For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: పెళ్లికి ముందు బిగ్ ట్విస్ట్ ఇచ్చిన జీకే.. కథలో ఊహించని మలుపు

  |

  సుదీర్ఘ కాలంగా తెలుగులో ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రమే బుల్లితెరపై ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూద్దాం పదండి!

  శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. పెళ్లిలో ఆందోళనగా కనిపించిన తులసి.. శృతిని కనిపెట్టేందు కోసం ఇంటికి వెళ్ళింది. అప్పుడు తులసి ఆమె గదిలో ఒక డెయిరీని చూసింది. అందులో తను ప్రేమ్‌ను ఎంతలా ప్రేమిస్తున్నానో శృతి వివరిస్తూ రాసుకొచ్చింది. ఆ తర్వాత శృతి స్టోర్‌ రూమ్‌లో ఉన్న విషయాన్ని తులసి కనిపెట్టింది. ఇక, కల్యాణ మండపంలో ఉన్న వాళ్లందరూ తులసి కనిపించక టెన్షన్ పడుతుంటారు. అప్పుడు నందూ ఆమె కోసం వెళ్తానని అనగా.. జీకే అడ్డుకుంటాడు. అలాగే, తులసి స్థానంలో లాస్యను కూర్చోబెట్టడానికి అక్షర, జీకే అభ్యంతరం వ్యక్తం చేస్తారు.

  జబర్ధస్త్ సెట్‌లో బాలకృష్ణకు రోజా ఫోన్: ఊహించని మాటలతో షాకిచ్చిన నటసింహం.. సంచలనంగా ఆడియో క్లిప్

  మాట తప్పుతున్నావని తులసి ఆగ్రహం

  మాట తప్పుతున్నావని తులసి ఆగ్రహం

  శృతిని కనిపెట్టిన తులసి ఆమెతో మాట్లాడుతుండగా ఈరోజు ఎపిసోడ్ ప్రారంభం అయింది. తులసి మాటలకు స్పందిస్తూ శృతి ‘అవును నేను ప్రేమ్‌ను ప్రేమించిన మాట నిజమే. అయితే, అది ఇప్పుడు కాదు' అని అంటుంది. అప్పుడు తులసి ‘ఇంకా దాచకు శృతి. నీ ప్రేమ విలువను ఇంకా తగ్గించుకోకు. ప్రేమ అబద్ధం కావొచ్చు కానీ, ప్రేమలో అబద్ధాలు, మోసాలు ఉండకూడదు అంటూ ఈ డైరీలో రాశావు గుర్తు లేదా? ఈ రాసుకున్న రాతలకు కట్టుబడి ఉంటానని, ప్రేమ్‌ను పోగొట్టుకోను అని రాసుకున్నావు. కానీ, ఇప్పుడు మాట తప్పుతున్నావు' అని అంటుంది.

  గుండెకు బలమైన గాయం చేశావు శృతి

  గుండెకు బలమైన గాయం చేశావు శృతి

  తులసి ‘నీ కన్నీళ్లు తుడిచి నేనున్నాను అంటూ అక్కున చేర్చుకున్నా. అవసరం కోసం అనుబంధంగా మారాలని నిన్ను కోడలిని చేసుకుందాం అనుకున్నాను. కానీ, నా గుండెకు గాయం చేశావు శృతి. నువ్వు భయంతో ఈ పని చేస్తున్నావని తెలుసు. అండగా ఉంటానని చెప్పినా ఎందుకు నమ్మట్లేదు. మీ అంకుల్‌ స్వార్థం కోసం ఇంత త్యాగం చేయాలా?' అని ప్రశ్నిస్తుంది. దీనికి శృతి ‘అంకుల్‌ కోసం కాదు.. నేను ప్రేమ్‌ను పెళ్లి చేసుకోపోడానికి నా కారణాలు నాకున్నాయి. మీరేం చేసినా సరే ఈ ఇంటి నుంచి అడుగు బయట పెట్టను' అని గట్టిగానే అంటుంది.

