For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: తులసి కోసం శృతి పెద్ద త్యాగం.. నిజం చెప్పి అవమానించిన అంకిత

  |

  మిగిలిన భాషలతో పోల్చుకుంటే తెలుగు బుల్లితెరపై వచ్చే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరూ చూడండి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. నందూ తన ఇంటికి వచ్చినప్పుడు జరిగిన విషయాలను గురించి చెప్పడం కోసం తులసికి జీకే ఫోన్ చేస్తాడు. అంతేకాదు, ఏదైనా సహాయం కావాలంటే అడగమని చెబుతాడు. అనంతరం ఇదే విషయం గురించి అంకిత, అభి మధ్య డిస్కర్షన్ జరుగుతుంది. ఆ తర్వాత ప్రాజెక్టును సరైన టైమ్‌లో పూర్తి చేయమని నందూకు చాలెంజ్ విసురుతుంది తులసి. ఆ సమయంలో ఇద్దరి మధ్య పెద్ద వాదన జరుగుతుంది. లాస్య మధ్యలో కలుగుజేసుకున్నా నందూ ఆగడు. ఇక చివర్లో కొత్త జంట శృతి, ప్రేమ్ సరసాలాడుకుంటూ ఉంటారు.

  షర్ట్ విప్పేసి బ్రా తీసేసి అషు రెడ్డి రచ్చ: హాట్ షోలో హద్దు దాటేసి.. మరీ ఇలా చూపిస్తారా!

  తులసి ఆటలో అరటిపండు మాత్రమే

  తులసి ఆటలో అరటిపండు మాత్రమే

  తులసితో జరిగిన డిస్కర్షన్ తర్వాత నందూ తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. అంతలో అతడి దగ్గరకు వెళ్లిన లాస్య ‘ఇన్ని రోజులు నువ్వేదో పెద్ద గ్రేట్ అనుకున్నా.. పెద్ద తెలివైన వాడివి అనుకున్నా కానీ.. ఆ తులసే నీకంటే తెలివైనది. తనే నిన్ను ఆడిస్తుంది' అని అంటుంది. దీనికి నందూ కోపంతో ఊగిపోతాడు. అంతేకాదు, ‘తులసి ఎన్ని నాటకాలు ఆడినా నేనేమీ నమ్మను. తను మన కంపెనీలో వాచ్‌మెన్ లాంటిది. తులసి ఆటలో అరటిపండు మాత్రమే. నన్ను చాలా సార్లు అవమానించింది. ఇప్పుడు ఆ పగ తీర్చుకుంటా' అంటూ లాస్యతో చెబుతాడు.

  తులసికి మరో టెన్షన్... డబ్బుల కోసం

  తులసికి మరో టెన్షన్... డబ్బుల కోసం

  ప్రాజెక్టును పూర్తి చేయడానికి నందూ ఒప్పుకున్న తర్వాత పరందామయ్య.. తులసి మధ్య చర్చ జరుగుతుంది. ఆ సమయంలో అతడు ‘నందూను బాగానే పడేశావమ్మా.. నీ తెలివితో బాగా ఒప్పించావ్. మరి డబ్బుల గురించి ఎలా ప్లాన్ చేశావ్' అని అడుగుతాడు. అప్పుడు తులసి తన ఫ్యాక్టరీ మేనేజర్‌కు ఫోన్ చేసి కంపెనీ అకౌంట్ నుంచి ఐదు లక్షల రూపాయలు డ్రా చేయమని అడుగుతుంది. అయితే, అకౌంట్‌లో రెండు లక్షల రూపాయలు ఖర్చు అయ్యాయని చెబుతాడు. దీంతో తులసికి డబ్బు సర్ధుబాటు కాక టెన్షన్ పడుతుంది. దీన్ని శృతి వెనుక నుంచి చూస్తుంది.

  బెడ్‌రూంలో లవర్‌తో శృతి హాసన్ సరసాలు: ఏకంగా అతడి మీద పడుకుని.. వామ్మో ఇది మహా దారుణం!

  తులసికి కోసం త్యాగానికి శృతి సిద్ధం

  తులసికి కోసం త్యాగానికి శృతి సిద్ధం

  తన తల్లి గుర్తుగా ఉంచుకున్న నెక్లెస్‌ను చూస్తూ ‘కష్టం చెప్పుకోడానికి దీన్ని చేతుల్లోకి తీసుకోలేదు. కష్టం వచ్చిందని తీసుకున్నాను. నువ్వు నా అమ్మవు. కానీ, తులసి ఆంటీ నన్ను తల్లిలా చూసుకుంటున్న అమ్మ. ఏ తల్లి తన బిడ్డ కష్టాన్ని చూడలేదు. అలాగే, బిడ్డ కూడా తల్లి బాధను కూడా చూడలేదు. కానీ, తులసి ఆంటీ మాత్రం ఈరోజు బాధతో కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అందుకే ఆమె కష్టాన్ని పంచుకోవాలని అనుకుంటున్నాను. అందుకు నీ సహాయం తీసుకోవాలని అనుకుంటున్నా. ఏమీ అనుకోవు కదమ్మా. నన్ను క్షమిస్తావు కదా' అని అంటుంది శృతి.

