Intinti Gruhalakshmi Today Episode: నందూకు అనసూయ సపోర్ట్.. ఇంట్లో వాళ్లకు షాకిచ్చిన తులసి

దాదాపు రెండు మూడు దశాబ్దాలుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే చూడండి!

Photos Courtesy: Star మా and Disney+Hotstar

శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. పరందామయ్య సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన తర్వాత అంత ఖర్చు ఎందుకు చేశారంటూ తులసి ఆయనను ప్రశ్నిస్తుంది. దీంతో నీకంటూ ఏమీ లేదనే ఈ ఇల్లు ఇచ్చాను అంటాడు. ఆ తర్వాత ఈ ఇల్లు విషయాన్ని నందూ, లాస్యకు భాగ్య చెప్పి బాగా రెచ్చగొడుతుంది. దీంతో వాళ్లంతా తులసి ఇంటికి వెళ్లి గొడవ చేయాలని అనుకుంటున్నారు. ఇక, ఇంట్లో పూజ సమయానికి సామ్రాట్ వస్తాడు. అప్పుడే నందూ, లాస్య, భాగ్యలు వచ్చి గొడవ చేస్తారు. ఆ సమయంలో సామ్రాట్ వల్లే తను ఈ ఇల్లు కొనగలిగానన్న నిజాన్ని పరందామయ్య చెబుతాడు.

సామ్రాట్‌ను వెళ్లిపోమన్న నందూ

సామ్రాట్‌ను వెళ్లిపోమన్న నందూ

తులసి ఇంటికి సామ్రాట్ రావడంతో నందూ, లాస్య గొడవ మొదలు పెడతారు. ఆ సమయంలో తులసి కూడా వాళ్లకు ధీటుగానే సమాధానం చెబుతుంది. ఆ సమయంలో నందూ తులసిని కాకుండా అక్కడకు వచ్చిన సామ్రాట్‌ను టార్గెట్ చేసి కామెంట్లు చేస్తుంటాడు. ఆ తర్వాత అతడిని నేరుగానే విమర్శించడం మొదలు పెడతాడు. అంతేకాదు, 'అసలు మా ఫ్యామిలీ విషయంలో మీరెందుకు జోక్యం చేసుకుంటున్నారు. మీకు ఈ ఫ్యామిలీకి సంబంధమేంటి? మీరు ముందు ఇక్కడి నుంచి వెళ్లిపోండి' అని అంటాడు. దీంతో సామ్రాట్ బయటకు వెళ్లిపోబోతాడు.

సామ్రాట్‌ను వెళ్లొద్దన్న తులసి

సామ్రాట్‌ను వెళ్లొద్దన్న తులసి

సామ్రాట్ బయలుదేరుతుండగా తులసి ఆపుతుంది. అంతేకాదు, మీరు ఎవరి కోసం ఇక్కడికి వచ్చారు అని అడుగుతుంది. దీంతో అతడు మీకోసమే అంటాడు. అప్పుడు తులసి 'మరి.. మీరెందుకు వెళ్లిపోతున్నారు. మీరు అలా వెళ్లిపోతే నన్ను అవమానించినట్టే. ఇది నా ఇల్లు. మీరు ఎప్పుడైనా రావొచ్చు ఎప్పుడైనా వెళ్లొచ్చు. అయినా మధ్యలో మీ పెత్తనం ఏంటి' అంటూ నందూను ప్రశ్నిస్తుంది. దీనికతడు 'చూశావా.. ఆస్తి ఇచ్చి ఎంత పని చేశారో.. మీ ముందే ఎలా చేస్తుందో చూశారు కదా. రేపు నా ఫ్యామిలీకి కూడా ఇలాంటి పరిస్థితే వస్తుందేమో' అంటాడు.

నందూకు అనసూయ సపోర్టుగా

నందూకు అనసూయ సపోర్టుగా

తులసి మాటలతో లాస్య ఇంకా ఇక్కడ ఉండటం ఎందుకు? నందూ వెళ్దాం పదా అంటుంది. దీంతో ఇద్దరూ బయటకు వెళ్లిపోతుండగా.. అనసూయ ఆపుతుంది. అంతేకాదు, 'నీకు ఎవరు విలువ ఇచ్చినా ఇవ్వకున్నా నేను ఇస్తాను. వాడు ఈ ఇంటి పెద్ద కొడుకు. ఆ మర్యాద అయినా ఇవ్వాలి. నందూ ఇక్కడికి ఎప్పుడైనా రావచ్చు.. రావద్దని అంటే నేను కూడా ఈ ఇంట్లో ఉండను. ఏమండి ఏమంటారు చెప్పండి' అంటుంది. అప్పుడు పరందామయ్య 'తులసి ధైర్యం చూస్తే ముచ్చటేస్తుంది' అని మనసులో అనుకుంటాడు. కానీ, లాస్య మాత్రం మామగారు అటు వైపే అంటుంది.