  Bigg Boss: ఆరో వారం సంచలన ఎలిమినేషన్.. డేంజర్‌ జోన్‌లో టాప్ కంటెస్టెంట్లు.. ఆ నలుగురిలో ఒకరు ఔట్

  లెటర్ చదివేసిన జీకే.. ప్రేమ్‌ను పిలిచి

  లెటర్ చదివేసిన జీకే.. ప్రేమ్‌ను పిలిచి

  తులసి కనిపించకపోయే సరికి ఆమెకు ఫోన్ చేసేందుకు పక్కకు వస్తాడు జీకే. అప్పుడు పిల్లలు ఆడుకుంటూ ప్రేమ్ రాసిన లెటర్‌ను జీకే ముందు పడేస్తారు. అది తీసుకున్న ఆయన.. మొత్తం చదివేసి నిజం తెలుసుకుంటాడు. దీంతో వెళ్లి ప్రేమ్‌ను పెళ్లి పీటలు దిగి రమ్మంటాడు. అప్పుడు నువ్వు అక్షరను ఇష్టపడే పెళ్లి చేసుకుంటున్నావా? అని అడుగుతాడు. దీనికి నేను ఒప్పుకుంటేనే నాకు అక్షరకు పెళ్లి జరుగుతోందని బదులిస్తాడు. దీంతో జీకే పెళ్లి బొమ్మలాట కాదు ప్రేమ్. పెళ్లంటే చేసుకోబోయే అమ్మాయికి కొన్ని ప్రమాణాలు చేయడం. అవి చేయకపోతే దేవుడిని, అమ్మాయిని, నిన్ను నువ్వు మోసం చేసుకోవడమే' అంటాడు.

   ప్రేమ్ మనసులో ఉన్నది అక్షర కాదు

  ప్రేమ్ మనసులో ఉన్నది అక్షర కాదు

  జీకే మాట్లాడుతుండగా నందూ ‘అసలేమైంది బావగారూ? మీకు ఈ సందేహం ఎందుకు వచ్చింది?' అని ప్రశ్నిస్తాడు. దీంతో జీకే తన చేతిలో ఉన్న లెటర్‌ను కోపంగా అతడి మీదకు విసిరేస్తాడు. అలాగే, ‘ఇది మీ ప్రేమ్ స్వహస్తాలతో అక్షరకు రాసిన లేఖ. అతడి మనసులో ఉన్నది అక్షర కాదు.. శృతి' అంటూ అందరి ముందే నిజం చెప్పేస్తాడు. దీంతో నందూ ‘బావగారూ ప్రేమ్.. శృతిని ప్రేమించింది నిజమే. కానీ, ఆమెను కాదనుకుని ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు' అని సమాధానం చెబుతాడు. దీంతో జీకే ‘మరి లెటర్ ఇప్పుడెందుకు రాశాడు' అంటాడు.

  హాట్ షోలో హద్దు దాటిన నందినీ రాయ్: తడిచిన బట్టల్లో అందాలు మొత్తం చూపిస్తూ.. వామ్మో ఇంత అరాచకంగానా!

   మీ పెద్దరికం ఏమైంది? బలవంతంగా

  మీ పెద్దరికం ఏమైంది? బలవంతంగా

  జీకే అడిగిన ప్రశ్నకు ‘ప్రేమ్‌ది చిన్నతనం అందుకే ఇలా చేశాడు' అంటూ నందూ బదులిస్తాడు. అప్పుడాయన ‘షటప్.. మీ స్వార్థం కోసం అతడి నోరు నొక్కేసి బలవంతంగా పెళ్లి పీటల మీద కూర్చోబెట్టారు. మీరు చెప్పిన అబద్ధాన్ని కప్పి పుచ్చుకోడానికి ఎన్నో అబద్ధాలు చెబుతున్నారు. పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు' అని ఫైర్ అవుతాడు. అప్పుడు అనసూయ ‘అది కాదు జీకే గారూ.. వాళ్లు చిన్న పిల్లలు. ఈ వయసులో ప్రేమలు మర్చిపోడాలు మామూలే కదా. ఇప్పుడు వీళ్లిద్దరికీ పెళ్లి చేస్తే అన్నీ మర్చిపోతారు. దానికి నేను గ్యారెంటీ' అంటూ చెప్పుకొస్తుంది.

