For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: అక్షరకు నిజం చెబుతూ లేఖ రాసిన ప్రేమ్.. జీకేకు కూడా చెప్పాలని!

  |

  తెలుగులో ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రమే బుల్లితెరపై ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూద్దాం పదండి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. కల్యాణ మండపానికి అందరూ ఒకే సమయంలో చేరుకుంటారు. ఆ సమయంలో అందరూ సంతోషంగా ఉండగా ప్రేమ్ మాత్రం బాధ పడుతుంటాడు. అప్పుడు తులసి మాత్రం శృతి రాలేదని ఆందోళన చెందుతూ ఉంటుంది. దీంతో నందూ ఆమెను అలా చూస్తూ కంగారు పడుతుంటాడు. అప్పుడు లాస్య అతడికి ధైర్యం చెబుతుంది. ఇక, తులసితో మాధవి మాట్లాడుతూ.. శృతి గురించి ఆందోళన చెందవద్దని చెబుతుంది. ఇక, ఇంట్లో ఒంటరిగా ఉన్న శృతి.. పెళ్లి పీటలపై ఉన్న ప్రేమ్ తమలో తాము మాట్లాడుతూ బాధ పడతారు.

  Monal Gajjar ఇన్‌స్టా నుంచి పిచ్చి పిచ్చి ఫొటోలు: అనుమానాలు మొదలు.. షాకింగ్ న్యూస్ చెప్పిన అఖిల్

  అక్షరకు నిజం చెప్పాలని ప్రేమ్ నిర్ణయం

  అక్షరకు నిజం చెప్పాలని ప్రేమ్ నిర్ణయం

  ఇంట్లో ఒంటరిగా ఉన్న శృతి.. కల్యాణ మండపంలో పెళ్లికి రెడీగా ఉన్న ప్రేమ్ మనసులో మాట్లాడుకుంటూ ఉండగా ఈరోజు ఎపిసోడ్ ప్రారంభం అయింది. ఆ సమయంలో ప్రేమ్ ‘ఇంత కాలం శృతి మనసులో నేను లేనని అనుకున్నా.. కానీ, ఇప్పుడు తను నన్ను ప్రేమిస్తుందని తెలిసింది. కాబట్టి తను మా నాన్నకు భయపడకుండా చూసుకోవాలి. అలా జరగాలంటే ముందు అక్షరకు నిజం చెప్పేయాలి. తనను నేను మోసం చేయలేను. ఎలా చెప్పాలి' అని తనలో తానే మాట్లాడుకుంటాడు. అంతేకాదు, అక్షరకు చెప్పేందుకు ఓ లెటర్‌ను కూడా రాసుకుంటాడు ప్రేమ్.

  లాస్య మాటలు విన్న తులసి.. లీకైన ప్లాన్

  లాస్య మాటలు విన్న తులసి.. లీకైన ప్లాన్

  పెళ్లి జరుగుతున్నది చూసి తెగ సంతోష పడుతోన్న లాస్యను పక్కకు తీసుకొస్తుంది భాగ్య. అప్పుడు ‘లాస్య నాకు చిన్నగా కునుకు పట్టింది. అప్పుడు శృతి కల్యాణ మండపానికి వచ్చినట్లు.. ఈ పెళ్లి ఆగిపోయినట్లు.. ప్రేమ్ అక్షరను కాదని, శృతి మెడలో తాళి కట్టినట్లు కల వచ్చింది' అని చెబుతుంది. దీనికి లాస్య ‘శృతి ఇక్కడకు రావడమేంటి? అలా జరగదు భాగ్య. ఆమెను నందూ స్టోర్ రూమ్‌లో పెట్టి తాళం వేశాడు' అని అంటుంది. దీంతో భాగ్య ‘బావగారు ఇలాంటి పని చేశారా' అంటూ షాక్ అవుతుంది. ఈ మాటలను తులసి వినడంతో వాళ్ల ప్లాన్ లీక్ అవుతుంది.

