For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: తులసికి షాకిచ్చిన అద్వైత కృష్ణ.. ఆమె మళ్లీ పడిపోవడంతో సీరియస్

  |

  దాదాపు రెండు మూడు దశాబ్దాలుగా తెలుగు బుల్లితెరపై వచ్చే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరూ ఓ లుక్కేయండి మరి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. అందరూ వెల్‌నెస్ సెంటర్‌కు వెళితే నందూతో ఏకాంతంగా గడపొచ్చని లాస్య ప్లాన్ చేసుకుంటుంది. అంతలో అభి వచ్చి తులసికి క్యాన్సర్ అని డౌట్‌గా ఉందని నందూకు చెబుతాడు. దీంతో తులసి కోసం వెల్‌నెస్‌ సెంటర్‌కు వెళ్లాలని నందూ డిసైడ్ అవుతాడు. అప్పుడు లాస్య అతడిపై కోప్పడుతుంది. ఏ హక్కుతో ఆమెతో కలిసి వెళ్తావని ప్రశ్నిస్తుంది. ఆ తర్వాత వెల్‌నెస్ సెంటర్‌ను చూసిన తులసి సంతోషంగా ఉంటుంది. ఆమెతో పాటు అందరూ కొన్ని రోజులు అక్కడ ఎంజాయ్ చేయాలని నిర్ణయించుకుంటారు.

  ప్యాంట్ లేకుండా షాకిచ్చిన అనన్య నాగళ్ల: సినిమాల్లో నిండుగా.. ఇక్కడ మాత్రం అరాచకంగా!

  అద్వైత కృష్ణను చూసి షాకైన తులసి

  అద్వైత కృష్ణను చూసి షాకైన తులసి

  వెల్‌నెస్ సెంటర్‌లో తులసి చాలా సంతోషంగా కనిపిస్తుంది. అక్కడి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ మురిసిపోతూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే ఓ వేణుగానం వినిపిస్తుంది. దీంతో తులసి, ప్రేమ్ ఆ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందో అని వెతుక్కుంటూ వెళతారు. అప్పుడు ఆ సెంటర్ ఓనర్ డాక్టర్ అద్వైత కృష్ణ వేణువును ఊదుతూ కనిపిస్తాడు. అప్పుడు తులసిని చూసి 'హాయ్ డియర్.. మీరు నా దగ్గర ఏమైనా నేర్చుకోవాలనుకుంటే గురూజీని. లేకుంటే నేను కూడా సాధారణ వ్యక్తిని' అంటాడు. దీంతో తులసి 'మీరు గురూజీ అంటే నమ్మలేకపోతున్నా' అని అంటుంది.

  తులసిని ఆశ్చర్యపరిచిన డాక్టర్ కృష్ణ

  తులసిని ఆశ్చర్యపరిచిన డాక్టర్ కృష్ణ

  తులసి మాటలకు అద్వైత కృష్ణ మాట్లాడుతూ 'మా గురువు గారు అలా ఉండరు. అందుకే నేను అలా ఉండను' అంటాడు. దీంతో మీ గురువు గారు ఎవరు అని తులసి అడగ్గా.. కృష్ణుడి వైపు చూపిస్తూ.. ఆయనే మా గురువు గారు తులసి అంటాడు. దీనికి ఆశ్చర్యపోయిన తులసి నా పేరు మీకెలా తెలుసు అని అడుగుతుంది. అప్పుడాయన 'నీలో ఉన్న స్వచ్ఛత.. అమాయకత్వం చూసి నీకు అదే పేరు ఉంటుంది అని గెస్ చేశాను. ఇంతకీ నేనెవరో తెలుసా? నాపేరు అద్వైత కృష్ణ' అని చెబుతాడు. దీనికి అంటే మీరు ఫేమస్ డాక్టర్ అద్వైత కృష్ణ కదా అంటాడు ప్రేమ్.

  Bigg Boss 13th Week Nominations: ఆ ఇద్దరు తప్పా అందరూ నామినేట్.. ఆ కంటెస్టెంట్లను కాలితో తన్నడంతో!

  డాక్టర్ అని తెలవగానే తులసి కొత్తగా

  డాక్టర్ అని తెలవగానే తులసి కొత్తగా

  ప్రేమ్ అడిగిన దానికి అవును నేనే ఆ డాక్టర్‌ను అని చెబుతాడు అద్వైత కృష్ణ. దీంతో ప్రేమ్ 'మా అమ్మకు ఆరోగ్యం బాగోలేదు. తరచూ కళ్లు తిరిగి పడిపోతుంది. దీంతో డాక్టర్లు ఇక్కడకు తీసుకు వెళ్లమని చెప్పారు. అందుకే ట్రీట్‌మెంట్ కోసం ఇక్కడికి తీసుకుని వచ్చాం' అని చెబుతాడు ప్రేమ్. అద్వైత కృష్ణ డాక్టర్ అని తెలియగానే తులసి మరోసారి షాక్ అవుతుంది. 'మీరు అంత పెద్ద డాక్టర్ అయి ఉండి.. ఇంత సింపుల్‌గా ఉన్నారు. చాలా ఆశ్చర్యంగా ఉంది' అని అతడికి చెబుతుంది. దీంతో అద్వైత కృష్ణ నవ్వుతాడు. ఆ తర్వాత ప్రేమ్, తులసి అక్కడి నుంచి వచ్చేస్తారు.

