Intinti Gruhalakshmi Today Episode: సామ్రాట్‌తో కలిసి పారిపోయిన తులసి.. అంతలోనే అనసూయ రూపంలో షాక్

దేశంలోని చాలా భాషలతో పోల్చుకుంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

Photos Courtesy: Star మా and Disney+Hotstar

మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే

మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే

మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. నందూ చేతిలో ఇంటి డాక్యూమెంట్లను పెట్టిన లాస్య.. తులసి తన పేరిట రాసిచ్చిందని చెబుతుంది. దీంతో అందరూ ఆ ఇంట్లో ఉండమని అంటారు. అప్పుడు నందూ తన తండ్రితో పాటు అందరినీ బ్రతిమాలతాడు. అదే సమయంలో తులసి కూడా వాళ్లకు సర్ధి చెబుతుంది.

దీంతో అందరూ ఇంట్లోకి వెళ్తారు.. కానీ, అనసూయ, పరందామయ్య వెళ్లరు. అప్పుడు వాళ్లను కూడా తులసి ఒప్పిస్తుంది. అనంతరం సామ్రాట్‌, తులసి కారులో వెళ్తుంటారు. ఆ సమయంలోనే ఇద్దరూ సరదాగా పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేస్తుంటారు.

సామ్రాట్‌కు పంచ్.. తులసి అలా

సామ్రాట్‌కు పంచ్.. తులసి అలా

రాత్రి సమయంలో తులసి, సామ్రాట్ మాట్లాడుతూ మాట్లాడుతూ నడుచుకుంటూ వెళ్తుంటారు. అప్పుడే ఐస్ బండి కనిపించగా సామ్రాట్ 'బాబూ ఐస్‌క్రీ టేస్ట్ ఎలా ఉంటుంది' అని అడుగుతాడు. దీనికతడు 'ఐస్‌క్రీమ్ లాగే ఉంటుంది' అంటాడు. దీంతో తులసి నవ్వుకుంటుంది.

ఆ తర్వాత ఇద్దరూ కలిసి నవ్వుకుంటారు. అనంతరం కుల్ఫీలు తీసుకుని తింటుంటారు. ఆ సమయంలో తులసి నవ్వుకుంటూ ఉండగా సామ్రాట్ ఏమైందని అడుగుతాడు. దీనికామె నా చిన్ననాటి పనులు గుర్తుకు వచ్చాయి అని చెబుతుంది. దీంతో అతడు కూడా నవ్వుకుంటాడు.

పారిపోయిన తులసి, సామ్రాట్

పారిపోయిన తులసి, సామ్రాట్

అనంతరం తులసి కుల్ఫీలకు డబ్బులు ఇచ్చారా అని సామ్రాట్‌ను అడుగుతుంది. అప్పుడతను జేబులో చూడగా పర్స్ కనిపించదు. ఇదే విషయాన్ని తులసికి చెబుతాడు. అప్పుడామె 'నాకు నా చిన్నతనం గుర్తొస్తుంది. అప్పుడు ఇలాగే ఐస్‌క్రీమ్ తిని డబ్బులు ఇవ్వకుండా పారిపోయేవాళ్లం. ఇప్పుడు అదే చేద్దాం' అంటుంది. దీంతో సామ్రాట్ షాక్ అవుతాడు. అంతేకాదు వద్దు.. బాగోదు అంటాడు. తర్వాత తులసి ఏం కాదు రండి పరిగెడదాం.

ఇదే చాన్స్ బండి అతడు మనల్ని చూడటం లేదు. లాగించేద్దాం. రెడీగా ఉండండి. ఒన్, టూ, త్రీ అంటాను అంటుంది. ఆ తర్వాత ఇద్దరూ అక్కడి నుంచి పారిపోతారు. తర్వాత తులసి డబ్బులు ఇచ్చేశాను అని నిజం చెబుతుంది. దీంతో సామ్రాట్ ఊపిరి పీల్చుకుంటాడు.

దేవుడే శిక్ష విధించాడు అంటూ

దేవుడే శిక్ష విధించాడు అంటూ

ఇక, ఇంటికి చేరిన పరందామయ్య.. ఇంకా అనసూయ గురించే ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడామె వచ్చి మిమ్మల్ని క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు అంటుంది. దీంతో పరందామయ్య 'లేచి అలా కూర్చో లేకపోతే మోకాళ్ల నొప్పులు వస్తాయి' అంటాడు. దీనికామె 'నేను ఘోరమైన పాపం చేశాను. నా పాపానికి పరిష్కారం ఏంటో.. నేను ఏం చేయాలో చెప్పండి' అని అడుగుతుంది.

