Intinti Gruhalakshmi Today Episode: వాళ్ల రాకతో లాస్యకు దెబ్బ మీద దెబ్బలు.. నందూ కోసం తులసి సాహసం

సుదీర్ఘ కాలంగా తెలుగులో ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రమే బుల్లితెరపై ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూద్దాం పదండి!

Photos Courtesy: Star మా and Disney+Hotstar

బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. శృతిని అర్థం చేసుకోమని అంకితకు చెప్పడానికి వచ్చిన ప్రేమ్.. ఆమెతో వాదనకు దిగుతాడు. ఆ సమయంలో అతడి తప్పు లేకపోయినా తల్లి కోరిక మేరకు అంకితకు సారీ చెబుతాడు. ఆ తర్వాత శృతి, ప్రేమ్ పెళ్లైనా సంతోషంగా లేకుండా బాధ పడుతుంటారు. తన తల్లికి చాలా కష్టం వచ్చిందని తెగ ఆలోచిస్తుంటాడు ప్రేమ్. ఆ తర్వాత ఇదే విషయం గురించి లాస్య, తులసి మధ్య వాగ్వాదం జరుగుతుంది. ఇక, పెళ్లి ఇష్టం లేని నందూ.. తన పరువు తీశావంటూ లాస్యపై ఫైర్ అవుతాడు. చివర్లో పరందామయ్య అందరినీ తిడతాడు.

ప్రేమ్, శృతి ఫస్ట్ నైట్‌.. తులసికి సలహా

ప్రేమ్, శృతి ఫస్ట్ నైట్‌.. తులసికి సలహా

పరందామయ్య అన్న మాటలతో ఇంట్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆ సమయంలో ఎప్పటి లాగే అనసూయ తన కొడుకును వెనకేసుకుని వచ్చేలా మాట్లాడుతుంది. అప్పుడు పరందామయ్య.. 'ఏంటమ్మా తులసి.. ప్రేమ్, శృతి పెళ్లి చేయగానే బాధ్యత తీరిపోయిందా? సమస్యల్లో పడి వాళ్ల అచ్చట ముచ్చట తీర్చాల్సిన పని లేదా? రేపు పంతులు గారిని పిలిపించు. వీళ్లిద్దరి శోభనానికి ముహూర్తం పెట్టించు' అని సలహా ఇస్తాడు. అప్పుడు అంకిత.. శృతిని కించ పరిచేలా మాట్లాడగా.. పరందామయ్య ఆమెకు సరైన సమాధానం చెప్పి నోరు మూయిస్తాడు.

అందరి ముందే లాస్యకు నందూ దెబ్బ

అందరి ముందే లాస్యకు నందూ దెబ్బ

పరందామయ్య శోభనం గురించి మాట్లాడుతుండగా ప్రేమ్, శృతి మాత్రం కంగారు పడుతుంటారు. ఆ సమయంలో తన భార్యతో 'చూడు అనసూయ.. నువ్వు ఇంట్లో పెద్దదానివి ఇలాంటివి అన్నీ దగ్గరుండి చూసుకోవాలి' అని అంటాడు. అంతలో పని మనిషి రాములమ్మ వచ్చి 'అయ్యగారూ భోజనం రెడీ అయింది వడ్డించమంటారా?' అని అడుగుతుంది. అప్పుడు లాస్య 'రాములమ్మ మాకు ఆకలిగా లేదు. పద నందూ వెళ్లిపోదాం' అంటుంది. అప్పుడు నందూ 'నా కొడుకు నా మాట వినకపోయినా.. నేను నా తండ్రి మాట వింటాను. పద వెళ్లి అన్నం తిందాం' అని షాకిస్తాడు.

ప్రేమ్ శృతి సరసాలు.. ముహూర్తం ఫిక్స్

ప్రేమ్ శృతి సరసాలు.. ముహూర్తం ఫిక్స్

నిద్రపోయినట్లు నటిస్తోన్న ప్రేమ్ దగ్గరకు కాఫీ పట్టుకుని వస్తుంది శృతి. అప్పుడు ఇద్దరూ సరసాలు ఆడుకుంటూ ఉంటారు. అనంతరం పూజారి వచ్చి శోభనానికి ముహూర్తం గురించి చూస్తూ ఉంటాడు. అంతలో నందూ 'ఫస్ట్ నైట్‌కు కూడా ఇంతలా ఆలోచించి ముహూర్తం పెట్టాలా? నాకు టైమ్ అవుతుంది. వెళ్తాను' అంటూ వెళ్లబోతాడు. అంతలో తులసి అతడిని ఆపుతూ 'ఇంటి పెద్ద మీరు ఉండాలి కదా' అంటుంది. దీనికి లాస్య 'అన్నీ నందూను అడిగే చేస్తున్నారా' అంటుంది. అప్పుడు తులసి అవన్నీ మర్చిపోమని కోరుతుంది. పూజారి ముహూర్తం పెడతాడు.

