For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: ఆమె డైరీ కనిపించడంతో తెలిసిన నిజం.. ఆగిన ప్రేమ్, అక్షర పెళ్లి

  |

  మిగిలిన భాషలతో పోలిస్తే తెలుగులో ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రమే బుల్లితెరపై ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూద్దాం పదండి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

   గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. లాస్య దుర్మార్గపు ఉద్దేశాల గురించి తెలుసుకుని తులసి ఆశ్చర్యపోతుంది. అంతేకాదు, ఆ వెంటనే భయంతో అసలు నిజాన్ని జీకేకు చెప్పాలని ప్రయత్నిస్తుంది. అందుకోసం ఆయనతో మాట్లాడాలని అడుగుతుంది. కానీ, నందూ ఆమెను అడ్డుకుంటాడు. ఆ తర్వాత తులసి, నందూ మధ్య భారీ స్థాయిలో గొడవ జరుగుతుంది. ఇక, అక్షరకు నిజం చెప్పాలన్న ఉద్దేశంతో ప్రేమ్ ఓ లెటర్‌ రాసి ఓ పాపకు ఇచ్చి పంపుతాడు. అయితే, అది అక్షరకు చేరకుండా అంకిత తీసుకుంటుంది. దాన్ని చదివేసి ఎవరూ చూడకుండా పడేస్తుంది.

  Most Eligible Bachelor Twitter Review: మూవీకి ఊహించని టాక్.. ప్లస్ మైనస్ ఇవే.. ఆ పొరపాటు లేకుంటే!

  శృతి అదృష్టమా? అక్షర దురదృష్టమా?

  శృతి అదృష్టమా? అక్షర దురదృష్టమా?


  శృతిని నందూ ఇంట్లో బంధించాడని తెలుసుకున్న తులసి ఆ విషయం గురించి కంగారుగా ఉంటుంది. ఆ సమయంలోనే పని మనిషి రాములమ్మ వచ్చి ఏం చేయబోతున్నారని అడుగుతుంది. దీనికి తులసి 'ఇంకా ఆలస్యం చేస్తే చాలా ప్రమాదం జరుగుతుంది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను వెళ్లి శృతిని ఇక్కడికి తీసుకుని వస్తాను' అని అంటుంది. అప్పుడు రాములమ్మ 'మీరు చెప్పింది జరుగుతుందా' అని అడుగుతుంది. దీనికి 'అయితే శృతి అదృష్టం.. లేకపోతే అక్షర దురదృష్టం. ప్రేమించిన వాళ్లను కలపాలి' అంటూ శృతి కోసం బయలుదేరుతుంది.

  తులసి భయపడిందని నందూ హ్యాపీగా

  తులసి భయపడిందని నందూ హ్యాపీగా

  ఇంట్లో ఒంటరిగా ఉన్న శృతి 'ఒంటరితనానికి నేనంటే చాలా ఇష్టం అనుకుంటా. ఎప్పుడూ నన్ను వదిలిపెట్టదు' అనుకుంటూ బాధ పడుతుంది. మరోవైపు, ఆమెను తీసుకొచ్చేందుకు తులసి ఆటోలో ప్రయాణం చేస్తుంది. ఆ సమయంలో ప్రేమ్ ఫోన్ నుంచి శృతికి పలుమార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయదు. ఇక, పెళ్లి మండపంలో ఉన్న లాస్య, నందూ తెగ సంతోషపడుతుంటారు. అప్పుడు 'నేను ఇచ్చిన వార్నింగ్‌కు తులసి భయపడిపోయిందనుకుంటా. అందుకే ఈ చుట్టుపక్కల కూడా కనిపించకుండా వెళ్లిపోయింది' అని అంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు నందూ.