దీంతో ఆయన 'నేను నిన్ను శిక్షించాల్సిన అవసరం లేదు. దేవుడే నిన్ను శిక్షించాడు. నువ్వు ఇదివరకు ఈ ఇంటి యజమానురాలివి. కానీ, ఇప్పుడు నీ పరిస్థితి ఎలా అయింది. తులసితోనే నీకు ప్రాబ్లమ్‌గా ఉండేది.. కానీ ఆ లాస్య నిన్ను మోసం చేసింది అంటాడు.

లాస్య మాయలో పడిపోయాను

అనసూయ మాటలకు పరందామయ్య 'నా మనసు నాతో పాటు ఇక్కడికి రాలేదు. ఈ ఇల్లు నాకు కాటేయడానికి వెంటపడుతున్న దురదృష్టంలా అనిపిస్తోంది. అసలు మన ఇల్లు అనే భావనే రావడం లేదు. ఈ ఇల్లు ఇల్లులాగానే అనిపించడం లేదు' అంటాడు. దీనికామె 'నాకు నేను చాలా తెలివైన దాన్ని. అన్నీ తెలుసు అనుకునే దాన్ని. నిజంగా తెలివే ఉండి ఉంటే లాస్య మాయలో ఎందుకు పడతాను' అని బాధపడుతుంది. దీనికాయన అయిపోయిందేదో అయిపోయింది. బాధ పెరగడం తప్ప మనం చేసేది ఏం ఉండదు అని అలా వెళ్లిపోబోతుంటాడు.

 కింద పడిపోయిన అనసూయ

కింద పడిపోయిన అనసూయ

పరందామయ్య వెళ్లబోతుండగా అనసూయ 'మీరు క్షమించరని తెలుసు అయినా కూడా రోజూ క్షమించమని అడుగుతూనే ఉంటాను. రోజూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటూనే ఉంటాను. ఏదో ఒక రోజు మీరు నన్ను క్షమిస్తారని చిన్న ఆశ. వెళ్లొద్దండి' అంటుంది. కానీ, ఆయన మాత్రం ఆమెను విదిలించుకుని అక్కడి నుంచి వెళ్లపోబోతుంటాడు. ఇంతలో అనసూయ స్పృహ తప్పి కింద పడిపోతుంది. దీంతో పరందామయ్య గట్టిగా 'అనసూయ' అంటూ అరుస్తాడు. దీంతో ఇంట్లో ఉన్న వాళ్లందరూ అక్కడకు చేరుకుని ఆమెను పైకి లేపి మంచం మీద పడుకోబెడతారు.

తులసికి ఫోన్ చేసి చెప్పడంతో

తులసికి ఫోన్ చేసి చెప్పడంతో

ఇక, తులసి.. సామ్రాట్ వెళ్తుండగా మెకానిక్ కారు తీసుకుని వస్తాడు. దీంతో సామ్రాట్ వెళ్లిపోతాడు. అప్పుడు తులసికి ప్రేమ్ ఫోన్ చేసి అనసూయ పడిపోయిన విషయం చెబుతాడు. దీంతో తులసి వస్తున్నా అంటూ బయలుదేరుతుంది. మరోవైపు, నందూ కంగారు అమ్మా ఏమైంది అంటాడు. దీనికి పరందామయ్య కళ్లు తిరిగి పడిపోయింది అంటాడు. అప్పుడు అంకిత, అభి కలిసి ఆమెకు ఇంజక్షన్ చేస్తారు. ఇంతలో తులసి అక్కడకు వస్తుంది. అత్తయ్య అత్తయ్య అని అంటుంది. తర్వాత భయపడాల్సింది ఏం లేదు కదా అని అభిని అడగ్గా ఏం పర్లేదు అంటాడు.

లాస్యకు షాక్... తులసికి సారీ

లాస్యకు షాక్... తులసికి సారీ

ఆ తర్వాత తులసిని అనసూయ పిలుస్తుంది. దగ్గర కూర్చోబెట్టుకుని ఏదో చెప్పబోతుంది. అంతలో లాస్యను బయటకు వెళ్లిపోమని అంటుంది. దీనికి షాకైన ఆమె నన్ను ఎందుకు బయటికి వెళ్లమంటున్నారు అంటుంది. దీంతో నందూ కోపం అమ్మ మాట అర్థం చేసుకో అంటాడు. దీనికి లాస్య 'మరి తులసి ఎందుకు వచ్చింది. తను పరాయిమనిషి కదా. తను ఎందుకు వచ్చింది. ఒక పరాయి మనిషితో మాట్లాడటానికి కోడలును బయటికి పంపించడం ఏంటి. మర్యాదల గురించి మాట్లాడే పెద్దవాళ్లు మౌనంగా ఉండటం ఏంటి' అంటుంది. ఆ తర్వాత తప్పు చేశానని, క్షమించమని బాధతో అడుగుతుంది. మేమంతా చిన్నవాళ్లం మీరు చేతులు జోడించడం ఏంటి అని తులసి అడుగుతంది. తర్వాత ధైర్యం చెబుతుంది. ఇలా ఈ ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X