twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Intinti Gruhalakshmi Today Episode: ప్రేమ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. సామ్రాట్ తీరుపై తులసికి డౌట్

    |

    రోజురోజుకూ కొత్త కొత్త షోలు వస్తున్నా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే చూడండి!

    Photos Courtesy: Star మా and Disney+Hotstar

    శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

    శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

    శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ఆఫీసులో తులసి జనరల్ మేనేజర్ సీటులో కూర్చుని ఉండడం చూసి లాస్య కుళ్లుకుంటుంది. అప్పుడామె వచ్చి ఫైల్ రెడీ చేయకపోతే తప్పుకోమంటూ వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత అనసూయను అభి బాగా రెచ్చగొడతాడు. దీంతో ఆమె నేరుగా సామ్రాట్ ఇంటికి వెళ్తుంది. అంతేకాదు, తులసిని మీ నుంచి, మీ కంపెనీ నుంచి దూరం చేసుకోవాలని అతడిని కోరుతుంది. దీంతో సామ్రాట్ షాక్ అవుతాడు. ఆ తర్వాత ప్రేమ్ ఓ మ్యూజిక్ ఆడిషన్స్‌కు వెళ్లగా.. అందులో అతడు సెలెక్ట్ అయినట్లు ఈవెంట్ వాళ్లు చెబుతారు.

    శృతి మించిన ప్రియ ప్రకాశ్ హాట్ షో: తడిచిన దేహంతో మెంటలెక్కించేలా!శృతి మించిన ప్రియ ప్రకాశ్ హాట్ షో: తడిచిన దేహంతో మెంటలెక్కించేలా!

    ప్రేమ్‌ను అడ్డుకున్న కంటెస్టెంట్

    ప్రేమ్‌ను అడ్డుకున్న కంటెస్టెంట్

    మ్యూజిక్ ఈవెంట్ ఆడిషన్స్ కోసం ప్రేమ్ ఓ ఆఫీస్‌కు వెళ్తాడు. సామ్రాట్ రికమండేషన్‌తో అక్కడకు వెళ్లిన ప్రేమ్.. తన టాలెంట్‌ను చూపించి సెలెక్ట్ అవుతాడు. ఈ విషయాన్ని ఆఫీస్ బాయ్ వచ్చి చెప్తాడు. ఆ తర్వాత లోపలికి రమ్మని పిలుస్తాడు. దీంతో అక్కడే ఉన్న మరో కంటెస్టెంట్ అతడిని అడ్డుకుంటాడు. దీంతో తప్పుకోమని ప్రేమ్ అడుగుతాడు. అప్పుడతను. 'రికమండేషన్ల మీద వచ్చి సెలెక్ట్ అవడం గొప్ప అనిపించుకోదు. మా లాంటి వాళ్ల టాలెంట్లను కూడా మీలాంటి వాళ్లు అడ్డుకుంటున్నారు. మమ్మల్ని పైకి ఎదగకుండా తొక్కేస్తున్నారు' అని అంటాడు.

    తులసిపై నిందలు.. కొట్టిన ప్రేమ్

    తులసిపై నిందలు.. కొట్టిన ప్రేమ్

    ఆ వ్యక్తి మాటలకు ప్రేమ్ 'నేను రికమెండేషన్ కేవలం ఇక్కడికి రావడానికే తీసుకున్నా. కానీ, ఇక్కడికి వచ్చాక ఆడిషన్స్‌లో మాత్రం నా టాలెంట్‌తోనే సెలెక్ట్ అయ్యా' అంటాడు. అప్పుడా కుర్రాడు 'నువ్వు సెలెక్ట్ అవడానికి కారణం మీ అమ్మ. అక్కడ సామ్రాట్ గారిని ఎంతో తెలివిగా ముగ్గులోకి లాగి ఇప్పుడు ఏం తెలియనట్టు మీ అమ్మ నటిస్తోంది. ఇక్కడేమో అన్ని తెలిసి నువ్వు నటిస్తున్నావు. నాకు అంతా తెలుసు. నువ్వేమీ యాక్టింగ్ చేయకు' అని నిందలు వేస్తాడు. దీంతో ప్రేమ్ కోపంతో అతడిని కొడతాడు. దీంతో ఆఫీస్‌లో కుర్రాడు పోలీసులకు ఫోన్ చేసి చెప్తాడు.

