For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: అతడి వల్లే తులసికి ఇల్లు.. నిజం చెప్పి షాకిచ్చిన పరందామయ్య

  |

  జనరేషన్లు మారుతూ ఉన్నప్పటికీ తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూద్దాం పదండి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తులసికి పరందామయ్య సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన తర్వాత అందులో ఏముందో అని అందరూ ఆసక్తిగా చూస్తుంటారు. కానీ, ఆయన మాత్రం తులసి పాత ఇంటికి అందరినీ తీసుకు వెళ్లి అక్కడ ఓపెన్ చేయమని చెప్తాడు. అది తీసి చూడగా అందులో రిజిస్ట్రేషన్ పత్రాలతో పాటు ఇంటి తాళాలు ఉంటాయి. అవి తీసుకుని కుటుంబ సభ్యులు అందరూ ఇంట్లోకి వెళ్తారు. ఆ సమయంలో అనసూయకు సందేహాల మీద సందేహాలు వస్తుంటాయి. ఇక, చివర్లో తులసి.. అసలు ఇల్లు ఎలా తిరిగి వచ్చిందని పరందామయ్యను ప్రశ్నిస్తుంది.

  షర్ట్ విప్పేసి షాకిచ్చిన యంగ్ హీరోయిన్: ఎద అందాలను ప్రదర్శిస్తూ హాట్ షో

  తులసికి జవాబు చెప్పిన మామ

  తులసికి జవాబు చెప్పిన మామ

  ఇంటిని గిఫ్టుగా ఇవ్వడంతో అంత సాహసం ఎందుకు చేశారని పరందామయ్యను తులసి ప్రశ్నిస్తుంది. అంతేకాదు, 'అసలు మీరు ఎందుకు ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఈ ఇంటిని నాకు గిఫ్ట్‌గా ఇచ్చారు' అని అడుగుతుంది. దీంతో ఆయన 'నీకంటూ ఒక ఇల్లు ఉండాలి. నీదంటూ ఒకటి ఉండాలి. ఇప్పుడు మా దగ్గర నువ్వు ఉన్నట్టు కాదు. నీ దగ్గర మేము ఉన్నాం. ఈ ఇల్లు నీది' అంటాడు. ఆ సమయంలోనే అనసూయ వచ్చి మమ్మల్ని ఉన్నపళంగా ఇక్కడికి తీసుకొచ్చావు. సామాన్లు తెచ్చుకోవద్దా అంటుంది. దీనికాయ 'మీ అందరినీ ఇంటికి తీసుకొచ్చిన వాడిని.. మిగితా ఏర్పాట్లు చూసుకోనా' అంటాడు. ఆ తర్వాత ప్రేమ్, అభిని పిలిచి సామాన్ల షిఫ్టింగ్ ఏర్పాటు చేశానని చెప్తాడు.

  నందూ, లాస్యకు మేటర్ చెప్పి

  నందూ, లాస్యకు మేటర్ చెప్పి

  ఉద్యోగం మానేసిన నందూ.. కొత్త జాబ్ కోసం నోటిఫికేషన్లను వెతుకుతూ ఉంటాడు. అంతలో అక్కడికి భాగ్య వస్తుంది. వచ్చీ రావడమే ఆమె 'దేనికైనా రాసిపెట్టి ఉండాలి. మీకేమో ఉన్నవి ఊడుతున్నాయి. ఆమెకేమో లేనివి వస్తున్నాయి. ఆవిడ సంతోషంగా గృహ ప్రవేశం చేసుకుంటోంది. తులసి అక్క అమ్ముకున్న ఇంటిని మామయ్య గారు కొని ఆమెకు గిఫ్ట్‌గా ఇచ్చారట' అని నిజం చెప్పేస్తుంది. కానీ, లాస్య మాత్రం నమ్మదు. దీంతో లాస్యకు ఫోన్‌లో ఆ వీడియోను చూపిస్తుంది. అక్కడ ఇంటిల్లి పాది సంబురాలు చేసుకుంటున్నారు అని లాస్యను రెచ్చగొడుతుంది.

  Ori Devuda Twitter Review: విశ్వక్ మూవీకి అలాంటి టాక్.. వెంకటేష్ రోల్ ఇలా.. ఫైనల్ రిపోర్ట్ ఏంటంటే!

  రెచ్చగొట్టేలానే మాట్లాడిన భాగ్య

  రెచ్చగొట్టేలానే మాట్లాడిన భాగ్య

  ఆ తర్వాత భాగ్య 'అక్కడ జరుగుతున్న దాని గురించి కనీసం బావ గారికి సమాచారం ఇచ్చారా' అని రచ్చగొడుతుంది. దీంతో లాస్య అక్కడ సామ్రాట్ చేసిన అవమానం కన్నా ఇది పెద్ద అవమానం అంటుంది. అప్పుడు నందూ గృహ ప్రవేశం చేసింది తులసి. మనల్ని పిలవాల్సిన అవసరం ఏంటి అంటాడు. అప్పుడు భాగ్య 'అంత విలువైన ఇంటిని తులసి అక్కకు గిఫ్ట్‌గా ఇవ్వడం ఏంటి. మామయ్య గారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా. ఎవ్వరూ ఆయనకు కనిపించలేదా. మీరు వదిలేసిన తులసక్కకు ఆయన గిఫ్ట్ గా ఇవ్వడం ఏంటి' అని అంటుంది. దీంతో లాస్య వెంటనే ఫోన్ చేసి అడుగు నందూ అంటుంది. దీంతో నందూనే వెళ్లాలని భాగ్య అంటుంది. కానీ, అతడు మాత్రం రానని అంటాడు.

