twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Intinti Gruhalakshmi Today Episode: ఫలించిన తులసి ప్రయత్నం.. ఆమె మాటకు ఒప్పుకున్న నందూ

    |

    దాదాపు రెండు మూడు దశాబ్దాలుగా తెలుగు బుల్లితెరపై వచ్చే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరూ చూడండి!

    Photos Courtesy: Star మా and Disney+Hotstar

    మంగళవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

    మంగళవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

    మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. సహాయం చేయమంటూ జీకే దగ్గరకు వెళ్లిన నందూను ఆయన అవమానించేలా మాట్లాడతాడు. అంతేకాదు, వెళ్లి తులసి కాళ్లు పట్టుకో అప్పుడు ఆలోచిస్తాను. ఒకవేళ నువ్వు ఆ పని చేయలేనంటూ ఇక్కడి నుంచి వెళ్లిపో అంటాడు. అనంతరం తులసితో ఈ ఇళ్లు ముక్కులు కాబోతుంది అంటూ లాస్య భయపెట్టేలా మాట్లాడుతుంది. కానీ, తులసి కూడా ధీటుగానే బదులిస్తుంది. అనంతరం శృతిని అంకిత మరింత అవమానిస్తుంది. అనంతరం దివ్యపై నందూ ఫైర్ అవుతాడు. ఆ తర్వాత వచ్చి కూతురికి సారీ చెబుతాడు.

    అరాచకమైన హాట్ ఫొటోను వదిలిన విష్ణుప్రియ: ఆమెను ఈ ఘాటు ఫోజులో చూస్తే అస్సలు తట్టుకోలేరుఅరాచకమైన హాట్ ఫొటోను వదిలిన విష్ణుప్రియ: ఆమెను ఈ ఘాటు ఫోజులో చూస్తే అస్సలు తట్టుకోలేరు

    తులసికి సాయం చేసేందుకు జీకే రెడీ

    తులసికి సాయం చేసేందుకు జీకే రెడీ

    నందూ తన ఇంటికి వచ్చిన విషయాన్ని వెల్లడించేందుకు తులసికి ఫోన్ చేస్తాడు జీకే. ఆ సమయంలో నందూతో తాను వ్యవహరించిన తీరును వివరిస్తాడు. అప్పుడు తులసి 'ఆయన మీ ఇంటికి వస్తే డబ్బు విషయంలో ఎంకరేజ్ చేయకండి' అని చెబుతుంది. అప్పుడు జీకే 'నువ్వు చెప్పినట్లే చేస్తాను కానీ.. అంత పెద్ద సమస్యను ఒంటి చేత్తో ఎలా డీల్ చేస్తున్నావమ్మా. ఏదైనా సహాయం కావాలంటే అడుగు. నీ ఆత్మాభిమానం గురించి నాకు తెలుసు. కానీ అన్నయ్యగా చెబుతున్నా' అని అంటాడు. దీనికి తులసి ఎంతో మురిసిపోతూ సరే అంటూ కన్నీరు పెట్టుకుంటుంది.

    మామయ్యకు బాధను తులసి చెప్పుకుని

    మామయ్యకు బాధను తులసి చెప్పుకుని

    జీకే ఫోన్‌లో మాట్లాడిన తర్వాత పరిస్థితిని ఊహించుకుంటూ తెగ బాధ పడుతుంటుంది తులసి. ఆ సమయంలో పరందామయ్య అక్కడకు వస్తాడు. వచ్చీ రావడమే 'ఏంటమ్మా తులసి ఎందుకు నీలో నువ్వే బాధ పడుతున్నావు' అంటూ ప్రశ్నిస్తాడు. దీంతో ఆమె జీకేతో మాట్లాడిన విషయాన్ని ఆయనకు చెబుతుంది. అప్పుడాయన 'ఛీ వాడికి సిగ్గుందా? మళ్లీ జీకే దగ్గరకు ఏ ముఖం పెట్టుకుని వెళ్లాడు?' అంటూ తిడుతుంటాడు. దీంతో తులసి కలుగజేసుకుని 'ఆయనను తిట్టకండి మామయ్య. అవసరాలు ప్రభావం చేస్తుండడంతో ఇలా చేస్తున్నారు' అని అంటుంది.

