For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: సామ్రాట్‌ను పెళ్లి చేసుకోమన్న తులసి.. దారిలో ఊహించని ఘటన

  |

  చాలా భాషలతో పోల్చుకుంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' మంగళవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే చూడండి!
  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  సోమవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  సోమవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  సోమవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. వరంగల్ వెళ్లేందుకు బయటకు వచ్చిన తులసిని లాస్య, నందూ అవమానించేలా మాట్లాడతారు. అదే సమయంలో సామ్రాట్‌ మీద కూడా కొన్ని కామెంట్స్ చేస్తారు. దీంతో తులసి వాళ్లకు సరైన సమాధానాలు చెబుతుంది. ఆ వెంటనే అతడితో కారులో వరంగల్ బయలుదేరుతుంది. అలా కారులో వెళ్తోన్న సమయంలో తన మనసులోని మాటలను సామ్రాట్, తులసికి చెబుతాడు. అనంతరం ఇద్దరూ కలిసి ఓ గుడి దగ్గర ఆగుతారు. అప్పుడు కూర్చుని మాట్లాడుతుండగా.. సామ్రాట్‌కు అమ్మాయిలు సైట్ కొట్టడంతో అతడు సిగ్గు పడతాడు.

  సమంతకు ఏమైంది? ఇలా మారిపోయిందేంటి? షాకిస్తోన్న లేటెస్ట్ ఫొటోలు

  సామ్రాట్‌ను పెళ్లి చేసుకోమంటూ

  సామ్రాట్‌ను పెళ్లి చేసుకోమంటూ

  దేవుడికి దండం పెట్టుకున్న తర్వాత తులసి, సామ్రాట్ ఇద్దరూ గుడిలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఇద్దరు అమ్మాయిలు సామ్రాట్‌ను చూసి 'అబ్బా ఏమున్నాడే. అతను ఒప్పుకుంటే ఇప్పుడంటే ఇప్పుడు ఈ గుడిలోనే పెళ్లి చేసుకుంటా' అంటారు. అది విని ఇద్దరూ నవ్వుకుంటాడు. అప్పుడు తులసి మిమ్మల్ని ఒకటి అడగొచ్చా అంటూ 'మరి మీరు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? అసలు ఆ ఆలోచన ఎందుకు రాలేదు' అని అడుగుతుంది. దీంతో సామ్రాట్ 'నేను మీకు ముందే చెప్పాను కదా. హనీ కోసమే పెళ్లి చేసుకోలేదు' అని సమాధానం చెప్తాడు.

  ఒకరి పెళ్లి గురించి మరొకరి ప్రశ్న

  ఒకరి పెళ్లి గురించి మరొకరి ప్రశ్న

  సామ్రాట్ మాటలకు తులసి స్పందిస్తూ.. 'హనీ కోసమే మీరు ఎందుకు పెళ్లి చేసుకోకూడదు' అని అడుగుతుంది. దీనికి సామ్రాట్ 'చాలామందిని చూశాను.. ఇష్టపడ్డాను. కానీ, వాళ్లంతా నా ఆస్తి, నన్ను చూసి వచ్చేవాళ్లే. కానీ, ఎవరూ హనీ కోసం రావడం లేదు. అందుకే ఇక పెళ్లి టాపిక్‌ను వదలేశాను' అని బదులిస్తాడు. ఆ తర్వాత సామ్రాట్ మీరెందుకు మళ్లీ పెళ్లి చేసుకోకూడదు అని తులసిని అడుగుతాడు. దీంతో ఆమె ఒక్కసారిగా షాక్‌కు గురి అవుతుంది. తర్వాత 'నాకు ఈ జీవితంలో పెళ్లి అనే దానికి ఇక చోటు లేదు. మళ్లీ మళ్లీ అనేది ఇక సాధ్యం కాదు' అని చెప్తుంది.

  కోహ్లీ భార్య అనుష్క హాట్ షో: పండుగ పూట ఎద అందాలు కనిపించేలా!

  మనసులోనే చెప్పేసిన సామ్రాట్

  మనసులోనే చెప్పేసిన సామ్రాట్

  ఆ తర్వాత తులసి 'రెండో పెళ్లి అనేది అస్సలు కుదరదు. ఇప్పటికే నేను చాలా అలసి పోయాను. జీవితం పంచుకునే విషయంలో నేను ఇంకో మనిషి నమ్ముదామనుకున్నా కానీ, నా మనసు ఒప్పుకోదు. ఎదురు దెబ్బలు తగిలాక కూడా మనసు చెప్పేది వినకపోతే చాలా కష్టం. ఇప్పుడు నా దృష్టి అంతా నా మీద, నా పిల్లల మీద నేను ఎదగడం మీద. నా ప్రపంచాన్ని అక్కడికే కుదించుకున్నాను. అతిగా ఆశలు లేవు. మీ ప్రశ్నకు సమాధానం దొరికిందా' అని అంటుంది. దీంతో సామ్రాట్ సమాధానం దొరికింది కానీ.. నచ్చలేదు అని మనసులో అనుకుంటాడు.

