For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: తులసికి నిజం చెప్పేసిన మాధవి.. నోరు జారి బుక్కైపోయిన లాస్య

  |

  సుదీర్ఘ కాలంగా తెలుగులో ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రమే బుల్లితెరపై ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూద్దాం పదండి!

  మంగళవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  మంగళవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. అందరూ పెళ్లి మండపానికి వెళ్తుండగా.. ప్రేమ్, తులసి మాత్రం ముభావంగా ఉంటారు. అంతలో శృతి కూడా రెడీ అయి వస్తుంటుంది. అప్పుడు అక్షర నుదుటిన ఉన్న బాసికం ఊడిపోతుంది. దీన్ని శృతే స్వయంగా కట్టాల్సి వస్తుంది. ఆ తర్వాత కారు ఎక్కబోతూ లాస్య, నందూను చూసి ఆగిపోతుంది. అనంతరం లాస్య ప్రోద్భలంతో శృతిని పెళ్లికి రాకుండా అడ్డుకుంటాడు నందూ. ఇందుకోసం ఆమెను స్టోర్ రూమ్‌లో బంధిస్తాడు. ఇక, పెళ్లి మండపానికి వచ్చిన వారిలో తులసి మిస్ అవుతుంది. దీంతో జీకే ఆరా తీస్తుంటాడు.

  బట్టలు లేకుండా దిగిన ఫొటో వదిలిన శృతి హాసన్: ఆ ప్లేస్‌లో టాటూ.. ఎవరి పేరు ఉందో తెలిస్తే!

   తులసిని తాళిని తీసేయమన్న నందూ

  తులసిని తాళిని తీసేయమన్న నందూ

  పెళ్లి మండపానికి వచ్చిన సమయంలో అందరూ తెగ సంతోషంగా ఉండగా ప్రేమ్ మాత్రం తనలో తానే బాధ పడుతుంటాడు. సరిగ్గా ఆ సమయంలోనే తులసి.. శృతి గురించి వెతుకుతూ ఉంటుంది. కానీ, ఆమె మాత్రం కనిపించదు. అప్పుడు నందూ దగ్గరకు వచ్చి ప్రశ్నిస్తుంది. దీనికి అతడు ఏవేవో మాటలు అంటాడు. అంతేకాదు, ‘మన ఇద్దరికీ విడాకులు అయిపోయాయి కదా. నీ మెడలో తాళి తీసేయ్' అంటాడు. అప్పుడామె ‘నాకు బరువు అనిపించినప్పుడు కచ్చితంగా తీసేస్తాను. ఆ విషయం మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు' అని సమాధానమిస్తుంది.

  ప్రేమ్‌ను వింత కోరిక కోరుకున్న అక్షర

  ప్రేమ్‌ను వింత కోరిక కోరుకున్న అక్షర

  పెళ్లికి సంబంధించిన పనులన్నీ ప్రారంభం అవుతుంటాయి. దీంతో జీకే అన్నీ చూసి తెగ సంతోష పడుతుంటాడు. అప్పుడు పక్కన ఉన్న ఒకరు ‘ఏంటి జీకే గారూ.. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు కలిసి గణపతి పూజ చేస్తున్నారు' అని అడుగుతాడు. అప్పుడాయన ‘నాకు కావాల్సింది నా కూతురు అనుకున్న వాడితో పెళ్లి జరగడం. అవన్నీ నేను పట్టించుకోను' అని అంటాడు. ఆ తర్వాత దివ్య ‘వదిన నీకు ఏం కావాలి' అని అక్షరను అడుగుతుంది. దీనికి ‘మీ అన్నయ్యను ఒకసారి నవ్వమని చెప్పు చాలు' అంటూ బదులిస్తుంది. దీనికి ప్రేమ్ లోలోపల బాధ పడతాడు.

  బీచ్‌లో లవర్‌తో పాయల్ రాజ్‌పుత్ రచ్చ: బికినీలో అందాలన్నీ చూపిస్తూ.. షాకిస్తోన్న సెల్ఫీ వీడియో

  తులసికి కంగారు.. లాస్య మాత్రం ఖుషీ

  తులసికి కంగారు.. లాస్య మాత్రం ఖుషీ

  కల్యాణ మండపానికి వస్తానని చెప్పి శృతి ఇంకా రాకపోవడంతో తులసి తెగ కంగారు పడుతుంది. అంతలో ప్రేమ్ ఫోన్ తీసుకుని ఆమెకు కాల్ చేస్తుంది. కానీ, తను మాత్రం లిఫ్ట్ చేయదు. దీంతో ఆమె మరింతగా ఆందోళన చెందుతూ ఉంటుంది. మరోవైపు, భాగ్య ‘ప్రేమ్ గాడు ఎలాగైతే పెళ్లికి ఒప్పుకున్నాడు. కానీ, ఇష్టం లేకుండా స్కూల్‌కు వచ్చిన పిల్లాడిలా కూర్చున్నాడేంటి? నువ్వేళ్లి నవ్వమని చెప్పొచ్చు కదా' అని లాస్యతో అంటుంది. దీనికామె.. ‘వాడు ఎలా ఉంటే నాకేంటి? నాకైతే వాడి వల్ల వచ్చే కోట్లు కనిపిస్తున్నాయి. నాకైతే అదే చాలు' అంటూ ఖుషీ అవుతుంది.

