Intinti Gruhalakshmi October 1st Episode: పెళ్లికి ముందే ప్రేమ్ ఇంటికి అక్షర.. జీకే ప్లాన్‌తో మలుపు

సుదీర్ఘ కాలంగా తెలుగులో ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో ఓ లుక్కేద్దాం పదండి!

Photos Courtesy: Star మా and Disney+Hotstar

గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ఎంగేజ్‌మెంట్ కోసం నందూ ఫ్యామిలీ మొత్తం జీకే వాళ్ల ఇంటికి వెళ్తుంది. అప్పుడు తులసి.. శృతిని కూడా వెంటబెట్టుకుని వెళ్తుంది. దీంతో నందూ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. జీకే ఇంట్లో అక్షర.. తులసిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉండడంతో లాస్య బాధ పడుతూ ఉంటుంది. భాగ్య ఆమెను మరింత రెచ్చగొడుతుంది.

అనంతరం ప్రేమ్ మూడీగా ఉండడం చూసిన జీకే అసలు అతడికి ఈ పెళ్లి ఇష్టమేనా అని ప్రశ్నిస్తాడు. అప్పుడు నందూ తెగ ఆందోళన చెందుతాడు. ఆ సమయంలో లాస్య మాత్రం తెలివిగా మాట్లాడి కవర్ చేసుకుంటుంది.

శృతికి అదిరిపోయే కానుకిచ్చిన అక్షర

శృతికి అదిరిపోయే కానుకిచ్చిన అక్షర

ప్రేమ్ ఎంగేజ్‌మెంట్ కోసం తులసితో పాటు వచ్చిన శృతితో అక్షర అనూహ్యంగా ప్రవర్తిస్తుంది. ముందుగా ఆమెను స్పెషల్‌గా ఆహ్వానించిన అక్షర.. ఆ తర్వాత డ్రెస్ బాలేదని అంటుంది. అప్పుడు భాగ్య 'అంటే శృతి ఇక్కడ ఉండకూడదు అని అంటున్నావా' అని అడుగుతుంది. దీనికి అక్షర 'అలా ఏం కాదాంటీ.. తను ఈ చీరలో బాలేదని అంటున్నా' అంటూ తన కబోర్డులో ఉన్న మరో చీరను తీసుకొచ్చి ఇస్తుంది. కానీ, దాన్ని తీసుకోడానికి శృతి నిరాకరిస్తుంది. అప్పుడు అక్షర ఆమెను ఎంతగానో బ్రతిమాలుతుంది. దీంతో శృతి.. తులసిని చూసి ఒప్పుకుంటుంది.

అలా చేస్తే ప్రేమ్ నీకే పడిపోయే వాడు

అలా చేస్తే ప్రేమ్ నీకే పడిపోయే వాడు

తను ఇచ్చిన చీరను శృతి తీసుకోగానే అక్షర చాలా సంతోషిస్తుంది. అంతేకాదు, తనకు పెద్దగా ఫ్రెండ్స్ లేరని, ఉన్నా వాళ్లు ఇలాంటి ఫంక్షన్లకు రారని చెబుతుంది. అప్పుడు భాగ్య 'అంటే శృతిని నీకు ఫ్రెండ్‌లా ఉండమంటున్నావా' అని అడుగుతుంది. అప్పుడు అక్షర 'అవును... శృతి తులసి ఆంటీకి ఇష్టమైన అమ్మాయి. ఆంటీ అంటే నాకు కాబోయే అత్తగారు. అయినా శృతి అందంగా రెడీ అయి కనిపిస్తే ప్రేమ్ ఎప్పుడో పడిపోయే వాడు. అంటే.. ఇంట్లో ఎవరైనా అందంగా ఉంటే అబ్బాయిలు సైట్ కొడతారు కదా.. ఆ ఉద్దేశంతో అన్నాను' అంటూ వివరిస్తుంది.

అంతా కలలా ఉంది... ప్రేమ్ గురించి

అంతా కలలా ఉంది... ప్రేమ్ గురించి

ప్రేమ్.. అక్షర ఎంగేజ్‌మెంట్ జరుగుతోన్న సమయంలో రెండు కుటుంబాలకు చెందిన వాళ్లంతా ఫుల్ ఖుషీగా ఉంటారు. ఈ సమయంలోనే జీకే 'నాకంతా కలలా ఉంది నందూ గారు. మా అక్షర మీ అబ్బాయిని కోరుకోవడం.. తనతోనే ఇప్పుడు పెళ్లి జరగబోతుండడం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది' అంటాడు. అచ్చం అదే మాదిరిగా నందూ కూడా మాట్లాడతాడు. అప్పుడే శృతి అక్షరను తీసుకుని వస్తుంది. ఆ సమయంలో ప్రేమ్‌ను చూసి అక్షర ఏదో అంటుంది. అప్పుడు శృతి 'పైకి అలా కనిపించిన ప్రేమ్ మనసు చాలా గొప్పది. ప్రేమిస్తే వదిలిపెట్టడు' అని చెబుతుంది.