లాస్యకు అవమానం.. ఇంట్లోనే ప్రాజెక్ట్

లాస్యకు అవమానం.. ఇంట్లోనే ప్రాజెక్ట్

నందూ కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చిన వాళ్లు తులసి ఇంటికి వస్తారు. ఆ సమయంలో గట్టిగట్టిగా అరుస్తూ నాన రచ్చ చేస్తారు. ఆ సమయంలో లాస్య 'తులసి చూశావా? నందూ పరువు పోతోంది. ఆ రెండు కోట్లు ఇస్తానన్నావు కదా ఇవ్వు' అని అంటుంది. అప్పుడు ఆ కంపెనీ వాళ్లు ఆమె ఎవరంటూ ప్రశ్నించగా.. నందూ మాజీ భార్య అని బదులిస్తుంది లాస్య. ఆ తర్వాత ఇంతకీ నువ్వెవరు అని అడగడంతో లాస్యకు అవమానం జరుగుతుంది. అప్పుడు 'ఇంట్లోనే మాజీ, కాబోయే భార్యలను పెట్టుకుని ప్రాజెక్ట్ చేస్తుంటే.. మన ప్రాజెక్టు ఎందుకు గుర్తుంటుంది' అని చురకలేస్తాడు.

నందూ కోసం తులసి.. శశికళ ఎంటర్

నందూ కోసం తులసి.. శశికళ ఎంటర్

కంపెనీ వాళ్లు రెచ్చిపోయి మాట్లాడుతుండగా తులసి వచ్చి 'పెనాల్టీ కట్టను. ఒకవేళ కట్టకపోతే ఏమౌతుంది? జైలుకు వెళ్లినా మీకు ప్రయోజనం ఉండదు కదా. నా మాట విని ప్రాజెక్టు పూర్తి చేయడానికి కొద్ది రోజులు గడువు ఇవ్వండి. దాన్ని దగ్గరుండి చేసే బాధ్యత నాది. అందుకు గానూ నా ఇంటిని తాకట్టు పెడతాను' అని అంటుంది. అంతలో అక్కడకు శశికళ ఎంట్రీ ఇస్తుంది. అప్పుడామె 'చూడమ్మీ ఈ ఇల్లు నాకు తాకట్టు పెట్టావు కదా? ఇప్పుడెలా వీళ్లకు చెబుతున్నావ్' అని అడుగుతుంది. దీనికి తులసి 'అవసరమైతే ఇల్లు అమ్మేసి మీ అప్పు తీరుస్తా' అంటుంది.

ఇద్దరికీ తులసి నమ్మకం.. అంకిత అలా

ఇద్దరికీ తులసి నమ్మకం.. అంకిత అలా

శశికళ దగ్గర నందూ తీసుకున్న అప్పు మొత్తం తీర్చుతానని తులసి హామీ ఇవ్వడంతో ఆమె వెళ్లిపోతుంది. ఆ తర్వాత కంపెనీ వాళ్లు కూడా తులసి మాటలను నమ్మి ప్రాజెక్టు పూర్తి అవడానికి గడువు ఇస్తున్నట్లు చెప్పి వెళ్లిపోతారు. ఆ తర్వాత అంకిత మాట్లాడుతూ.. 'ఇప్పుడీ పరిస్థితి రావడానికి శృతే కారణం' అని నిందిస్తుంది. అప్పుడు ప్రేమ్ 'చూడు అన్నయ్య వదిన ఎప్పుడూ శృతినే అంటోంది. నువ్వైనా చెప్పు. అమ్మకు మాటిచ్చాను కాబట్టి నేను నీతో మాట్లాడడం లేదు. మరోసారి అలా మాట్లాడితే మాత్రం అస్సలు బాగుండదు' అని చెప్పి వెళ్లిపోతాడు.

Recommended Video

Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
కళ్లు తిరిగి పడిపోయిన తులసి.. నందూ

కళ్లు తిరిగి పడిపోయిన తులసి.. నందూ

ప్రేమ్ పెళ్లి.. రెండు కోట్ల రూపాయల అప్పులు.. శశికళ రాక.. ఇలా కొద్ది రోజులుగా ఇంట్లో జరుగుతోన్న పరిణామాలను తలుచుకుంటూ తెగ టెన్షన్ పడుతుంటాడు నందూ. అదే సమయంలో కింద నడుచుకుంటూ ఇవన్నీ ఆలోచిస్తుంటుంది తులసి. అలా కాసేపు తిరిగి తిరిగి ఆమె కింద పడిపోతుంది. దీంతో నందూ కంగారుగా తులసి తులసి అంటూ అరుస్తుంటాడు. దీంతో ఈ రోజు ఎపిసోడ్ పూర్తైపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X