For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: తులసికి సామ్రాట్ సర్‌ప్రైజ్ గిఫ్ట్.. తప్పు చేశానని ఏడ్చిన నందూ

  |

  ఇండియాలోని చాలా భాషల కంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే చూడండి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే

  మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే

  మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తులసి బయటకు వెళ్లిపోయిన తర్వాత మాధవి పుట్టింటికి వస్తుంది. వచ్చీ రావడమే నందూ, లాస్య, అనసూయలతో ఆమె గొడవలు పెట్టుకుంటుంది. ఆ సమయంలో తులసిని వెనకేసుకు వస్తూ మాట్లాడడంతో నందూ తన రుణం తీర్చుకోమని మాధవిపై ఫైర్ అవుతాడు. దీంతో ఆమె తన దగ్గర ఉన్న డబ్బులను అతడి అకౌంట్‌లోకి వేసేస్తుంది. మరోవైపు, సామ్రాట్, తులసిని తీసుకుని ఓ ఇంటికి వెళ్తాడు. అది ఆమెకు బాగా నచ్చుతుంది. అలాగే, ఓనర్ మాటలు కూడా నచ్చుతాయి. దీంతో ఆ ఇంట్లోకి వస్తానని తులసి చెబుతుంది.

  నోయల్‌పై ఎస్తర్ సంచలన వ్యాఖ్యలు: పెళ్లైన 16 రోజులకే అలా.. అక్కడ యాసిడ్ పోస్తానన్నాడు అంటూ!

  తులసికి సామ్రాట్ సర్‌ప్రైజ్ గిఫ్ట్

  తులసికి సామ్రాట్ సర్‌ప్రైజ్ గిఫ్ట్

  ఇల్లు చూసుకున్న తర్వాత తులసి సంతోషంగా ఉంటుంది. అప్పుడు సామ్రాట్ ఆమెకు ఓ గిఫ్ట్ ఇస్తాడు. దీనికామె 'నాకు మీ స్నేహం చాలు వేరే ఏ బహుమతి అవసరం లేదు' అని అంటుంది. దీంతో సామ్రాట్ 'స్నేహానికి మించిన బహుమతి లేదు. కాదని అనను. కానీ ఇది మన స్నేహానికి గుర్తు మాత్రమే. ఇప్పుడు మీ అనుమానం ఏంటి? ఖరీదైన బహుమతి అనా? ఇది ఖరీదైనది కాదు.. విలువైనది. బాక్స్ ఓపెన్ చేసి చూస్తే మీకే తెలుస్తుంది' అంటాడు. దీంతో తులసి బాక్స్ ఓపెన్ చేయగా.. అందులో ఆమె పేరుతో కీ చైన్ ఉంటుంది. అది చూసి తులసి తెగ మురిసిపోతుంది.

  తులసి హ్యాపీ.. సామ్రాట్ తృప్తిగా

  తులసి హ్యాపీ.. సామ్రాట్ తృప్తిగా

  ఆ తర్వాత ఆ గిఫ్ట్ నచ్చిందా అని సామ్రాట్ తులసిని అడుగుతాడు. దీనికామె నా కళ్లలోకి చూస్తే తెలియడం లేదా అని అంటుంది. అప్పుడు సామ్రాట్ మీ కళ్లల్లోకి చూస్తే తెలుస్తుంది తులసీ.. కానీ మీ నోటి నుంచి ఆ మాట వింటే అదో సంతృప్తి అంటాడు. దీంతో తులసి చాలా బాగుంది థాంక్స్ అంటుంది. దీనికి సామ్రాట్ 'పాతికేళ్ల సంతోషాన్ని అత్తింట్లో వదిలేసి గడప దాటారు. కొత్త సంతోషాల కోసం ప్రయాణం మొదలెట్టారు. ఈ ఇల్లు మొదటి సంతోషం. గెలుపు ప్రయాణంలో మొదటి అడుగు వేశారు. ఈ ఇల్లు సంతోష నిలయం కావాలి. అందుకే ఈ ఇంటి కీని పెట్టుకునే చైన్‌ను ప్రజెంట్ చేశాను' అని అంటాడు. ఆ తర్వాత ఇంటి తాళాలను ఆ కీచైన్‌కి పెట్టి తులసి చేతిలో పెడతాడు.

  హాట్ షోతో షాకిచ్చిన రమ్యకృష్ణ: చీర ఉన్నా లేనట్లే యమ ఘాటుగా!

  నా మనసుతో మాట్లాడండి అని

  నా మనసుతో మాట్లాడండి అని

  ఆ తర్వాత తులసి 'ఈ ఇల్లు దొరుకుతుంది అని మీరు చెప్పారు. నాకు దొరికేసింది. నేను ఏదైనా కన్ఫ్యూజన్‌లో ఉన్నప్పుడు మీ మనసు సహాయం తీసుకోవచ్చు కదా' అని తులసి అడుగుతుంది. దీంతో సామ్రాట్ నన్ను అడుగుతారేంటి అని అంటాడు. అప్పుడామె మరి ఎవర్ని అడగాలి అని ప్రశ్నిస్తుంది. దీంతో నా మనసుని అడగండి అని అంటాడు. అప్పుడామె మీ మనసు నాతో మాట్లాడుతుందా? అని అడగ్గా.. మాట్లాడి చూడండి.. మీకే తెలుస్తుంది అని సామ్రాట్ బదులిస్తాడు. ఆ తర్వాత మనిద్దరం వచ్చినందుకే ఇల్లు దొరికిందని సామ్రాట్ అంటాడు.