  నిజం చెప్పిన పరందామయ్య

  నిజం చెప్పిన పరందామయ్య


  ఇక, సామాన్లు వచ్చాక తులసి పూజలు చేయడం మొదలు పెడుతుంది. దీంతో అందరూ ఇంట్లో సంతోషంగా ఉంటారు. హారతి తీసుకోండి అని అందరికీ ఇవ్వబోతుండగా అప్పుడే సామ్రాట్ వచ్చి తన హారతి తీసుకుంటాడు. అంతేకాదు, ఈ ఇంట్లో మొదటి హారతి కళ్లకు హద్దుకునే అదృష్టం నాకే దక్కింది అంటాడు. అప్పుడు తులసి నేను ఇక్కడ ఉన్నానని మీకు ఎలా తెలిసింది అని అడుగుతుంది. దీంతో పరందామయ్య 'ఇప్పుడు మనం ఇక్కడ ఉండటానికి కారణమే ఆయనే. కోర్టులో ఉన్న లిటిగేషన్ లాండ్‌ను ఆయన కొనబట్టే మనం ఈ ఇంటిని కొనగలిగాం' అంటాడు.

  స్టార్ హీరోయిన్‌‌ను ఇబ్బంది పెడుతున్న నిర్మాత: పెళ్లి చేసుకోకుండా అలా చేయమంటూ!

  గొడవలు పెట్టిన నందూ, లాస్య

  గొడవలు పెట్టిన నందూ, లాస్య

  అప్పుడే నందూ, లాస్య, భాగ్యలు అక్కడకు వస్తారు. అంతేకాదు, లాస్య 'మీది ఎంత గొప్ప మనసో.. ముచ్చటేస్తోంది సామ్రాట్. గౌరవం పోగొట్టుకున్నావు. నేనేం చేయను చెప్పు. అందుకే ఇలా మాట్లాడుతున్నా' అంటుంది. దీంతో తులసి మా ఇంటికి వచ్చి మా అతిథిని అగౌరవ పరిచే హక్కు నీకు లేదు అంటుంది. అప్పుడు పరందామయ్య సోది ఆపి అసలు విషయం ఏంటో చెప్పు లాస్య అంటాడు. దీంతో మేము బయటి వాళ్లం కాదు కదా మామయ్య. నీ కొడుకు, కోడలే కదా అంటూ తర్వాత తులసిని నిలదీస్తుంది. అంతలో భాగ్య మీరు మాట్లాడరు ఏంటి అత్తయ్య అంటుంది.

  ఎదురు తిరిగిన పరందామయ్య

  ఎదురు తిరిగిన పరందామయ్య

  భాగ్య అడిగిన మాటలకు అనసూయ 'ఈ ఇంట్లో ఎవరి ఇష్టం వారిది అయిపోయింది. నా పెద్దరికానికి విలువ లేకుండా పోయింది. నన్ను అడగకు' అంటుంది. అప్పుడు పరందామయ్య 'నాతో ఎవరూ మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు' అంటాడు. అప్పుడు తులసి 'ఈ ఇల్లు అమ్మగా వచ్చిన డబ్బులో నీ వాటా నువ్వు తీసుకెళ్లావు కదా.. మళ్లీ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు' అని భాగ్యను ప్రశ్నిస్తుంది. దీనికి పరందామయ్య 'నా స్వార్జితంతో ఇల్లు కొని నేను తులసికి ఇచ్చాను. ఇందులో వాటా అడిగే హక్కు ఎవరికీ లేదు' అంటాడు.

  అందాల ఆరబోతలో గీత దాటిన దివి: సీక్రెట్ పార్ట్స్ కనిపించేలా హాట్ షో

  ఆస్తి కోసం తులసి డ్రామా అని

  ఆస్తి కోసం తులసి డ్రామా అని

  ఆ తర్వాత లాస్య 'మేము మిమ్మల్ని చూసుకోవడానికి రెడీగా ఉన్నాం. కానీ, తులసి అడ్డు పడింది. ఇదిగో ఇలా ఆస్తి కోసమే' అని ఆమెపై ఆరోపణలు చేస్తుంది. దీంతో పరందామయ్య 'పట్టుపట్టాం కాబట్టే తులసి మమ్మల్ని తన దగ్గర ఉంచుకుంటోంది. మేము బలవంతం చేయబట్టే ఈ ఇంటిని తన పేరు మీద రాసేందుకు ఒప్పుకుంది. పరాయి మనిషి అయినా ఈ ఇంటితో సంబంధం లేకపోయినా సామ్రాట్ హెల్ప్ చేశాడు' అని చెప్తాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 769: Lasya and Bhagya Provoke Nandhu About Parandhamaiah Gift. After That Nandhu Went to Tulasi House and Create a Scene.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X