For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: తులసి కోసం ఒక్కటైన ఫ్యామిలీ.. చివరి నిమిషంలో పుల్లపెట్టిన లాస్య

  |

  సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై వచ్చే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరూ ఓ లుక్కేయండి మరి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. పరందామయ్య చెప్పిన మాటలను విన్న తర్వాత లాస్య నందూతో మాట్లాడుతుంది. ఆ సమయంలో తనను పెళ్లి చేసుకోమంటూ నందూను అభ్యర్ధించింది. కానీ, దీనికి అతడు పెళ్లి చేసుకోడానికి మాత్రం నిరాకరించాడు. ఇప్పటికిప్పుడు జరిగే పని కాదని, దానికింకా సమయం కావాలని అడుగుతాడు. దీంతో లాస్య ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని అనుకుంటుంది. అప్పుడు తులసి ఆమెను ఆపి నందూతో గొడవ పడుతుంది. ఆ సమయంలో కళ్లు తిరిగి కింద పడిపోయింది. ఆమెను పరీక్షించిన వైద్యులు క్యాన్సర్ వచ్చిందని చెబుతారు.

  బైసెక్సువల్‌గా మారబోతున్న సమంత: విడాకులు తర్వాత సంచలన ప్రకటన.. తెలుగులో ఎవరూ చేయని విధంగా!

  విడాకుల కోసం ఎందుకలా చేశారంటూ

  విడాకుల కోసం ఎందుకలా చేశారంటూ

  లాస్యను పెళ్లి చేసుకోమని తులసి గొడవ పడుతుండగా నందూ కూడా సీరియస్‌గానే సమాధానాలు చెబుతుంటాడు. దీంతో ఆమె 'లాస్యను ఎందుకు పెళ్లి చేసుకోనని అంటున్నారు? అన్ని విషయాల్లోనూ మీరు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? మీరు ఇకనైనా మారరా? మీరు వెంటనే లాస్యను పెళ్లి చేసుకోవాల్సిందే' అంటూ సీరియస్ అవుతుంది. దీంతో నందూ నాకు సమయం కావాలి అని మామూలుగానే సమాధానం చెబుతాడు. అప్పుడు తులసి 'మరి నాతో విడాకులకు ఎందుకు అంత తొందరపడ్డారు? అప్పుడెందుకు సమయం తీసుకోలేదు' అని ప్రశ్నిస్తుంది.

  ఏం చేస్తానో నాకే తెలియదు అంటూనే

  ఏం చేస్తానో నాకే తెలియదు అంటూనే

  తులసి మాటలకు నందూ పెద్దగా స్పందించడు. దీంతో ఆమె మరింతగా సీరియస్ అవుతుంది. గొంతు పెంచేసి 'మీ తప్పును ఒప్పుకోవడానికి భయపడుతున్నారా? ఆడదాన్ని బలహీనురాలు, చేతగానిది అని నిందించే మీరు.. కష్టాలు వచ్చినప్పుడు పారిపోయారు. కానీ, ఆడది మాత్రం ఎలాంటి కష్టాలను అయినా రాయిలా భరిస్తుంది.. సహిస్తుంది. ఆడదాని ముందు కష్టాలు ఓడిపోతాయి. కానీ ఆడది ఓడిపోదు' అని అంటుంది. దీనికి నందూ 'నన్ను బలవంతపెట్టకు తులసి. అలాగే చేశావంటే నేనేం చేస్తానో నాకు తెలియదు' గంభీర స్వరంతో చెబుతాడు.

  Bigg Boss Elimination: లీకైన 12వ వారం అఫీషియల్ ఓటింగ్.. మారిన టాప్ పొజిషన్.. ఆ ఇద్దరిలో ఒకరు బయటకు!

  కింద పడిపోయిన తులసి.. ఆస్పత్రికెళ్లి

  కింద పడిపోయిన తులసి.. ఆస్పత్రికెళ్లి

  నందూతో గొడవ పడుతోన్న సమయంలోనే తులసి స్పృహ తప్పి కింద పడిపోతుంది. దీంతో అతడికి ఏం చేయాలో అర్థం కాదు. ఆ సమయంలోనే ఇంట్లో వాళ్లందరూ వచ్చి తులసిని బెడ్ మీద పడుకోబెడతారు. కొద్ది సేపటికి తులసి స్పృహలోకి వస్తుంది. కానీ, ఆమె తరచూ అలా ఎందుకు పడిపోతుందో ఎవరికీ అర్థం కాదు. దీంతో అభి ఆమెను ఆస్పత్రికి తీసుకుని వెళ్తాడు. అక్కడి డాక్టర్ కొన్ని మందులు ఇచ్చి టెస్టులు చేసిని తర్వాత స్కానింగ్ చేయగా.. గర్భాశయంలో ఇన్ఫెక్షన్ ఉందని తెలుస్తుంది. ఇది ట్రీట్‌మెంట్‌తో తగ్గేదే అయినా బయాక్సీ చేయిద్దామని అంటోంది డాక్టర్.

