Intinti Gruhalakshmi Today Episode: తులసికి దొరికిన లాస్య నందూ.. శోభనం గదిలో ప్రేమ్‌కు శృతి షాక్

బుల్లితెరపై ఎన్నో రకాల సీరియళ్లు వస్తున్నాయి. కానీ, తెలుగులో వచ్చే వాటికి మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూద్దాం పదండి!

Photo Courtesy: Star మా and Disney+Hotstar

శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. కళ్లు తిరిగి పడిపోయిన తులసిని ఎత్తుకుని రూమ్‌లోకి తీసుకొస్తాడు నందూ. ఆ తర్వాత ఆమెకు అతడు క్లాస్ పీకుతాడు. అనంతరం తులసి కూడా ఘాటుగానే బదులిస్తూ కంపెనీని ఓపెన్ చేయాలని చెబుతుంది. ఆ తర్వాత నందూకు ఆమెకు మధ్య వాగ్వాదం జరుగుతుంది. ఇక, శృతి అంటే ఇష్టపడని అంకితకు లాస్య కొన్ని సలహాలు ఇస్తుంది. ఇక, ప్రేమ్, శృతి ఫస్ట్ నైట్ కోసం ఏర్పాట్లను స్వయంగా చేస్తుంది అంకిత. ఆ సమయంలో తులసి తన పాత రోజులను గుర్తు చేసుకుంటుంది. ఆ తర్వాత లాస్య కూడా నందూతో రొమాన్స్ చేస్తుంది.

నందూ, లాస్య సరసాలు.. తులసి ఫైర్

నందూ, లాస్య సరసాలు.. తులసి ఫైర్

ఫ్యూచర్ గురించి మాట్లాడుతూ రొమాన్స్ పండిస్తుంటారు నందూ, లాస్య. అంతలో తులసి అక్కడకు రావడంతో నందూ కంగారు పడతాడు. అప్పుడు లాస్య 'మనిషి వయసు పెరగ్గానే సరిపోదు.. బుద్ది రావాలి. భార్య భర్తలు ఉన్న గదిలోకి వచ్చేటప్పుడు అడిగి రావాలన్న కామన్‌సెన్స్ లేదా? ఇలా చెప్పాపెట్టకుండా వచ్చేయడమేనా?' అని అంటుంది. దీనికి తులసి 'ఎవరు ఎవరికి భార్య? ఎవరు ఎవరికి భర్త? భార్యభర్తలు ఏకంతంగా ఉన్నప్పుడు తలుపులు వేసుకుంటారు. పరాయి మగాడి గుండెల మీద పడుకునే నువ్వు నన్ను వేలెత్తి చూపిస్తావా' అని ఫైర్ అవుతుంది.

నందూపై లాస్య ఆగ్రహం.. అర్థం లేదు

నందూపై లాస్య ఆగ్రహం.. అర్థం లేదు

తులసి తిట్టి వెళ్లిపోయిన తర్వాత లాస్య 'ఏంటి నందూ.. తులసి నన్ను అన్నన్ని మాటలు అంటుంటే నువ్వు సైలెంట్‌గా ఎందుకు ఉండిపోయావ్? అసలు నువ్వు తను రాగానే ఎందుకు లేచావు? ఆమెకు విడాకులు ఇచ్చిన వెంటనే మనం పెళ్లి చేసుకుని ఉండుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా' అంటూ కోప్పడుతుంది. అప్పుడు నందూ 'సమస్య నీ వైపు నుంచే కాదు.. నా వైపు నుంచి కూడా అర్థం చేసుకోడానికి ట్రై చెయ్. ఆఫీస్ తెరవడం లేదు.. అప్పులపాలయ్యాం. ఇలాంటి టైంలో పెళ్లి చేసుకుంటే నా పరువు పోతుంది' అంటూ కోపంగా వెళ్లిపోతుంటాడు.

ఫస్ట్ నైట్‌లో ప్రేమ్‌కు షాకిచ్చిన శృతి

ఫస్ట్ నైట్‌లో ప్రేమ్‌కు షాకిచ్చిన శృతి

శోభనం గదిలో ఉన్న ప్రేమ్.. శృతి కోసం వేచి చూస్తుంటాడు. అంతలో ఆమె పాల గ్లాసుతో లోపలికి వస్తుంది. అప్పుడు సగం పాలు తాగిన అతడు.. పాలను సగం సగం ఎందుకు చేసుకుంటారో తెలుసా? అని ఆమెను అడుగుతాడు. దీనికి శృతి సరైన సమాధానం చెబుతుంది. అంతేకాదు, అతడిని ఓ గిఫ్ట్ ఇవ్వమని అడుగుతుంది. అప్పుడు ప్రామిస్ వేయమని అడుగుతుంది. ఆమె కోరిక ప్రకారం చేతిలో చేయి వేసి ఏం కావాలని అడుగుతాడు. అప్పుడు శృతి 'మనం ఫస్ట్ నైట్ చేసుకోవద్దు.. ఇది అసలు జరగకూడదు. నువ్వు మాటిచ్చేశావ్' అంటూ ప్రేమ్‌కు షాకిస్తుంది.

