For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: లాస్యకు కోలుకోలేని షాక్.. తులసికి సర్‌ప్రైజ్ గిఫ్ట్

  |

  సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూద్దాం పదండి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే

  మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే

  మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. నందూ ఉద్యోగం మానేశాడని తెలిసిన తర్వాత సామ్రాట్ అతడిపై కోపంగా ఉంటాడు. దీంతో లాస్య ఆ జనరల్ మేనేజర్ పోస్టు తనకు ఇవ్వమని అడుగుతుంది. కానీ, సామ్రాట్ మాత్రం తులసికి ఇస్తున్నట్లు చెప్తాడు.

  దీంతో లాస్య ఆఫీసులోని వాళ్లందరినీ పిలిచి సామ్రాట్, తులిస మధ్య సన్నిహిత సంబంధం ఉందని చెబుతుంది. దీంతో సామ్రాట్ అదంతా విని లాస్యపై ఫైర్ అవుతూ ఆమెను ఉద్యోగం నుంచి తీసేస్తాడు. ఆ తర్వాత తులసికి జనరల్ మేనేజర్ పోస్టు ఇస్తాడు. దీనికి తులసి ఒప్పుకోకపోయినా బలవంతంగా ఇస్తాడు.

  నగ్నంగా సీతా రామం హీరోయిన్: సినిమాలో అలా.. రియల్‌గా ఇంత దారుణంగా!

  లాస్య రిక్వెస్టు.. కాదన్న తులసి

  లాస్య రిక్వెస్టు.. కాదన్న తులసి

  తనను జాబ్‌లో నుంచి తీసేసిన తర్వాత సామ్రాట్‌ను లాస్య చాలా సేపు బ్రతిమాలుతుంది. కానీ, అతడు వినడు. దీంతో తులసి దగ్గరకు వచ్చి 'తులసి మేడం మీరైనా చెప్పండి. ఇప్పటికే నందూ ఉద్యోగం మానేశాడు. ఇప్పుడు నా ఉద్యోగం కూడా పోతే మేమిద్దరం రోడ్డు మీద పడాల్సిందే. అప్పుడు నాకు జాబ్ రావడానికి కారణం అయ్యారు. ఇప్పుడు ఉద్యోగం పోకుండా చూడండి. ఇదే నా తొలి చివరి తప్పుగా భావించండి' అంటుంది. దీంతో తులసి 'ఇప్పుడు నీ మాటలతో నేనొక్కదాన్నే బాధ పడి ఉంటే నిన్ను క్షమించేదాన్ని. కానీ, సామ్రాట్ గారు కూడా ఇబ్బంది పడ్డారు. కాబట్టి నేనేమీ చేయలేను' అంటుంది.

  నోటికొచ్చినట్లు తిట్టేసిన లాస్య

  నోటికొచ్చినట్లు తిట్టేసిన లాస్య

  ఎంత బ్రతిమాలినా ఒప్పుకోకపోవడంతో లాస్య తన ఒరిజినల్ క్యారెక్టర్‌ను బయటకు తీసుకు వస్తుంది. 'సామ్రాట్.. నువ్వు జెంటిల్‌మ్యాన్, మంచి బిజినెస్‌మ్యాన్ అనుకున్నా. కానీ, తులసి చేతిలో కీలుబొమ్మలా మారిపోయావు. నందూ చెప్పింది నిజమే నువ్వు నిజంగానే తులసి చేతిలో కీలుబొమ్మవు అంటుంది లాస్య. బిజినెస్ అనే మాట స్పెల్లింగ్ అనే కూడా తెలియని దాన్ని నీ బాస్ ఇంత పెద్ద కంపెనీలో జనరల్ మేనేజర్ పోస్ట్ ఇవ్వడం' అంటూ నోటికొచ్చినట్లు తిడుతుంది. ఆ తర్వాత తులసిని 'శభాష్.. ఇద్దరూ భలే నాటకాలు ఆడుతున్నారు. నువ్వు ఎందుకు నామీద జాలి చూపించావో, జాబ్ వచ్చేలా చూశావో నాకు ఇప్పుడు అర్థం అయింది తులసి. ఈ జాబ్ వల్ల నన్ను, నందూ మీద పెత్తనం చేయాలనుకున్నావు' అని తిడుతుంది.

  మసాజ్ పిక్‌తో షాకిచ్చిన తెలుగు హీరోయిన్: ఏమీ లేకుండానే కనిపించడంతో!

  బయటకు గెంటేసిన సామ్రాట్

  బయటకు గెంటేసిన సామ్రాట్

  లాస్య తన నోటికి ఇంకా పని చెబుతూ సామ్రాట్‌ను, తులసిని తిడుతుంటుంది. దీంతో సామ్రాట్‌కు కోపం వస్తుంది. వెంటనే గెట్ అవుట్ అంటాడు. దీంతో లాస్య ఏదో ఒక రోజు నువ్వు ఈ కంపెనీని నిలువునా ముంచేస్తావు అని తులసిని తిడుతూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఉద్యోగులు అందరూ ఎవరి పనులకు వాళ్లు వెళ్లిపోతారు. తులసికి ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు సామ్రాట్ ఈ లాస్య ఇక ప్రశాంతంగా ఉండదు. మనల్ని ఉండనివ్వదు అంటాడు. దీంతో తులసి నాకు తెలుసు సామ్రాట్ గారు. ఇంటి దగ్గర ఇంకెంత గొడవ చేస్తుందో అంటుంది.

