For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: తిరిగి వచ్చేసిన నందూ.. చనిపోతానని చెబుతూ.. చివర్లో ఎమోషన్ సీన్

  |

  దాదాపు రెండు మూడు దశాబ్దాలుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. పరందామయ్య తన బాధను మర్చిపోకుండా ఉండడంతో తులసి, సామ్రాట్, వాళ్ల బాబాయి కలిసి ఆయనను బయటకు తీసుకు వెళ్తారు. అక్కడ వాళ్లంతా ఆయనను నవ్వించే ప్రయత్నం చేసినా కూల్ అవడు. మరోవైపు, ప్రేమ్, శృతి ఇల్లు వదిలి వెళ్లిపోతారు. దీంతో అనసూయ కుప్పకూలిపోతుంది.

  అనంతరం పరందామయ్యను తీసుకొచ్చేందుకు తులసి ఇంటికి వెళ్తుంది. కానీ, ఆమె మాత్రం రానని పట్టుబడతాడు. అంతేకాదు, ఆమెను బయటకు పంపించి తలుపులు మూసేస్తాడు. దీంతో అనసూయ చనిపోతానని వార్నింగ్ ఇస్తుంది.

  బ్రాతో యాంకర్ రష్మీ ఓవర్ డోస్ హాట్ షో: తొలిసారి ఇలా తెగించిన బ్యూటీ

   భర్తను బ్రతిమాలిన అనసూయ

  భర్తను బ్రతిమాలిన అనసూయ

  పరందామయ్య తలుపులు మూయడంతో అనసూయ బయట నిలబడి మాట్లాడుతుంది. ఆ సమయంలో పరందామయ్యను తనతో రమ్మని ప్రాధేయపడుతుంది. అప్పుడాయన 'నీతో ఎంత దూరం నడవాలో నడిచేశాను. ఎంత కాలం కలిసి బతకాలో బతికేశాను. ఇంక నువ్వు ఒంటరిగా నడవాలి. నేను కూడా అలాగే చేయాలి. ఇద్దరం ఒంటరిగానే చావాలి' అంటాడు. దీంతో అనసూయ 'మీకు చేతులు జోడించి అడుగుతున్నా. మీరు ఇంటికి రండి. దయచేసి నాతో రండి. నన్ను క్షమించండి. ఇంటికి వెళ్దాం పదండి' అంటూ ఏడుస్తూ బ్రతిమాలుతుంటుంది.

  తులసిని అసలు క్షమించనంటూ

  తులసిని అసలు క్షమించనంటూ

  ఎంత చెప్పినా పరందామయ్య వినికపోవడంతో అనసూయ 'తులసి.. ఆయన రానిదే ఇక్కడి నుంచి కదలను. ఎంతసేపైనా.. ఎన్ని రోజులైనా ఇక్కడే ఉంటాను' అంటూ తలుపులు కొడుతూ ఉంటుంది. అప్పుడు లాస్య 'తులసి.. అత్తయ్య చేతికి గాయం అవుతుంది. తలుపులు తెరవండి' అంటుంది. తర్వాత అనసూయ 'నేను చావనైనా చస్తాను కానీ.. ఆయనతో మాట్లాడినిదే కదలను.

  ఆయనను తీసుకునే వెళ్తాను. ఒకరోజు కూడా మేమిద్దరం మాట్లాడుకోకుండా ఉన్నది లేదు. కానీ, నీవల్ల ఈ తలుపులు బిగుసుకుపోయాయి. ఈ తలుపులు నువ్వే తెరవాలి. ఇవి తెరవకపోతే నేను నిన్ను క్షమించను. తలుపు తెరువు తులసి' అంటూ గొడవ చేస్తుంది.

  నాగశౌర్య కట్నం వివరాలు లీక్: అన్ని కోట్ల విలువైన కానుకలు.. అనూష పేరిట ఉన్న ఆస్తి ఎంతంటే!

  అనసూయకు తేల్చి చెప్పిన భర్త

  అనసూయకు తేల్చి చెప్పిన భర్త

  అనసూయ మాటలతో బయటకు వచ్చిన పరందామయ్య 'ఒకవేళ నువ్వు తులసికి శాపనార్థాలు పెట్టాలని అనుకుంటే.. నా శవాన్ని కూడా చూసే అవకాశం లేకుండా చేస్తాను. ఏం మాట్లాడాలి? ఏం చెప్పాలి నాతో? ఎందుకు గొంతు చించుకుని అరుస్తున్నావు? రా చెబుదువు కానీ.. చెప్పు.. ఏంటి నీ బాధ? ఇంకా నువ్వు అనాల్సిన మాటలు.. నేను పడాల్సిన మాటలు.. నా మీద చల్లాల్సిన పేడనీళ్లు మిగిలే ఉన్నాయా' అని ప్రశ్నిస్తాడు. దీంతో అనసూయ 'ఎందుకు అంత ఉక్రోషం? చచ్చే వరకూ కలిసే ఉంటానని పెళ్లి అప్పుడు మాటిచ్చారు. కానీ, మీరు చేసిందేంటి? ఎవరి కోసమే నన్ను దూరం చేస్తే నాకు కోపం రాదా? దీనికే నన్ను వదిలేస్తారా' అని ప్రశ్నిస్తుంది. దీంతో పరందామయ్య 'అలా చేసుకుంది నువ్వే' అంటూ బదులిస్తాడు.

