For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: తులసి నోటి నుంచి చావు మాట.. అభి ద్వారా నిజం తెలుసుకున్న నందూ

  |

  మిగిలిన భాషలతో పోల్చుకుంటే తెలుగు బుల్లితెరపై వచ్చే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరూ ఓ లుక్కేయండి మరి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. నందూతో గొడవ పడుతోన్న సమయంలో తులసి కళ్లు తిరిగి కింద పడిపోతుంది. దీంతో ఆమెను అభి ఆస్పత్రికి తీసుకుని వెళ్తాడు. అక్కడ ఆమెకు పలు రకాల వైద్య పరీక్షలు చేసిన తర్వాత క్యాన్సర్ అని అనుమాన పడతారు. దీంతో తులసిని వెల్‌నెస్ సెంటర్‌కు తీసుకెళ్లమని సలహా ఇస్తారు. ఆ విషయం అభి ఇంట్లో వాళ్లకు చెప్పగానే వాళ్లందరూ కలిసి వెళ్దాం అని అనుకుంటారు. అప్పుడు లాస్య తాను రానని, నందూ కూడా రాడని చెబుతుంది. ఆ తర్వాత ఇంట్లో ఎవరూ ఉండకపోవడంతో ఏకాంతంగా ఉండొచ్చని సంబరపడుతుంది.

  బైసెక్సువల్‌గా మారబోతున్న సమంత: విడాకులు తర్వాత సంచలన ప్రకటన.. తెలుగులో ఎవరూ చేయని విధంగా!

   ఎంజాయ్ చేయాలని ప్లాన్ చేసిన లాస్య

  ఎంజాయ్ చేయాలని ప్లాన్ చేసిన లాస్య

  తులసికి ఆరోగ్యం బాలేకపోవడంతో వెల్‌నెస్ సెంటర్‌కు తీసుకెళ్లడానికి ఇంట్లో వాళ్లు రెడీ అవుతుండగా లాస్య తెగ సంతోషపడుతుంది. నందూ దగ్గరకు వచ్చి 'వాళ్లంతా వెల్‌నెస్ సెంటర్‌కు వెళ్తే వారం పాటు మనం ఫ్రీబర్డ్స్‌లా ఉండొచ్చు. ఈ ఇంట్లో మనం తప్పితే ఎవరూ ఉండరు. ఫుల్లుగా ఎంజాయ్ చేద్దాం' అంటూ తెగ సంబర పడుతూ చెబుతుంది. కానీ, నందూ మాత్రం ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు లాస్య 'ఏంటి నందూ ఏమీ మాట్లాడవు. రేపు గోల్డ్ షాప్‌కు వెళ్దామని అనుకున్నాం కదా.. సేట్‌కు షోన్ చేస్తా ఇక్కడే ఉండు' అంటూ పక్కకు వెళ్లిపోతుంది.

  తులసి గురించి నందూకు చెప్పిన అభి

  తులసి గురించి నందూకు చెప్పిన అభి

  రూమ్‌లో ఒంటరిగా ఉన్న నందూ దగ్గరకు అభి వస్తాడు. వచ్చీ రావడమే 'రేపు మార్నింగే కదా బయలుదేరేది. అంతా రెడీయేనా డాడ్? మామ్ విషయంలో అందరికీ అబద్ధం చెప్పాను. తనను స్ట్రెస్ తగ్గడం కోసం తీసుకెళ్లడం లేదు.. మామ్‌కు గర్భసంచిలో ట్యూమర్ ఉంది. పొరపాటున అది క్యాన్సర్ అయ్యే చాన్స్ ఉందేమోనని డౌట్. ఇది జస్ట్ నా అనుమానం మాత్రమే. కన్ఫార్మ్‌గా చెప్పలేము. టెస్ట్ చేస్తే అనుమానం తీరుతుందని తీసుకెళ్తున్నాం' అని వివరిస్తాడు. దీంతో తులసి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని నందూ ఒక్కసారిగా షాక్ అయిపోయి సైలెంట్‌గా ఉంటాడు.

  మళ్లీ రెచ్చిపోయిన అషు రెడ్డి: ఎద అందాలు మొత్తం కనిపించేలా.. వామ్మో ఆమెనిలా చూస్తే తట్టుకుంటారా!

  తులసి కోసం ఈమాత్రం చేయకూడదా

  తులసి కోసం ఈమాత్రం చేయకూడదా

  ఉదయాన్నే అందరూ రెడీ అయి హాల్‌లోకి వస్తాడు. అప్పుడు నందూ కూడా తన బట్టలు సర్ధుకుంటూ ఉంటాడు. అంతలో అతడి దగ్గరకు వెళ్లిన లాస్య షాకై ప్రశ్నిస్తుంది. దీంతో తాను కూడా తులసి వాళ్లతో వెళ్తున్నానని చెబుతాడు. దీంతో లాస్య 'వెళ్లనని అన్నావ్ కదా.. అసలు నువ్వు ఏ హోదాలో వెళ్తున్నావో తెలుసుకోవచ్చా' అని ప్రశ్నిస్తుంది. దీనికి నందూ 'పాతికేళ్లు సేవలు చేయించుకున్న వ్యక్తిగా వెళ్తున్నాను. తులసి కోసం ఈ మాత్రం చేయకపోతే ఎలా? అందుకే వాళ్లతో వెళ్తున్నాను' అని అంటాడు. దీంతో లాస్య ఇచ్చిన మాట తప్పుతున్నావని గుర్తు చేస్తుంది.