  వదినలతో దివ్య ఆట... ఎంజాయ్‌గా

  వదినలతో దివ్య ఆట... ఎంజాయ్‌గా

  వెల్‌నెస్ సెంటర్‌లో ఆహ్లాదకర వాతావరణం ఉండడంతో తులసి కుటుంబ సభ్యులు అందరూ ఎంజాయ్ చేస్తుంటారు. ఇందులో భాగంగానే శృతి, అంకిత, దివ్యలు కలిసి సరదాగా స్కిప్పింగ్ చేస్తుంటారు. అప్పుడు తోడికోడళ్లు 'కమాన్ దివ్య.. ఫాస్ట్‌గా' అంటూ దివ్యను ఎంకరేజ్ చేస్తారు. అప్పుడామె మీరు కూడా స్కిప్పింగ్ చేయండి అని అడుగుతుంది. దీంతో శృతి ముందుకొచ్చి కాసేపు స్కిప్పింగ్ చేస్తుంది. ఆ తర్వాత అంకితను కూడా చేయమంటారు. కానీ, ఆమె భయపడుతుంది. దీంతో శృతి, దివ్య ఆమెలో ఉన్న భయాన్ని పోగెట్టేలా మాటలు చెబుతుంటారు.

  Janhvi Kapoor: బటన్స్ విప్పేసి రచ్చ చేసిన జాన్వీ కపూర్.. ముందుకు వంగి మరీ అందాల జాతర

   తులసిని స్కిప్పింగ్ చేయమనడంతో

  తులసిని స్కిప్పింగ్ చేయమనడంతో

  శృతి, అంకిత, దివ్యలు సరదాగా స్కిప్పింగ్ చేస్తున్న సమయంలో తులసిని తీసుకుని వస్తాడు ప్రేమ్. వాళ్లలా రాగానే 'మామ్.. ఇప్పుడే మేమంతా స్కిప్పింగ్ చేశాం. ఇప్పుడు నీ టర్న్. నువ్వు స్కిప్పింగ్ చేయ్. చాలా బాగుంటుంది మామ్. ప్లీజ్ ప్లీజ్' అని దివ్య తన తల్లిని అడుగుతుంది. కానీ, ఆమె మాత్రం అది చేయడానికి చాలా సేపు సంశయిస్తూ ఉంటుంది. ఆ సమయంలో అక్కడున్న వాళ్లంతా ఆమెను స్కిప్పింగ్ చేయాల్సిందే అంటూ తెగ పట్టుబడతారు. వాళ్ల కోరిక మేరకు తులసి స్కిప్పింగ్ చేయడానికి ముందుకు వస్తుంది. అలాగే, చేస్తూ ఉంటుంది.

  పడిపోయిన తులసి.. అభి ఆగ్రహం

  పడిపోయిన తులసి.. అభి ఆగ్రహం

  తులసి స్కిప్పింగ్ చేస్తోన్న సమయంలో నందూ, అభి అక్కడకు వస్తుంటారు. అప్పుడామెను అలా చూసి షాక్ అవుతారు. ఆ సమయంలోనే అభి 'అదేంటి మామ్ స్కిప్పింగ్ చేస్తుంది? ఈ పరిస్థితుల్లో అలా చేయకూడదు కదా. డాడ్ మనం మామ్‌ను వెంటనే ఆపాలి' అంటూ ఇద్దరూ పరుగు పరుగున అక్కడకు వస్తుంటారు. అంతలోనే తులసి మరోసారి కళ్లు తిరిగి పడిపోబోతుంటుంది. సరిగ్గా అప్పుడే అక్కడకు చేరుకున్న నందూ ఆమెను కింద పడకుండా పట్టుకుంటాడు. ఆ తర్వాత అభి అక్కడున్న వాళ్లందరిపై ఓ రేంజ్‌లో సీరియస్ అవుతాడు.

  రష్మీ, సుధీర్ బండారం బయటపెట్టిన గెటప్ శ్రీను: పెళ్లి ఎప్పుడని అడిగితే.. సీక్రెట్ లీక్ చేసి మరీ!

  Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
  డాక్టర్ లేకపోవడంతో టెన్షన్ పెరిగి

  డాక్టర్ లేకపోవడంతో టెన్షన్ పెరిగి

  తులసి కింద పడిపోవడంతో అభి 'మీకు అసలు బుద్ధి ఉందా? మామ్ పేషేంట్ అన్న విషయం మీకు తెలియదా? ఈ పరిస్థితుల్లో తనతో స్కిప్పింగ్ చేయిస్తారా' అంటూ కోప్పడతాడు. ఆ తర్వాత తులసిని తన రూమ్‌లోకి తీసుకుని వెళ్లారు. అనంతరం అభి.. డాక్టర్ సునీతకు ఫోన్ చేసి అర్జెంట్‌గా రమ్మని చెబుతాడు. అయితే, ఆమె మాత్రం తనకు రావడం కుదరదని చెబుతుంది. దీంతో వేరే డాక్టర్‌ను సంప్రదిస్తానని అభి అంటాడు. ఆ సమయంలో తులసికి ఏమవుతుందో తెలియక ఇంట్లో వాళ్లంతా తెగ టెన్షన్ పడుతూ ఉంటారు. దీంతో ఈ ఎపిసోడ్ పూర్తైపోయింది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 489: Tulasi and Prem Meet Doctor Advitha Krishna. After That Tulasi Fall Down Once Again.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X