    Bigg Boss Elimination: చివరి రోజు మారిన ఓటింగ్.. డేంజర్ జోన్‌లోకి మోడల్.. ఆ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్Bigg Boss Elimination: చివరి రోజు మారిన ఓటింగ్.. డేంజర్ జోన్‌లోకి మోడల్.. ఆ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్

    సామ్రాట్ డీలా... తులసికి డౌట్

    సామ్రాట్ డీలా... తులసికి డౌట్

    సామ్రాట్ ఆఫీస్‌లో మీటింగ్ జరుగుతూ ఉంటుంది. అక్కడే తులసి కూడా ఉంటుంది. కంపెనీలోని ఉద్యోగులు ప్రజెంటేషన్ ఇస్తుండగా.. సామ్రాట్ మాత్రం డీలా పడిపోయినట్లు ఉంటాడు. అంతేకాదు, తులసి నుంచి దూరంగా ఉండమని అనసూయ చెప్పిన మాటలనే ఆలోచిస్తూ కూర్చుంటాడు. దీంతో తులసి అతడిని చూసి కంగారు పడుతుంది. అంతేకాదు, 'ఓవైపు మీటింగ్ జరుగుతుంటే సామ్రాట్ అలా ఉన్నాడు ఏంటి' అని అనుకుంటుంది. వెంటనే మీటింగ్‌లో డిస్టర్బ్‌ ఉన్నారు ఏమైంది అని మెసేజ్ చేస్తుంది. కానీ, సామ్రాట్ మాత్రం ఆ మెసేజ్ పట్టించుకోడు.

    సామ్రాట్‌కు ప్రేమ్ ఫోన్ చేయగా

    సామ్రాట్‌కు ప్రేమ్ ఫోన్ చేయగా

    ఆడిషన్స్ దగ్గర కొట్టుకున్న ప్రేమ్‌, మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత ప్రేమ్ ఫోన్ ఇచ్చి నీ వాళ్లకు ఇక్కడికి రమ్మను అని ఎస్సై అంటాడు. దీంతో తులసికి చేస్తే కంగారు పడుతుందని ప్రేమ్ ఫోన్ సామ్రాట్‌కు చేస్తాడు. అప్పుడు నేను ప్రాబ్లమ్‌లో ఉన్నాను అంటూ జరిగింది మొత్తం వివరించి చెబుతాడు. దీంతో సామ్రాట్ మీటింగ్ మధ్యలోనే అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరోవైపు, సెల్‌లో ప్రేమ్, ఆ వ్యక్తి మళ్లీ కొట్టుకోబోతారు. దీంతో ఎస్సై వాళ్లను బయటకు తీసుకు వస్తాడు. అంతలోనే సామ్రాట్ అక్కడకు వస్తాడు. వచ్చీ రావడమే పూచికత్తు మీద వదిలేయమని అడుగుతాడు. ఆ సమయంలో సదరు కుర్రాడు మళ్లీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాడు. కానీ, సామ్రాట్ పట్టించుకోడు. తర్వాత ఎస్సై వాళ్లను వదిలేస్తాడు.

    హీరోయిన్ శ్రీయ ఎద అందాల జాతర: వామ్మో అలా పడుకుని మరీ!హీరోయిన్ శ్రీయ ఎద అందాల జాతర: వామ్మో అలా పడుకుని మరీ!

