For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: నోరు జారిన అనసూయ.. సామ్రాట్ విషయంలో తులసి సంచలన నిర్ణయం

  |

  చాలా భాషలతో పోల్చుకుని చూసుకుంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే చూడండి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే

  మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే

  మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తులసి ఫ్యామిలీ మొత్తం బతుకమ్మ సంబరాలను సంతోషంగా జరుపుకుంటూ ఉంటుంది. ఆ సమయంలో సామ్రాట్ వాళ్ల బాబాయితో కలిసి అక్కడకు వస్తాడు. దీంతో అనసూయ, లాస్య, నందూలు ఆగ్రహంతో రగిలిపోతూ ఉంటారు.

  అనంతరం హనీ చెప్పిన అబద్ధం వల్లే సామ్రాట్ అక్కడకు వచ్చాడని తెలుసుకుంటారు. తర్వాత సామ్రాట్, తులసి కలిసి దాండియా ఆడి విజయం సాధిస్తారు. ఇక, చివర్లో తులసి అమ్మవారికి దీపం వెలిగించేందుకు వెళ్తుండగా.. కాలనీ వాళ్లు ఆపడంతో పాటు ఆమెను నోటికొచ్చినట్లు తిడతారు.

  జబర్ధస్త్ రీతూ చౌదరి ఎద అందాల ఆరబోత: హాట్ షోలో గీత దాటేసిందిగా!

  తులసిపై నింద.. అనసూయ కోపం

  తులసిపై నింద.. అనసూయ కోపం

  తులసి, సామ్రాట్ అందరి ముందే దాండియా ఆడి విజయం సాధించడంపై కాలనీ వాళ్లంతా అసహనంగా ఉంటారు. అందుకే తులసి దీపం వెలిగించేందుకు వెళ్లకుండా అడ్డుకుంటారు. అప్పుడు 'చూశావా అనసూయ.. మా మీద మాత్రం కళ్లు పెద్దవి చేసుకొని మరీ చూస్తావు కదా. ఇప్పుడు నీకు ఇది కనిపించడం లేదా. ఇంతలా బరి తెగిస్తారా? తెగిన గాలిపటం ఎక్కడికైనా వెళ్తుంది. ఇక్కడే ఇంతలా రెచ్చిపోతున్నారంటే ఇక ఏకాంతంగా ఉన్నప్పుడు ఇంకెలా ప్రవర్తిస్తున్నారో' అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు. దీంతో అనసూయకు కోపం వస్తుంది.

  కోపం నిజం చెప్పేసిన అనసూయ

  కోపం నిజం చెప్పేసిన అనసూయ

  కాలనీ వాళ్లు తులసి గురించి చెడుగా మాట్లాడడంతో అనసూయకు కోపం వచ్చి వాళ్లకు ఎదురు తిరుగుతుంది. అయినా వాళ్లు తగ్గరు. అప్పుడు తులసి కలగజేసుకుంటుంది. అంతలో అనసూయ 'ఇదంతా నీవల్లే వచ్చింది తులసి. వద్దు వద్దు అంటే కూడా ఆయనతో దాండియా ఆడావు కదా' అని సీరియస్ అవుతుంది. ఆ తర్వాత సామ్రాట్‌తో 'మా తులసిని వదిలేయ్ అని ఎంత చెప్పినా నీకు అర్థం కాదా. తులసికి దూరంగా ఉండమని చెప్పాను. తులసిని ఉద్యోగంలో నుంచి తీసేయమని అడిగాను. అయినా నీకు అర్థం కావడం లేదా' అని నిజాన్ని చెప్పేస్తుంది.

  బాత్‌టబ్‌లో నగ్నంగా హీరోయిన్: స్నానం చేస్తోన్న వీడియో వైరల్

  అత్తయ్యకు ఎదురుతిరిగిన తులసి

  అత్తయ్యకు ఎదురుతిరిగిన తులసి

  అనసూయ అసలు నిజం చెప్పడంతో పరందామయ్య ఏంటి అనసూయ.. నువ్వు చెప్పడం వల్లనే సామ్రాట్ ఉద్యోగంలో నుంచి తులసిని తీసేశాడా అని అడుగుతాడు. దీనికామె 'అవును.. నేనే చెప్పాను. ఇలాంటి పరిస్థితి రాకూడదనే చెప్పాను. ఇది తప్పా' అని అంటుంది. దీంతో తులసి 'అవును.. ఇది ముమ్మాటికీ తప్పే అత్తయ్య. మా ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని అనుమానించడం తప్పే' అని అంటుంది. అప్పుడు సామ్రాట్ 'ఇక.. నేను ఆగలేను. అసలు మీకెవరికీ సంస్కారం లేదు. తులసి గారు ఇప్పుడు కూడా మన స్నేహం గురించి మాట్లాడకపోతే ఇక తప్పదు. దసరా పండుగ నాడు ఇలా తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు' అంటూ కాలనీ వాళ్లుకు తమ మధ్య ఏ బంధం ఉందో క్లారిటీ ఇస్తాడు.

