Intinti Gruhalakshmi Today Episode: నందూ కోసం అతడికి తులసి హామీ.. శృతికి కండీషన్ పెట్టిన అంకిత

ఎన్నో ఏళ్లుగా తెలుగు బుల్లితెరపై వచ్చే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూద్దాం పదండి!

Photos Courtesy: Star మా and Disney+Hotstar

 బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. అంకిత చెప్పిన మాటలకు తులసిని ప్రశ్నిస్తుంటాడు అభి. అప్పుడామె చాలా బాధ పడుతుంది. ఆ తర్వాత శృతి, అంకిత ఒకరినొకరు విమర్శించుకుంటారు. దీంతో తులసి వాళ్లను చూసి తెగ టెన్షన్ పడుతుంది. అప్పుడు వాళ్లకు తులసి సర్ధి చెప్పే ప్రయత్నం చేస్తుంది. అనంతరం శృతి ఈ విషయాన్ని ప్రేమ్‌కు చెబుతుంది. దీంతో అతడు అంకిత మనసు మార్చమని ఆమెకు చెబుతాడు. అంతేకాదు, అంకితను ఉడికించేందుకు ఇంట్లో వాళ్లిద్దరూ యోగా చేస్తుంటారు. ఆ తర్వాత తులసికి పరందామయ్య విలువైన మాటలు చెబుతాడు.

అంకితకు షాకిచ్చిన అభి.. ప్రేమ లేదని

అంకితకు షాకిచ్చిన అభి.. ప్రేమ లేదని

ప్రేమ్, శృతి వర్కౌట్లు చేసుకుంటుండగా.. అంకిత అభిని తీసుకొచ్చి వాళ్లను చూపించడంతో ఈరోజు ఎపిసోడ్ ప్రారంభం అయింది. అంతేకాదు, ఎప్పుడైనా నాతో అలా ఉన్నావా అంటూ ఆమె తన భర్తను నేరుగా అడుగుతుంది. అప్పుడు అభి 'కొత్తగా పెళ్లైంది కాబట్టి అలాగే ఉంటుంది. నేను కూడా పెళ్లైన కొత్తలో నీకు చాలా నేర్పించాను కదా. అయినా ఇప్పటికే ప్రేమ అలాగే ఉంటుందా? రెండేళ్ల తర్వాత ఈ ప్రేమ్ గాడు కూడా ఆమెతో అలాగే ఉంటాడా? అది సాధ్యం కాదు చూస్తూ ఉండు' అంటూ అంకితకు షాకిస్తాడు. దీంతో ఆమె కుళ్లుకుంటూనే ఉంటుంది.

 వాళ్లను పడేసేందుకు అంకిత మరో ప్లాన్

వాళ్లను పడేసేందుకు అంకిత మరో ప్లాన్

ఎంత చెప్పినా అభి వినకపోయే సరికి అంకిత అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దీంతో తాను చెప్పాల్సినవి అన్నీ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత పని మనిషి రాములమ్మ వచ్చి శృతి, ప్రేమ్‌కు జ్యూస్ తెస్తుంది. అది చూసి కూడా అంకిత తెగ కుళ్లుకుంటూ ఉంటుంది. అనంతరం 'ఇప్పుడు శృతి ఇక్కడ ప్రేమ్‌తో ఎంజాయ్ చేస్తుంది కదా. ఈ లోపు ఆమె చేయాల్సిన పనులన్నీ నేనే స్వయంగా చేస్తే.. ఇంట్లో వాళ్ల నుంచి మార్కులు కొట్టేయొచ్చు. అప్పుడు అందరినీ నా వైపునకు తిప్పుకోవచ్చు' అని తనలో తానే మాట్లాడుకుంటూ సంబర పడిపోతుంది.

తులసితో కలుస్తావా అంటూ లాస్య ఫైర్

తులసితో కలుస్తావా అంటూ లాస్య ఫైర్

కంపెనీ విషయంలో టెన్షన్ పడుతోన్న నందూ.. జీకేను కలవడానికి వెళ్తున్నానంటూ లాస్యతో చెబుతాడు. అప్పుడామె 'పెళ్లి మండపంలో ఆయనతో అనిపించుకున్న మాటలు సరిపోలేదా?' అని అడుగుతుంది. దీనికి నందూ 'శత్రుత్వం అనేది శాశ్వతం కాదు. అయినా ఆయనకు పెళ్లి విషయంలోనే కదా ఇబ్బంది' అని బదులిస్తాడు. అప్పుడు లాస్య 'అంటే శత్రుత్వం కాదని తులసితో కూడా కలుస్తావా? అయినా నువ్వు ఆయనను మోసం చేశావు కదా. నీతో ఎలా మాట్లాడతాడు' అని అంటుంది. దీనికి నందూ ఆయనకు అర్థమయ్యేలా వివరిస్తానని చెబుతాడు.

