For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: ఇద్దరికీ దండం పెట్టిన తులసి.. ఆమెను మార్చేందుకు ప్రేమ్ ప్లాన్

  |

  సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై వచ్చే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూద్దాం పదండి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  మంగళవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  మంగళవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. భర్తను అదుపులో పెట్టుకోమని లాస్య చెప్పిన మాటల ప్రకారమే అంకిత.. తనకు ఇంట్లో అవమానాలు జరుగుతున్నాయని చెప్పి బాధ పడినట్లు నటిస్తుంది. అప్పుడు నమ్మేసిన అభి.. ఆ తర్వాత తన తల్లితో ఈ విషయం గురించి మాట్లాడతాడు.

  దీంతో తులసి అతడికి లెక్చర్ ఇస్తుంది. ఇక, కొత్తగా పెళ్లైన శృతి, ప్రేమ్‌ శోభనం చేసుకోరు కానీ.. రొమాన్స్ పండిస్తూ ఉంటారు. అనంతరం కంపెనీలో పని చేయడానికి వర్కర్లు రావడం లేదని తులసితో చెప్తాడు నందూ. దీంతో ఆమె మరోసారి వాళ్లను బ్రతిమాలమనగా కోప్పడతాడు.

  టాప్ విప్పేసి షాకిచ్చిన అషు రెడ్డి: లోదుస్తులు కూడా లేకుండా ఫోజు.. వామ్మో మరీ ఇంత ఘోరమా!

  శృతిని రెచ్చిపోవద్దని తల్లికి చెప్పిన అభి

  శృతిని రెచ్చిపోవద్దని తల్లికి చెప్పిన అభి

  అంకిత చెప్పిన మాటలకు రెచ్చిపోయిన అభి.. తల్లితో శృతి గురించి మాట్లాడుతూ ఉంటాడు. ‘చూడు మామ్.. అంకితకు ఇదంతా ఇబ్బందిగా ఉంటుంది. ఇది మరీ తెగే వరకూ లాగితే మా ఇద్దరి మధ్య ఈ కారణంగా దూరం పెరిగిపోవచ్చు. అదే జరిగితే ఎంత వరకైనా వెళ్లొచ్చు. కాబట్టి శృతిని కూడా రెచ్చిపోవద్దని చెప్పు మామ్. ఏదైనా తప్పు చేసుంటే సారీ' అంటుంది. అప్పుడు తులసి ‘అత్త గారిని కదా నేనే సర్ధుకునిపోవాలి. వాళ్లు నా మాట వినడమేమో కానీ, నేను వాళ్ల మాట వింటాను. ఈ కంపెనీ పనులకు తోడు నాకు ఇదో టెన్షన్' అని అనుకుంటుందామె.

  అంకితకు చేతులెత్తి దండం పెట్టిన శృతి

  అంకితకు చేతులెత్తి దండం పెట్టిన శృతి

  తులసితో అభి మాట్లాడిన విషయాలను వెనక నుంచి విన్న శృతి.. అంకిత దగ్గరకు వెళ్లి దీని గురించి మాట్లాడుతుంది. ‘ఏదైనా ఉంటే నాకు డైరెక్ట్‌గా చెప్పు. అంతేకానీ, ఆంటీ దగ్గరకు ఈ విషయాలను తీసుకు రావొద్దు. ఇప్పటికే ఆమె కంపెనీ టెన్షన్‌లతో బాగా బాధ పడుతున్నారు. దీనికితోడు మన గొడవలు ఆమెకు చెప్పడం ఎందుకు' అని చేతులెత్తి దండం పెడుతుంది. అప్పుడు ‘నువ్వు నీ యాక్టింగ్‌లు ఆపుతావా? నేనేం చేయాలో నువ్వే చెప్తావా? అంటే అభి ఎలా బిహేవ్ చేయాలో కూడా నువ్వే చెబుతావా' అంటూ ఎదురు తిరుగడంతో గొడవ పెరుగుతుంది.

  Bigg Boss: ఐదో సీజన్ విన్నర్ అతడే.. టాప్ 5లో ఉండే కంటెస్టెంట్లు వాళ్లే.. ఈ లెక్కలు చూస్తే షాకే!

  మీరిద్దరూ నాకు ముఖ్యమే అన్న తులసి

  మీరిద్దరూ నాకు ముఖ్యమే అన్న తులసి

  శృతి, అంకిత గొడవ పడుతుండగా తులసి చూస్తుంది. అలా కాసేపు వేచి చూసిన తర్వాత గొడవ ఆపమని గట్టిగా అరుస్తుంది. అంతేకాదు, ‘అక్కా చెల్లెలిలా ఉండాల్సిన తోడికోడళ్లు ఇలా గొడవ పడుతున్నారు. మీరు ఇద్దరిలో ఒకరు ఎక్కువ.. ఒకరు తక్కువ కాదు. ఇద్దరూ నాకు సమానమే. ఎప్పుడైనా ఏమైనా అంటే చనువుతో అన్నానని అనుకోండి. నాలా మీరు మీ జీవితాలను కష్టాల మయం చేసుకోకండి. మీకంటూ కొన్ని బంధాలు ఉన్నాయి. దయచేసి అర్థం చేసుకోండి' అంటూ ఇద్దరికీ దండం పెడుతుంది. దీంతో శృతి వెళ్లిపోగా.. అంకిత మాత్రం సారీ చెబుతుంది.

