Intinti Gruhalakshmi Today Episode: అడ్డంగా బుక్కైన శృతి.. ఇంట్లో పెద్ద గొడవ.. నందూకు ఉద్యోగుల షాక్
మిగిలిన భాషలతో పోలిస్తే తెలుగు బుల్లితెరపై వచ్చే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూద్దాం పదండి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే
గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ప్రేమ్, శృతిని చూసి కుళ్లుకుంటున్న అంకిత.. అభిని కూడా అలా చేయమని అడగ్గా.. అతడు చేయనని చెబుతాడు. ఆ తర్వాత ఆఫీస్‌కు వెళ్లేందుకు నందూను తులసి ఒప్పిస్తుంది. అలాగే, వర్క్ చేయడానికి ఉద్యోగులను కూడా రమ్మని మేనేజర్‌తో మాట్లాడుతుంది.
ఆ తర్వాత శృతిని ఇబ్బంది పెట్టేందుకు అంకిత అనసూయతో చేతులు కలుపుతుంది. అందుకు అనుగుణంగానే ఆమెను అవమానించేలా ఇద్దరూ మాట్లాడతారు. ఇక, చివర్లో అంకిత పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంది. అదే సమయంలో ఓ కండీషన్ కూడా పెడుతుంది.

అంకితకు అలా ప్రామిస్ చేసిన శృతి
ఇంట్లో పిచ్చి పిచ్చి పనులు చేస్తూ గొడవలు పెడుతోన్న అంకితతో శృతి కాంప్రమైజ్ అవడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఇలా ఇద్దరి మధ్య మాటలు జరుగుతుండగా ఈరోజు ఎపిసోడ్ ప్రారంభం అయింది. గొడవలు లేకుండా ఉందామని శృతి కోరడంతో అంకిత ఆమెకు ఒక కండీషన్ పెడుతుంది. దీనికి అంగీకరించిన శృతి ఏం పనులు చేయాలో అని అడుగుతుంది. అప్పుడామె 'నా బట్టలు ఉతకాలి.. నా రూమ్ క్లీన్ చేయాలి.. అలాగే నా పనులన్నీ దగ్గరుండి నువ్వే చూసుకోవాలి' అని చెబుతుంది. దీనికి శృతి అఇష్టంగానే ఒప్పుకోవడంతో ఆమె వెళ్లిపోతుంది.

ఆఫీస్‌లో కనిపించని స్టాఫ్... నిందలు
మేనేజర్‌తో మాట్లాడిన ఉద్యోగులంతా ఆఫీస్‌కు వస్తారన్న కొండంత ఆశతో తులసి.. నందూ, లాస్యను తీసుకుని వస్తుంది. అయితే, అక్కడ మాత్రం స్టాఫ్ ఎవరూ కనిపించరు. దీంతో నందూ, లాస్య.. తులసిపై నిందలు వేస్తుంటారు.
అప్పుడు ఆమె కాపురానికైనా.. వ్యాపారానికైనా ఓర్పు కావాలని లెక్చర్ ఇస్తుంది. అప్పుడు నందూ 'నాకు ఇక్కడ ఇలా వాళ్ల కోసం వేచి చూడడం సిగ్గుగా ఉంది' అంటాడు. అప్పుడు లాస్య 'పద నందూ మనం వెళ్లి మన క్యాబిన్‌లో కూర్చుందాం' అని అనగా ఇద్దరూ వెళ్లిపోతారు. దీంతో తులసి ఒంటరిగా ఉండి తనలో తానే బాధ పడుతుంది.

శృతిపై అంకిత నింద... అభి కోపంగా
శృతితో పనులు చేయించుకుంటున్న అంకిత.. ఆమెను మరింత ఇబ్బంది పెట్టాలని ప్లాన్ చేస్తుంది. ఇందుకోసం అభి లాప్‌టాప్‌ను నేలకేసి కొట్టి పగలగొడుతుంది. అనంతరం అతడు వచ్చి చూసి నానా రభస చేస్తాడు. ఆ సమయంలో అంకిత తప్పించుకుని ఆ నిందను శృతిపై నెట్టేస్తుంది. దీంతో అభి ఆమెపై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతాడు. ప్రేమ్ చెప్పినా వినకుండా గొడవ చేస్తుంటాడు. దీంతో ప్రేమ్ 'తను లాప్‌టాప్ పగలకొట్టింది నువ్వు చూశావా. ఇంకోటి కొందాంలే' అని అంటాడు. దీనికి అభి 'ఏం అవసరం లేదు. ఈవిడ మా రూమ్‌లోకి రావొద్దు' అంటాడు.