లాస్యకు తులసి వార్నింగ్.. నందూ అలా

లాస్యకు తులసి వార్నింగ్.. నందూ అలా

నందూ, లాస్య మాట్లాడుతుండగా తులసి ఎంట్రీ ఇస్తుంది. అప్పుడు ఎందుకు వచ్చావ్ అని అడుగుతుంది. దీనికి తులసి 'ఇది నువ్వు అడుగుతున్నావా? ఆయన అడుగుతున్నారా? నీకైతే నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకైతే సమాధానం తెలుసు' అని అంటుంది. దీంతో లాస్యకు ఒళ్లు మండినంత పని అవుతుంది. అప్పుడు నందూతో ఆఫీస్‌కు వెళ్దామని చెప్పాను కదా రెడీ అవ్వండి అని అంటుంది తులసి. దీనికి నందూ 'ఆఫీస్‌కు వచ్చేందుకు స్టాఫ్ ఎవరూ సిద్ధంగా లేరు. నీకు చెప్పినా అర్థం కాదులే' అంటూ తులసిని లైట్ తీసుకుంటూ బదులిస్తాడు.

 మేనేజర్‌తో మాట్లాడిన తులసి.. సిద్ధంగా

మేనేజర్‌తో మాట్లాడిన తులసి.. సిద్ధంగా

తులసి నందూతో మాట్లాడుతుండగానే ఫ్లాష్‌బ్యాక్ సీన్‌ను చూపిస్తారు. అందులో గతంలో నందూ కంపెనీలో పని చేసిన మేనేజర్‌తో తులసి మాట్లాడుతూ ఉంటుంది. ఇప్పటికే మూడు నెలల జీతం పెండింగ్ ఉందని.. ఇప్పుడు మళ్లీ అక్కడకు ఉద్యోగానికి రావడం కుదరదని అతడు అంటాడు. దీనికి తులసి 'ప్రాజెక్టు పూర్తయ్యే వరకూ చేయండి. ఈ జీతం ముందే ఇచ్చేస్తాను. పెండింగ్ శాలరీ ప్రాజెక్టు పూర్తైన తర్వాత ఇస్తాను. దీంతో నందూ గారికి సంబంధం లేదు. నన్ను నమ్మండి' అని చెప్తుంది. దీంతో అతడు ఓకే చెప్పడంతో పాటు అందరినీ తీసుకొస్తానంటాడు.

 శృతికి రెండు పెళ్లిళ్లు.. అర్హత లేదంటూ

శృతికి రెండు పెళ్లిళ్లు.. అర్హత లేదంటూ

తులసి కష్టాలన్నీ తీరాలని ఇంట్లో శరన్నవరాత్రి పూజలు చేయాలని శృతి సంకల్పం చేసుకున్న విషయం తెలిసిందే. ఆమె పూజ చేస్తుండగా అంకిత, అనసూయ వచ్చి అడ్డు పడతారు. అంతేకాదు, పరందామయ్య ముందే శృతికి రెండు పెళ్లిళ్లు అయ్యాయని, ఆమెకు అసలు పూజ చేసే అర్హతే లేదంటూ ఘోరంగా అవమానిస్తారు. అనంతరం అంకిత హారతి తీసుకొచ్చి తులసికి ఇవ్వబోగా.. ఆమె శృతి ఎందుకు పూజ చేయలేదని ప్రశ్నిస్తుంది. దీనికామె అబద్ధం చెబుతుంది. అనంతరం శృతి లంచ్ బాక్స్ తీసుకు రాగా నందూ, లాస్య దాన్ని తీసుకోకుండా వెళ్లిపోతారు.

Recommended Video

Siri Hanmanth : ఆదర్శంగా నిలిచిన Bigg Boss బ్యూటీ.. పెళ్లి కాకుండానే తల్లిగా || Filmibeat Telugu
శృతికి అంకిత కండీషన్.. పిచ్చి పిచ్చిగా

శృతికి అంకిత కండీషన్.. పిచ్చి పిచ్చిగా

లంచ్ బాక్స్‌లు తీసుకొచ్చి తులసి దగ్గర మార్కులు కొట్టేస్తుంది శృతి. దీంతో ఆమెను చూసి అక్కడే ఉన్న అంకిత కుళ్లుకుంటుంది. అప్పుడే పరందామయ్య వచ్చి అంకితకు బుద్ది వచ్చేలా మాట్లాడతాడు. అనంతరం వంటగదిలో కూరగాయలను కింద పడేసి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంది అంకిత. అప్పుడు శృతి ఎంతగా ఆపే ప్రయత్నం చేసినా ఆమె మాత్రం అస్సలు తగ్గదు. పైగా ఆమెను నిందిస్తూ మాట్లాడుతుంది. అనంతరం 'నేను సైలెంట్‌గా ఉండాలంటే ఇంట్లో నా పనులన్నీ నువ్వే చేయాలి' అంటూ కండీషన్ పెడుతుంది అంకిత. దీంతో ఈ ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X