  రోజూ గొడవలే.. శృతికి ప్రేమ్ సర్‌ప్రైజ్‌గా

  రోజూ గొడవలే.. శృతికి ప్రేమ్ సర్‌ప్రైజ్‌గా

  తులసి అన్న మాటలకు అంకిత సారీ చెప్పి మారినట్లు యాక్టింగ్ చేస్తుంది. ఆ తర్వాత ‘అదేంటి ఆంటీ.. అలా అనుకుంటున్నారు. నేను ప్రతిరోజూ శృతి వల్ల.. శృతి కోసం.. శృతి ద్వారా గొడవలు పెట్టుకోవాల్సిందే. మా గొడవలు చూసి మీరు ఏడవాల్సిందే' అని తనలో తాను అనుకుంటుంది.

  ఇక, రూమ్‌లోకి వెళ్లిన శృతి ఒంటరిగా కూర్చుని ఏడుస్తుంది. అప్పుడే లోపలికి వచ్చిన ప్రేమ్ ‘అమ్మ పడుతున్న కష్టాలకు మనం సాయం చేయాల్సిన టైమ్ వచ్చింది. నాకు ఒక కొత్త ప్రాజెక్టు వచ్చింది' అంటూ గుడ్ న్యూస్ చెప్తాడు. తర్వాత శృతి ద్వారా జరిగింది తెలుసుకుంటాడు.

  Bigg Boss: బెడ్ మీద లేకపోతే ఆ రూమ్‌లో.. మీ అమ్మ కూడా అలాగే.. షణ్ముఖ్‌పై రవి షాకింగ్ కామెంట్స్

  అంకితను మార్చాలని ప్రేమ్ కొత్త ప్లాన్‌

  అంకితను మార్చాలని ప్రేమ్ కొత్త ప్లాన్‌

  శృతి చెప్పిన మాటలకు ప్రేమ్‌లో ఆగ్రహం పెరుగుతుంది. వెంటనే అభితో గొడవ పడేందుకు వెళ్లబోతాడు. అంతలో శృతి ‘చూడు ప్రేమ్.. ఇప్పుడు నువ్వెళ్లి అభిని అడిగావంటే మీ ఇద్దరి మధ్య గొడవ జరిగే ప్రమాదం ఉంది. ఆ తర్వాత అన్నాదమ్ముల మధ్య దూరం పెరుగుతుంది. అయినా ఇది అంకిత వల్లే జరుగుతుంది' అని అంటుంది. దీంతో ప్రేమ్ ‘సరే శృతి అడగను.. కానీ దీన్ని ఇంతటితో ఆపేయడానికి ప్లాన్ చేయాలి. సరే నువ్వే అంకిత వదిన మనసును మార్చే ప్రయత్నం చేయొచ్చు కదా. ఆమెతో మాట్లాడడానికి ప్రయత్నించు' అంటూ ప్లాన్ చెబుతాడు.

  తులసిని అలా ఓదార్చిన పరందామయ్య

  తులసిని అలా ఓదార్చిన పరందామయ్య

  ఇంట్లో తోడికోడళ్ల మధ్య జరుగుతోన్న గొడవలతో బాధ పడుతోన్న తులసి దగ్గరకు పరందామయ్య వస్తాడు. ‘ఈ భూమి బద్దలైనా నా కోడలి కంట్లోంచి నీళ్లు రాకూడదని అనుకున్నా. కానీ, ఈరోజు అవి చూస్తున్నా. ఎందుకమ్మ ఇలా ఉన్నావు' అని ప్రశ్నించగా.. ‘ఈ కంపెనీ టెన్షన్‌తో బాధ పడుతుంటే శృతి, అంకిత నన్ను ఇంకా ఇబ్బంది పెడుతున్నారు' అని అంటుంది. అప్పుడాయన ‘నువ్వు ఎన్నో సమస్యలను అధిగమించావు. అయినా నీకిది పెద్ద కష్టం కాదు. అభి నిన్ను అడిగినప్పుడు నువ్వే నీ భార్యకు చెప్పుకో అని వాడితో అనాల్సింది' అని ఓదార్చుతుంటాడు.

  బ్రా కూడా లేకుండా షాకిచ్చిన నందినీ రాయ్: ఈ హాట్ వీడియో చూస్తే అస్సలు తట్టుకోలేరు!

  Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
  వాడు డబ్బులు వద్దు.. ప్రేమ్, శృతి అలా

  వాడు డబ్బులు వద్దు.. ప్రేమ్, శృతి అలా

  పరందామయ్య మాట్లాడుతూ.. ‘చూడమ్మా అభి ఎప్పుడైనా నీకు డబ్బులు ఇస్తానంటే వాటిని తీసుకోకు. దాన్ని ఆసరాగా తీసుకుని ఎప్పటికైనా నిన్ను చులకన చేస్తారు' అని అంటాడు. మరోవైపు, ప్రేమ్.. శృతిని బాల్కనీలోకి తీసుకొచ్చి వర్కౌట్లు చేయిస్తుంటాడు. అప్పుడామె ఇబ్బంది పడుతుండగా.. ‘మనం ఇలా చేయకపోతే అందరికీ డౌట్ వస్తుంది' అని అంటాడు. వాళ్లను అలా చూసిన అంకిత.. వెంటనే అభిని నిద్ర లేపుకుని తీసుకొచ్చి చూపిస్తుంది. తనకు కూడా అలా చేయమని కోరుతుంది. దీంతో అతడు అసహనంగా కనిపిస్తాడు. దీంతో ఈ ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 461: Shruthi and Ankitha Criticise Each Other. Then Family Member Tensioned About This. After That Tulasi Request to Them.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X