  జబర్ధస్త్ సెట్‌లో బాలకృష్ణకు రోజా ఫోన్: ఊహించని మాటలతో షాకిచ్చిన నటసింహం.. సంచలనంగా ఆడియో క్లిప్

   తులసి స్థానంలో లాస్య.. షాకిచ్చిన అక్షర

  తులసి స్థానంలో లాస్య.. షాకిచ్చిన అక్షర

  ముహూర్తానికి సమయం దగ్గర పడడంతో పెద్దలను రమ్మని పూజారి చెబుతాడు. అప్పుడు జీకే తులసి ఎక్కడుంది అని అడుగుతాడు. దీనికి నందూ 'ఇప్పటి వరకూ ఇక్కడే ఉండాలి వెతికి వస్తాను' అంటూ పక్కకు వెళ్తాడు. అప్పుడు వెంట వెళ్లిన లాస్య 'ఇదే సరైన సమయం.. తులసి స్థానంలో లాస్యను ఉంచుతాను అని చెప్పు' అంటూ సలహా ఇస్తుంది. ఇదే విషయం జీకేతో చెబుతాడు నందూ. అయితే, పెళ్లి పీటలపై ఉన్న అక్షర మాత్రం దీనికి ఒప్పుకోదు. 'తల్లి స్థానంలో ఉండి అన్నీ చేసిన తులసి ఆంటీ లేకుంటే పెళ్లి చేసుకోను' అని వాళ్లకు షాకిస్తుంది.

  నందూపై జీకే ఆగ్రహం.. తులసే ముఖ్యం

  నందూపై జీకే ఆగ్రహం.. తులసే ముఖ్యం

  అక్షర మాటలకు లాస్య సర్థిచెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ, ఆమెకు కూడా సరైన సమాధానం చెబుతుంది. అంతలో జీకే 'నందూ గారూ.. అసలు తులసికి ఈ పెళ్లి ఇష్టం ఉందా? లేదా?' అని సూటిగా ప్రశ్నిస్తాడు. అప్పుడు పరందామయ్య కూడా 'చెప్పరా నందూ.. ఆయన మాటలకు సమాధానం చెప్పు' అని అంటాడు. దీంతో నందూ నసుగుతూ 'అలా అడుగుతారేంటి జీకే గారు. తనకు పెళ్లి ఎందుకు ఇష్టముండదు' అని అంటాడు. అప్పుడు జీకే 'చూస్తుంటే అలాగే ఉంది. ముందు ఈ గొడవ ఆపి.. తులసి గారు ఎక్కడ ఉన్నారో వెతికే ప్రయత్నం చేయండి' అంటాడు.

  హాట్ డ్రెస్‌లో మంచు లక్ష్మీ అందాల ఆరబోత: ఎద భాగం మొత్తం కనిపించేలా.. మరీ ఇంత దారుణమా!

  కనపడకుండా దాక్కుని తప్పు చేస్తున్నావ్

  కనపడకుండా దాక్కుని తప్పు చేస్తున్నావ్

  శృతి కోసం ఆటోలో వెళ్తోన్న తులసికి నందూ పలుమార్లు ఫోన్ చేస్తాడు. కానీ, ఆమె మాత్రం కట్ చేస్తుంటుంది. ఇక, ఇంటికి చేరుకున్న తులసి.. అన్ని రూమ్‌లు వెతుకుతుంది. ఆ సమయంలో ఆమె శృతి శృతి అని గట్టిగా అరుస్తుంది. దీంతో తులసి తన కోసం వచ్చిందన్న విషయాన్ని ఆమె తెలుసుకుంటుంది. అప్పుడు 'శృతి నువ్వు చాలా తప్పు చేస్తున్నావ్.. కనపడకుండా దాక్కోవడం చాలా తప్పు. దయచేసి మాట్లాడు. నాకు బదులివ్వు' అంటూ అరుస్తుంది. ఇది విని శృతి 'ఆంటీ నా మనసు మార్చాలని చూస్తున్నారు. నేను కనిపించకూడదు' అనుకుంటుంది.