  భార్యను పొగిడిన పరందామయ్య

  భార్యను పొగిడిన పరందామయ్య

  ఆ తర్వాత పరందామయ్య 'నీ బాధ్యతల వల్లే మనం ఇంత కాలం సంతోషంగా ఉన్నాం. మనం పేదోళ్లలా పచ్చడి మెతుకులు వేసుకుని తిన్నా.. నీ బాధ్యతల కారణంగానే మన అన్నంలో ఓ స్వీటు కూడా ఉండేది. నువ్వు నాకు ఈ యాభై ఏళ్లలో ఎప్పుడూ విలువ ఇస్తూనే ఉన్నావు. అందుకే నా పిల్లల దగ్గర నేనెప్పుడూ తల దించుకునే పరిస్థితి రాలేదు. కానీ, ఈరోజు నీ కారణంగా అవమానం భారంతో క్రుంగి క్రషించి పాతాలానికి పడిపోయానన్నది కూడా అంతే నిజం. దాన్ని ఒప్పుకో.. దీన్ని కూడా ఒప్పుకో' అంటాడు. దీంతో అనసూయ మౌనంగానే ఉండిపోతుంది.

  బీచ్‌లో అందాల తెర తీసేసిన శ్రీముఖి: అక్కడ ఆకును అడ్డుగా పెట్టి మరీ!

  నందూ అనుమానం.. ఇంటికొచ్చి

  నందూ అనుమానం.. ఇంటికొచ్చి

  మరోవైపు ముంబై వెళ్తున్నానని అబద్ధం చెప్పి హైదరాబాద్‌లోనే ఉన్న నందూ.. అభికి ఫోన్ చేస్తుంటాడు. కానీ, అతడు మాత్రం లిఫ్ట్ చేయడు. చివరకు లాస్య కూడా ఫోన్ లిఫ్ట్ చేయదు. దీంతో ఏం జరుగుతోంది అని టెన్షన్ పడుతూ.. వెంటనే హోటల్ నుంచి బయలుదేరి ఇంటికి వస్తాడు. అలా రాగానే అభిని పిలుస్తాడు. అప్పుడు 'ఏంట్రా ఏమైంది.. నువ్వు కూడా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఎవ్వరూ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు' అని అడుగుతాడు. దీంతో అభి అందరూ గుడికి వెళ్లారు అని అబద్ధం చెబుతాడు. కానీ, ఆ సమయంలో కొన్ని మాటల వల్ల అతడికి డౌట్ వస్తుంది.

  నా కూతురిని ఏమీ అనొద్దంటూ

  నా కూతురిని ఏమీ అనొద్దంటూ

  ఆ తర్వాత అనసూయ 'మీరు చెప్పిన వాటన్నింటికీ నేను ఒప్పుకుంటాను. ముందు మనం ఇంటికి వెళ్లి మాట్లాడుకుందాం రండి' అని అడుగుతుంది. దీంతో పరందామయ్య 'అమ్మా తులసి నేను వెళ్లను. ఆ ఇంటికి నేను వెళ్లను. నీ ఇంట్లోనే ఉంటాను' అంటాడు. అప్పుడు తులసి మీరిద్దరూ ప్రశాంతంగా ఉండండి. నేను చెప్పేది కూడా వినండి అంటుంది. దీంతో అనసూయ నువ్వు మధ్యలో రాకు అంటుంది.

  దీనికి పరందామయ్య నా కూతురును ఏం అనకు అనసూయ అంటూ సీరియస్ అవుతాడు. నేను ఇక నుంచి అయినా ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోవాలని అనుకుంటున్నాను. నవ్వడానికి ప్రయత్నిస్తున్నాను' అని చెబుతాడు.

  జాకెట్ తీసేసిన జబర్ధస్త్ వర్ష: హాట్ షోలో గీత దాటేసి మరీ రచ్చ

  ఇదే నా ఆఖరు కోరిక అనుకో

  అనంతరం పరందామయ్య '50 ఏళ్లు నాతో తోడుగా నిలబడినందుకు ధన్యవాదాలు. కలిసి మనిద్దరం ఎంతో మంచి లైఫ్ గడిపాం. సంతోషంగా ఉన్నాం. పొరపాటున నిన్ను హార్ట్ చేసి ఉంటే నన్ను క్షమించు. ఇక నావల్ల కాదు. ఒప్పేసుకుంటున్నాను. తప్పు నాదే.. ఇక వెళ్లిరా అనసూయ వెళ్లు' అంటాడు. అప్పుడు లాస్య మామయ్య.. నందూ తిరిగి వచ్చాక ఏం చెప్పాలి అంటుంది.

  దీనికాయన 'వాళ్ల నాన్న చచ్చిపోయాడని చెప్పండి. నువ్వు ఇక వెళ్లిరా అనసూయ. చేతులెక్కి మొక్కుతాను. నువ్వు అడిగితే నీ కాళ్లు కూడా పట్టుకుంటా. ఇక్కడ నన్ను ప్రశాంతంగా ఉండనివ్వు. ఇది నా ఆఖరి కోరిక అనుకో' అని ప్రాధేయపడతాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 798: Parandhamaiah Expresses his grief when Anasuya tries to Convince him. After That Nandhu Questions To Abhi.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X