ప్రేమ్‌ను చూసి భయం.. అంతా సాఫీగా

ప్రేమ్‌ను చూసి భయం.. అంతా సాఫీగా

ఎంగేజ్‌మెంట్ జరుగుతున్నా ప్రేమ్ మాత్రం బాధగానే కనిపిస్తాడు. ఒకానొక సందర్భంలో శృతిని చూసి కన్నీరు పెట్టుకుంటాడు. ఇక, అతడి పరిస్థితిని చూసి లాస్య, భాగ్య తెగ భయపడిపోతుంటారు. అప్పుడు 'వీడు కొంప ముంచేలా ఉన్నాడు. నిశ్చితార్థం అయ్యే వరకైనా వీడు కామ్‌గా ఉంటే బాగుండు. అంతా సాఫీగా అయిపోతుంది' అంటూ మాట్లాడుకుంటారు. వాళ్లు అనుకున్నట్లుగానే నిశ్చితార్థం సాఫీగా జరిగిపోతుంది. మనసులో ఎంతో సంతోషంతో అక్షర.. ప్రేమ్ వేలికి ఉంగరం తొడుగుతుంది. అలాగే, అతడు కూడా బాధగానే ఆ పని చేస్తాడు.

నీ స్థానంలో వేరే అమ్మాయి.. చెరిపేయ్

నీ స్థానంలో వేరే అమ్మాయి.. చెరిపేయ్


అక్షరకు ఉంగరం తొడుగుతున్న సమయంలో ప్రేమ్ 'శృతి చూస్తున్నావుగా.. నువ్వు ఉండాల్సిన స్థానంలో వేరే అమ్మాయి కూర్చుని ఉంది. నువ్వు నీ మనసులో మాటను చెప్పకపోవడం వల్ల ఈ పరిస్థితి ఎదురైంది' అంటూ మనసులో మాట్లాడుకుంటాడు. అప్పుడు శృతి కూడా దయచేసి నువ్వు నన్ను అలా చూడకు. ఇప్పుడు నువ్వు వేరే అమ్మాయికి భర్తకు కాబోతున్నావు. మళ్లీ నేను నీ జీవితంలోకి వస్తానని కానీ, పెళ్లి చేసుకుంటానని కానీ ఆశ ఉంటే దాన్ని ఈరోజుతో చెరిపేసేయి ప్రేమ్' అంటూ మనసులో అనుకుంటుంది. ఈ సీన్ ఎంతో ఎమోషనల్‌గా సాగుతుంది.

జీకేపై నందూ ప్రశంసలు.. వాళ్లు అలా

జీకేపై నందూ ప్రశంసలు.. వాళ్లు అలా

ఎంగేజ్‌మెంట్ తర్వాత జీకే మాట్లాడుతూ 'ఏమ్మా అక్షర.. ఇప్పుడు నువ్వు హ్యాపీయేనా' అని అడుగుతాడు. అప్పుడు నందూ 'ఎందుకు సంతోషంగా ఉండదు జీకే గారూ. మీ లాంటి తండ్రులు ఉంటే పిల్లలు ఎప్పుడూ ఆనందంగానే ఉంటారు' అంటాడు. దీనికి మాధవి స్పందిస్తూ.. 'అవును అన్నయ్య అందరూ పిల్లల మనసులు అర్థం చేసుకోలేరు' అంటూ అతడిని పరోక్షంగా నిందిస్తుంది. అప్పుడు తులసి కూడా 'అవును మాధవి.. అందరికీ జీకే గారిలా గొప్ప మనసు ఎందుకు ఉంటుంది చెప్పు' అంటూ అంటుంది. దీంతో నందూ ముఖం వాడిపోతుంది.

పెళ్లికి ముందే తులసి ఇంటికి అక్షర

పెళ్లికి ముందే తులసి ఇంటికి అక్షర

ఎంగేజ్‌మెంట్ అయిపోయిన తర్వాత జీకే మాట్లాడుతూ.. 'నేను ఢిల్లీ వెళ్తున్నాను. వచ్చిన వెంటనే పెళ్లికి సంబంధించిన షాపింగ్ చేద్దాం' అంటాడు. అప్పుడు అక్షర 'డాడీ మీరు ఢిల్లీ వెళ్లి వచ్చే వరకూ నేను తులసి ఆంటీ వాళ్ల ఇంట్లో ఉండనా' అని అడుగుతుంది. దీనికి జీకే మొహమాటపడుతుంటాడు. అప్పుడు నందూ ఓకే చెబుతాడు. అయినా తులసిని కూడా అడుగుతాడు జీకే. అప్పుడామె 'అందులో ఏముంది అన్నయ్య గారూ.. నిశ్చితార్థం అయిందంటే తను మా ఇంటి పిల్ల. ఇప్పుడు ఎక్కడుంటే ఏంటి?' అని అంటుంది. దీంతో ఈ ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X