  బట్టలు లేకుండా దిగిన ఫొటో వదిలిన శృతి హాసన్: ఆ ప్లేస్‌లో టాటూ.. ఎవరి పేరు ఉందో తెలిస్తే!

  అక్షరకు లెటర్ పంపిన ప్రేమ్.. అంకితకు

  అక్షరకు లెటర్ పంపిన ప్రేమ్.. అంకితకు

  తన మనసులో శృతి ఉన్న విషయంతో పాటు నిజాలన్నీ చెబుతూ ప్రేమ్ లేఖ రాస్తాడు. దాన్ని అక్షరకు ఇవ్వమని ఓ పాపతో పంపుతాడు. అయితే, ఆ చిన్నారికి పెళ్లి కూతురు కనిపించకపోవడంతో దాన్ని తీసుకెళ్లి అంకితకు ఇస్తుంది. అప్పుడు దాన్ని చదివిన ఆమె ‘శృతి ప్రేమ గురించి అక్షరకు చెప్పేసి ఈ పెళ్లి ఆపేద్దామని డిసైడ్ అయిపోయావా ప్రేమ్?.. అస్సలు అలా జరగనివ్వను' అని అనుకుంటుంది. అంతలో అక్కడకు అక్షర వచ్చి అదేంటని ప్రశ్నించగా.. పాత సామాన్ల చీటీ అంటూ అబద్ధం చెప్పి దాన్ని పక్కకు విసిరేస్తుంది అంకిత.

  జీకేకు నిజం చెప్పాలని తులసి నిర్ణయం

  జీకేకు నిజం చెప్పాలని తులసి నిర్ణయం

  లాస్య, భాగ్య మాట్లాడుకుంటుండగా వినేసిన తులసి ‘చూస్తూ చూస్తూ ఊరుకుంటుంటే వీళ్లు బాగా రెచ్చిపోతున్నారు. ఇలాగే ఉంటే వీళ్ల ఆగడాలు మరింత ఎక్కువయ్యేలా ఉన్నాయి. కాబట్టి నిజం నిగ్గుతేల్చేయాలి. వెంటనే వెళ్లి ఈ విషయాన్ని జీకే అన్నయ్య గారికి చెప్పాలి' అంటూ టెన్షన్ పడుతూ వెళ్తుంది. అప్పుడు ఆమెను చూసిన నందూ, తులసి తెగ భయపడుతుంటారు. వాళ్ల భయానికి తగ్గట్లుగానే తులసి నేరుగా జీకే దగ్గరకు వెళ్లి ‘అన్నయ్య గారూ.. మీతో ఓ విషయం అర్జెంట్‌గా మాట్లాడాలి. అందరి ముందూ కాదు.. కాస్త పక్కకు వస్తారా' అని అడుగుతుంది.

  స్విమ్‌సూట్‌లో కనిపించి షాకిచ్చిన ఈషా రెబ్బా: తడిచిన బట్టల్లో అందాలన్నీ చూపించిన తెలుగమ్మాయి

   శృతి ఎక్కడంటూ నందూతో తులసి వార్

  శృతి ఎక్కడంటూ నందూతో తులసి వార్

  జీకేతో ఎక్కడ నిజం చెప్పేస్తుందో అని తులసిని పక్కకు తీసుకుని వస్తాడు నందూ. అప్పుడు తులసి ‘మీరు చేసే పనులు నన్ను కష్ట పెడుతున్నా.. నన్ను ఇబ్బంది పెడుతున్నా కామ్‌గా ఉన్నా. కానీ, దాన్ని మీరు నా చేతకాని తనం అనుకుంటున్నారు. అది చాలా తప్పు. నిజానికి గీత దాటా అని అన్నారు కదా. అది నేను కాదు మీరు. ఇప్పుడు చెప్పండి శృతి ఎక్కడ' అంటూ గట్టిగా ప్రశ్నిస్తుంది. దీనికి నందూ తనకు తెలీదు అంటూ మాట దాటవేస్తాడు. అంతేకాదు, ‘అయినా శృతికి ప్రేమ్ అంటే ఇష్టం లేదు కదా. తను ఎక్కడుంటే ఏంటి' అంటూ బదులిస్తాడు.

