For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: తులసికి ప్రాణాంతక రోగం.. భయంకరమైన నిజం చెప్పిన డాక్టర్లు

  |

  దాదాపు రెండు మూడు దశాబ్దాలుగా తెలుగు బుల్లితెరపై వచ్చే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరూ ఓ లుక్కేయండి మరి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

   బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తులసిని తమ జోలికి రావొద్దంటూ నందూ గట్టి వార్నింగ్ ఇస్తాడు. దీంతో లక్కీ దగ్గరకు రావాలంటే తులసి భయపడుతూ ఉంటుంది. అలాంటి సమయంలో లక్కీ టిఫిన్ తినిపించుందుకు వచ్చిన లాస్యకు కోలుకోలేని షాకిచ్చాడు. తులసి ఆంటీనే నీకంటే ఇష్టం అంటూ ముఖం మీదే చెప్పేస్తాడు. ఆ తర్వాత పరందామయ్య నందూను ఇంట్లో నుంచి వెళ్లిపోమని అడుగుతాడు. కానీ, దీనికి అతడు నిరాకరించాడు. లాస్యనైనా వదులుకుంటా కానీ.. మిమ్మల్ని వదిలేసి వెళ్లనని తేల్చి చెప్పేస్తాడు. ఈ మాటలను లాస్య విని షాక్‌కు గురవుతుంది.

  హాట్ షోతో హీటు పెంచేసిన అనుపమ పరమేశ్వరన్: అమాంతం పైకి లేపి రచ్చ చేసిన హీరోయిన్

  లాస్య గుడ్ న్యూస్.. వద్దనేసిన నందూ

  లాస్య గుడ్ న్యూస్.. వద్దనేసిన నందూ

  బుధవారం జరిగిన ఎపిసోడ్‌లో నందూకు పరందామయ్య చెప్పిన మాటలను లాస్య వినేస్తుంది. దీంతో ఈరోజు ఎపిసోడ్‌లో ఆమె నందూ దగ్గరకు వచ్చి గుడ్ న్యూస్ చెబుతానని అంటుంది. అప్పుడు నందూ ఏంటని అడగ్గా.. 'ఇంతకు ముందే పంతులు గారితో మాట్లాడాను. మన పెళ్లికి రేపే మంచి ముహూర్తం ఉందట' అని అంటుంది. దీనికి నందూ 'అదేంటి ఇంత సడెన్‌గా పెళ్లి గురించి మాట్లాడుతున్నావ్? కొన్ని రోజులు దాన్ని పక్కనపెడదాం' అంటాడు. కానీ లాస్య మాత్రం వినకపోగా 'మీ నాన్నతో మాట్లాడినదంతా వినేశాను' అని నందూకు చెబుతుంది.

   పెళ్లి జరగదు.. ఏం చేస్తావో చెయ్ అని

  పెళ్లి జరగదు.. ఏం చేస్తావో చెయ్ అని

  లాస్య చెప్పిన దానికి షాకైన నందూ.. 'డిస్కర్షన్ మొత్తం విన్నావు కదా' అని అడుగుతాడు. అప్పుడు లాస్య 'మీ నాన్న గారికి ఉన్న క్లారిటీ కూడా నీకు లేదు. అయినా నువ్వు అలా చెప్పడం నాకు నచ్చడం లేదు. రేపే మన పెళ్లి జరిగిపోవాలి' అని అంటుంది. దీనికి అదేమన్నా ఆట అనుకున్నావా అంటాడు నందూ. అప్పుడు 'నువ్వు మాత్రం దాన్ని ఆటలాగే చూస్తున్నావు. రేపు ఎట్టి పరిస్థితుల్లోనూ మన పెళ్లి జరగాల్సిందే' అని పట్టుబడుతుంది. దీనికి నందూ 'రేపు మన పెళ్లి జరిగే ప్రసక్తే లేదు. ఏం చేసుకుంటావో చేసుకో' అంటూ లాస్యకు మరో షాకిస్తాడు.

  Bigg Boss: అర్ధరాత్రి ఒకే బెడ్‌పై సిరి, షణ్ముఖ్.. లెటర్‌పై రాసి మరీ రచ్చ.. ఏకంగా మీదకు ఎక్కేసి అలా!

  లాస్య కోపంగా.. నందూ విరక్తి అంటూ

  లాస్య కోపంగా.. నందూ విరక్తి అంటూ

  ఈ డిస్కర్షన్ తర్వాత నా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటా అంటూ లాస్య లోపలికి వెళ్లిపోతుంది. అలా కోపంగా వెళ్లిన ఆమె తులసి దగ్గర ఉన్న లక్కీని బలవంతంగా గదిలోకి తీసుకుని వెళ్తుంది. ఆ సమయంలో నందూ 'ఛీ ఇదేం బతుకో.. నా మీద నాకే విరక్తి పుడుతుంది. ఈ ఇంట్లో ఒక్కరు కూడా నన్ను పట్టించుకోవడం లేదు' అంటూ తనలో తానే బాధపడుతూ ఉంటాడు. ఇక, తులసి దగ్గర నుంచి లక్కీని తీసుకొచ్చిన లాస్య.. అ చిన్నారిని గదిలో పడేస్తుంది. ఆ తర్వాత బ్యాగులో బట్టలు సర్దుకుంటూ ఉంటుంది. దీంతో ఏం జరుగుతుందోనన్న భయంతో లక్కీ ఏడుస్తుంటాడు.