  తులసి గురించి ఫ్యామిలీ టెన్షన్

  తులసి గురించి ఫ్యామిలీ టెన్షన్

  సామ్రాట్‌తో కలిసి తులసి వెళ్లడంతో అభి, అనసూయ తెగ టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడతను అమ్మకు ఫోన్ చేసి ఎక్కడుందో అడుగు అని నానమ్మకు చెబుతాడ. అప్పుడే అక్కడకు పరందామయ్య వచ్చి 'తులసి నాకు అన్ని విషయాలు ఎప్పటికప్పుడు ఫోన్ చేసి చెబుతోంది. వచ్చే దారిలో మధ్యలో గుడిలో ఉన్నారట. గుడి నుంచి తిరిగి ఇంటికే వస్తున్నారట' అని చెబుతాడు. దీంతో అనసూయ పరాయి మగాడితో గుడికి ఎందుకు వెళ్లింది అని అంటుంది. అప్పుడు పరందామయ్య సామ్రాట్ పరాయి మగాడు కాదు తన ఫ్రెండ్ అని సమాధానం చెప్తాడు.

  ఆరియానా ఎద అందాల ప్రదర్శన: ఆమెనింత ఘోరంగా ఎప్పుడూ చూసుండరు!

  మెసేజ్ పెట్టినా రాకపోవడంతో

  మెసేజ్ పెట్టినా రాకపోవడంతో

  ఆ తర్వాత సామ్రాట్, తులసి కారులో బయలుదేరుతారు. అప్పుడు సామ్రాట్ 'ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం. సాయంత్రం వరకూ ఇంటికి చేరుకుంటాం' అని మెసేజ్ చేయమని అంటాడు. తులసి అలాగే పెడుతుంది. కానీ, రాత్రి అయినా తులసి ఇంటికి రాదు. రాత్రి బాగా వర్షం పడుతూ ఉంటుంది. ఇంకా రాలేదు ఏంటి అని అందరూ కూర్చొని టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడు ప్రేమ్ 'తాతయ్య మీకు వచ్చిన మెసేజ్ ప్రకారం అమ్మ ఈ సమయం వరకు ఇంటికి రావాలి కదా' అంటాడు. అప్పుడు పరందామయ్య 'తులసి రాలేదని బాధపడుతున్నాను. కానీ, అనుమాన పడట్లేదు' అంటాడు. అప్పుడు నందూ వాళ్లు ఎక్కడ ఉన్నారో.. ఏ పొజిషన్‌లో ఉన్నారో అంటాడు. మరోసారి దివ్య ఫోన్ చేస్తుంది కానీ.. తన ఫోన్ పని చేయదు.

  మరింత రెచ్చగొట్టేసిన నందూ

  మరింత రెచ్చగొట్టేసిన నందూ

  ఇట్లోని వాళ్లు అందరూ టెన్షన్ పడుతూ ఉండగా సామ్రాట్ వాళ్ల బాబాయికి ప్రేమ్ ఫోన్ చేస్తాడు. కానీ, వాళ్లు ఎక్కడ ఉన్నారో అన్నదానిపై ఎలాంటి సమాచారం లేదని చెబుతాడు. దీంతో ఇంట్లో వాళ్లలో భయం మరింతగా పెరుగుతుంది. ఆ సమయంలో నందూ హారతి ఇచ్చి పంపించారు.. ఇప్పుడేమో టెన్షన్ పడుతున్నారు అంటాడు. అప్పుడు పరందామయ్య 'నేను తులసి గురించే కాదు.. సామ్రాట్ గురించి కూడా ఆలోచిస్తున్నాను. బయట ఈదురు గాలులు, కుంభవృష్టి.. కారు నడపడానికి కూడా సమస్యే. కాబట్టి ఎక్కడో ఆగి ఉండుంటారు' అని అంటాడు.

  పబ్లిక్ ప్లేస్‌లో రెచ్చిపోయిన శ్రీయ: అతడి నోట్లో నోరు పెట్టేసి మరీ!

  కారుకు ప్రాబ్లం... తడిచిపోయి

  కారుకు ప్రాబ్లం... తడిచిపోయి

  అంత భారీ వర్షం వస్తుండడంతో సామ్రాట్‌కు కారు నడపడం కష్టంగా మారుతుంది. సరిగ్గా అప్పుడే కారు బ్రేక్ డౌన్ అవుతుంది. దీంతో సామ్రాట్ కిందకు దిగి ఏమైందో చూస్తానని అంటాడు. కానీ, తులసి మాత్రం నేను కూడా దిగుతానని అంటుంది. అప్పుడు అతడు వద్దన్నా తులసి మాత్రం వినదు. అలా ఇద్దరూ కిందకు దిగడంతో వర్షంలో తడిచిపోతారు. ఇలా ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 772: Tulasi Gives a Suggestion for Samrat about Marriage. After That Family Gets Worried about Tulasi and Samrat
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X