Don't Miss!
- Automobiles
కార్లలో బెస్ట్ ఆడియో సిస్టమ్స్ కోసం చూస్తున్నారా..? అయితే ఇవిగో..!
- Finance
ఇండియాకు మెట్రో గుడ్‌బై? కొనుగోలుకు అమెజాన్, డీమార్ట్, రిలయన్స్ పోటీ?
- News
మంకీపాక్స్ కలవరం: 10 రోజుల్లో 12 దేశాలకు వ్యాప్తి, వేగం పెరగనుందని డబ్ల్యూహెచ్ఓ అలర్ట్
- Sports
IND vs SA 2022: సన్‌రైజర్స్ ప్లేయర్స్‌కు పిలుపు?: రెండుగా టీమిండియా: కోచ్‌గా వీవీఎస్?
- Technology
OnePlus స్నాప్‌డ్రాగన్ కొత్త చిప్ ఫీచర్లతో వన్‌ప్లస్ బ్రాండ్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను ప్రకటించింది
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు మే 22 నుండి 28వ తేదీ వరకు..
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Intinti Gruhalakshmi Today Episode: తులసిని ఎత్తుకున్న నందూ.. ఫస్ట్ నైట్ చేసుకోవాలని ఉందని చెబుతూ!
భారతదేశంలో చాలా భాషల్లో బుల్లితెరపై సీరియళ్లు ప్రసారం అవుతోన్నా.. తెలుగులో వచ్చే వాటికి మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరూ ఓ లుక్కేయండి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే
గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. కొత్తగా పెళ్లైన ఇంట్లో అందరూ దిగాలుగా ఉండడంపై సీరియస్ అయిన పరందామయ్య.. శృతి, ప్రేమ్ శోభనానికి ముహూర్తం పెట్టించమని తులసికి సలహా ఇస్తాడు. దానికి సంబంధించిన సీన్ జరుగుతుండగా.. నందూకు కాంట్రాక్ట్ ఇచ్చిన కంపెనీ వాళ్లు పెనాల్టీ కట్టమని వస్తారు. అప్పుడు తులసి రెండు కోట్లు కట్టకుండా.. కంపెనీ వాళ్లను గడువు అడుగుతుంది.
అప్పుడు శశికళ కూడా తన డబ్బుల కోసం అక్కడకు వస్తుంది. ఆమెకు కూడా తులసి సర్ధి చెబుతుంది. దీంతో ఆమెపై నమ్మకం ఉంచి వాళ్లంతా అక్కడి నుంచి వెళ్లిపోతారు.
Bigg Boss: బిగ్ బాస్ సీక్రెట్స్ తెలుసుకున్న రవి.. టాప్ 5లో ఉండే కంటెస్టెంట్లు ఎవరో చెప్పేశాడుగా!

ప్రేమ్ ఫస్ట్ నైట్... అంకితపై అభి ఫైర్
ఉదయాన్నే రెడీ అయి అంకితను బయటకు వెళ్దాం అంటాడు అభి. దేనికి అని ప్రశ్నించగా 'ప్రేమ్ ఫస్ట్ నైట్ కదా.. దానికి కావాల్సినవి అన్నీ తీసుకుని వద్దాం పదా' అంటాడు. అప్పుడు అంకిత 'శృతి గురించి నా దగ్గర మాట్లాడొద్దని చాలా సార్లు చెప్పాను కదా. మళ్లీ మళ్లీ ఆ టాపిక్ తీసుకు రావొద్దు' అని అంటుంది. దీనికి అభి 'అంకిత ఈ మధ్య నువ్వు బాగా ఓవర్ చేస్తున్నావ్. ఎంత కాదన్న వాడు నా తమ్ముడు. శృతి ఈ ఇంటి కోడలు. పెద్ద కొడుకు, కోడలిగా ఫస్ట్ నైట్ బాధ్యతను అమ్మ మన మీద పెట్టింది. నీకు నచ్చకపోయినా చేయాల్సిందే' అని ఫైర్ అవుతాడు.

అంకితకు లాస్య సలహా.. టార్గెట్ శృతి
ఎంత చెప్పినా అంకిత వినకపోయే సరికి అభి 'అందుకే నీ గురించి అందరూ చెడుగా అనుకుంటున్నారు' అని వెళ్లిపోతుంటాడు. అంతలో అంకిత మరి నువ్వేమనుకుంటున్నావో చెప్పు అని అడగ్గా.. అతడు కోపంగా వెళ్లిపోతాడు. దీంతో ఆమె ఎంతగానో రగిలిపోతుంది. అప్పుడు లాస్య ఎంట్రీ ఇచ్చి 'చూడు అంకిత.. నీ కోపాన్ని అర్థం చేసుకోగలను.
కానీ, నీకు నచ్చకపోయినా శృతితో మంచిగా ఉన్నట్లు నటించు. ముందు నీ భర్తను అదుపులో పెట్టుకో.. ఆ తర్వాత తనే శృతితో గొడవ పెట్టుకుంటాడు. నన్ను నమ్ము.. నేను చెప్పినట్లు చెయ్' అంటూ సలహాలు ఇస్తుంది.
మితిమీరిన జాన్వీ కపూర్ హాట్ షో: ఘాటు ఫోజులో అందాలను మొత్తం చూపిస్తోన్న శ్రీదేవి కూతురు

తులసికి నందూ సాయం.. క్లాస్ పీకుతూ
ఏవేవో ఆలోచిస్తూ కళ్లు తిరిగి పడిపోయిన తులసిని నందూ లోపలికి మోసుకుంటూ తీసుకుని వస్తాడు. కొద్ది సేపటి తర్వాత ఆమె స్పృహలోకి వస్తుంది. దీంతో నందూ 'నువ్వు ఒక హౌస్‌వైఫ్‌వు మాత్రమే. బతుకుదెరువు కోసం నానా తంటాలు పడుతోన్న మామూలు మనిషివి. అలాంటిది నా రెండు కోట్ల కోసం ఆలోచించి పడిపోయావ్. ఇప్పటికైనా అర్థమైందా? నేను ఎంత కష్టపడుతున్నానో. చిన్న దానికే నీకిలా ఉంటే కంపెనీని నడిపే నా పరిస్థితి ఎలా ఉంటుంది? ఇంట్లో వాళ్లకు కష్టం తెలియకుండా జాగ్రత్తలు పడుతున్నా' అంటూ క్లాస్ పీకుతుంటాడు.