  లాస్యను మరింత రెచ్చగొట్టేసిన భాగ్య

  లాస్యను మరింత రెచ్చగొట్టేసిన భాగ్య

  నందూ బయటకు రాకపోవడంతో అందరూ వెళ్లిపోవాలని అనుకుంటారు. అంతలో నందూ వస్తాడు. దీంతో షాకైన అందరూ సంతోషంగా బయలుదేరుతారు. అప్పుడు లాస్య ఒంటరిగా మిగిలానని బాధపడుతుంది. పెళ్లి అనుకున్న టైంలోనే ఇలా జరిగిందేంటని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు భాగ్య ఫోన్ చేసి 'ఏంటి ఒంటరిదానివి అయిపోయావా? అందరూ తులసి మాయలో పడిపోయారు. నువ్వు కూడా తులసి మాయలో పడిపోయావు. తులసికి జబ్బు ఉందని అందరినీ నమ్మించింది. చివరకు నిన్ను కూడా నమ్మేలా చేసింది' అంటూ మరింతగా రెచ్చగొడుతుంది.

  Akhanda ఈవెంట్‌కు బన్నీతో పాటు మరో స్పెషల్ గెస్ట్: ఆ సెంటిమెంట్ ప్రకారం ఈ సినిమా కూడా హిట్టే

  చనిపోయే వరకూ ఇక్కడే ఉండాలని

  చనిపోయే వరకూ ఇక్కడే ఉండాలని

  తులసి, నందూతో పాటు ఇంట్లో వాళ్లందరూ వెల్‌నెస్ సెంటర్‌కు చేరుకుంటారు. అక్కడ వాతావరణం చూసి అందరికీ బాగా నచ్చుతుంది. తులసికి కూడా అక్కడ ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. అప్పుడు 'అభి ఇది ఎంతో బాగుందిరా.. ఇక్కడ రెండు వారాలు ఏంటి? నేను చనిపోయే వరకూ ఉంటాను' అంటుంది. దీంతో అందరూ భయపడిపోతారు. అప్పుడు అనసూయ 'అలా అనకూడదమ్మా' అంటూ కంగారుగా చెబుతుంది. దీంతో తులసి 'నేను అంటే జరిగిపోతుందా? అయినా మీరంతా ఉండగా చావు కూడా నా దగ్గరకు రాదు' అని చెబుతుంది.

   బిగ్ బాస్ హౌస్‌లా ఉండాలి అంటూ

  బిగ్ బాస్ హౌస్‌లా ఉండాలి అంటూ

  వెల్‌నెస్ సెంటర్‌కు వెళ్లిన వెంటనే తులసి 'అమ్మా శృతి.. ఫ్యాక్టరీ మేనేజర్‌కు కాల్ చేయవా? అక్కడ ఈరోజు డెలివరీలు చాలా ఉన్నాయి' అని అడుగుతుంది. దీనికి అందరూ ఒప్పుకోరు. అప్పుడు అనసూయ 'ఇక్కడకు వచ్చిందే ప్రశాంతంగా ఉండడానికి. అలాంటివి ఏమీ లేకుండా ఉందాం' అంటుంది. అప్పుడు అంకిత 'అవును ఆంటీ.. మనం ఏమీ పట్టించుకోకుండా బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నట్లు ఉందాం' అంటుంది. దీనికి తులసి 'ఆ హౌస్‌లో లాగ గొడవలు లేకుండా ఎంజాయ్ చేద్దాం' అని అంటుంది. దీంతో అందరూ తలూపడంతో ఈ ఎపిసోడ్ పూర్తైంది.

  హాట్ షోతో హీటు పెంచేసిన అనుపమ పరమేశ్వరన్: అమాంతం పైకి లేపి రచ్చ చేసిన హీరోయిన్

  46వ వారం గృహలక్ష్మి రేటింగ్ ఇలా

  46వ వారం గృహలక్ష్మి రేటింగ్ ఇలా

  ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ రేటింగ్ విషయానికి వస్తే.. రూరల్ ప్రాంతంలో 45 వారంలో 13.65 రేటింగ్ సొంతం చేసుకొంటే.. 46వ వారంలో 14.75 రేటింగ్‌ను సాధించింది. ఇక అర్బన్ ప్రాంతంలో 45వ వారం 12.76 రేటింగ్ సొంతం చేసుకొంటే.. 46వ వారంలో 13.71 రేటింగ్‌ను సాధించింది. గత కొద్ది వారాలుగా ఈ సీరియల్ మంచి రేటింగ్‌ను నమోదు చేసుకొంటూ దూసుకెళ్లున్నది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 488:Nandhu Decides to go Wellness Center for Tulasi. Then Lasya Angry on Nandhu. After That Tulasi Feels Happy.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X