  ఆటోలోనే షాపింగ్‌కు వెళ్లడంతో

  అనంతరం తులసి షాపింగ్‌కు వెళ్తానని అంటుంది. దీంతో సామ్రాట్ కారులో వెళ్దాం అనగా.. వద్దని ఆటో ఎక్కిస్తుంది. అప్పుడు ఆటో ఎందుకు కారు ఉందిగా అని అతడు అంటాడు. దీనికి తులసి 'నేను కారులో వెళ్లేంత కాస్ట్లీ షాపింగ్ చేయను సామ్రాట్ గారు. ఒకవేళ కారులో వెళ్తే వంద రూపాయలది కూడా వేయి రూపాయలకు కొనాలి. ప్రతి ఒక్కరూ ఎక్కువ రేట్లు చెబుతారు' అని అంటుంది. దీంతో సామ్రాట్ నిజమే అంటాడు. అప్పుడామె 'ఏం పర్లేదు.. మిమ్మల్ని ఇలా సూటు బూటులో చూసినా ఎక్కువ రేటు చెప్తారు' అని అంటుంది. దీంతో సామ్రాట్ అవాక్కవుతాడు.

  బట్టలు మొత్తం విప్పేసి శ్రీయ దారుణం: ఈ వీడియోలో ఆమెను చూశారంటే!

  సామ్రాట్‌లో ఆకర్షణ ఉందటూ

  సామ్రాట్‌లో ఆకర్షణ ఉందటూ

  ఆటో ప్రయాణిస్తోన్న సమయంలో సామ్రాట్‌పై తులసి, తులసిపై సామ్రాట్ ప్రశంసల జల్లు కురిపించుకుంటూ వెళ్తారు. ఆ సమయంలో తులసి 'మీలో ఏం ఆకర్షణ ఉంది. అందుకే అందరి చూపులు మీపైనే. మొన్న గుడికి వెళ్లినప్పుడు అక్కడ ఇద్దరు అమ్మాయిలు చూసి మిమ్మల్ని ఏమన్నారో మర్చిపోయారా' అని అంటుంది. దీంతో సామ్రాట్ ఆమె నోటితో చెప్పించుకోవడం కోసం ఏమన్నారో మీరే చెప్పండి అంటాడు. దీంతో తులసి 'అబ్బా ఏం ఉన్నాడే. ఆయన ఒప్పుకుంటే ఇప్పటికిప్పుడు గుడిలో తాళి కట్టించుకుంటాను' అని చెప్తుంది. దీంతో అతడు మురిసిపోతాడు.

  లాస్యపై ఫైర్ అయిన నందూ

  లాస్యపై ఫైర్ అయిన నందూ

  ఇక, నందూ ఇంట్లో కూర్చుని మాధవిని అన్న మాటలను తలుచుని బాధపడుతుంటాడు. అప్పుడు 'ఈ లోకంలో ఏ అన్న అయినా చెల్లెలికి ఖర్చు పెట్టిన డబ్బును తిరిగి ఇవ్వమని అడుగుతాడా? దౌర్భాగ్యమైన పనిచేశాను. కన్నీళ్లు పెట్టించాను. డబ్బులు అడిగేసరికి తన అకౌంట్‌లో ఉన్న డబ్బును నా అకౌంట్‌లోకి కొట్టేసింది' అని లాస్య, అనసూయల ముందు కన్నీళ్లు పెట్టుకుంటాడు. దీంతో లాస్య 'రెచ్చగొట్టింది ఆవిడే కదా.. నిన్ను పురుగులా తీసి పారేసింది. మీ చెల్లి పంపిన డబ్బు ఉండనివ్వు. ఖర్చులకు పనికొస్తుంది. ఎలాగూ మనకి ఉద్యోగాలు లేవు కదా' అని అంటుంది. అప్పుడు నందూ నువ్వు ఇలా మాట్లాడే నన్ను దిగజారుస్తున్నావ్ అని ఫైర్ అవుతాడు. దీంతో అనసూయ వచ్చి తులసి వల్లే ఇలా జరిగిందని తిడుతుంది.

  వాష్ రూమ్‌లో హాట్‌గా తెలుగు పిల్ల డింపుల్: టైట్ ఫిట్‌లో ఆ ఫోజు చూస్తే మెంటలే

  తులసి క్లాస్.. మోసిన సామ్రాట్

  తులసి క్లాస్.. మోసిన సామ్రాట్

  షాపింగ్‌కు వెళ్లిన సమయంలో తులసి వాళ్లు ప్రమిదలు కొనేందుకు ఓ కొట్టు దగ్గరకు వెళ్తారు. అక్కడ ఓ రిచ్ అమ్మాయి వాటిని బేరం ఆడుతూ ఉంటుంది. అప్పుడు తులసి ఎంట్రీ ఇచ్చి ఆమెకు ఓ రేంజ్‌లో క్లాస్ పీకుతుంది. అనంతరం తులసి, సామ్రాట్ అవి కొని ఎక్కువ డబ్బులు ఇస్తారు. దీంతో ఆ షాప్ అమ్మాయి సంతోషిస్తుంది. అనంతరం తులసి కొన్న వస్తువులను సామ్రాట్ మోసుకుంటూ వస్తుంటాడు. అలా ఇంటికి వచ్చే సరికి అక్కడ ప్రేమ్, శృతి, అంకిత, దివ్యలు వేచి చూస్తూ ఉంటారు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 785: Samrat Gives Surprise Gift To Tulasi. Then They Went to Shopping. After That Nandhu Fires on Lasya about Tulasi Issue.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X