ఇంట్లో వాళ్లకు షాకిచ్చిన తులసి

ఇంట్లో వాళ్లకు షాకిచ్చిన తులసి

అనసూయ మాటలకు తులసి 'అత్తయ్య.. నేను మీ అబ్బాయిని ఇక్కడికి రావద్దని అనను. ఆయన ఎప్పుడైనా రావచ్చు. కానీ, నా విషయంలో మాత్రం జోక్యం చేసుకోవద్దు. సామ్రాట్ గారు నా ఫ్రెండ్. ఆయన కూడా ఎప్పుడైనా ఈ ఇంటికి వస్తారు. అంతేకాదు, రేపు మేము ఆఫీసు పని మీద వరంగల్ వెళ్తున్నాం. ఇద్దరం ఒకే కారులో వెళ్తున్నాం. సామ్రాట్ గారు మా వాళ్లు అంతే. వాళ్ల గురించి పట్టించుకోకండి. రేపు మీరు చెప్పిన టైమ్‌కు రెడీగా ఉంటాను' అంటుంది. అప్పుడు పరందామయ్య తులసిలో వచ్చిన తెగింపు చూసి ఇప్పుడు ధైర్యం వచ్చింది అనుకుంటాడు.

తులసి బాధను చెప్పిన మామ

తులసి బాధను చెప్పిన మామ

తులసి తీరుపై అనసూయ టెన్షన్ పడుతుంటుంది. అంతలో రూమ్‌లోకి పరందామయ్య వస్తాడు. అంతేకాదు, 'నాతో మాట్లాడవా. ఎన్ని రోజులు ఇలా మౌనంగా ఉంటావు చెప్పు. ఎప్పుడు మనకు చివరి క్షణం అవుతుందో తెలియదు. ఉన్నప్పుడు నాతో మాట్లాడకపోతే.. ఆ తర్వాత మాట్లాడటానికి నేను ఉంటానో తెలియదు' అంటాడు. దీంతో అనసూయ 'నా కోపం మీ మీద కాదు. తులసి మాట వినడం లేదని బాధ. బిడ్డ లాంటి తులసి బాగు కోసం నేను ఆరాటపడటం తప్పా. నేను అడిగింది ఒక్కటే. ఆ సామ్రాట్ కు దూరంగా ఉండమని. ఈ ఒక్క విషయం తను వినలేదా' అంటుంది. దీనికాయన 'తనను బాధపెట్టేలా చేయడం తప్పు. తులసి బాధ కూడా అదే. అన్నీ అత్తయ్య చెప్పినట్టే వింటున్నాను కదా. ఈ విషయంలో ఎందుకిలా చేస్తున్నారు అని' అంటాడు.

తులసికి ఫోన్ చేసిన సామ్రాట్

తులసికి ఫోన్ చేసిన సామ్రాట్

ఉదయాన్నే వరంగల్ వెళ్లాల్సి ఉండడంతో తులసి తన బట్టలు సర్దుకుంటూ ఉంటుంది. ఇంతలో ఆమెకు సామ్రాట్ ఫోన్ చేసి 'సారీ తులసి గారు.. నేను మీ ఇంటికి వచ్చిన ప్రతిసారీ నా వల్ల మీ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి' అంటాడు. అప్పుడామె 'ఈ ఇంట్లో సమస్యలకు కారణం మీరు కాదు నేను.

ఇలాంటివి అలవాటు చేసుకున్నాను. మీరు కూడా అలవాటు చేసుకోండి' అంటుంది. అప్పుడు సామ్రాట్ 'రేపు మనం వరంగల్ వెళ్లబోయే మీటింగ్‌కు సంబంధించిన ఫైల్స్ గురించి చెబుదామని ఫోన్ చేశాను' అంటాడు. ఆ తర్వాత సామ్రాట్ దగ్గరికి వాళ్ల బాబాయి వస్తాయి. తులసితో కలిసి వెళ్తున్నందుకు సామ్రాట్‌కు నిద్ర పట్టదేమో అన్నట్లు మాట్లాడతాడు.

కన్నింగ్ ప్లాన్‌‌తో నందూ, లాస్య

కన్నింగ్ ప్లాన్‌‌తో నందూ, లాస్య

ఆ తర్వాత నందూ మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నా.. వాళ్ల కంపెనీలో ఏదో ఓపెనింగ్స్ ఉన్నాయట. రమ్మన్నాడు అని లాస్యతో అంటాడు. దీనికామె 'ఇప్పుడు కాదు కానీ.. రేపు వెళ్లు. ఇప్పుడు మీ ఇంటికి వెళ్దాం పదా' అంటుంది. దీంతో ఎందుకు నిన్ననే వెళ్లాం కదా. మళ్లీ ఇప్పుడు ఎందుకు అంటాడు. దీనికామె 'నిన్న మీ అమ్మ నీకు సపోర్ట్ చేసింది. అంటే అత్తయ్య గారు మనవైపు ఉన్నారు' అంటుంది. మరోవైపు తులసి రెడీ అవుతుంది. అనసూయకు చాలా కోపం వస్తుంటుంది. ఇంతలో అక్కడికి నందూ, లాస్య వస్తారు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X