For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: అందరి ముందే నిజం చెప్పిన హనీ.. తులసికి ఘోర అవమానం

  |

  దాదాపు రెండు దశాబ్దాలుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' మంగళవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే చూడండి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  సోమవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  సోమవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  సోమవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తులసి ఫ్యామిలీ మొత్తం గుడికి వెళ్తుంది. అక్కడకు లాస్య, నందూ, లక్కీలు వస్తారు. దీంతో వాళ్లు తన కోసమే వచ్చారని అనసూయ చెప్తుంది. ఆ తర్వాత లాస్య.. అత్తమామలకు అర్చన చేయిస్తుంది. అనంతరం శృతి, అంకిత తల్లులు కావాలని కోరుకుంటూ చెట్టుకు ముడుపులు కడతారు. అనంతరం తులసి వాళ్ల కాలనీలో బతుకమ్మ సంబరాలు ప్రారంభం అవుతాయి. ఆ సమయంలో హనీని వాడుకుని సామ్రాట్‌ను అక్కడకు రప్పించాలని లాస్య ప్లాన్ చేస్తుంది. అందుకు తగ్గట్లుగానే హనీని రెచ్చగొట్టి సామ్రాట్‌కు ఫోన్ చేయిస్తుంది.

  బ్రాతో యాంకర్ శ్రీముఖి తెగింపు: ఇది హాట్ షో కాదు.. అంతకు మించి!

  ఓడాక భర్తపై అనసూయ కోపంగా

  ఓడాక భర్తపై అనసూయ కోపంగా

  తులసి వాళ్ల కాలనీలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతూ ఉంటాయి. ఆ సమయంలో పరందామయ్యకు అడివి రాముడు అనే పేరు వస్తుంది. కానీ, ఆయన మాత్రం సరిగా యాక్టింగ్ చేయలేకపోతాడు. దీంతో వాళ్లు ఓడిపోతారు. అప్పుడు అనసూయ మీ చేతకానితనం వల్లే ఓడిపోయాం అంటుంది. అనంతరం అక్కడ హోస్టుగా ఉన్న అమ్మాయి 'ఇప్పటి వరకు ఈ కాంపిటీషన్‌లో ఎవ్వరూ గెలవలేదు. ఇక చివరి జంట ప్రేమ్, శృతి మాత్రమే మిగిలారు. వీళ్లైనా గెలుస్తారో లేదో చూద్దాం' అంటుంది. దీంతో తులసి 'వెళ్లండి.. మీరు తప్పకుండా గెలుస్తారు. మీ ఇద్దరి మధ్య బంధం అలాంటిది' అని అంటుంది.

  పోటీలో గెలుపొందిన శృతి, ప్రేమ్

  పోటీలో గెలుపొందిన శృతి, ప్రేమ్

  తులసి ఎంకరేజ్ చేసిన తర్వాత ప్రేమ్, శృతి ఇద్దరూ ఆడటానికి వెళ్తారు. ప్రేమ్ చీటీ తీయగా అందులో మనసంతా నువ్వే సినిమా పేరు ఉంటుంది. దాన్ని సైగల ద్వారా చెప్పగా.. శృతి ఆ పేరు చెప్పేస్తుంది. దీంతో వాళ్లు గెలుస్తారు. ఆ తర్వాత ప్రేమ్ 'నేను చేసిన చిన్న సైగలతో అర్థం చేసుకున్నావు. నా మనసును ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు' అని మనసులో మాట్లాడతాడు. అందుకు అనుగుణంగానే శృతి కూడా మనసుతో మాట్లాడుతుంది. అలా ఇద్దరూ కాసేపు సరదాగా గొడవ పడుతుంటారు. అంతలో యాంకర్ వాళ్లను అభినందిస్తుంది.

  Rashmika Vijay Marriage: సీక్రెట్‌గా రష్మిక, విజయ్ పెళ్లి.. ఫొటో వైరల్.. మరీ ఇంతకు తెగించారేంటి!

  రెండో పోటీ.. ఆ జంట విజయం

  రెండో పోటీ.. ఆ జంట విజయం

  చీటీల గేమ్ తర్వాత ఇంకో ఆటను మొదలు పెడదామని యాంకర్ అంటుంది. పరందామయ్య వెళ్లి అనసూయ గురించి వెటకారంగా చెబుతాడు. ఆ తర్వాత మళ్లీ ప్రేమ్, శృతిని పిలుస్తారు. దీంతో వాళ్లు అదేంటి ఇప్పుడే ఆడాం కదా.. మళ్లీ పిలుస్తున్నారేంటి అని అంటుంది. ఇది మరో రౌండ్ అని యాంకర్ చెబుతుంది. అంతేకాదు, కళ్లకు గంతలు కట్టుకున్న ఉన్న పార్ట్‌నర్‌తో టబ్‌లో బాల్ వేయించాలని చెబుతుంది. అలా వాళ్లతో బాల్ గేమ్ ఆడిస్తారు. కానీ, అందులో ప్రేమ్, శృతి జంటగానీ, నందూ, లాస్య జోడీ కానీ గెలవదు. చివర్లో అభి, అంకిత జంట ఆడి గెలుస్తుంది.