  అమ్మ తప్పకుండా వస్తుంది అన్న ప్రేమ్

  అమ్మ తప్పకుండా వస్తుంది అన్న ప్రేమ్

  తులసి కనిపించకపోవడంతో అందరూ తెగ కంగారు పడుతుండగా.. 'ఏంటి డాడీ ఈ పరిస్థితి' అని అక్షర జీకేను ప్రశ్నిస్తుంది. ఆ తర్వాత ప్రేమ్‌తో 'ఏంటి ప్రేమ్.. తులసి ఆంటీ కనిపించడం లేదని అందరం తెగ టెన్షన్ పడుతుంటే నువ్వేమో చాలా కామ్‌గా ఉన్నావు?' అని ప్రశ్నిస్తుంది. దీనికి ప్రేమ్ 'మీరంతా పెళ్లి కోసం ఉత్సాహంగా ఉన్నారు. నేనేమో జీవశ్చవంలా కూర్చుని ఉన్నాను. నిమిత్తమాత్రుడను మాత్రమే' అని మనసులో అనుకుంటాడు. ఆ తర్వాత 'అమ్మ నన్ను ఒంటరిగా వదలదు. నా కోసం తప్పుకుండా తిరిగి వచ్చేస్తుంది' అని బదులిస్తాడు.

  Monal Gajjar ఇన్‌స్టా నుంచి పిచ్చి పిచ్చి ఫొటోలు: అనుమానాలు మొదలు.. షాకింగ్ న్యూస్ చెప్పిన అఖిల్

  జీకే కండీషన్‌తో నందూకు కొత్త చిక్కులు

  జీకే కండీషన్‌తో నందూకు కొత్త చిక్కులు

  తులసి.. శృతి కోసం ఇంటికి వెళ్లిందేమో అని భయపడిపోయిన నందూ.. అక్కడికి వెళ్లడానికి ప్రయత్నిస్తాడు. దీంతో జీకే అతడిని అడ్డుకుంటాడు. 'ఏంటి నందూ.. ఇక్కడ అందరం తులసి కనిపించడం లేదని టెన్షన్ పడుతుంటే.. నువ్వేమో ఎక్కడికో పారిపోవాలని చూస్తున్నావ్?' అని ప్రశ్నిస్తాడు. దీనికి నందూ 'తులసిని వెతికేందుకు వెళ్తున్నా బావగారూ' అంటూ బదులిస్తాడు. అప్పుడతను 'మీరు వెళ్తే నేను కూడా మీ వెంట వస్తాను' అని కండీషన్ పెడతాడు. దీంతో నందూ 'వద్దులే బావగారూ మనిద్దరం లేకపోతే అంతా టెన్షన్ పడతారు' అని ఆగిపోతాడు.

  Recommended Video

  Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
  శృతిని కనిపెట్టేసిన తులసి.. ఆగ్రహంతో

  శృతిని కనిపెట్టేసిన తులసి.. ఆగ్రహంతో

  ఇంట్లో శృతిని వెతికేందుకు వెళ్లిన తులసికి ఆమె డైరీ కనిపిస్తుంది. అందులో ప్రేమ్‌ను ఎంతలా ప్రేమిస్తున్నానో అని శృతి రాసుకున్నది చదువుతుంది. ఆ తర్వాత తన ఫోన్‌తో శృతికి కాల్ చేయగా.. రింగ్ శబ్దం రూమ్‌లో నుంచి రావడాన్ని గమనించి తాళం తీసి చూస్తుంది. అక్కడ శృతి కనిపించడంతో 'ఏంటి శృతి నేనంతలా అరుస్తుంటే నువ్వు స్పందించవేంటి? నేను ప్రేమ్ కోసం ఇదంతా చేస్తున్నా అనుకుంటున్నావా? కాదు నీకోసమే చేస్తున్నా. నువ్వు నీ ప్రేమను చెప్పకున్నా ఈ డైరీ మొత్తం చదివేశాను' అని అంటుంది. దీంతో ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 451: Tulasi Went Home For Shruthi. Then She Saw a Dairy. After That GK Put Condition to Nandhu.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X