  శృతి నిర్ణయాన్ని వ్యతిరేకించిన ప్రేమ్

  శృతి నిర్ణయాన్ని వ్యతిరేకించిన ప్రేమ్

  శృతి తన తల్లి నెక్లెస్ తాకట్టు పెట్టడానికి రెడీ అవగా.. ప్రేమ్ మాత్రం దానికి ఒప్పుకోడు. ఆ సమయంలో ‘ఆంటీ మన కోసం ఎంత సాహసం చేశారో తెలుసు కదా. అలాంటి ఆమె ఇప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు మనం సహాయం చేస్తే తప్పేంటి ప్రేమ్. అయినా.. ఈ నెక్లెస్ తాకట్టు పెడుతున్నామని మనం చెప్పొద్దు. వేరే ఎక్కడి నుంచో తెచ్చామని చెబుదాం' అని అంటుంది. కానీ, ప్రేమ్ మాత్రం దీనికి నిరాకరిస్తాడు. అలాంటి సమయంలో శృతి ప్రేమ్‌కు చాలా విధాలుగా నచ్చజెప్పి ఒప్పిస్తుంది. దీంతో అతడు కూడా దీనికి ఒకే చెప్పి తాకట్టు పెట్టడానికి బయలుదేరుతాడు.

  బ్రా కూడా లేకుండా షాకిచ్చిన నందినీ రాయ్: ఈ హాట్ వీడియో చూస్తే అస్సలు తట్టుకోలేరు!

  అంకిత మరో ప్లాన్.. నిరాకరించిన అభి

  అంకిత మరో ప్లాన్.. నిరాకరించిన అభి

  ఇంట్లో ఫోన్ మాట్లాడుకుంటోన్న అభి దగ్గరకు పరుగు పరుగున వస్తుంది అంకిత. అప్పుడు ‘అభి నువ్వు మా ఇంటికి వెళ్లి.. మామ్ ఇచ్చే రెండున్నర లక్షలు తీసుకుని రా' అని అంటుంది. దీనికి ‘నేను మీ ఇంటికి వెళ్లడం ఏంటి? డబ్బుల తీసుకు రావడం ఏంటి? ఆమె నన్ను ఎన్నిసార్లు అవమానించిందో తెలుసు కదా' అంటాడు. అప్పుడు అంకిత.. తులసి పరిస్థితిని అతడికి వివరిస్తుంది. దీంతో మళ్లీ ఇచ్చేద్దాం అని కండీషన్ పెట్టి వెళ్తాడు. ఆ తర్వాత ‘ఆంటీకి సహాయం చేయడానికి కాదు అభి.. శృతిని కంటే గొప్ప అని చెప్పించుకోడానికి' అని అంటుంది అంకిత.

  శృతి, ప్రేమ్‌ను బుక్ చేసేసిన అంకిత

  శృతి, ప్రేమ్‌ను బుక్ చేసేసిన అంకిత

  నెక్లెస్ తాకట్టు పెట్టి వచ్చి తులసికి డబ్బులు ఇవ్వబోతాడు ప్రేమ్. దీంతో యాభై వేలు ఎక్కడివి అంటూ ఆమె ప్రశ్నిస్తుంది. అంతలో శృతి అబద్ధం చెప్పబోగా.. అంకిత ఎంట్రీ ఇస్తుంది. అప్పుడు అసలు విషయం ఆమెకు చెప్పేస్తుంది. దీనికి తులసి ‘నాకోసం మీ అమ్మ నెక్లెస్ తాకట్టు పెట్టాలా? నేనేమైనా అడిగానా' అని ప్రశ్నిస్తుంది. అప్పుడు అంకిత ‘అయ్యో ఆంటీ వాళ్లనేమీ అనకండి. మీ మీద ఉన్న ప్రేమతో అలా చేశారు. శృతి ఆ యాభై వేలు తీసుకెళ్లి.. మీ అమ్మ నెక్లెస్ తీసుకొచ్చుకో' అని అంటుంది. ఆ తర్వాత అభి తెచ్చిన రెండున్నర లక్షలు తులసికి ఇస్తుంది.

  Disha Patani: బీచ్‌లో బికినీలో రెచ్చిపోయిన దిశా పటానీ.. అసలే తడిచిన అందాలు.. అలా పడుకోవడంతో!

  Recommended Video

  Nayanthara ఫోటో కి ఫోజ్ ఇచ్చిందా..? అంటూ నెటిజన్ల అనుమానాలు!! || Filmibeat Telugu
  శృతి, ప్రేమ్‌ను అవమానించిన అంకిత

  శృతి, ప్రేమ్‌ను అవమానించిన అంకిత


  ఆస్పటల్‌లో లోన్ తీసుకొచ్చాము అని అబద్ధం చెప్పి తులసికి రెండున్నర లక్షలు ఇస్తుంది అంకిత. ఆ తర్వాత ‘పాపం ప్రేమ్.. మీకు సహాయం చేయాలని ఉన్నా చిన్న ఉద్యోగం కదా. అడపాదడపా పాటలు పాడితే డబ్బులు వస్తాయి లేకుంటే లేదు' అని అవమానిస్తుంది. దీంతో ప్రేమ్ డల్ అయిపోతాడు. అప్పుడు తులసి అర్థం చేసుకుని ‘ప్రేమ్ ఎంత సంపాదించినా పైసా కూడా ఉంచుకోకుండా నాకే ఇస్తున్నాడు' అని చెప్తుంది. ఆ తర్వాత పరందామయ్య అభిని నిందిస్తాడు. దీంతో కుటుంబంలో చిన్న వాదన మధ్య ఈరోజు ఎపిసోడ్ పూర్తైపోయింది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 468: Shruthi Decieds to Help Tulasi After Overhearing her Words. Then Ankitha Insults Shruthi and Prem.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X