  దమ్ముంటే శృతి ప్రేమను నిరూపించు

  దమ్ముంటే శృతి ప్రేమను నిరూపించు

  నందూ మాటలతో విసిగిపోయిన తులసి ‘శృతి ఎక్కడ ఉందో నాకు తెలుసు? ఎవరు రానివ్వకుండా అడ్డుకున్నారో కూడా నాకు తెలుసండీ' అని అంటుంది. దీనికి నందూ కంగారు పడిపోతాడు. అప్పుడు ‘చూడు తులసి.. శృతి మనసులో ప్రేమ్ లేడు. ఆ విషయాన్ని తనే స్వయంగా చెప్పింది. దమ్ముంటే ఇప్పుడు తన మనసులో ప్రేమ్ ఉన్నాడని చెప్పించు' అంటూ సవాల్ చేస్తాడు. దీనికి తులసి ‘శృతి ఆ మాట చెబితేనే కదండీ. అదే తను నిజం చెప్పుంటే వెంటనే ప్రేమ్‌ను ఇచ్చి పెళ్లి చేసేసే దాన్ని' అంటూ తీవ్ర స్వరంతో సమాధానం చెబుతుంది.

  అరాచకమైన ఫొటోలతో షాకిచ్చిన అమలా పాల్: బీచ్‌లో బికినీతో అందాలు మొత్తం కనిపించేంత ఘాటుగా!
  https://telugu.filmibeat.com/heroine/amala-paul-sizzling-bikini-photos-viral-in-social-media-103153.html

  ఎంతకైనా తెగిస్తాను అంటూ వార్నింగ్‌తో

  ఎంతకైనా తెగిస్తాను అంటూ వార్నింగ్‌తో

  క్రమంగా తులసి, నందూ మధ్య వాగ్వాదం తారా స్థాయికి చేరుతుంది. అప్పుడామె ‘నేనే కనుక తలుచుకుని ఉంటే ప్రేమ్‌ను గదిలో పెట్టి తాళం వేసి పెళ్లి ఆపేసేదాన్ని' అంటుంది. దీనికి నందూకు మరింతగా కోపం వస్తుంది. అప్పుడతను ‘చూడు తులసి కొడుకు పెళ్లి జరుగుతుంటే పిచ్చి దానిలా మాట్లాడతావేంటి? అందరూ సంబరంగా ఉన్నారు. నువ్వు దాన్ని పాడు చేయాలని చూడకు. ఒకవేళ ఏదైనా పిచ్చి పని చేశావంటే.. నేను ఎంతకైనా తెగిస్తాను. ఇది నా వార్నింగ్' అంటూ వెళ్లిపోతాడు. దీంతో తులసి మాత్రం అక్కడే ఉండి ఆలోచనలో పడిపోతుంది.

  Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
  అక్షర రాదనుకుంటూ ప్రేమ్ సంతోషం

  అక్షర రాదనుకుంటూ ప్రేమ్ సంతోషం


  అక్షరకు పంపించిన లెటర్ చదివి ఉంటుందని భావించిన ప్రేమ్.. తను పెళ్లి పీటల పైకి రాదని అనుకుంటూ ఉంటాడు. అయితే, అందుకు భిన్నంగా ఆమె అతడి పక్కన వచ్చి కూర్చుంటుంది. అప్పుడు అక్కడే ఉన్న అంకిత ‘ప్రేమ్ నువ్వు పంపిన లెటర్‌ను అక్షరకు చేరకుండా అడ్డుకున్నాను. తనే నాకు తోడికోడలిగా రావాలి. అంటే ఈ పెళ్లి జరగాలి' అని మనసులో అనుకుంటుంది. దీంతో ఈరోజు ఎపిసోడ్ పూర్తైపోయింది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 450: Tulasi was Shocked about to Learn Lasya's Wicked Intentions. After That Tulasi and Nandhu Started Heated Argument.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X