Intinti Gruhalakshmi Today Episode: పరువు పోయిందని జీకే ఫైర్.. పెళ్లి జరగాలంటే 2 కోట్లు కట్టమనడంతో!
మిగిలిన భాషలతో పోలిస్తే తెలుగులో ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రమే బుల్లితెరపై ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరూ చూడండి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే
శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. గతంలో అక్షరకు నిజం చెప్తూ ప్రేమ్ రాసిన లెటర్‌ను జీకే చూస్తాడు. దాన్ని తీసుకుని వెళ్లి పెళ్లి పీటల మీద ఉన్న ప్రేమ్‌ను నిజం చెప్పమని అడుగుతాడు. ఆ సమయంలో నందూ అడ్డు పడుతూ ఉండగా లెటర్ విసిరేసి నిజం చెబుతాడు. ఆ తర్వాత శృతి, ప్రేమ్ లవ్ గురించి తులసి నిజం చెప్పిందని బాంబ్ పేలుస్తాడు జీకే. ఆ తర్వాత ప్రేమ్, అక్షర వివాహాన్ని రద్దు చేయమని కూడా జీకే ముందు రిక్వెస్ట్ చేసింది. దీనికి జీకే ఒప్పుకోవడంతో పాటు శృతిని తీసుకుని రమ్మని తులసిని పంపిస్తాడు. దీంతో అందరూ షాక్‌కు గురవుతారు.

ప్రేమలో ఓడిపోయినందుకు బాధగా
పెళ్లికి ముందు నిజం తెలియడంతో అక్షర చాలా బాధ పడుతూ ఉంటుంది. ఆ సమయంలోనే ప్రేమ్ మాట్లాడుతూ.. 'సారీ అక్షర గారు. నా నిస్సహాయత, చేతకానితనం వల్ల మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను' అని అంటాడు. దీనికామె 'నన్ను ఇబ్బంది పెట్టినందుకు బాధగా లేదు ప్రేమ్. ప్రేమలో ఓడిపోయినందుకు బాధగా అనిపిస్తుంది' అంటూ ఏడుస్తుంది. అంతలో పరందామయ్య 'తులసి నిజం చెప్పినప్పుడే పెళ్లి ఆపేయాల్సింది బాబూ.. ఎందుకు ఈ బంగారు తల్లిని మరింత బాధ పెట్టారు' అంటూ అక్షరను ఉద్దేశించి జీకేతో మాట్లాడతాడాయన.

తులసి నా పరువు తీసినా బాధ లేదు
పరందామయ్య అడిగిన మాటలకు జీకే మాట్లాడుతూ.. 'మీ కుటుంబంలో ఎవరి నిబద్ధత ఏంటో తెలుసుకోవాలని.. ఎవరి నిజాయితీ ఎంతో తెలుసుకోవాలని.. బంధాల కోసం ఎవరు ఎంత తపిస్తున్నారో మీకు తెలియజెప్పాలని. నాకు జరిగిన నష్టం ఎలాగో జరిగింది. కానీ, అది తులసి విషయంలో జరగకూడదని. నిజానికి తులసి చేసిన పని వల్ల నా కూతురి పెళ్లి ఆగిపోయింది. సంఘంలో నా పరువు పోయింది. అయినా నాకు బాధ లేదు. ఎందుకంటే తులసిలో ఉన్న నిజాయితీ నాకు బాగా నచ్చింది. ఆమెలోని అమ్మ ప్రేమ నన్ను కదిలించింది' అంటూ బదులిస్తాడు.

నీ వల్ల వాళ్లిద్దరి జీవితాలు నాశనమే
ఒకపక్క కల్యాణ మండపంలో జీకే క్లాస్ పీకుతుండగా.. ఇంట్లో శృతి మనసు మార్చడానికి తులసి ప్రయత్నిస్తుంది. అప్పుడు శృతి 'నేనేమి చేసినా ప్రేమ్ కోసమే చేశాను' అని అంటుంది. అప్పుడు తులసి 'నువ్వు ఎవరి కోసం ఆలోచించకు. నీ సంకల్పం మంచిదైతే అంతా మంచే జరుగుతుంది. ఇప్పుడు నువ్వు తీసుకున్న నిర్ణయం వల్ల ఒకపక్క ప్రేమ్ జీవితం నాలా నాశనం అవుతుంది. అలాగే, అటు అక్షర జీవితం కూడా నాశనం అవుతుంది. మంచి జరగడం కోసం చెడుగా ప్రవర్తించినా నష్టం లేదు' అంటూ చెప్పి శృతిని తన వెంట తీసుకుని వెళ్తుంది తులసి.