    షర్ట్ విప్పేసి బ్రా తీసేసి అషు రెడ్డి రచ్చ: హాట్ షోలో హద్దు దాటేసి.. మరీ ఇలా చూపిస్తారా!షర్ట్ విప్పేసి బ్రా తీసేసి అషు రెడ్డి రచ్చ: హాట్ షోలో హద్దు దాటేసి.. మరీ ఇలా చూపిస్తారా!

    తల్లిని వెనకేసుకొచ్చి అంకితకు షాకిచ్చి

    తల్లిని వెనకేసుకొచ్చి అంకితకు షాకిచ్చి

    జీకే తులసితో మాట్లాడిన విషయాన్ని తెలుసుకున్న అంకిత తన రూమ్‌లోకి వస్తుంది. అప్పుడు 'ఛీఛీ అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. చేతికి వచ్చిన అవకాశాలను వదులుకుంటున్నారు' అని అరుస్తుంటుంది. అప్పుడు ఏమైందని ప్రశ్నించిన అభికి విషయం చెబుతుంది. దీంతో అభి 'మామ్ కరెక్టుగానే చేస్తుంది. ఆ జీకే దగ్గర డబ్బు తీసుకుంటే అది పర్మినెంట్ సొల్యూషన్ అవుతుందా? అందుకే మామ్ పట్టుదలతో ఉంది. అదే ఆమె ఆయుధం. ఇవన్నీ ఆలోచించి నీ బుర్ర పాడు చేసుకోకు' అంటూ తల్లి వైపు మాట్లాడి షాకిస్తాడు.

    మీరు విడాకులు ఇచ్చింది నాకే అంటూ

    మీరు విడాకులు ఇచ్చింది నాకే అంటూ

    లాస్య, నందూ మాట్లాడుతుండగా తులసి వచ్చి 'ఏమండి క్లైంట్స్ ఫోన్ చేశారు? ప్రాజెక్టు స్టేటస్ ఏంటి అని అడుగుతున్నారు' అని చెబుతుంది. దీనికి నందూ 'నాకు ఆ ప్రాజెక్టుతో పని లేదు. నువ్వు నన్ను అడిగి ప్రాజెక్టు ఒప్పుకున్నావా? నన్ను అడిగి ఉద్యోగులతో మాట్లాడావా? ఇప్పుడు నేనెందుకు ప్రాజెక్టు గురించి మాట్లాడాలి' అని ప్రశ్నిస్తాడు. దీనికి తులసి 'మీరు విడాకులు ఇచ్చింది నాకే.. మీ ప్రాజెక్టుకు కాదు. దాన్ని ఒప్పుకుంది మీరు.. పూర్తి చేయాల్సింది కూడా మీరే. ఒకవేళ చేయకపోతే నష్టపోయేది కూడా మీరే మీరే' అంటూ అతడిని రెచ్చగొడుతుంది.

    బెడ్‌రూంలో లవర్‌తో శృతి హాసన్ సరసాలు: ఏకంగా అతడి మీద పడుకుని.. వామ్మో ఇది మహా దారుణం!బెడ్‌రూంలో లవర్‌తో శృతి హాసన్ సరసాలు: ఏకంగా అతడి మీద పడుకుని.. వామ్మో ఇది మహా దారుణం!