    సామ్రాట్ క్లాస్.. ప్రేమ్ ఏడుస్తూ

    సామ్రాట్ క్లాస్.. ప్రేమ్ ఏడుస్తూ

    పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సామ్రాట్ 'నీకు అసలు బుద్ధి ఉందా.. ఏం చేస్తున్నావో అర్థం అవుతుందా' అని క్లాస్ పీకుతాడు. దీంతో ప్రేమ్ 'వాడు ఎలా మాట్లాడుతున్నారో చూశారు కదా' అని అంటాడు. దీంతో సామ్రాట్ 'అందుకని వాడిని కొడతావా? ఇలా రోజూ ఎంత మందిని కొడతావు. ఇవాళ వీడు.. రేపు ఇంకొకడు ఇలాగే చేస్తావా? వాడు అన్న మాటలకు నాకు కోపం రాలేదు అనుకున్నావా' అని సీరియస్ అవుతాడు. అప్పుడు ప్రేమ్ 'మా అమ్మను ఎవరు ఏమన్నా నేను తట్టుకోలేను సార్. అందుకే మా నాన్నతో కూడా నేను సరిగ్గా మాట్లాడటం లేదు. ఈ గొడవలు మా అమ్మకు తెలియనీయకండి సార్. ఇది మనమధ్యే ఉండాలి' అని ఎమోషనల్ అవుతాడు. ఆ తర్వాత ఇద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు.

    తులసిపై సామ్రాట్ సీరియస్

    తులసిపై సామ్రాట్ సీరియస్

    మీటింగ్ మధ్యలోనే సామ్రాట్ లేచి వెళ్లిపోవడంతో వాళ్ల బాబయితో పాటు తులసి టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడు తులసి ఎన్నిసార్లు ఫోన్ చేసినా సామ్రాట్ లిఫ్ట్ చేయడు. తర్వాత కాసేపటికి అతడే ఫోన్ చేస్తే ఎందుకు ఫోన్ చేశారు అని అడుగుతుంది. దీంతో సామ్రాట్ ఎందుకు కాల్ చేశారో చెప్పండి అని అంటాడు. అప్పుడు తులసి లంచ్ టైమ్ అయింది కదా అని అంటుంది. దీంతో సామ్రాట్ 'టైమ్ నా దగ్గర ఉంది. నాకు తెలుసు. మీ పని మీరు చూసుకోండి. నేను లంచ్‌కు రావట్లేదు. బాబాయికి చెప్పండి. ఓకే అని' సీరియస్ అవుతూ ఫోన్ కట్ చేస్తాడు.

    పైన ఏమీ లేకుండానే పూజా హెగ్డే: ఫ్రంట్, బ్యాక్ కనిపించేలా హాట్ షోపైన ఏమీ లేకుండానే పూజా హెగ్డే: ఫ్రంట్, బ్యాక్ కనిపించేలా హాట్ షో

    తులసిపై అనసూయకు డౌట్

    తులసిపై అనసూయకు డౌట్

    ఆఫీస్‌ నుంచి తులసి ఇంటికి వస్తుంది. అప్పుడు అనసూయ తులసి గురించే ఆలోచిస్తుంటుంది. 'సామ్రాట్ నేను చెప్పిన విషయాన్ని వినలేదా.. అసలు ఈ విషయం తులసికి చెప్పాడా లేదా? ఒకవేళ చెప్తే తను గట్టిగా అరిచేస్తుంది. అలా లేదంటే సామ్రాట్ తులసిని దూరం పెట్టడం లేదా? అంటే అందరూ అనుకున్నదే నిజం అయి ఉంటుందా? చీచీ తులసి అలా చేయదు. అసలేం జరిగిందో అర్థం కావడం లేదు' అని తనలో తానే అనుకుంటుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

    English summary
    Intinti Gruhalakshmi Episode 752: Prem Enter Into Trouble At Event Office. Then He Gets Arrested. After That He Contacts Samrat for Help.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X