  లక్కీని మోసం చేశానని ఏడ్చిన లాస్య

  లక్కీని మోసం చేశానని ఏడ్చిన లాస్య

  లక్కీ భయంతో ఏడుస్తూ ఉండగా 'నా జీవితంలో నేను తీసుకున్న తప్పుడు నిర్ణయాలు నా లైఫ్ నే కాదు.. నీ లైఫ్‌ను కూడా నాశనం చేశాయి. నేను నమ్ముకున్న వాళ్లు నన్ను మోసం చేశారు. నేను నిన్ను మోసం చేశాను' అంటూ తెగ బాధ పడుతుంది. ఆ తర్వాత బ్యాగును, లక్కీని తీసుకుని లాస్య బయటకు వస్తుంది. ఆ సమయంలో తులసి చూసి ఏమైందని అడగ్గా 'నువ్వే గెలిచావు తులసి. నువ్వు అనుకున్నదే జరిగింది కదా' అంటుంది. దీంతో తులసి 'కాస్త ఆగు లాస్య.. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు' అంటూ చెప్పుకొస్తుంది.

  హాట్ ఫొటోలు షేర్ చేసిన సమంత: విడాకుల తర్వాత తొలిసారి ఘాటుగా.. అసలిలా ఎప్పుడూ చూసుండరు

  లాస్యకు తులసి భరోసా.. పెళ్లి చేస్తానని

  లాస్యకు తులసి భరోసా.. పెళ్లి చేస్తానని

  తులసి అడగడంతో లాస్య 'నేను నిన్ను పెళ్లి చేసుకోను.. నీ ఇష్టం వచ్చింది చేసుకో అన్నాడు నందూ. తన వల్ల మేము అనాథలుగా మిగిలిపోయాం. మమ్మల్ని నడి రోడ్డు మీద నిలబెట్టాడు. అతడు అలా అనడానికి కారణం నువ్వే' అంటుంది. దీనికి తులసి 'నన్ను నమ్ము లాస్య. మీ పెళ్లి నేను జరిపిస్తాను. నా జీవితంలో ఆయన ఎప్పుడూ ఉండడు' అని అంటుంది. దీనికి లాస్య 'నీ మాటలు వింటుంటే నాకు జీవితం మీద మళ్లీ ఆశ కలుగుతోంది. నీ మాట నమ్మి ఈ ఇంట్లో అడుగు పెడతాను' అంటుంది. అప్పుడు నమ్మిన వాళ్లను మోసం చేయనని తులసి చెబుతుంది.

  లాస్య కోసం నందూ దగ్గరకెళ్లిన తులసి

  లాస్య కోసం నందూ దగ్గరకెళ్లిన తులసి

  లాస్య కోసం తులసి నందూ దగ్గరకు వెళ్తుంది. దీంతో ఎందుకొచ్చావ్ అని సూటిగా ప్రశ్నిస్తాడతను. దీనికి తులసి 'లాస్య పెళ్లి విషయం గురించి మాట్లాడటానికి వచ్చాను. మీరు తనను పెళ్లి చేసుకోవాలి' అని అంటుంది. దీంతో నందూ 'నా పెళ్లి విషయం నీకు సంబంధం లేదు' అంటూ బదులిస్తాడు. దీనికి తులసి 'పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి ఎందుకు తప్పారు. లాస్యను పెళ్లి చేసుకోండి' అని డిమాండ్ చేస్తుంది. దీంతో నందూ 'నేను ఇప్పుడు మాట్లాడలేను.. ఇక్కడి నుంచి వెళ్లిపో' అంటాడు. దీంతో మీకు సిగ్గులేదా అంటూ ముఖం మీదే ప్రశ్నిస్తుందామె.

  హాట్ వీడియోతో షాకిచ్చిన మోనాల్ గజ్జర్: చాలా రోజుల తర్వాత ఇంత ఘాటుగా కనిపించడంతో!

  Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
  తులసికి ప్రాణాంతక రోగం.. అంతా షాక్

  తులసికి ప్రాణాంతక రోగం.. అంతా షాక్

  తులసి మాటలకు నందూ ఇంట్లో నుంచి వెళ్లిపోతాను అంటూ అరుస్తాడు. సరిగ్గా అతడితో మాట్లాడుతున్న సమయంలోనే గతంలో మాదిరిగానే తులసి కళ్లు తిరిగి కింద పడిపోతుంది. దీంతో ఆమెను ఇంట్లో వాళ్లంతా హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్తారు. అక్కడ ఆమెకు పలు రకాల వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు.. బయటకు వచ్చి తులసికి గర్భాశయంలో పుండు ఉందని. దీంతో కుటుంబ సభ్యులు పుండు అంటే క్యాన్సరా అని అడుగుతారు. దీంతో డాక్టర్లు అవునని సమాధానం ఇస్తారు. దీంతో అందరూ షాక్ అయిపోతారు. ఇలా ఈ ఎపిసోడ్ ఓ ట్విస్ట్‌తో పూర్తైపోయింది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 486: Lasya Requested to Nandhu for Their Marriage. But He Reject This. Then Tulasi Fell Down at Nandhu Room
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X