తులసి మీ అదృష్టం... కానీ మీరేమో
తులసిని ప్రశంసిస్తూ మాట్లాడుతోన్న జీకే 'మీ కుటుంబంలో తులసి ఉండడం మీ అదృష్టం. అలాగే, మీ కుటుంబంలో ఉండడం ఆమె దురదృష్టం' అంటూ ఫైర్ అవుతాడు. అంతేకాదు, 'నందూ గొప్పగా బతకాలనుకోవం తప్పుకాదు. అందుకోసం అడ్డదారులు వెతకడం చాలా తప్పు. సొసైటీలో పిల్లల కోసం తప్పుడు దారులు నడిచే పేరెంట్స్‌ను చూశాను. కానీ, నువ్వు మాత్రం నీ కొడుకు జీవితాన్ని మాత్రం నాశనం చేయాలని చూశావు. స్వప్రయోజనాలకు స్వార్థంగా ఆలోచించావు. పాపం ప్రేమ్ నీ స్వార్థం కోసం తన ప్రేమనే కోల్పోడానికి సిద్ధం అయ్యాడు' అంటాడు.

జీకేపై లాస్య ఫైర్.. సవాల్ విసిరాడు
జీకే మాట్లాడుతుండగా లాస్య అడ్డు వస్తుంది. 'ఇంక ఆపండి జీకే గారూ.. ఊరుకుంటుంటే ఏదేదో మాట్లాడుతున్నారు. మీకు పెళ్లి ఇష్టం లేకపోతే మీ అమ్మాయిని తీసుకుని వెళ్లిపోండి. అంతేకానీ, మా మీద మీ ఇష్టం వచ్చినట్లు నిందలు వేయకండి. అసలు శృతికి ప్రేమ్‌కు పెళ్లి జరపడం మాకు ఇష్టం లేదు' అని అంటుంది. దీనికి జీకే 'అంత వరకూ వస్తే నా సత్తా నేనూ చూపిస్తా. శృతితోనే ప్రేమ్ పెళ్లి జరుగుతుంది. నేను జరిపిస్తాను. మీకు చేతనైతే ఆపుకోండి' అంటూ సవాల్ విసురుతాడు. దీంతో నందూ, లాస్య ఏమీ మాట్లాడకుండా అలా ఉండిపోతారు.

బాసికం కట్టి పెళ్లికి రెడీ చేసిన అక్షర
తన పెళ్లి ఆగిపోయినా శృతి, ప్రేమ్ పెళ్లి చేయడానికి అక్షర ముందుకు వస్తుంది. ఆ సమయంలో 'నీ స్థానంలో నేను ఉండి నీకు అన్యాయం చేయాలని అనుకున్నాను. నన్ను క్షమించు' అంటూ శృతిని రిక్వెస్ట్ చేస్తుంది అక్షర. అంతేకాదు, స్వయంగా ఆమెను పెళ్లి పీటలపై కూర్చోబెట్టడంతో పాటు నుదిటిన బాసికం కడుతుంది. దీంతో అక్కడున్న వాళ్లందరూ సంతోషిస్తుంటారు. కానీ, నందూ, లాస్య మాత్రం అక్కడి నుంచి వెళ్లిపోడానికి రెడీ అవుతుంటారు.
Recommended Video

రెండు కోట్లు డిమాండ్ చేసిన లాస్య
శృతి, ప్రేమ్ పెళ్లి జరుగుతుండగా నందూ, లాస్య వెళ్లిపోవాలని అనుకుంటారు. అంతలో తులసి వాళ్లను ఉండమని అడుగుతుంది. అప్పుడు లాస్య 'మేమెందుకు ఉండాలి. అక్షర, ప్రేమ్ పెళ్లి జరిగితే మా కష్టాలన్నీ తీరిపోతాయి. శశికళ అప్పు ఎవరు తీరుస్తారు? ఈ పెళ్లైతే నందూ టెన్షన్ లేకుండా ఉంటాడని అనుకుంటే ఇప్పుడిలా అయింది. ఆ రెండు కోట్లు నువ్వు కడతానంటే మేము ఇక్కడే ఉండి వాళ్లిద్దరినీ ఆశీర్వదిస్తాము' అని అంటుంది. దీనికి తులసి ఓకే చెబుతుంది. మధ్య ప్రేమ్, పరందామయ్య ఆమెను అడ్డుకోగా.. తులసి మాత్రం లాస్య కండీషన్‌కు ఒప్పుకుంటుంది. దీంతో ప్రేమ్, శృతి పెళ్లి అయిపోతుంది.


Click it and Unblock the Notifications