  తులసి మీద కోప్పడిన సామ్రాట్

  తులసి మీద కోప్పడిన సామ్రాట్

  తులసి వాళ్ల ఫ్యామిలీ మెంబర్లు గేమ్ ఆడుతూ ఉండగానే సామ్రాట్, వాళ్ల బాబాయితో కలిసి అక్కడకు వస్తాడు. వాళ్లను చూసి తులసి ఎదురు వెళ్తుంది. అంతలో సామ్రాట్.. హనీ కడుపు నొప్పి తగ్గిందా అని తులసిని అడుగుతాడు. దీంతో కడుపునొప్పా.. మాకు తెలియదే అని అంటుందామె. దీంతో సామ్రాట్ 'అదేంటి తులసి గారు మీకు అంత నిర్లక్ష్యమా. పాప కడుపు నొప్పి అని బాధపడుతుంటే మీరు పట్టించుకోరా. తను నాకు కాల్ చేస్తేనే వచ్చాను' అని కోప్పడతాడు. దీనికి తులసి 'అసలు హనీకి కడుపులో నొప్పి అని నాకు తెలియదు. నాకు చెప్పలేదు' అంటుంది.

  షర్ట్ విప్పేసిన యాంకర్ మంజూష: హాట్ షోలో అస్సలు తగ్గట్లేదుగా!

  నిజం చెప్పి షాకిచ్చేసిన హనీ

  నిజం చెప్పి షాకిచ్చేసిన హనీ

  వాళ్లు అలా గొడవ పడుతుండగానే హనీ అక్కడకు వస్తుంది. దీంతో అసలేమైందని ఆమెను అడుగుతారు. అప్పుడు హనీ నవ్వుకుంటూ 'అసలు నాకు కడుపులో నొప్పి వస్తే కదా. మా నాన్నకు ఫోన్ చేసి అబద్ధం చెప్పా. మా నాన్న కూడా పండుగ సెలబ్రేట్ చేసుకోవాలని పిలిచాను. లేకపోతే ఆయన ఇంట్లోనే ఉండిపోయారు. ఇక్కడ అందరూ కలిసి ఉంటే ఎంత సంతోషంగా ఉంది కదా డాడీ' అని అంటుంది. దీంతో సామ్రాట్‌కు కోపం కట్టలు తెంచుకుంటుంది. అప్పుడు తులసి అయిపోయిందేదో అయిపోయింది.. రండి కాసేపు మాతో కలిసి ఎంజాయ్ చేయండి అంటుంది.

  దాండియాలో సామ్రాట్, తులసి

  దాండియాలో సామ్రాట్, తులసి

  ఆ తర్వాత నిర్వహకులు దాండియా కాంపిటిషన్‌ను మొదలు పెడుతున్నట్లు చెబుతారు. దీంతో సామ్రాట్ కూడా వచ్చి తులసితో కలిసి దాండియా ఆడుతాడు. సామ్రాట్, తులసి జంట బాగా దాండియా చేయడంతో ఒకవైపు అనసూయ, మరోవైపు నందూ, లాస్యలు కుళ్లుకుంటూ ఉంటారు. అయినా అవేమీ పట్టించుకోకుండా సామ్రాట్, తులసి జంటగా ఆడుతూ ఉంటారు. అలా ఈ కాంపిటీషన్ వాళ్లిద్దరూ విజయం సాధిస్తారు. దీంతో అందరూ వాళ్లను అభినందిస్తారు. కానీ, అనసూయ మాత్రం కోపంతో చూస్తుంటుంది. అది చూసిన సామ్రాట్ భయంతో వణికిపోతుంటాడు.

  హాట్ షోలో హద్దు దాటిన ఇలియానా: ఏం చూపించకూడదో అవే చూపిస్తూ!

  తులసికి అవమానం కలిగిస్తూ

  తులసికి అవమానం కలిగిస్తూ

  ఇక, గేమ్స్ అన్నీ అయిపోయిన తర్వాత అందరూ సంతోషంగా ఉంటారు. అంతలో యాంకర్ 'ఇప్పుడు తులసి గారు అమ్మవారి ముందు దీపాన్ని వెలిగించాలని కోరుకుంటున్నాము' అని అంటుంది. దీంతో తులసి వెళ్లబోతుండగా.. పక్కన వాళ్లు ఆపుతారు. 'ఏంటి నువ్వు దీపం వెలిగిస్తావా? అసలు నీకు అర్హత ఉందా? ఊళ్ల మీద పడి పోట్ల గిత్తలా తిరుగుతున్న ఆడదానివి నువ్వు' అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడి ఆమెను అవమానిస్తారు. దీంతో అక్కడున్న వాళ్లందరూ షాక్ అయిపోతారు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 760: Shruthi and Prem Participated in a Game. Then Tulasi Feels Happy. After That Anasuya Gets Irritated about Tulasi and Samrat.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X