  వాళ్లు విడాకులెందుకు తీసుకున్నారు

  వాళ్లు విడాకులెందుకు తీసుకున్నారు

  అనసూయ అన్న మాటలకు ఫైర్ అయిన జీకే ‘మనవడి తరపున గ్యారెంటీ ఇస్తున్నారు సరే.. మరి మీ కొడుకు తరపున కోడలికి ఇవ్వలేదా? ఎందుకు వాళ్లు విడాకులు తీసుకున్నారు?' అంటూ ప్రశ్నిస్తాడు. దీంతో పరందామయ్య కలుగజేసుకుని ‘అలా అడగండి జీకే గారూ.. వాడు విడాకులు తీసుకున్నాడు కాబట్టే పెళ్లి విలువ తెలియడం లేదు. ఇంత వరకూ నోరు మూసుకున్నా. ఇప్పుడైనా మాట్లాడకపోతే నా మనవడి జీవితం అన్యాయం చేసిన వాడిని అవుతాను' అంటూ చెప్పుకొస్తాడు. ఆ తర్వాత అక్షర కూడా ఆ లెటర్‌ను చదువుకుని తెగ ఏడ్చేస్తూ ఉంటుంది.

  హాట్ డ్రెస్‌లో మంచు లక్ష్మీ అందాల ఆరబోత: ఎద భాగం మొత్తం కనిపించేలా.. మరీ ఇంత దారుణమా!

  ముందే నిజం తెలుసుని చెప్పిన జీకే

  ముందే నిజం తెలుసుని చెప్పిన జీకే

  జీకే మాట్లాడుతూ.. ‘మీకో షాకింగ్ న్యూస్ చెప్పనా? నేను ఈ లెటర్ చదవడానికి ముందే నాకు ఈ విషయం తెలుసు. తులసి నాకు అంతా చెప్పేసింది' అని ఝలక్ ఇస్తాడు. ఫ్లాష్‌బ్యాక్‌లో తులసి కంగారుగా వెళ్తుండగా.. జీకే ఆపి ఏమైందని అడుగుతాడు. దీంతో ‘ఇది తెలిసి మీకు కోపం రావొచ్చు.. నన్ను చంపేయాలని అనుకోవచ్చు.. ఏది ఏమైనా ఇప్పుడు ఈ విషయం చెప్పేస్తాను' అంటూ శృతి ప్రేమ్ ప్రేమించుకున్న విషయం చెబుతుంది. అలాగే, ప్రేమ్‌తో అక్షరకు పెళ్లి జరిగితే భవిష్యత్‌లో వచ్చే సమస్యల గురించి వివరించి చెబుతుంది.

  Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
   శృతి.. ప్రేమ్ పెళ్లికి జీకే గ్రీన్ సిగ్నల్

  శృతి.. ప్రేమ్ పెళ్లికి జీకే గ్రీన్ సిగ్నల్

  తులసి చెప్పిన మాటలకు కరిగిపోయిన జీకే.. ‘వెళ్లమ్మా.. వెళ్లి ముహూర్తం సమయానికి శృతిని తీసుకుని రా. శృతికి ప్రేమ్‌కు పెళ్లి చేద్దాం' అని అంటాడు. దీంతో తులసి ఆయనకు చేతులెత్తి దండం పెడుతుంది. అప్పుడు జీకే ‘నాకెందుకమ్మా దండం పెడుతున్నావు? అనాథ అయిన ఓ అమ్మాయికి అండగా నిలవాలని అనుకున్నా అంతే వెళ్లు' అంటూ తులసిని పంపిస్తాడు. దీంతో ఫ్లాష్‌బ్యాక్ అయిపోతుంది. అలాగే, ఈరోజు ఎపిసోడ్ కూడా ఊహించని మలుపుతో పూర్తవుతుంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 452: Tulasi Told the Truth about Shruthi and Prem Love to GK. Then She asked to Cancel Prem and Akshara Marriage.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X