మన ఆలోచనలు ఎప్పటికీ ఒకేలా అని

మన ఆలోచనలు ఎప్పటికీ ఒకేలా అని

ఫస్ట్ నైట్ ఎందుకు వద్దన్నావని ప్రేమ్ అడగ్గా.. శృతి 'పైనున్న దేవుడు మన పెళ్లిని రాసి పెట్టాడు. కానీ, కిందున్న దేవత పూనుకోకపోయి ఉంటే ఇది జరిగేది కాదు. ఆంటీ మన కోసం అంకుల్‌ను ఎదురించారు. రెండు కోట్లు అప్పును తన నెత్తిపై వేసుకున్నారు. ఆమె అక్కడ టెన్షన్ పడుతుంటే.. మనం ఇలా సుఖపడాలా? అందుకే వద్దన్నా' అని అంటుంది. దీనికి ప్రేమ్ 'మన ఇద్దరి ఆలోచనలు ఒకటే శృతి. నాక్కూడా ఇలాగే అనిపించింది. కానీ, నువ్వు ఏమనుకుంటావో అని ఆగిపోయాను. ఐలవ్యూ శృతి. ముందు మనం అమ్మ గురించి ఆలోచిద్దాం' అని అంటాడు.

తన కోరికను బయట పెట్టిన తులసి

తన కోరికను బయట పెట్టిన తులసి

రాములమ్మతో మాట్లాడుతోన్న సమయంలోనే తులసి తన కోరికను బయట పెడుతుంది. 'వాళ్ల పెళ్లి దేవుడి దయ వల్ల జరిగిపోయింది. ఎన్నో అడ్డంకులను దాటుకుని వాళ్లిద్దరినీ ఒకటి చేశాను. వాళ్లు సంతోషంగా ఉండడమే కదా నేను కోరుకునేది. ఇప్పుడు చక్కగా ఉండి.. త్వరలోనే వాళ్లిద్దరూ నాకు మనవడినో, మనవరాలినే అందిస్తే చాలు' అని అంటుంది. అప్పుడు రాములమ్మ 'మీరు అనుకుంటే సరిపోతుందా అమ్మా.. పిల్లలు కావాలని వాళ్లు కూడా అనుకోవాలి కదమ్మా' అని చెబుతుంది. దీనికి తులసి అంతా మంచే జరుగుతుందిలే అని అనుకుంటుంది.

శోభనం జరిగినట్లు నాటకం ఆడుతూ

శోభనం జరిగినట్లు నాటకం ఆడుతూ

ఇద్దరూ అనుకుని శోభనం జరగకుండా చూసుకుంటారు. ఉదయాన్నే రాములమ్మ వచ్చి తలుపులు కొడుతుంది. దీంతో నిద్ర లేచిన శృతి.. ప్రేమ్‌ను కూడా లేపుతుంది. అప్పుడు అతడు గతంలో చాలా సార్లు చూసిన విధంగా ఆమె బొట్టు చెరిపి, చీర నలిపి, పూలు చిదిపి, గాజులు తీసేసి ఫస్ట్ నైట్ జరిగినట్లు నాటకం ఆడతాడు. అలా శృతి తలుపులు తీస్తుంది. దీంతో రాములమ్మ ఆమెను పూర్తిగా గమనించి శోభనం జరిగినట్లు ఊహించుకుంటుంది. ఇదే విషయంపై కామెంట్లు చేయడంతో అటు శృతి.. బయట ఉండి చూస్తున్న తులసి తెగ సిగ్గు పడిపోతుంటారు.

 రాములమ్మ సందేహం.. సస్పెన్స్‌తో

రాములమ్మ సందేహం.. సస్పెన్స్‌తో

శృతి మాట్లాడి వెళ్లిపోతోన్న సమయంలోనే రాములమ్మ రూమ్ వైపు చూస్తుంది. అప్పుడు ప్రేమ్ 'ఇంక మాట్లాడింది చాల్లే కానీ, వెళ్లి కాఫీ తీసుకుని రా' అని అంటాడు. ఆ సమయంలో బెడ్ వైపు చూసిన పని మనిషి 'దుప్పటి నలగకుండా ఎలా పడుకున్నారు' అంటూ సందేహం వ్యక్తం చేస్తుంది. దీంతో శృతి, ప్రేమ్ తెగ కంగారు పడుతుంటారు. ఇలా సస్పెన్స్‌తో ఈరోజు ఎపిసోడ్‌ను ఆసక్తికరంగా ముగించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X