  తులసికి క్యాన్సర్... అక్కడికి వెళ్లమని

  తులసికి క్యాన్సర్... అక్కడికి వెళ్లమని

  డాక్టర్ చెప్పిన మాటలను విన్న తర్వాత అభి.. అమ్మకు వచ్చింది క్యాన్సరా అని ప్రశ్నిస్తాడు. దీంతో డాక్టర్ ఒకసారి చెక్ చేసి చూద్దాం అంటుంది. దీంతో అతడు చాలా టెన్షన్ పడుతుంటాడు. ఆ సమయంలో డాక్టర్ 'నేను వెల్‌నెస్ సెంటర్‌కు వెళ్తున్నా. అక్కడికి తులసిని తీసుకెళ్దాం. కొద్ది రోజులు అక్కడ ఉంచుదాం. ఆ సెంటర్ ఫేమస్ అంకాలజిస్ట్ డాక్టర్ అధ్వైత కృష్ణ గారిది. క్యాన్సర్ అవేర్ నెస్ మీద సోషల్ మీడియాలో ఆర్టికల్స్ రాయిస్తారు' అని చెబుతుంది. ఆ తర్వాత అభి బాధ పడుతూనే.. తులసిని తీసుకొని ఇంటికి వస్తాడు. ఇంట్లో వాళ్లంతా టెన్షన్ పడతారు.

  Drushyam 2: వెంకటేష్‌కు భారీ షాక్.. రిలీజైన గంటల్లోనే ఫుల్ మూవీ లీక్.. ఆ సైట్లలో డౌన్‌లోడ్ లింక్
  https://telugu.filmibeat.com/news/daggubati-venkatesh-s-drushyam-2-full-movie-leaked-online-for-free-download-104856.html

  వెల్‌నెస్ సెంటర్‌కు.. రానన్న తులసి

  వెల్‌నెస్ సెంటర్‌కు.. రానన్న తులసి

  ఇంటికి వచ్చిన వెంటనే అభి.. 'అమ్మను కొన్ని రోజులు వెల్‌నెస్ సెంటర్‌కు తీసుకెళ్లాలి' అని అందరి ముందు చెబుతాడు. కానీ, తులసి మాత్రం ఎక్కడికీ రానని అంటుంది. అప్పుడు నందూ కలుగజేసుకుని నువ్వు రానంటే ఎలా అంటాడు. దీనికి తులసి 'ఇంట్లో వాళ్లను వదిలేసి వారం రోజులు ఉండాలంటే నావల్ల కాదు' అంటుంది. అప్పుడు పరందామయ్య అందరం కలిసి అక్కడికి వెళ్దాం అంటాడు. దీంతో అందరూ సరే అని ఒప్పుకుంటారు. దీనికి తులసి 'నా ఒక్కదాని కోసం మీరందరూ వస్తారా' అని అడగ్గా.. అందులో తప్పేముంది అని శృతి బదులిస్తుంది.

  లాస్యను లైట్ తీసుకుని.. నందూ అలా

  లాస్యను లైట్ తీసుకుని.. నందూ అలా

  తులసితో పాటు అందరూ వెల్‌నెస్ సెంటర్‌కు వెళ్లాలని డిసైడ్ అయిన తర్వాత లాస్య 'మనమేమన్నా పిక్నిక్‌కు వెళ్తున్నామా? నేను అయితే రాను' అని అంటుంది. దీంతో ప్రేమ్ కోపంగా 'నిన్నెవరూ బొట్టు పెట్టి పిలవట్లేదు. ఇష్టం లేకపోతే నువ్వు రాకు' అని అంటాడు. అప్పుడు లాస్య 'నేనే కాదు.. నందూ కూడా మీతో పాటు రాడు' అంటుంది. దీంతో ప్రేమ్ 'ఆ మాట చెప్పాల్సింది నువ్వు కాదు.. నాన్న' అని అంటాడు. వీళ్లు అలా మాట్లాడుకుంటున్నా నందూ మాత్రం ఏం మాట్లాడడు. అప్పుడు అనసూయ అందరం వెళ్తున్నాం అంటూ వెళ్లిపోతుంది.

  మళ్లీ రెచ్చిపోయిన అషు రెడ్డి: ఎద అందాలు మొత్తం కనిపించేలా.. వామ్మో ఆమెనిలా చూస్తే తట్టుకుంటారా!

  Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
   నందూతో ఏకాంతంగా ఉండాలని ప్లాన్

  నందూతో ఏకాంతంగా ఉండాలని ప్లాన్

  వెల్‌నెస్ సెంటర్‌కు వెళ్లడం గురించి డిస్కర్షన్ పూర్తైన తర్వాత తులసిని అంకిత, శృతి పట్టుకుని వెళ్లి ఆమె రూమ్‌లో కూర్చోబెడతారు. ఆ తర్వాత నందూ రూమ్‌లో ఒంటరిగా ఉండగా లాస్య అక్కడకు వస్తుంది. ఎంతో సంతోషంగా కనిపిస్తూ 'హమ్మయ్యా నందూ.. ఇనాళ్లకు మనకు మంచి జరిగింది' అని అంటుంది. దీంతో అతడు అయోమయంగా చూస్తుంటాడు. అప్పుడు లాస్య 'అన్నీ నేనే చెప్పాలి. ఇంట్లో వాళ్లందరూ వెళ్లిపోతున్నారు కదా.. ఇక మనం వారం రోజులు ఏకాంతంగా ఉండొచ్చు. ఫుల్లుగా ఎంజాయ్ చేయొచ్చు' అంటుంది. దీంతో ఈ ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 487: The Family Members Worried about Tulasi Health. Then Abhi gets Worried After Discussing with Doctors.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X