  సామ్రాట్ చేసిన తప్పు అదే అని

  సామ్రాట్ చేసిన తప్పు అదే అని

  ఆ తర్వాత సామ్రాట్ సారీ తులసి గారు నేను ఈరోజు ఇక్కడికి రావాల్సింది కాదు అని అంటాడు. దీంతో తులసి 'మీరు వచ్చింది మంచిది అయింది సామ్రాట్ గారు. ఇప్పుడు చెప్తున్నా వినండి.. సామ్రాట్ గారు నాకు మంచి స్నేహితులు.. వ్యాపార భాగస్వామి.. అంతకుమించి మంచి మనిషి.. నిజంగా మనల్ని రోడ్డు మీదికి లాగాలంటే ఆయన హోదాకు ఐదు నిమిషాలు చాలదు. ఒక ఆడది చదువుకోకపోవచ్చు కానీ.. మగాడి మనసును వెంటనే తెలుసుకోగలదు. ఆయన చేసిన తప్పేమైనా ఉంది అంటే.. ఒక్కటే. నాకు సాయం చేయడం.. చేయాలనుకోవడం' అని చెబుతుంది.

  షర్ట్ విప్పేసిన యాంకర్ మంజూష: హాట్ షోలో అస్సలు తగ్గట్లేదుగా!

  నేను సీత లాంటి దాన్ని కాదంటూ

  నేను సీత లాంటి దాన్ని కాదంటూ

  అనంతరం తులసి 'ఒక్కటి మాత్రం ఇంట్లో వాళ్లకు, బయటి వాళ్లకు చెప్పదలుచుకున్నాను. ఈరోజు నుంచి సామ్రాట్ గారి గురించి చెడుగా మాట్లాడితే ఊరుకోను. సీతమ్మ లాంటి మహాసాద్వి మీద ఆనాటి సమాజం ఎలా నిందలు వేయగలిగింది. అప్పటి సమాజం.. ఇప్పటి సమాజం ఒక్కటే. కానీ, నాకు సీతాదేవికి ఒకే తేడా. సీతమ్మ వారిలా నేను నిందలు భరించను. మొహం పగిలేలా సమాధానం చెబుతాను. ఒక మనసు ఇంకో మనసుకు దగ్గరైతే దాన్ని స్నేహమంటారు. మాది ఎప్పుడూ ముక్కలు కాదు. సామ్రాట్ గారి సంస్కారం మీద నాకు నమ్మకముంది' అంటుంది.

  సామ్రాట్‌ను అంటే ఊరుకోనంటూ

  సామ్రాట్‌ను అంటే ఊరుకోనంటూ

  తులసి మాట్లాడుతూ.. 'సామ్రాట్ గారు ఇక నుంచి ఈ కాలనీకే కాదు.. ఏకంగా నా ఇంటికే వస్తాడు. నన్ను పికప్ చేసుకోవడానికి వస్తాను.. ఎప్పుడైనా వస్తాడు.. నాతో మాట్లాడటానికి వస్తాడు.. రాత్రి అయినా వస్తాడు.. పని ఉన్నా వస్తాడు.. భోజనానికి వస్తాడు.. పండుగ అయినా వస్తాడు.. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వస్తాడు.. ఆయన ఎప్పుడు వచ్చినా స్వాగతం పలుకుతాను. ఆయనకు అవమానం జరిగితే మాత్రం నేను ఊరుకునేదే లేదు' అంటూ తేల్చి చెప్పేస్తుంది. దీంతో ఆమెకు అందరూ చప్పట్లు కొడతారు. తర్వాత పదండి సామ్రాట్ గారు అని తులసి వెళ్లిపోతుంది.

  బ్రాతో యాంకర్ శ్రీముఖి తెగింపు: ఇది హాట్ షో కాదు.. అంతకు మించి!

  సామ్రాట్ హ్యాపీగా.. స్కూల్‌ కోసం

  సామ్రాట్ హ్యాపీగా.. స్కూల్‌ కోసం

  తులసి తనను సపోర్ట్ చేయడంతో సామ్రాట్ చాలా సంతోషంగా ఉంటాడు. అప్పుడు 'మనసులో నుంచి నాకు దిగులు ఇక పారిపోయింది. అనసూయ గారి మాటలకు బాధపడి తులసికి ఏమవుతుందో అని భయపడ్డా. నేను తీసుకున్న నిర్ణయాలు తప్పు కాదని అందరి ముందు తులసి గారు తేల్చేశారు. ఇదే నాకు కావాల్సింది. ఇదే నేను కోరుకుంది. ఈరోజు ఒక్క మనిషి నా స్నేహం కోసం చుట్టూ ఉన్నవాళ్లతో సమాజంతో పోరాడుతోంది. అందరి ముందు తలవంచుకోవాలేమో.. తులసి గారు నన్ను పట్టించుకోరేమో అని అనుకున్నాను. తులసి గారు నన్ను పూర్తిగా సపోర్ట్ చేశారు. ఈ ప్రపంచాన్నే గెలిచినంత ఆనందంగా ఉంది' అని సంతోషిస్తాడు. అలాగే, మ్యూజిక్ స్కూల్ త్వరగా స్టార్ట్ చేయాలని అనుకుంటాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 761: Neighbours Questioned to Tulasi and Samrat. Then They Gets Furious on Them. After That Tulasi Helps to Samrat.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X