  ప్రేమ్ స్వీట్స్... దివ్య సెటైర్లు

  ప్రేమ్ స్వీట్స్... దివ్య సెటైర్లు

  ఇంట్లో పరందామయ్య, దివ్య ఇద్దరూ కలిసి చెస్ ఆడుతుంటారు. అప్పుడాయన ఏనుగు అంటే గుర్తొచ్చింది మీ నానమ్మ ఏది కనిపించడం లేదు అంటాడు. ఇంతలో ప్రేమ్ స్వీట్ బాక్స్ పట్టుకొని వస్తాడు. దాన్ని దాచుకుని వెళ్తుండగా తాతయ్య 'ఏంటి అది.. ఎవరికిరా అది దొంగతనంగా తీసుకెళ్తున్నావు? ముసలి తాత కోసం ఎప్పుడైనా చిన్న స్వీటు ముక్క అయినా తీసుకొచ్చి ఇచ్చావా' అని అడుగుతాడు. అప్పుడు దివ్య అన్నయ్యలు మారిపోయారు. వదినల కొంగులు పట్టుకొని తిరుగుతున్నారు అంటుంది. ఇంతలో అంకిత, శృతి అక్కడకు వచ్చి దివ్య చెవులు పిండుతారు.

  బ్రా తీసేసి అషు రెడ్డి అందాల ఆరబోత: పవన్ కోసం మరోసారి దారుణంగా!

  తులసిపై నిందలు వేసిన అత్త

  తులసిపై నిందలు వేసిన అత్త

  ఆ తర్వాత తులసి దీనంగా ఇంటికి వస్తుంది. అందరూ ఆమెను చూసి ఏమైందో అని అనుకుంటారు. అప్పుడు ప్రేమ్ అమ్మకు ఏమైంది అలా ఉంది అని అంటాడు. దీంతో అనసూయ 'నన్ను అడగరా.. నేను చెబుతాను. దసరా పండుగ నాడు సామ్రాట్‌ను అన్నామని.. ఒక్కొక్కరి మీద ప్రతీకారం తీర్చుకుంటోంది. నిన్న నందూ, ఇవాళ లాస్య. తులసి మారిపోయింది. ఇప్పుడు ఉన్న తులసి మన తులసి కాదండి' అంటుంది. దీంతో తులసి 'అత్తయ్య ఎందుకు ఇలా నిందలు వేస్తున్నారు. ఇప్పుడు నేను ఏం చేశాను' అని అడుగుతుంది. దీనికామె నందూ, లాస్య ఉద్యోగాలు పోవడానికి కారణం ఎవరు అని అడుగుతుంది.

  అత్తకు సమాధానం చెప్పేసి

  అత్తకు సమాధానం చెప్పేసి

  అనసూయ.. సామ్రాట్‌ను అడ్డం పెట్టుకొని పగ సాధిస్తున్నావు అంటుంది. దీంతో తులసి 'నాకు ఎవరి మీద కోపం లేదు అత్తయ్య. ఇప్పటికీ నేను పాత తులసినే. మీ తులసినే. మీరే నన్ను ఒంటరి దాన్ని చేస్తున్నారు. దూరం చేస్తున్నారు. అయినా.. లాస్యను, మీ అబ్బాయిని ఆఫీసు నుంచి తప్పించడం వల్ల నాకు ఒరిగేదేంటి' అని సమాధానం చెబుతుంది. దీంతో అనసూయ 'వాళ్లు ఉంటే నీకు అడ్డం. అందుకే నువ్వు వాళ్లను తప్పించావు' అంటుంది. దీంతో పరందామయ్య అనసూయను తిడుతాడు. మీ అత్తయ్య అన్న మాటలు నువ్వు పట్టించుకోకు అంటాడు. దీంతో తులసి అందరికీ భోజనాలు వడ్డిస్తాను రండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

  జాన్వీ కపూర్ ఎద అందాల అరాచకం: టైట్ టాప్‌లో యమా హాట్ ట్రీట్

  నందూను రెచ్చగొట్టిన లాస్య

  నందూను రెచ్చగొట్టిన లాస్య

  జాబ్ నుంచి తీసేయడంతో లాస్య కోపంగా ఇంటికి వస్తుంది. అప్పుడామె ఇంట్లో వస్తువులు అని పగలగొడుతుంది. అంతేకాదు, నన్ను గెటవుడ్ అంటావా.. హవ్ డేర్ యూ అంటూ ఇంట్లో చాలా కోపంగా ఉంటుంది. ఇంతలో అక్కడికి నందూ వస్తాడు. అప్పుడు ఏమైంది లాస్య అంటాడు. దీంతో లాస్య 'నువ్వు చెప్పిందే నిజం నందూ. ఇద్దరిని రిక్వెస్ట్ చేసినా పట్టించుకోలేదు. ఆ తులసి రెచ్చగొట్టడంతో నన్ను జాబ్‌లో నుంచి తీసేశాడు. అంతేకాదు నందూ.. ఆ తులసి.. సామ్రాట్‌ను మీ వాళ్లకు కూడా దగ్గర చేస్తోంది' అని రెచ్చగొడుతుంది. దీంతో నందూలో కోపం పెరుగుతుంది. ఆ తర్వాత పరందామయ్య.. తులసి కోసం ఓ సర్‌ప్రైజ్ గిఫ్టును ఆమె గదిలో ఉంచుతాడు. దీంతో అందులో ఏముందో సస్పెన్స్‌గా మారింది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 767: Lasya Insults Tulasi and Samrat. After That Anasuya Blames Tulasi for Trying to Troble Lasya and Nandhu.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X