    నందూను సూటిగా ప్రశ్నించిన తులసి

    నందూను సూటిగా ప్రశ్నించిన తులసి

    ఎంత చెప్పినా నందూ వినకపోయే సరికి తులసి మరింత రెచ్చగొట్టాలని చూస్తుంది. అప్పుడామె 'పెళ్లైన కొత్తలో ఎలా ఉండేవాళ్లు? ఎవరి మాటా వినేవాళ్లు కాదు. ఆ చురుకుదనం ఏమైంది? నాతో విడాకులు తీసుకోగానే ఎందుకు డల్ అయ్యారు? తప్పు చేశానని భయమా? నాతో మనసు విప్పి మాట్లాడడానికి మొహమాటమా? మీరు మారిపోయారు. మీ కళ్లలో పిరికిదనం కనిపిస్తోంది' అని మాట్లాడుతుంది. దీంతో నందూ 'నేను మారలేదు. అది నిరూపించాలంటే ఏం చేయాలి' అని అంటాడు. దీనికి ప్రాజెక్టు పూర్తి చేయమంటుంది. దీనికి నందూ ఒకే చెప్పేస్తాడు.

    నేను విడాకులు వెనక్కి తీసుకోమనలేదు

    నేను విడాకులు వెనక్కి తీసుకోమనలేదు

    తులసి మాటలకు రెచ్చిపోయిన నందూ ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఒప్పుకుంటాడు. ఆ సమయంలో లాస్య 'నందూ నందూ నువ్వు కామ్‌గా ఉండు. ఆమె నిన్ను రెచ్చగొడుతుంది. దానికి నువ్వు ఓకే చెప్పకు' అంటూ సర్ధి చెప్పే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు నందూ 'ఆగు లాస్య నా సత్తా ఏంటో చూపించుకుంటా' అని అంటాడు. అప్పడు తులసి 'నేనేమీ ఆయనను రెచ్చగొట్టడం లేదు. నేనేమీ విడాకులు వెనక్కి తీసుకోమనలేదే. ప్రాజెక్టు పూర్తి చేయమన్నా అంతే' అంటుంది. అప్పుడు నందూ ప్రాజెక్టు పూర్తి చేస్తే నేను చెప్పింది చేయాలి అని కండీషన్ పెడతాడు.

    హాట్ ఫొటోలతో షాకిచ్చిన అమలా పాల్: డ్రెస్ ఉన్నా లేనట్లే అందాల విందు.. ఆమెనిలా ఎప్పుడూ చూసుండరు!హాట్ ఫొటోలతో షాకిచ్చిన అమలా పాల్: డ్రెస్ ఉన్నా లేనట్లే అందాల విందు.. ఆమెనిలా ఎప్పుడూ చూసుండరు!

     తల్లి కోసం బాధ్యతను తీసుకున్న ప్రేమ్

    తల్లి కోసం బాధ్యతను తీసుకున్న ప్రేమ్

    ప్రాజెక్టు పూర్తి చేయడానికి నందూ ఒప్పుకోవడంతో ప్రేమ్, శృతి ఎంతో సంతోషంగా ఉంటారు. ఆ సమయంలో 'అమ్మ నాన్న విడాకులు తీసుకున్నా ఒకే ఇంట్లో ఉన్నారు. విధి వాళ్లను విడగొట్టకుండా చూస్తుందని అనిపిస్తుంది. అమ్మ మన కోసం ఎంతో కష్ట పడుతుంది. దీంతో మనం కూడా తనకు ఏదో ఒకటి చేయాలి. అందుకే శశికళ దగ్గర చేసిన అప్పును తీర్చేద్దాం అని అనుకుంటున్నా' అంటాడు. దీనికి శృతి కూడా ఓకే చెబుతుంది. ఆ తర్వాత ఇద్దరూ కాసేపు సరసాలు ఆడుకుంటారు. దీంతో ఈరోజు ఎపిసోడ్ పూర్తైపోయింది.

    English summary
    Intinti Gruhalakshmi Episode 467: Nandhu Challenges Tulasi to Submit the Project on Time. After That Shruthi and Prem Enjoyed.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X