ.. ఏకంగా మీదకు ఎక్కేసి అలా!

  ఈ ఇల్లు ప్రశాంతంగా ఉండాలంటే వెళ్లు

  ఈ ఇల్లు ప్రశాంతంగా ఉండాలంటే వెళ్లు

  ఇంట్లో నుంచి ఎందుకు వెళ్లిపోమంటున్నారు అని నందూ అడిగిన ప్రశ్నకు పరందామయ్య 'ఈ ఇల్లు ప్రశాంతంగా ఉండాలంటే ఇంతకు మించి పరిష్కారం లేదు. ఎప్పటికప్పుడు నువ్వు సమస్యను ఎలా మెడలేసుకొని తిరగాలి అనుకుంటున్నావు తప్పితే.. ఆ సమస్యను ఎలా తప్పించుకోవాలని చూడటం లేదు. దీనివల్ల భవిష్యత్‌లో చాలా నష్టాలు వచ్చే పరిస్థితి ఉంది. ఏదో ఒకటి చేయకపోతే మన మధ్య బంధాలు శాశ్వతంగా తెగిపోయే ప్రమాదం కూడా ఉంది. అందుకే మా కంటికి కనిపించకుండా లాస్యను తీసుకొని ఎక్కడికైనా దూరంగా వెళ్లిపోరా' అని చెబుతాడు.

  లాస్యనైనా వదిలేస్తా అంటూ షాకిచ్చాడు

  లాస్యనైనా వదిలేస్తా అంటూ షాకిచ్చాడు

  తండ్రి మాటలకు బిత్తరపోయిన నందూ 'ఇప్పటికిప్పుడు ఇల్లు వదిలేసి ఎక్కడికని వెళ్లను' అంటూ ప్రశ్నిస్తాడు. దీనికి పరందామయ్య 'అయితే నీ సమస్యకు పరిష్కారం దొరకదు. కళ్ల ముందు తులసి కనిపిస్తున్నంత కాలం తనకు చేసిన అన్యాయం నీ మనసును తొలుస్తూనే ఉంటుంది. లాస్య ప్రతి రోజు అందరితో గొడవ పెట్టుకుంటోంది. ఈ నరకం మాకొద్దు. ఇంట్లో నుంచి వెళ్లిపోయి లాస్యను పెళ్లి చేసుకో' అంటాడు. అప్పుడు నందూ 'ఈ ఇంటిని వదలాస్సి వస్తే లాస్యనైనా వదిలేస్తా. ఆమె ఇష్టమే కానీ.. మిమ్మల్ని వదులుకోను' అని చెబుతాడు. దీంతో ఇది విన్న లాస్య ఒక్కసారిగా షాక్ అవుతుంది.

  పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ప్రభాస్ హీరోయిన్: పెళ్లైన ఆరు నెలలకే తల్లిగా ప్రమోషన్

  Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
  నందూ అలా.. తులసికి గిఫ్ట్ ఇచ్చిన లక్కీ

  నందూ అలా.. తులసికి గిఫ్ట్ ఇచ్చిన లక్కీ

  తండ్రి మాటలకు 'నేను లాస్యతో ఉండాలి.. నాతో మీరు ఉండాలి. అలా జరగనప్పుడు ఆమె కూడా నాతో ఉండదు. కాబట్టి ఏం చేయాలో మీరే డిసైడ్ అవ్వండి' అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు నందూ. ఇదంతా విన్న లాస్య షాకైపోతుంది. ఆ తర్వాత లక్కీ.. తులసి దగ్గరకు రాగా ఆమె తెగ భయపడిపోతుంది. అప్పుడు ఆ బుడ్డోడు తులసికి డాలర్ ఇస్తాడు. 'ఇది ఎవరి దగ్గర ఉంటే వాళ్లకు కష్టాలు ఉండవట. ఇప్పుడు ఇంట్లో అందరూ మిమ్మల్ని అంటున్నారు. మీరే ఎక్కువగా బాధ పడుతున్నారు. అందుకే మీకిస్తున్నా' అంటాడు. దీంతో ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 485: Lucky Gave Big Shock to Lasya. Then Parandamayya Request to Nandhu for Go Away From Home. But He Denied This.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X