   లాస్యపై ఓ రేంజ్‌లో మండిపడ్డ నందూ

  లాస్యపై ఓ రేంజ్‌లో మండిపడ్డ నందూ

  శృతి రాకపోవడంతో తెగ కంగారు పడుతోన్న తులసిని అలా చూస్తూ ఉండిపోతాడు నందూ. అది గమనించిన లాస్య అతడి దగ్గరకు వస్తుంది. రావడం రావడమే ‘ఏంటి నందూ విడాకులు తీసుకున్న తర్వాత తులసి మరింత అందంగా కనిపిస్తుందా' అని వెటకారంగా అడుగుతుంది. దీంతో నందూకు కోపం కట్టలు తెంచుకుంటుంది. అప్పుడు లాస్యను నోరు మూయించడంతో సారీ చెబుతుంది. తులసి టెన్షన్ పడుతుండడంతో చూస్తున్నానని నందూ అనగా.. ప్రేమ్ పెళ్లి శృతితో కాకుండా అక్షరతో చేస్తున్నందుకు అలా టెన్షన్ పడుతుందేమో అని లాస్య అంటుంది.

  హాట్ షో రెచ్చిపోయిన మోనాల్ గజ్జర్: గతంలో ఎన్నడూ చూడనంత ఘాటుగా.. ఆమెనిలా చూస్తే తట్టుకోలేరు!

   తులసికి నిజం చెప్పిన మాధవి.. టెన్షన్

  తులసికి నిజం చెప్పిన మాధవి.. టెన్షన్

  తులసి ఆందోళనగా ఉండగా మాధవి వచ్చి ఏమైందని అడుగుతుంది. దీంతో ‘పెళ్లి బట్టలు మర్చిపోయి వచ్చాం కదా.. ఇప్పుడు శృతికి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు' అని అంటుంది. అప్పుడు మాధవి ‘అదేంటి పెళ్లి బట్టలు మన కారులోనే వచ్చాయి. వాటిని నేనే ప్రేమ్, అక్షరకు ఇచ్చాను' అని అంటుంది. దీంతో తులసి ‘శృతి పెళ్లికి రావాలి కదా. ఇంకా రాలేదేంటి' అంటుంది. అప్పుడు మాధవి ‘తను పెళ్లి కూతురు కాదు కదా.. ఆమె రాకపోతే పెళ్లి ఆగిపోదు కదా. అయినా నువ్వు, శృతి కలిసి ప్రేమ్‌కు అన్యాయం చేస్తున్నారు' అంటూ తులసిని నిందిస్తుంది.

  తులసి అనుమానం.. మోహన్ మరోలా

  తులసి అనుమానం.. మోహన్ మరోలా

  మాధవి తనను నిందిస్తోన్న సమయంలో తులసి మాట్లాడుతూ.. ‘నా జీవితాన్నే నేను చక్కగా ఉంచుకోలేకపోయాను. అలాంటిది వేరే వాళ్లకు ఏమని చెబుతాను? ఒకవేళ శృతి నన్ను ప్రశ్నిస్తే నేనేమి చెప్పగలను. అయినా శృతి ఇష్టం లేక రాకపోతే పర్లేదు. కానీ, అన్నీ వద్దనుకుని ఎటైనా వెళ్లిపోవాలని అనుకుంటుందేమో అని అనిపిస్తుంది. నిన్న బట్టలు సర్ధుకోవడం నేను గమనించాను' అని అంటుంది. అంతలో మోహన్ వచ్చి ‘ప్రేమ్ పెళ్లి బట్టలు వేసుకోకుండా దిగాలుగా కూర్చుని ఉన్నాడు. వెళ్లి వాడిని చూడు మాధవి' అని మరో న్యూస్ చెబుతాడు.

  షర్ట్ విప్పేసి షాకిచ్చిన బిగ్ బాస్ సరయు: బ్రాతో ఘాటు ఫోజులిస్తూ.. వామ్మో చూస్తే తట్టుకోలేరు

  Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
  శృతి అలా.. ప్రేమ్ ఇలా.. తప్పు అంటూ

  శృతి అలా.. ప్రేమ్ ఇలా.. తప్పు అంటూ

  ఇంట్లో ఒంటరిగా ఉన్న శృతి ‘ఇష్టాన్ని చంపుకున్నప్పుడు కష్టం గురించి ఆలోచించకూడదు. ఆశల మీద నీళ్లు చల్లుకున్నప్పుడు కన్నీళ్లు పెట్టుకోకూడదు. వద్దు అని అనుకున్నప్పుడు మనసును బాధ పెట్టకూడదు. త్యాగం చేయాలి అనుకున్నప్పుడు గుండె రాయి చేసుకోవాలి' అనుకుంటుంది. అలాగే, ప్రేమ్ ‘నా స్వార్థం కోసం ఓ అమాయకురాలిని బాధ పెట్టే హక్కు నాకు లేదు. తప్పు చేస్తున్నాను.. పెద్ద తప్పు చేస్తున్నాను. నేను ప్రేమించిన శృతి కోసం అక్షర మెడలో తాళి కట్టేందుకు సిద్ధపడ్డాను' అంటూ బాధ పడుతుంటాడు. దీంతో ఈ ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 449: Tulasi Worries as Shruthi Does Not Attend The Wedding. Then Prem Feels Guilty for Hide the Truth.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X