ఆఫీస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఉద్యోగులు
ఆఫీస్‌లో ఒంటరిగా ఉండి తులసి బాధ పడుతుండగా మేనేజర్ అక్కడకు వస్తాడు. దీంతో సంతోష పడిన తులసి ఆ వెంటనే 'మిగిలిన వాళ్లంతా ఎక్కడున్నారు. నువ్వు ఒక్కడివే వచ్చావేంటి' అని ప్రశ్నిస్తుంది. దీనికి అతడు 'మీరు చెప్పిన మాటలనే వాళ్లకు చెప్పాను మేడం. ఇంక వాళ్లు వస్తారా? రారా? అన్నది మాత్రం వాళ్ల ఇష్టం.
చూద్దాం వాళ్లు వస్తారో రారో' అని అంటాడు. వాళ్లిద్దరూ అలా మాట్లాడుతూ ఉండగానే ఉద్యోగులంతా ఆఫీస్‌లోకి ఎంట్రీ ఇస్తారు. దీంతో వాళ్లను చూసి తులసి ఎంతగానో సంతోషిస్తుంది. అప్పుడు వాళ్లు కూడా ఆమెకు గౌరవిస్తుంటారు.

మీ ఇద్దరి మధ్య బంధం తెగిపోయింది
ఉద్యోగులంతా ఆఫీస్‌లోకి రావడంతో తులసి వాళ్లతో మాట్లాడి స్వాగతం పలుకుతుంది. అనంతరం నందూ దగ్గరకు వెళ్లి ఈ విషయాన్ని చెబుతుంది. అప్పుడు లాస్య 'అంటే నువ్వు చేసిన పనుల వల్లే వాళ్లంతా వచ్చారా? నందూను కాదని ఇదంతా నీ క్రెడిట్ అనుకుంటున్నావా' అని అంటుంది. దీంతో తులసి ఆమెకు సమాధానం చెబుతూనే నందూను వచ్చి మనం మనం ఒకటని తెలీదు కదా మీరు వచ్చి వాళ్లతో మాట్లాడమని కోరుతుంది. దీనికి లాస్య 'మీ ఇద్దరి మధ్య బంధం ఎప్పుడో తెగిపోయింది' అంటూ గతాన్ని గుర్తు చేసి మరీ ఇబ్బంది పెట్టబోతుంది.

నందూకు మరో షాకిచ్చిన ఉద్యోగులు
లాస్య ఎంత చెడగొట్టాలని ప్రయత్నించినా తులసి.. నందూకు అర్థం అయ్యేలా చెబుతుంది. దీంతో కన్విన్స్ అయిన అతడు.. ఆమె వెంట వెళ్తాడు. అప్పుడు అందరికీ నవ్వుతూ వెల్‌కం చెబుతాడు. దీంతో వెంటనే వాళ్లలో ఒక్కొక్కరు 'తులసి మేడం వల్లే మేము వచ్చాము.. తులసి మేడం మాకు శాలరీలు ఇస్తానన్నారు.. ఈ నెల శాలరీ ముందే ఇస్తానని తులసి మేడం చెప్పారు' అంటారు. దీంతో నందూ మొదట ఫీల్ అయినా ఆ తర్వాత నేనే అవన్నీ చెప్పానని కవర్ చేసుకుంటాడు. ఆ తర్వాత ప్రాజెక్టు వివరాలన్నీ చెప్పి వాళ్లను మోటివేట్ చేసే ప్రయత్నం చేస్తాడు.

తులసిపై అలా సెటైర్లు వేసిన లాస్య
ఉద్యోగులతో మాట్లాడిన తర్వాత తన పనిలో నిమగ్నమై ఉంటాడు నందూ. ఆ సమయంలో లాస్య అక్కడకు పిజ్జాలు పట్టుకుని వస్తుంది. అప్పుడు 'కొంత మంది ఉంటారు.. ఎర్రబస్సు ఎక్కేసి వచ్చేస్తారు. ఎప్పుడూ ముద్దపప్పు, అవకాయ్ తింటూ ఉంటారు. వాళ్లకు పిజ్జాల గురించి ఏం తెలుసు? పిజ్జా కావాలేమో అడుగు నందూ.. మొహమాటం వద్దని చెప్పు ఐదు నిమిషాల్లో తెప్పిస్తా' అంటూ మాట్లాడుతుంది. దీనికి తులసి సైలెంట్‌గా ఉంటూనే ఇంటి నుంచి తెచ్చుకున్న పులిహోర తింటుంది. దీంతో ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