మీరు కట్టిన తాళి నా మెడలోనే ఉంటది
నందూ అన్న మాటలకు స్పందిస్తూ.. 'మీ గురించి ఆలోచించి నాకు కళ్లు తిరిగి పడిపోలేదు. పొద్దున్న నుంచి ఏమీ తినలేదు కాబట్టి అలా జరిగింది. జీవితంలో నేను నమ్మి మోసపోయాను కానీ.. నేనెవరినీ మోసం చేయలేదు. ఒక్కసారి మీ మనసును అడగండి.. మన విడాకులకు నా మొండితనం కారణమా? నా స్థానంలోకి మీరు మరో ఆడదాన్ని తీసుకుని రావడమా? ఇప్పటికైనా నా గురించి నన్ను చెప్పుకోనివ్వండి.
మీరు నన్ను శత్రువులా చూస్తున్నా.. నేనెప్పుడూ అలా చూడలేదు. మీరు కట్టిన తాడు ఎప్పటికీ నా మెడలోనే ఉంటుంది. మీరెప్పుడూ నా గుండెలోనే ఉంటారు. నాది నటన కాదు' అని బదులిస్తుంది తులసి.
అరాచకమైన ఫొటోను వదిలిన పూజా హెగ్డే: ఒక పక్క విప్పేసి మరీ.. ఆమెను ఇంత హాట్‌గా ఎప్పుడూ చూసుండరు!

నందూకు బ్యాడ్ న్యూస్ చెప్పిన తులసి
తులసి మాటలతో నందూలో 'నీ నరనరంలో అహంకారం ఉంది. అందుకే మనకు విడాకులు అయ్యాయి. అయినా ఇప్పటికీ ఆ రెండు కోట్లు నువ్వే కదతానని అనుకుంటున్నావా?' అంటూ కోప్పడతాడు. అప్పుడు తులసి 'అవును నేనే కడతాను. రేపటి నుంచి మనం కంపెనీ రీఓపెన్ చేస్తున్నాం.. ప్రాజెక్టును గడువులోగా పూర్తి చేస్తున్నాం. ఆ ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత మీది.. దాన్ని దగ్గరుండి చేయించే బాధ్యత నాది. నా మీద నమ్మకంతోనే వాళ్లు మళ్లీ గడువు ఇచ్చారు. ఎనీవే.. కళ్లు తిరిగి పడిపోగానే నా గురించి టెన్షన్ పడి తీసుకొచ్చినందుకు థ్యాంక్స్' అని అంటుంది.

మారిపోయిన అంకిత... తులసి ప్రశంస
ఉదయాన్నే శృతి గురించి అభితో గొడవ పడిన అంకిత.. లాస్య మాటలను వెంటనే ఆచరణలో పెట్టేస్తుంది. ఇందులో భాగంగానే భర్తతో కలిసి ఫస్ట్ నైట్ కోసం రూమ్, బెడ్ సిద్ధం చేస్తుంది. దీంతో అభి 'ఉదయాన్నే శృతి గురించి గొడవ పడ్డావు. ఇప్పుడేంటి ఇలా మారిపోయి ఫస్ట్ నైట్‌కు రెడీ చేస్తున్నావ్' అని అడుగుతాడు.
దీంతో ఆమె తప్పు తెలుసుకుని మారిపోయాను అని అంటుంది. అంతలో అక్కడకు వచ్చిన తులసి రూమ్ చూసి ఆశ్చర్యపోతుంది. అలాగే, అంకితను ప్రశంసిస్తూ.. 'అందరూ కలిసి ఉంటున్నప్పుడు చిన్న చిన్న పొరపచ్చాలు మామూలే' అని అంటుంది.

వాళ్లంతా ఫస్ట్ నైట్ గురించి ఆలోచిస్తూ
ఫస్ట్ నైట్ జరగబోయే ఏర్పాట్లు చూడగానే అభి, అంకిత మళ్లీ అలాంటి అనుభూతి కావాలని కోరుకుంటారు. అంతలో తులసి వాళ్లను ప్రేమ్, శృతిని తీసుకు రమ్మని పంపుతుంది. ఆ సమయంలో ఆమె కూడా తనకు నందూతో జరిగిన ఫస్ట్ నైట్ గురించి ఆలోచించుకుంటుంది. ఆ తర్వాత తన పరిస్థితి గురించి ఊహించనుకుని బాధ పడుతుంది.
ఇక, నందూ, లాస్య మధ్య కూడా అలాంటి సంభాషణే జరుగుతుంది. అప్పుడు లాస్య 'మన పెళ్లి కూడా అయిపోతే ఫస్ట్ నైట్ చేసుకునేవాళ్లం' అంటుంది. దీనికి నందూ.. నాకు ఇద్దరు పిల్లలు అనగా.. లాస్య అదంతా మర్చిపోమని అంటుంది. దీంతో ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.